తెలంగాణలో కాంగ్రెస్,టిడిపి లు సహకరించుకోవడం ఆరంభమైంది.రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్,టిడిపి నేతలు ఒక హోటల్ లో భేటీ అయి స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో సహకరించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.కాంగ్రెస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలు ఈ భేటీలో పాల్గొని ఒక అవగాహనకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.రంగారెడ్డిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా చెరో స్థానంలో పోటీచేయవచ్చని భావించారు.ఒక స్థానానికి సుధీర్ రెడ్డిని అభ్యర్ధిగా పెట్టవచ్చు. మరో స్థానానికి టిడిపి తరపున గోపాల్ పోటీచేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఇది కత్త పరిణామమే.
తల్లి ,పిల్ల కాంగ్రెస్ లని తరచు విమర్శలు చేసే టిడిపి నేతలు ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం విశేషమే.
రంగారెడ్డిలో ఈ అవగాహన కుదిరితే అది తెలంగాణ స్థాయిలో కూడా జరగవచ్చన్న అబిప్రాయం ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20151129_34.php?p=1448860975593
నాడు రౌడీషీటర్.. నేడు ప్రభుత్వ విప్
-అప్పుడూ ఇప్పుడూ దాడులూ, దౌర్జన్యాలే చింతమనేని చరిత్ర
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి
ఆయన ఓనాడు రౌడీషీటర్. నేడు ప్రజాప్రతినిధి. శాసన సభలో ప్రభుత్వ పక్ష విప్ కూడా. కానీ తనపై రౌడీషీట్ ఉన్న నాడూ, ఇప్పుడూ ప్రవర్తనలో కించిత్ తేడా లేదు. అధికా రులపైనా, మహిళలపైనా అనేకసార్లు దౌర్జన్యాలను చేసిన చరిత్రను మూటగట్టుకున్నారు. ఆయనే పశ్చిమగోదావరి జిల్లాలోని చింతలపూడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అధి కార పార్టీ ఎమ్మెల్యే అవ్వడంతో తానాడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. మహిళలు, ఉద్యోగులపై చింతమనేని దౌర్జన్యాలకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. పోలీ సులు సైతం భయపడే పరిస్థితి నెలకొంది. ఓ ప్రజాప్రతి నిధిగా చట్టాన్ని పరిరక్షించాల్సిన ఆయనే శాంతిభద్రతలకు విఘాతంగా పరిణమించడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
గత శుక్రవారం చింతమనేని.. ఏలూరులో మహిళ లని కూడా చూడకుండా అంగన్‌వాడీ ఉద్యోగులపై సభ్య సమాజం తలదించుకునేలా.. పత్రికల్లో రాయ వీలులేని అస భ్య పదజాలంతో దూషించారు.
దీనిపై రాష్ట్రవ్యాప్తంగా మహి ళాలోకం మండిపడుతోంది. చింతమనేని దౌర్జన్యకాండపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనపై 2004లోనే ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది. 20కుపైగా కేసులున్నాయి. అలాంటి వ్యక్తికి ఎంపిపి పదవి నుంచి ఎంఎ ల్‌ఎ, విప్ పదవుల వరకూ కట్టబెట్టడం రౌడీయిజానికి టిడిపి లైసెన్స్ ఇచ్చినట్టయిందనే విమర్శలున్నాయి. 2004లో రెవెన్యూ అధికారి పెంచల్‌రెడ్డిపై దాడికి పాల్పడిన చింతమ నేని ఆ తర్వాత వరుసగా ప్రభుత్వ అధికారులే టార్గెట్‌గా రెచ్చిపోయారు. తన మాట వినని అధి కారులపై దాడికి పాల్పడటం పరిపా టిగా మారింది. 2012లో జిల్లా పంచాయతీ అధికారి వరప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారు. పెదవేగి మండలంలో ఎస్‌ఐలుగా పనిచేసిన ఆనందరావు, మోహనరావు, ఆంజనేయులుపై దౌర్జన్యానికి దిగారు. పోలీస్ సిబ్బంది దెందులూరు నియోజకవర్గంలో పని చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొల్పారు. ఎఫ్‌సిఐ గోడౌన్ అధికారి, అటవీశాఖ అధికారులపై చింతమనేని సాగించిన దౌర్జన్యకాండ అంతాఇంతా కాదు. కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై దాడి ఘటన చింతమనేని అసలు రూపాన్ని రాష్ట్రమంతటా తెలిసేటట్టు చేసింది. ఓ మహిళా తహశీల్దారుపై తన అనుచరగణాన్ని ఉసిగొల్పి చింతమనేని సాగించిన దౌర్జన్యకాండను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. కొల్లేరులో చేపల అక్రమ చెరువుల మాఫియాకు, తమ్మిలేరులో ఇసుక మాఫియాకు చింతమనేనే అండదండ అనే విమర్శలున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవుతున్నారు.
అంగన్‌వాడీ ఉద్యోగులపై ఆదినుంచీ వేధింపులు!
