ఆ స్వరాలు వారివే…

-ప్రయోగశాల నిర్ధారణ
-ఓటుకు నోటు కేసులో మళ్లీ కలకలం
-నివేదికను తమకు ఇవ్వాలంటూ.. కోర్టులో ఎసిబి పిటిషన్‌
-రాజకీయ ఒత్తిడులు లేకపోతే బాబు స్వర నమూనా కూడా…
ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దర్యా ప్తునకు పట్టు దొరికింది. ఈ కేసులో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎల్విస్‌ స్టీవెన్‌సన్‌తో టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, బిషప్‌ హ్యారీ సెబాస్టియన్‌తో పాటు మరో నిందితుడు జెరుసలేం మత్తయ్య ఆడియో , వీడియో టేపుల్లో మాట్లాడింది వాస్తవమేనని తేలింది. ఎమ్మెల్యేల స్వర నమూనాలను పరీక్షించిన రాష్ట్ర ఫొరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) ఎసిబి ప్రత్యేక కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. దీంతో తాము చేస్తున్న దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఎసిబి సిద్ధమవుతోంది. ఈ నివేదికను తమకు ఇవ్వాలని ప్రత్యేక కోర్టులో ఎసిబి శుక్రవారం పిటిషన్‌ వేసింది.

రాజకీయ ఒత్తిళ్లు లేకపోతే మాత్రం ఈ కేసులో ఎంతటి పెద్దవారినైనా వదిలే ప్రసక్తిలేదని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో మత్తయ్య తప్ప మిగతా నలుగురు బెయిల్‌పై విడుదల య్యారు. స్వర నమూనాలు నిందితులవేనని తేలడంతో ఈ కేసులో మరి కొందరిని చేర్చేందుకు ఎసిబి సిద్ధమవుతోంది.

చంద్రబాబు స్వర నమూనాలనూ సేకరించే పనిలో ఉన్నారు. చంద్రబాబుతో స్టీఫెన్‌సన్‌ ఏ ఫోన్‌తో మాట్లాడారనే వివరాలను ఇప్పటికే ఎసిబి సేకరించింది. ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా సంభాషణల ను స్టీఫెన్‌సన్‌ రికార్డు చేశారని తేలింది. ఈ యాప్‌లో 516 కాల్స్‌ రికార్డు కాగా అందులో 100 కి పైగా కాల్స్‌ ఓటుకు నోటుకు సంబంధించినవేనని ఎసిబి విచారణ లో తేలినట్లు తెలిసింది. చంద్రబాబుతో మాట్లాడిన సందర్భంలో కూడా అదే ఫోన్‌ను ఎమ్మెల్యే వాడినట్లు తేలడంతో తదుపరి చర్యలకు ఎసిబి సిద్ధమవుతోంది. రాజకీయ ఒత్తిడులు లేకపోతే కొత్త వారి పేర్లతో అను బంధ ఛార్జిషీట్‌ ను దాఖలు చేస్తామని ఒక అధికారి తెలి పారు. ఓటుకు నోటు వ్యవహారంలో కీలక ఘట్టాలు మే 30 న సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిగూడలోని సెబాస్టియన్‌ నివాసంలో, మరుసటి రోజు 31 న విక్ర ంపురిలోని స్టీఫెన్‌ మిత్రుడు మార్కంటేలర్‌ నివాసంలో జరిగినట్లు ఎసిబి తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.

http://www.prajasakti.com/Content/1719496

గుడ్లు అమ్ముకునే మీకెందుకే జీతాలు- మహిళలపై చింతమనేని బూతులు

తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసినా, అటవీ సిబ్బందిపై దాడి చేసి దౌర్జన్యంగా రోడ్డు వేసినా తనను ఏ వ్యవస్థ ఏమీ చేయకపోవడంతో ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లో ధీమా బాగా పెరిగినట్టుంది. ఈసారి చింతమనేని తీరుకు అంగన్‌వాడీ మహిళలు బలయ్యారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదు.. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయండంటూ విన్నవించుకునేందుకు వచ్చిన అంగన్‌వాడీ మహిళలను చింతమనేని బూతులు తిట్టారు.

నోటికొచ్చినట్టు, బయటకు చెప్పుకోలేని స్థాయిలో బూతులు తిట్టారు. ”కోడి గుడ్లు, పప్పులు అమ్ముకునే మీకెందుకే జీతాలు” అంటూ అనకూడని మాటలు అనేశారు. ”మా జీతాలకు దిక్కులేదు. చంద్రబాబే అద్దెఇంటిలో ఉంటున్నారు. మీకు వస్తున్నవి సరిపోవడం లేదని జీతాలు కూడా కావాలా.? కావాలంటే బెడ్‌రూం ఇస్తాం తీసుకోండి” అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే బూతులతో బిత్తరపోయిన మహిళల నోట మాట రాలేదు. ఇంతలో ఓ పెద్దావిడ జోక్యం చేసుకుని తాము అడుగుతున్నది పెంచిన జీతాలు కాదని… పాత జీతాలే మూడు నెలలుగా రాలేదని చింతమనేనికి వివరించబోయారు. అయితే ఆ పెద్దావిడను కూడా చింతమనేని బూతులు తిట్టారు.

