ఏమార్చడంలో బాబు తరువాతే ఎవరయినా !

అబద్దాలు చెప్పడంలో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మించినవాడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన అబద్దాలను అందంగా ప్రచారంచేసి పెట్టడంలో ఆంధ్రా మీడియాను మించిన మీడియా మరొకటి ఈ ప్రపంచంలోనే లేదు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. ఈ సంధర్భంగా జరిగిన ఒప్పందాలలో భారతదేశంలోని మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా తాము అభివృద్ది చేస్తామని ముందుకు వచ్చింది.

మహారాష్ట్రలోని పుణె, అమరావతి, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాలను బ్రిటన్ ఎంపిక చేసుకుంది. అయితే కోతికి దొరికిందే కొబ్బరిచిప్ప అన్నట్లు అమరావతి పేరు కనిపించగానే ఆంధ్రా రాజధాని అమరావతి అంటూ ఆంధ్రా మీడియా సంకలు గుద్దుకుంది. ఇక టీడీపీ సోషల్ మీడియాలో దానిని గొప్పగా ప్రచారం చేసుకుంది. అది మహారాష్ట్రలోని అమరావతి నగరం అన్న విషయాన్ని దాచిపెట్టింది. జనాలను ఏమార్చడంలో వీరికి పీహెచ్ డీ పట్టా ఇచ్చినా తక్కువే.

http://madeintg.com/amaravathi-develop/

ప్రకాశం జిల్లా వదిలిపెట్టని చంద్రబాబు
తమ ప్రాంతాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ వైపు రాయలసీమవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ఆ జాబితాలోకి ప్రకాశం జిల్లా కూడా వచ్చి చేరుతోంది. జిల్లాకు కొత్తగా ప్రాజెక్టులు, అభివృద్ది పనుల సంగతి అలా ఉంచితే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులను కూడా చంద్రబాబు పక్క జిల్లాలకు తరలిస్తుండడంపై జిల్లావాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లావాసులకు తాజాగా కోపం రావడానికి కారణం మైనింగ్‌ యూనివర్శిటీ.

ఏప్రిల్‌లో నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన వెనుకబడిన చీమకుర్తి ప్రాంతంలో మైనింగ్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలో గ్రానైట్‌తో పాటు అనేక రకాల ఖనిజాలు ఉండడంతో మైనింగ్ యూనివర్శిటీకి సరైన ప్రాంతాన్నే చంద్రబాబు ఎంపిక చేశారని అందరూ భావించారు. అయితే ఇప్పుడా యూనివర్శిటీని కృష్ణా జిల్లాకు తరలించారు. కృష్ణా జిల్లాలో మైనింగ్‌ యూనివర్శిటీ కోసం స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఇదే ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

తాము అడక్కుండానే మైనింగ్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ఆశచూపి ఇప్పుడు తీరా దాన్ని తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లాకు చెందిన టీడీపీ నేతలు గానీ, మంత్రులు గానీ నోరు మెదకపోవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇటీవల కేంద్రం ప్రకటించిన లక్షా 98వేల ఇళ్లలోనూ ప్రకాశం జిల్లాకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న భావన వ్యక్తమవుతోంది. లక్షా 98 వేల ఇళ్లలో ప్రకాశం జిల్లాకు కేవలం 5వేల ఇళ్ళు మాత్రమే ప్రకటించారని ఆరోపిస్తున్నారు.

http://teluguglobal.com/ap-govt-shift-the-mining-university-to-krishna1/

15 Comments

Filed under Uncategorized

15 responses to “ఏమార్చడంలో బాబు తరువాతే ఎవరయినా !

 1. Veera

  విజయవాడ మాజీ MLA అడుసుమిల్లి చౌదరి గారు చక్కగా వ్రాసారు

  సుపరిపాలన శూన్యమేనా?
  http://andhrabhoomi.net/content/main-feature-7

 2. Veera

  దూసుకెళుతున్న జగన్ ఆర్మీ ,పొలిటికల్ పంచ్ టీం
  తెలుగు దేశం అంటే నే హైటెక్ పార్టీ. ప్రచారం మొదలు కుని…పని తీరు అంచనా వరకు అంతా టెక్నాలజీ ద్వారానే తెప్పించే పార్టీ. అలాంటి హైటెక్ పార్టీ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వెనుక బడింది. బాబు పోటోలు…ప్రచారం కనిపించే స్థానంలో ప్రభుత్వంపై విమర్శలు….కార్టూన్లు ఎక్కువ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షానికి దీటుగా సమాదానం ఇవ్వడంతో టిడిపి వెనుక బడిందని తెలుస్తోంది.

