బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!

బాక్సైట్ తవ్వకాలపై బాబు
విశాఖ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు స్వయంగా 24.12.2011న గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. 24.04.12న అదే లేఖను మరోమారు విడుదల చేశారు.

ఆద్యుడు చంద్రబాబే.. అయినా ైవె ఎస్‌పై బురదజల్లే యత్నం
విశాఖ బాక్సైట్ లీజులకు ఆద్యుడు చంద్రబాబే. 1995లో పదవి చేపట్టగానే ఆయన బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. నిబంధనలను మార్చి, గిరిజనులను ఏమార్చి 2000లోనే దుబాయ్ కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి బాక్సైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ నిజాలన్నీ దాచి ఇపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004 ఎన్నికల్లో గెలిచినట్లయితే దుబాయ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బాక్సైట్ తవ్వకాలతో యథేచ్ఛగా దోపిడీ సాగించేవారే. ఆయన ఓడిపోవడంతో వినాశకరమైన దుబాయ్ ఒప్పందాలకు బ్రేక్ పడింది. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ దృష్టిపెట్టినా గిరిజనుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

గతంలోనే బాబు యత్నాలు..
వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకోగానే బాక్సైట్ నిక్షేపాలపై బాబు కన్నుపడింది. సుప్రీం తీర్పు అందుకు ఆటంకంగా మారింది. గిరిజనుల చట్టాలూ ఆయన కాళ్లకు అడ్డంపడ్డాయి. అయినా బాబు దుబాయ్ నుంచి ఓ బృందాన్ని పిలిపించి, అక్కడి కొండల్ని చూపించి తవ్వుకోవడానికి మీరు రెడీనా అని అన్నారు. దుబాయ్ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలూ కల్పించాలని సూచిస్తూ 29-02-2000న సీఎం చంద్రబాబు కార్యదర్శి స్వయంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దుబాయ్ బృందం 2000 మేలో హైదరాబాద్ వేంచేయగా సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని బాబు తన ‘చాణక్యం’ అంతా ఉపయోగించి 2000 మే, జూన్‌లలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌తో ప్రత్యేక తీర్మానం చేయించారు.

2000 మే 24న విశాఖ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్‌లో జరిపిన భేటీలో ఈ కౌన్సిల్‌తో ‘మన్యంలో గనుల్ని గిరిజనేతరులు కూడా తవ్వవచ్చు’ అని దుర్మార్గమైన తీర్మానం చేయిం చారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. అది గిరిజనుల హక్కుల పరిరక్షణకు పనిచేయాల్సిన సంస్థ. కానీ దానితోనూ నిబంధనలకు విరుద్ధమైన తీర్మానాలు చేయించిన ఘనుడు చంద్రబాబు.ఆయన ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచిన తర్వాతే విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజుల్ని నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రమాదం దాపురించింది. ఆ తర్వాత దుబాయ్ అల్యూమినియం కంపెనీ(దుబాల్)కు లీజులు కట్టబెట్టేందుకు బాబు చేయని ప్రయత్నమే లేదు. 2004 మేలో దుబాయి బాబులు రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో బాబు ఆశలు ఆవిరయ్యాయి. బాక్సైట్ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తానూ ముడుపులు మింగేయాలని తహతహలాడిన చంద్రబాబు ఇపుడు తానేమీ ఎరగనట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ లీజుల వ్యవహారం ఆరంభమయినట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.

గిరిజన సంక్షేమానికి అనుగుణంగానే వైఎస్ నిర్ణయాలు
చంద్రబాబు చేసిన చట్ట సవరణలు, ప్రత్యేక తీర్మానాల కారణంగా విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజులు నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సంయమనం పాటించింది. బాక్సైట్ గనుల లీజుల్ని నేరుగా కంపెనీలకు కేటాయించలేదు. నిజానికి లీజు తమ పేరిటే ఉండాలని బాబు తీసుకువచ్చిన దుబాల్ కంపెనీ గట్టిగా పట్టుబట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కే సర్వహక్కులు ఉంటాయని వైఎస్ సర్కార్ స్పష్టం చేసింది. జిందాల్, అన్‌రాక్, నాల్కో వంటి కంపెనీలు బాక్సైట్‌ను అల్యూమినా, అల్యూమినియంగా మార్చే కర్మాగారాలని వేలకోట్ల పెట్టుబడిపెట్టి అక్కడే నెలకొల్పాలని వైఎస్ సర్కార్ నిర్ణయించింది. బాక్సైట్ దొరికే చోటే కర్మాగారం ఏర్పాటయితే గిరిజనులకు ఉపాధి లభిస్తుంది.