ప్రభుత్వ విప్‌గా కూడా ఉన్న చింతమనేని తీరుతో హడలిపోయిన మహిళలు చేసేదేమీ లేక… ఎందుకొచ్చామురా దేవుడా అంటూ వెనుదిరిగారు. తహసీల్దార్‌ వనజాక్షిపై దాడి చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఎమ్మెల్యే ఇలా రెచ్చిపోయేవారు కాదని మహిళలు మండిపడుతున్నారు.

http://teluguglobal.com/tdp-mla-chintamaneni-rash-behaviour-with-womens22/

10 Comments

Filed under Uncategorized

10 responses to “ఆ స్వరాలు వారివే…

 1. Veera

  నేను గిల్లితే గిల్లించుకోవాలి,అరవకూడదు-పోకిరి లో డాన్ ప్రకాష్ రాజ్
  నేను కొడితే కొట్టించుకోవాలి, అరవకూడదు -డాన్ చింతమనేని చౌదరి, TDP MLA
  (అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే కమ్మగా ఉంటుంది!!!)

 2. Veera

  APలో 15% వృద్ధి రేటు -కోతల రా(నా)యుడు
  ఇండియా లో వృద్ది రేటు 7%, మరి AP లో 15% సాద్యమా?
  (అంటే ఆయన చెబితే కరెక్టే అనే కుల మీడియా ఉంటె సాధ్యమే!!!)
  ఎవర్రా నేను MA ఎకనామిక్స్ అని చెప్పింది?
  ఇంకా నయం, మా సాఫ్టవేర్ బ్రహ్మి వింటే జీవితం మీద విరక్తితో ఎక్కడన్నా దూకేవాడు!!!

 3. Veera

  టీ ఐదు రూపాయలు ఉంటే రూపాయికి కిలో బియ్యం ఏమిటి? TDP MP JC
  రుణమాఫీ అంటే అభివృద్ధి మాఫీ పంచె కూడా మిగలదు- వెనకయ్య నాయుడు
  మీరిద్దరూ చెప్పింది నిజమే కాకపోతే ఈ మాట TDP తరపున ఎన్నికల్లో చెప్పి ఉంటె
  సెహభాష్ అనేవాన్ని.రుణమాఫీ చేయలేము అని జగన్ అంటే నాకు అనుభవముంది (మోసం చేయడములో) నేను చేసి చూపిస్తా అన్నది బాబు కాదా!!!
  ఎన్నికల్లో ఆల్ ఫ్రీ అని చెప్పి వోట్లు దండుకొని ఇప్పుడు ఇలా అంటే ఎలా?
  బాబు మాత్రమే రుణమాఫీ చేయగలదు అని బాబు తో పాటు సభల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు అనలేదా?
  (రేవు దాటేదాకా ఓడ మల్లన్న దాటాక బోడి మల్లన్న !!!)

 4. Veera

  ఎర్ర బెల్లి ఎటకారం !!!
  వరంగల్ సీటును మనం బీజేపీకి ఇవ్వడం TRSకు లాభించింది. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ స్థానికులు కారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. రాజయ్య ఇంట్లో జరిగిన సంఘటనతో కాంగ్రెస్‌ ముందుగానే సంక్షోభంలో పడింది. చివరి రెండు రోజుల్లో కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ చేతులు ఎత్తేశాయి. నిధులు ఇవ్వలేకపోయాయి. దానిని టీఆర్‌ఎస్‌ సద్వినియోగం చేసుకొంది. ఆ పార్టీ నిధులు కుమ్మరించింది. దీనితో భారీ మెజారిటీ వచ్చింది -ఎర్రబెల్లి , చంద్రజ్యోతి

  సరే రేపు నారాయణఖేడ్ లో ఉప ఎన్నిక ఉంది కదా,20 సం లు అధికారం లో ఉన్న 33 సం ల TDP ఏమి చేస్తుందో చూద్దాం?
  అలాగే హైదరబాద్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయండి మరి ,BJP తో పొత్తు ఎందుకు? మీ బలమెంతో కూడా తెలుస్తుందిగా అసలే హైదరబాద్ ను ప్రపంచ పటం లో పెట్టినవాళ్ళు కదా మీరు, మీ మామ ఎన్టీఆర్ అయితే హైదరబాద్ వాళ్ళకు ఉదయాన్నే నిద్ర లేవడం నేర్పాడు కదా!!!