  చంద్రబాబు నుంచి నారా లోకేష్ వరకు పార్టీలో టెక్నాలజీకి పెద్ద పీఠ వేస్తారు. అధినేత పార్టీ నేతల పనితీరును సైతం ఐవిఆర్‌ఎస్‌ విధానంతో సర్వేలు నిర్వహించి రిపోర్టులు తయారు చేస్తున్నారు. మరోవైపు అందరికీ ఐడి కార్డుల పేరుతో సభ్యత్వ కార్డులతో సమస్త సమాచారం సేకరించారు చిన బాబు లోకేష్. ప్రచారం నుంచి ప్రతి అంశంలో టిడిపి టెక్నాలజీని మొద టినుంచి బాగా ఉపయోగించు కుంటుందనే పేరుంది. మొన్నటి ఎన్నికల్లో సైతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా…బాబు ఆవస్యకతను వివరిస్తూ విస్తృతంగా పోస్టులు ఫేస్‌ బుక్ లలో కనిపించేవి.

  అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీలు కనీసం వూహించ లేని స్థాయిలో సోషల్ మీడియాలో ఆధిపత్యం ప్రదర్శించింది తెలుగు దేశం. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని వైసిపి అందుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జగన్ పార్టీ… సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టి విమర్శలు చేస్తోంది. ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం విమర్శనాత్మకంగా పోస్టింగ్ లు పెడుతోంది. పెద్ద సంఖ్యలో పోస్టలు పేస్ బుక్ లో దర్శనం ఇస్తున్నాయి. ఎఫ్‌బిలో జరిగే చర్చల్లో కూడా జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ గళం వినిపిస్తు్ననారు. మరోవైపు వాట్సాప్ లో సైతం ఇదే జోరు చూపుతుంది వైసిపి.

  పార్టీ పరంగా ఈవిషయంలో కొంత ప్లానింగ్ తో వ్యవహరిస్తుంటే…మరోవైపు అభిమానులు కూడా తమ వంతు పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే పొలిటికల్ పంచ్ లు అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలతోపోస్టింగ్ లు దర్శనం ఇస్తున్నాయి. బాబు మాట్లాడిన మరునిముషం వ్యగ్యంగా..లేక విమర్శలతో పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు విధానాలను ఎండగట్టేందుకు ఆసక్తికరంగా పోస్ట్ చేస్తున్నారు. దీని కోసం వైసిపిలో ప్రత్యేకంగా టీంలు పనిచేస్తున్నాయి. కేవలం ఇండియానుంచే కాకుండా…ప్రభుత్వానికి వ్యతిరేకంగా విదేశాలనుంచి కూడా జగన్ పార్టీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఫేస్ బుక్ వాట్సాప్ లలో ప్రతిపక్షం హవా కొనసాగుతుంది.

  తెలుగు దేశం పార్టీలో ఐటి వింగ్ కు చాలా ప్రాధాన్యం ఉంది. పార్టీ అధికారంలోకి రావడానికి ఐటి వింగ్ చేసిన ప్రచారం అద్భుతం అంటూ గతంలో అంతా కీర్తించారు. అయితే ఇప్పుడు ఆ వింగ్ పూర్తిగా డల్ అయిపోయింది. దీనికి తోడు పార్టీ పరంగా ప్రభుత్వ కార్యక్రమాలను వివరించేందుకు పెద్దగా ప్రయత్నం జరగడం లేదు. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తరువాత ఎదురుదాడి తగ్గుతుంది. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో చేసినన్ని విమర్శలు అధికారంలో కూర్చుని చెయ్యలేరు. ఈ కారణం కూడా తోడవ్వడంతో వైసిపి సోషల్ మీడియాలో దూసుకుపోతుంటే టిడిపి చతికల పడింది. లోకేష్, చంద్రబాబు దీనిపై ఓ లుక్‌ వేయాలని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లోనూ పార్టీ హవా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారట. మొత్తానికి ఈ విమర్శల మాత్రం.. సామాన్యులను అలరిస్తున్నాయ్‌.