అంతేకాదు బాక్సైట్ శుద్ధి కర్మాగారాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో లాభాలు – టర్నోవర్‌లలో ప్రభుత్వం, సంస్థలు, ఏపీఎండీసీలు తమ వంతుగా ఎంతెంత శాతాన్ని గిరిజనుల సంక్షేమానికి వెచ్చించాలన్న స్పష్టమైన నిబంధనలూ ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 25%, ఏపీఎండీసీ ఖనిజ విక్రయాల ద్వారా పొందే ఆదాయంలో 20%, అల్యూమినా కర్మాగారం సాధించే లాభంలో 0.5% మొత్తాన్ని ఈ ప్రాంతంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక ప్రగతికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధన ఉంది. చంద్రబాబులా నచ్చిన కంపెనీలకు నిబంధనలను అతిక్రమించి మరీ అడ్డగోలుగా అన్నీ కేటాయించే నైచ్యానికి వైఎస్ ఎన్నడూ దిగజారలేదు. షరతులతో కూడిన ఆరు గనుల తవ్వకం లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పేరిట మంజూరు చేసింది. 1957 గనుల చట్టం, 1960 ఖనిజాల రాయితీ నియమావళి మేరకే ఒప్పందాలు జరిగాయి. అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో ప్రయత్నాలు జరిగినట్లే వైఎస్ హయాంలోనూ బాక్సైట్ అనుబంధ పరిశ్రమల స్థాపనకు (గిరిజనుల సంక్షేమానికి విఘాతం కలగకుండా) నిబంధనల మేరకు ప్రయత్నాలు జరిగాయి. అయినా వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలను వైఎస్ పూర్తిగా నిలిపేశారు.

► దొంగే దొంగా అన్నట్లు…
విశాఖ బాక్సైట్ వ్యవహారంలో ఆది నుంచి నేటి వరకు జరిగిందిదే. తన నేరాలన్నిటినీ దాచిపెట్టి పక్కవారిపై నెపం మోపడానికి ప్రయత్నించడం బాబు నైజం. బాక్సైట్ లీజుల వ్యవహారాన్ని రాజశేఖరరెడ్డి మీద, కాంగ్రెస్ మీద నెట్టేయడానికి శ్వేత పత్రంలో ఆయన చేయని ప్రయత్నమే లేదు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలు జరిగాయనేది శుద్ధ అబద్దం. ఇన్నేళ్లు అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరగనేలేదు. ఒక్క తట్ట కూడా బాక్సైట్‌ను ఎత్తి పోయలేదు. వైఎస్‌కు ముందు, వైఎస్ తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం నిబంధనలను అతిక్రమించి అనేక ప్రయత్నాలు చేసింది చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు నిషేధించాలని ఉద్యమాలు చేసిన, చేయించిన బాబు అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకోవడానికి కారణాలు వెతకనక్కరలేదు. గిరిజనుల ప్రయోజనాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తేనే ఆయన మెచ్చిన కంపెనీలు బాగుపడతాయి. అందుకే హడావుడిగా జీవో జారీ చేశారు. వ్యతిరేకత రావడంతో ఆ జీవో సంగతే తనకు తెలియదంటున్నారు. ప్రస్తుతానికి జీవోను నిలుపుదల చేశామని చెబుతున్నారు.. గిరిజనుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ది ఉంటే జీవోనే రద్దు చేయవచ్చు కదా? అది వదిలేసి శ్వేతపత్రాలు విడుదల చేయడం దేనికి సంకేతం? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను రద్దు చేసేవారని, అలా కాకుండా నిలుపుదల చేయడంలోనే ఏదో కుట్ర పొంచి ఉందని గిరిజన సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

http://www.sakshi.com/news/district/cm-chandrababu-bauxite-way-293461?pfrom=home-top-story

5 Comments

Filed under Uncategorized

5 responses to “బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!

 1. Veera

  సాక్షి పత్రిక చదవద్దు టీవీ చూడవద్దు చూస్తే ఆరోగ్యం పాడవుతుంది-బాబు
  APలో సాక్షి తప్ప అన్ని టీవీలు ఈనాడు జ్యోతి బాబు కులస్తులవే,అవి ఎటూ బాబు భజన చేస్తాయి కదా!!!
  [కమ్మ యజమానుల అధీనం లోని మీడియా
  1.TV9:రవి ప్రకాష్ .
  2.NTV:తుమ్మల నరేంద్ర .
  3.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు.
  4.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ
  5.ETV/ఈనాడు:రామోజీ రావు
  6.MahaTV: ఐ వెంకట్ రావు /సుజన చౌదరి.
  7.Express TV: చిగురుపాటి జయరాం
  8.Gemini News :అక్కినేని మనోహర్
  9.Studio N:నార్నే శ్రీనివాస్ రావు (Junior NTR మామ).
  10.10TV:వీరభద్రం
  11:6TV:లోకేష్.
  12.CVR:చలసాని వెంకటేశ్వర రావు
  .
  Source: Kammas World ]