  (తెలంగాణా TDP నాయకులు వరంగల్ లో మనం పోటీ చేద్దాం అంటే వద్దు BJP కి ఇద్దాము ,అక్కడ మనం గెలవాలెం కాబట్టి TDP కి ఇద్దాం అన్నది ఎర్రబెల్లి అని ఇంగ్లీష్ పత్రిక వ్రాసింది , బాబు కూడా KCR తో కుదిరిన డీల్ ప్రకారం BJP కే సీట్ వదిలేసి ప్రచారానికి కూడా వెళ్ళలేదు)

 5. Veera

  రామార్పణం-చంద్రార్పణం-బిజెపి లో చర్చ
  (బిజెపి అద్యక్షుడు హరిబాబు తాజాగా కేంద్రం 1.93 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, వాటిని రామార్పణం కాకుండా చూడాలని అంటే, మీరు చంద్రార్పణం చేయకండి అని మరో నేత వ్యంగ్యం గా అన్నారు. బిజెపిలో కొందరు నేతలు చంద్రబాబు ను ఎక్కువగా పొగుడుతున్నారన్న అబిప్రాయం నేపద్యంలో ఆయన ఈ వ్యంగ్య వ్యాఖ్య చేశారన్నమాట)
  పార్టీ బలోపేతానికి కృషి చేయాలి-BJP అద్యక్షుడు, విశాఖ MPకంభంపాటి హరిబాబు చౌదరి
  ఉదయాన్నే ఈ జోకులేంటి సర్!!!
  మీరు మీ వెనకయ్య నాయుడు ఉండగా అదెలా సాధ్యం?
  ఏపార్టీ లో ఉన్నా మన …. మనకు ముక్యం కదా!! ఆ విధంగా ముందుకు పొండి
  ఎప్పుడన్నా కనీసం బాబు ను మాటవరసకన్నా దెబ్బ తగలకుండా పూలతో కొట్టండి సర్!!!
  http://kommineni.info/articles/dailyarticles/content_20151129_14.php?p=1448773484785

 6. Veera

  అంగన్ వాడి మహిళలను బూతులు తిట్టిన దెందులూరు TDP MLA ,విప్ అయిన చింతమనేని ప్రభాకర్ చౌదరి ని అరెస్ట్ చేయాలి -పౌర సంఘాలు
  ఏమంటిరి ఏమంటిరి TDP ప్రభుత్వంలో ఒక చౌదరిని అరెస్ట్ చేయడమా? అసంభవం!!!
  స్టూడెంట్ రితికేస్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు చౌదరిని అరెస్ట్ చేసామా? ఇసుక మాఫియా ను అడ్డుకున్న MRO వనజాక్షి ని కొట్టిన కేసులో చింతమనేని ని అరెస్ట్ చేసామా?అటువంటిది కేవలం అంగన్ వాడీ వర్కర్స్ ని తిట్టారని అరెస్ట్ చేస్తామా? కావాలంటే వేరే కులం వారి పేరు చెప్పండి అరెస్ట్ చేయిస్తాం!!!

 7. Veera

  కడుపుకు అన్నం తింటున్నారా లేక ఇసుక తింటున్నారా?
  గతం లో ఇసుక పై 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అన్నారు బాబు.ఇపుడు 831 కోట్ల ఆదాయం వచ్చింది అంటున్నారు అంటే మిగిలిన డబ్బు బాబు అండ్ కో హుండీ లోకి వెళ్ళినట్టే కదా?
  (1.ఇసుక మాఫియ లో బాబు హస్తముంది, ఒక్క ఇసుక లారీ కూడా బాబు కు తెలీకుండా వెల్లదు -BJP MP గోకరాజు గంగరాజు
  2.ఇసుకాసురులు 35 మంది TDP MLA లు అని TDP కరపత్రిక ఈనాడు వ్రాసింది,ఇందులో పెద్దలకు వాటాలున్నాయి అని చెప్పింది
  3.35 మందిTDP MLA లు ఇసుక కుంభకోణం లో ఉన్నారు, వేల కోట్లు గడిస్తున్నారు పెద్దల అండదండలతో -లోక్ సత్తా )

 8. Oka vypu …..Gajji dongalu rastranni dochukuntunta
  Mari oka vypu …..Aluperagani Praja poratam

  http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-mohan-reddy-tour-in-east-godavari-3553?pfrom=home-top-photos

  The fanatics might enjoy for sometime with their itch and money but will rot in Hell for having no human or ethical values.

 9. Veera

  జగన్ నటనను నమ్మరు-యనమల
  నిజమే నటించడం రాదు కదా!!! అయితే బాబు నటన భేష్ అంటారు అంతేగా!!!
  (నా అల్లుడు నాకంటే గొప్ప నటుడు-ఎన్టీఆర్)
  తెలుగు డ్రామా పార్టీ వాళ్ళు నటిస్తే వచ్చే ఆ కిక్కే వేరప్పా!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s