  http://www.ntvpost.com/news/its-tdp-vs-ysrcp-online-war-10713

 3. Veera

  ఓటుకునోటుః రేవంత్ మ‌ళ్లీ బ‌క‌రా

  ఓటుకునోటు కేసులో ఏ1 నిందితుడు అయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మ‌రోమారు బ‌కారా అయ్యారు. ఈ ద‌ఫా ఆయ‌న్ను అలా బ‌లిచేసింది ప్ర‌తిప‌క్షాలో లేక‌పోతే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులో కానే కాదు స్వ‌యంగా ఆళ్ల పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు!!

  తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, మాజీ ఎంపీ రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కుమారుడి వివాహం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. చంద్ర‌బాబుకు రావుల అత్యంత స‌న్నిహితుడు అయిన నేప‌థ్యంలో విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌త్యేకంగా వ‌చ్చిన చంద్ర‌బాబు వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మైహోమ్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. రావుల చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, జూప‌ల్లి రామేశ్వ‌రరావుల‌ది మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాయే అనే సంగ‌తి తెలిసిందే.

  వివాహానికి హాజ‌రైన చంద్ర‌బాబు రామేశ్వ‌ర‌రావుతో భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో రావుల కుమారుడి వివాహానికి హాజరయిన అనంతరం అక్కడే ఉన్న రామేశ్వరరావుతో కేవ‌లం క‌ర‌చాల‌నంతో స‌రిపెట్ట‌కుండా చంద్రబాబు ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆప్తుడు అయిన రామేశ్వరరావుతో ఏం మాట్లాడారనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్ర‌బాబును రేవంత్ లైట్ తీసుకున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మైహోం సంస్థ‌ల్లో అన్యాయం అక్ర‌మం అంటూ రేవంత్ రెడ్డి గ‌గ్గోలు పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న పోరాటం ఆప‌బోన‌ని కూడా రేవంత్ ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అయితే అదేమీ ప‌ట్టించుకోకుండా రేవంత్ కామెంట్స్‌ను లైట్ తీసుకుంటూ చంద్ర‌బాబు రామేశ్వ‌ర‌రావుతో భేటీ అవ‌డం అంటే…రేవంత్ మ‌రోమారు బ‌క‌రా అయిన‌ట్లేన‌ని అంటున్నారు.

  http://madeintg.com/babu-punch-to-revanth/

 4. Veera

  90% కరువు,10% వరదలతో ఉన్న AP లో ఏమి చేసారని విజయ యాత్రలు రాజా?
  అసలు ఏమి తింటారు రాజా?

  కుల మీడియా-అయ్యో మనకు హుదూద్ ను ఆపిన బాబు లేకపోయే అని తమిళుల బాధ

  నిప్పు:ఎంతటివారినైనా వదిలిపెట్టను శిక్షిస్తాను
  బ్రాహ్మి:మరి ఆ MLA చౌదరి ని, ప్రిన్సిపాల్ చౌదరిని శిక్షించలేదే?
  పోసాని:ఎంతటివారైనా అన్నాడు కాని ఏ కులం వారైనా అనలేదుగా రాజా ???

  పప్పు:నాన్నారు హుదూద్ ను టెక్నాలజీ తో అపినట్ట్టుగా చెన్నై తుఫాన్ ను ఆపోచ్చుగా ?
  నిప్పు:అరె మాలోకం, అక్కడ మన కుల మీడియా లేదు అపాము అని డప్పు కొట్టడానికి!!!
  మెంటల్ కృష్ణ: నీ క్లారిటీ నాకు నచ్చింది ,ఐ లవ్ యు రాజా !!!

  కూతురు పుట్టిందన్న సంతోషం లో 3 లక్షల కోట్లు దానం చేసిన ఫేస్ బుక్ జుకర్ బర్గ్
  మనువడు పుట్టినప్పుడు సింగపూర్ లో ఉన్న5 లక్షల కోట్ల లో కనీసం ఒక లక్ష కోట్లు అన్నా ఇవ్వచ్చు కదా???

