సుపరిపాలన శూన్యమేనా?అడుసుమిల్లి జయప్రకాష్

ఏ ప్రభుత్వంలోనైనా సుపరిపాలన సాగుతున్నదా, లేదా! అన్నది చెప్పడానికి రెండే గీటురాళ్లు. ఒకటి ప్రజల సమస్యలు, రెండోది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రజలకు నిత్యసమస్యలు అనేకానేకం ఉన్నా, అన్నిటికంటె ప్రధానమైనది నిత్యావసరాల ధరవరలు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ప్రధానంగా చూడవలసింది కేటాయింపులు, అప్పులు. ఈ రెండింటిని బట్టి చూస్తే ప్రభుత్వపాలన ఏ విధంగా ఉన్నదో తేలికగానే చెప్పవచ్చు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడచిన 16 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం సుపరిపాలనకు ఇంకా చాలా దూరంగానే ఉన్నదని ఆ రెండు గీటురాళ్లను పరిశీలిస్తే స్పష్టమవుతుంది.

సుపరిపాలన ఉన్నదని చెప్పడానికి మరో గీటురాయి హామీల అమలు. ఈ అం శంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యానికి ఆమడ దూరంలోనే కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడకముందు ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలు చేసినవెన్ని? ఇంకా ఇస్తున్నవెన్ని? అన్నది పరిశీలిస్తే పది శాతం కూడా మార్కులుపడే అవకాశంలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ప్రధాన హామీయే ‘సుపరిపాలన’. ఇంకా మిగిలిన హామీలు కోకొల్లలు. ఆ హామీలు అమలు జరిగి ప్రజలు సంతృప్తిగాఉంటే సుపరిపాలన సాధించినట్లవుతుంది. కానీ ప్రధాన హామీలే అమలుకానప్పుడు రాష్ట్రం లో సుపరిపాలన ఉన్నదని ఎలా చెప్పగలం! అది లేనప్పుడు ప్రజలు వేసిన ఓటుకు విలువ ఏముంటుంది!

అధికారంలోకి వచ్చిన రోజునుండి ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులను పరిశీలిస్తే ప్రజలకు తాను ఇచ్చిన హామీలను గాలికివదిలివేసి కొందరు సంపన్నులు, పార్టీలోని ‘అస్మదీయుల’ ప్రయోజనాలకోసం మాత్రమే- పనిచేస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేయడం, అనుత్పాదక కార్యక్రమాలపై అధికంగా వెచ్చించడంవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రానురాను మరింత దిగజారుతోంది గాని, ప్రజలకు ఎంతమాత్రం ప్రయోజనం కలిగించడం లేదు. ఆ కమిటీలు, ఈ కమిటీలు అంటూ కాలక్షేపం చేయడంలోనే 16 నెలలు గడిచిపోయాయి. వందలు, వేల, కోట్లల్లో ప్రజాధనం దుబారా ఒక్కటే ఈ పదహారునెలల్లో కనిపిస్తున్న సత్యం అనిపిస్తుంది.

Read Full Article at
http://andhrabhoomi.net/content/main-feature-7

12 Comments

Filed under Uncategorized

12 responses to “సుపరిపాలన శూన్యమేనా?అడుసుమిల్లి జయప్రకాష్

 1. Mega cities without proper planning ….
  Airports , IT offices etc etc inundated with water.
  How many crores is one acre ?
  How many crores is human lives worth ??
  Human greed comes with consequences.

  http://www.ndtv.com/chennai-news/no-airport-roads-become-rivers-chennai-from-an-air-force-chopper-1250510?pfrom=home-lateststories

 2. Veera

  వోటుకు కోట్లు కేసు సా ………..గుతోంది-ACB DGP AK ఖాన్
  (మీరు AK ఖాన్ కాదు AK 47 అనుకొన్నాం సర్. ప్చ్ !!!
  నిప్పు బాస్ వెళ్లి మీ దొర కాళ్ళు పట్టుకొన్నాక మీరు మాత్రం ఏమి చేస్తారులే!!!
  వాళ్ళు వాళ్ళు ఒక్కటైపోయరుగా!!!
  అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ అని కెసిఆర్ చెప్పింది కరెక్టే!!!)