టిడిపి అధికారంలోకి రాకముందునుంచే అంగన్ వాడీలను వేధిస్తూనేవున్నారు. నచ్చనివారిని తొలగిస్తూ వారి పోస్టులను అనుయాయులకు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఏకంగా అంగన్‌వాడీలపై అసభ్య పదజాలంతో రెచ్చిపో యారు. దుర్భాషలాడారు. ఆయనపై కేసు పెట్టేందుకు అంగన్‌వాడీలు సిద్ధమయ్యారు. చింతమనేనిపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
‘నా చావుకు బాధ్యులు పవన్ కల్యాణ్ , టీడీపీనే’
విజయవాడ :
ఏపీ ముఖ్యమంత్రి కటౌట్ పైకి ఎక్కిన ఓ రైతు.. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడంతో విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో కాసేపు గందరగోళం నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కర్నూలు జిల్లా అస్సారి మండలం అట్టెకల్లు గ్రామానికి చెందిన గోవిందరాజుగా పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో.. జనంలో తిరగలేకపోతున్నానని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి దిగానని తన లేఖలో వివరించాడు.
ఆయన ఆవేదన ఆయన మాటల్లోనే….
నా పేరు గోవింద రాజు. 2014కు ముందు నేను ఏ పార్టీలో చేరలేదు. కనీసం టీడీపీకి అభిమానిని కూడా కాదు. కానీ.. ఎలక్షన్‌లకు ముందు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మీద ఉన్న అభిమానంతో.. ఆయన మాటలు నమ్మి టీడీపీ కోసం ప్రచారం నిర్వహించాను. దళిత సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ మా వార్డు వాళ్లందరితో టీడీపీకి ఓటు వేసే విధంగా ప్రచారం చేశాను.
అనంతరం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా టీడీపీని గెలిపించడానికి కృషి చేశాను. వార్డు పరిధిలో సిమెంట్ రోడ్డు వేయిస్తామని, పింఛన్లు ఇప్పిస్తామని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించాను. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో.. జనాల్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. గతంలో చేసిన అప్పులు … ఇప్పుడు తీర్చాలంటూ అప్పులు ఇచ్చినవాళ్లు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇంటి దగ్గర నాతో కలిసి ఉండాలంటే మొహం చెల్లగా నా భార్య, పిల్లలను విడిచి వెళ్లిపోతున్నాను.
ఏది ఏమైనా మా అన్నయ్య పవన్ కళ్యాణ్ మాత్రం నా గుండెల్లో ఉన్నాడు. ఆయన అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. నా కుటుంబానికి టీడీపీ అన్ని విధాలుగా న్యాయం చెయ్యాలి.. నా మరణానికి సమాధానం చెప్పాల్సిన ఇద్దరు.. ఒకరు పవన్ కళ్యాణ్ అయితే.. మరొకరు టీడీపీ పార్టీ అని పేర్కొన్నాడు.
కాగా కటౌట్ ఎక్కిన గోవిందరాజులును పోలీసులు సముదాయించి ఎట్టకేలకు కిందకు దించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రబాబు సందర్శకులను కలుస్తారని చెప్పడంతో అతను తన పట్టువీడాడు. గోవిందరాజులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
http://www.sakshi.com/news/district/farmer-attempts-suicide-by-stepping-up-cut-out-of-chandra-babu-naidu-294517?pfrom=home-top-story
ఇలా అంకెల గారడీ చేస్తే మా స్విట్జర్లాండ్ లో అయితే బాబును జైలు లో కాని మెంటల్ ఆసుపత్రిలో కానీ పెడతారు-ఫిబ్రవరి 2000లో అప్పటి CM బాబు ముందే చెప్పిన స్విస్ ఆర్ధిక మంత్రి Pascal Couchepin (Feb18,2000)
(AP అభివృద్ధి రేటు 15% సాధిస్తాం-కోతల రా(నా)యుడు
చైనా అభివృద్ధి రేటు 7%, 2014లో భారత్‌లో వృద్ధిరేటు 7.4%, 2014 లో AP వృద్ది రేటు 7.48%. మరి AP కి 15% సాధ్యమా???
ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళూ, ఆ స్విస్ మంత్రి చెప్పింది కరెక్టా కదా???)
[Naidu’s economic numbers could land one in jail or mental hospital, says Swiss minister (Feb18,2000)
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu was visibly embarrassed by the comments of the Swiss Minister for Economy, Pascal Couchepin, at a luncheon meeting in Hyderabad Friday.
Reacting to the presentation made by Naidu on the “Vision-2020” envisaged for the state, the Swiss minister felt that Andhra Pradesh’s target for a seven-fold increase in the gross state product in the next two decades was a bit too ambitious.
“Such projections we cannot make in our country. In the best of electoral speeches in Switzerland, we cannot make such promises or projections. If I make such promises, I will be sent either to a jail or a (mental) hospital,” Pascal Couchepin quipped, even as Naidu was seen squirming in his seat.
The Swiss minister also had a word of advice for Naidu. He said that a predominantly agrarian state like Andhra Pradesh should lay stress on the development of the farm sector, which provided employment and foodgrains for the people.
http://www.rediff.com/money/2000/feb/18naidu.htm ]