 5. nlr2019

  Kondharu …Okarki okaru sahyama chesukuntu ..Rastranni dochukunutunta
  Mari kondhari pedha prajala jeevithalu ……ila

  http://www.sakshi.com/news/district/man-takes-dead-body-on-bicycle-for-funeral-294855?pfrom=home-top-story

  But I don’t have to tell who will go to heaven and who will rot in hell because death is inevitavble.

 6. Veera

  దేశమంటే మట్టికదోయ్ దేశమంటే మనుషులోయ్-ట్విట్టర్ లో బాబు
  (దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ కు వచ్చిన తిప్పలు)
  ఇంగ్లీషే కాదు తెలుగు కూడా రాదు అన్నమాట!!!
  (ఏమిరా బాలరాజూ నీ వలన దేశానికి ఉపయోగం-ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగ్ )

 7. Veera

  సైకిల్ గుర్తుపై గెలిస్తే కెసిఆర్ ఎలా చేర్చుకుంటారు-తెలంగాణా టిడిపి
  ఫ్యాన్ గుర్తు పై గెలిచిన నంద్యాల MP SPY రెడ్డి, అరకు MP కొత్తపల్లి గీత లను TDP కండువా కప్పి మరీ బాబు TDP లో చేర్చుకోలేదా?
  అంటే బాబుకు ఎటూ విలువలు లేవు మీరన్నా పాటించండి కెసిఆర్ అని అంటున్నారా టీడీపి వాళ్ళు ?

 8. Veera

  గురజాడకు, కందుకూరికి తేడా తెలియని YCP- చదువు ‘కొన్న’ లోకేష్
  (కులపిచ్చి, అవినీతి ఉన్న పార్టీ ఒక్క TDP మాత్రమే- బాగా చదువు ‘కొన్న’ లోకేష్

  (మహాకవి గురజాడ శతవర్ధంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ ఫేస్‌బుక్‌ టీమ్‌ పెట్టిన పోస్ట్‌లో గురజాడ ఫొటోకు బదులుగా కందుకూరి వీరేశలింగం ఫొటో పెట్టారు. ఈ తప్పును అందిపుచ్చుకున్న లోకేష్‌ తన ట్విట్టర్‌లో ఇదే అదునుగా జగన్‌మీద, పార్టీమీద విరుచుకుపడ్డాడు. వెంటనే తెలుగుతమ్ముళ్ళు సోషల్‌ మీడియాలో జగన్‌ను, వైఎస్‌ఆర్‌సీపీని దుమ్ములేపారు.)

  అయితే లోకేష్‌ ట్వీట్‌కు వైఎస్‌ఆర్‌సీపీ అఫిషియల్‌ సోషల్‌మీడియా టీమ్‌ స్పందించకపోయినా పార్టీ అభిమానులు వెంటనే తీవ్రంగా స్పందించి గతంలో చంద్రబాబు గురజాడ కొటేషన్‌తో ట్వీట్‌ చేస్తూ “దేశమంటే మట్టి కాదోయ్‌” అని పెట్టబోయి “దేశమంటే మట్టి కదోయ్‌” అని ట్వీట్‌ చేసిన దానిని మళ్లీ ఇప్పుడు పోస్ట్‌ చేశారు.

  అలాగే లోకేష్‌ ఒక సభలో మాట్లాడుతూ పొరపాటున “బంధుప్రీతి, మతపిచ్చి, కుల పిచ్చి… ఎక్కువగా ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయేనని గుర్తించండి” అన్న వీడియో క్లిప్పింగ్‌ను కూడా పోస్ట్‌ చేశారు. దీనికి స్పందించిన టీడీపీ అభిమానులు గతంలో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా….. భారతదేశంలోని … రాష్ట్రాలలో 33వ రాష్ట్రం …. అంటూ పెట్టిన పోస్ట్‌ను ఇప్పుడు మళ్లీ స్ర్కీన్‌ షాట్‌ తీసి పోస్ట్‌చేసి, భారతదేశంలో ఎన్నిరాష్ట్రాలు ఉన్నాయోకూడా తెలియని వాళ్లకు పార్టీలు ఎందుకు? అని ఎద్దేవా చేస్తున్నారు.