 3. Veera

  విదేశాల్లో బాబుకు అవినీతి ఆస్తులు ఉన్నాయి
  -1997 లో బాబు పై BJP పుస్తకం లోని మాటలు

 4. Aa desam agina ……andhu kalidina
  Pogadara ……Mana Kulanni …Mathanni ?

  Narrow minded and unethical fanatics destroying this world.

  http://www.dailymail.co.uk/news/article-3343309/At-TWENTY-people-gunned-California-mass-shooting-police-search-three-suspects.html

  They will rot in hell.

 5. Veera

  బాబు సొంత అసెంబ్లీ చంద్రగిరి YCP MLA చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్ట్
  (ఎయిర్ ఇండియా అదికారి రాజశేఖర్ కేసులో అరెస్టు)
  నిజంగా తప్పు చేసి ఉంటె సరే కాని ఇంతవరకు దాడి జరిగినట్టుగా ఆధారాలు లేవు)

  కాని TDP MLA చింతమనేని చౌదరి సైగతో అయన మనుషులు ఇసుక మాఫియా ను అడ్డుకొంటావా అని MRO వనజాక్షి ని ఈడ్చుకొంటూ కొట్టుకొంటూ వెళ్ళిన వీడియో లు అందరం చూసాము , 3 నెలలైనా కాని కేసు లేదు కానీ 5 రోజుల క్రితం జరిగిన సంఘటనపై ఆధారాలు లేకుండా అప్పుడే అరెస్ట్

  భాస్కర్ రెడ్డి కాకుండా బాస్కర్ చౌదరి అయితే అరెస్ట్ ఉండేదా???
  అతను మనోడు అయితే ఓకే!!!

 6. Veera

  TDP గంగానది లాంటిది- ఆనం బ్రదర్స్ చేరికపై కిమిడి కళా వెంకట్రావు
  గంగానది కాలుష్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం!!!!
  -Phani Sharma

 7. Veera

  కెసిఆర్ ఆప్తుడితో (మై హొమ్ రామేశ్వరరావు) చంద్రబాబు భేటీ-వోటుకు కోట్లు ఎఫెక్ట్
  (సైలెంట్ గా ఉంటున్నాను కదా, ఇంక నన్ను వదిలేయండి దొరా)
  [కెసిఆర్ ఆప్తుడితో చంద్రబాబు భేటీ-ఆంతర్యం
  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావుతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం అవుతోంది.ఒకప్పుడు ఉప్పు,నిప్పుగా ఉన్న చంద్రబాబు,కెసిఆర్ లు ఇటీవలి కాలంలో కొంత స్నేహంగా ఉంటున్నారు.ఓటుకు నోటు కేసు ఒకవైపు , పోన్ టాపింగ్ కేసు మరో వైపు పెట్టుకుని హడావుడి చేసిన ఇద్దరు ముఖ్యమంత్రులు అమరావతి శంకుస్థాపన నాటి నుంచి కలిశారు. తాజాగా కెసిఆర్ కూడా చంద్రబాబును చండీయాగానికి పిలవవచ్చని అంటున్నారు.ఈ నేపధ్యంలో టిడిపి నేత రావుల చంద్రశేఖరరెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన చంద్రబాబు నాయుడు అక్కడే రామేశ్వరరావుతో భేటీ అవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కెసిఆర్ తరపున రామేశ్వరరావు ఏమైనా మాట్లాడారా?లేక రామేశ్వరరావు ద్వారా చంద్రబాబు ఏదైనా సందేశం పంపించారా అన్న చర్చ జరుగుతోంది.ఏమి మాట్లాడుకుంది ఎవరూ చెప్పరు కనుక ఎవరికి తోచిన ఊహాగానం వారు చేసుకోవచ్చు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20151203_23.php?p=1449130538675 ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s