 2. Veera

  అతను మనోడు అయితే ఓకే!!! ఆ విధంగా ముందుకు పోతున్న బాబు !!!
  APPSC చైర్మన్‌గా JNTUK ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయభాస్కర్ చౌదరి
  [పార్టీతో పాటు ప్ర‌భుత్వ ప‌దువులు కూడా వారికేనా..
  ప‌ద‌వుల‌న్నీ ఆ సామాజిక‌వ‌ర్గానికేనా అన్న అనుమానాలొస్తున్నాయి. ప‌లువురిలో అస‌హ‌నం పెరుగుతోంది. అయినా చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. చిన‌బాబు చెప్పార‌నో..మ‌రోక‌రు సూచించార‌నో గానా మొత్తానికి కీల‌క‌ప‌ద‌వుల‌న్నీ త‌మ సామాజిక‌వ‌ర్గానికే క‌ట్ట‌బెడుతున్నారు. గ‌తంలో ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు నేత‌లు, అధికారులు కూడా ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.
  http://updateap.com/one-caste-domination-in-andhra-pradesh-recruitment/%5D

 3. Veera

  మేనల్లుడు మేయర్ మద్య కమ్మని కుట్ర
  [చింటూ, మోహన్ మధ్య చిచ్చు పెట్టింది సీఎం సామాజిక వర్గం నేతలే
  పరిస్థితులు ఇలానే ఉంటే భవిష్యత్తులో తమకు పదవులు రావనే భయం
  అందుకే ఇరువర్గాలను ఎగదోశారు
  ప్రతిఫలంగా కఠారి దంపతుల హత్య
  ఇటు చింటూ, అటు కఠారి మోహన్ మధ్య గొడవలు తీవ్రరూపం దాలుస్తున్నాయని, ఇరువర్గాలను సర్దుబాటు చేయకపోతే చిత్తూరులో టీడీపీకి నష్టం వాటిల్లుతుందని చిత్తూరుకు చెందిన పలువురు నేతలు సైతం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కఠారి, చింటూల మధ్య గొడవలు మరింత పెరిగితేనే తాము మనగలమని భావించారు ఒక సామాజికవర్గం నాయకులు. అందుకే వాటి తీవ్రత తగ్గించి సీఎం దృష్టికి తీసుకువెళ్లేవారు. దీంతో సీఎం పట్టించుకోకుండా వదిలేశారు. హత్య అనంతరం చిత్తూరుకు వచ్చి వీరి గొడవలు తన దృష్టికి రాలేదని, వచ్చి ఉంటే పరిస్థితి ఇంతదూరం రానివ్వనంటూ సీఎం పేర్కొనడం విడ్డూరం.

  చిచ్చుపెట్టింది సీఎం సామాజిక వర్గ నేతలే
  కఠారి మోహన్, చింటూ మధ్య చిచ్చుపెట్టింది సీఎం సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలేనని టీడీపీలో ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరులో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే డీకే.ఆదికేశవులనాయుడు సతీమణి సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు అదే సామాజిక వర్గానికి చెందిన కఠారి మోహన్ కుటుంబానికి కీలకమైన మేయర్ పదవిని కట్టబెట్టారు. దీంతో ఆ సామాజిక వర్గం చిత్తూరులో బలం పుంజు కుంది. మరోవైపు కఠారి మోహన్ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలంటూ గత ఎన్నికల్లోనే పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీన్ని ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు జీర్ణించుకోలేకపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమకు ఏ పదవీ దక్కే అవకాశం లేదని భావించారు. ఇందులో భాగంగానే చింటూ, కఠారి మధ్య వివాదాలు సృష్టించి దానికి మరింత ఆజ్యం పోశారు. వాటి ఫలితమే కఠారి దంపతుల దారుణ హత్య. రెండు కుటుంబాల మధ్య తగవులు పెట్టి దారుణానికి ఒడిగట్టింది టీడీపీ నాయకులేనని చింటూ తండ్రి సుబ్రమణ్యంనాయుడు సాక్షితో వాపోయారు.

  http://www.sakshi.com/news/district/chittoor-mayor-katari-anuradha-katari-mohan-murder-case-293297?pfrom=facebook ]

Leave a Reply to nlr2019 Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s