 9. Veera

  కుళ్ళు జోకులు
  1.కిలో రెండు రూపాయలకు బియ్యం ఇచ్చారంటే అది NTR దూరదృష్టి -బాబు
  మరి మీరు CM అయాక తీసేసారు కాబట్టి మీకు దూరదృష్టి లేనట్టేగా?

  2.బుల్లెట్ లా దూసుకుపోతా-బాబు
  దూసుకెల్లాల్సింది AP, మీరు కాదు!!!

  3.నేను ఎవరికీ భయపడను-బాబు
  ష్ గట్టిగా అనకండి కెసిఆర్ వింటాడు
  మోడీ అంటే డిల్లీలో ఉన్నాడు కాబట్టి ఫర్వాలేదు

 10. Veera

  కాపు సోదరులారా ,కమ్మని కుట్రలను గమనించండి!!!
  18 నెలల తరువత కాపుల రిజర్వేషన్ కోసం కమీషన్ వేసి 9 నెలల్లో రిపోర్ట్ అంటున్నాడు బాబు.మరలా ఇంకో 6 నెలలు ,ఇంకో 6 నెలలు అని పొడిగించి అ విధంగా ఎన్నికల వరకు లాగిస్తాడు.
  ఇప్పటికే అభివృద్ధి చెందిన కాపులకు రిజర్వేషన్ కుదరదు అని హై కోర్ట్ చాలాసార్లు కొట్టేసింది.ఇది బాబు మార్కు ఎన్నికల స్టంట్!!!
  2014 చట్ట సభల్లో రెడ్డి ,కమ్మ కాపు కులస్థుల బలాబలాలు
  రెండు తెలుగు రాష్ట్రాల్లో MLA లు
  రెడ్డి: 80 (39 in AP and 41 In T)
  కమ్మ: 38 (33 in AP and 5 in T)
  కాపు /బలిజ.మున్నూరు/తూర్పు ..: 32(24 in AP,8 in T)

  రెండు తెలుగు రాష్ట్రాల్లో MP లు
  రెడ్డి:11(6 in AP and 5 in T)
  కమ్మ6(6 in AP, 0 in T)
  కాపు /బలిజ/మున్నూరు/తూర్పు:2(2 in AP, 0 in T)
  (సోర్స్ : నందమూరి ఫ్యాన్స్, కమ్మ వరల్డ్, కాపు వరల్డ్ )

  ఇతర కులాలతో ఇంచుమించు సమానగా ఉన్న కాపులకు రిజర్వేషన్ కోర్ట్ ఒప్పుకోదు,కొట్టేస్తుంది.ముస్లిమ్స్ కు ఇచ్చారు అంటే వాళ్ళు చట్ట సభల్లో మహా అయితే 2,3 MLA ల కంటే ఎక్కువ ఉండేవారు కాదు. కాబట్టి కాపుల రిజర్వేషన్ కు కోర్ట్ ఒప్పుకోదు.

  నిజంగా బాబు కు కాపుల మీద ప్రేమ ఉంటె ప్రతి సం కాపులకు ఇస్తామన్న వెయ్యి కోట్లు ఇవ్వాలి కాని 100 కోట్లే ఇచ్చాడు.
  మొన్న జరిగిన 14 MLC లలో 7 మంది సొంత కులస్తులకు ఇచ్చి కాపులకు ఒకటి ఇచ్చి మొండి చేయిచూపాడు బాబు.

  ఇంకో వైపు TDP నాయకుడు BC క్రిష్నయ్య కాపులకు రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకోము అంటున్నాడు.ఒక పధకం ప్రకారం కాపులకు వెన్నుపోటు పొడుస్తున్నాడు బాబు.
  అసలు రాష్ట్రాన్ని విడగొట్టమని బాబు లేఖ ఇవ్వడం వెనక ప్రధాన కారణం రెడ్ల బలాన్ని తగ్గించాలనే!!!

  గమనిక:నేను కాపులకు వ్యతిరేకం కాదు కాని నాకున్న అవగాహనతో రిజర్వేషన్ జరిగేపని కాదు అని చెప్పడమే నా ఉద్దేశం, తప్పుగా అర్ధం చేసుకోకండి!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s