నారా లోకేష్ కి చుక్కెదురు..!

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కి చుక్కెదుర‌య్యింది. అనుకోని ఘ‌ట‌న‌ల‌తో ఆయ‌న హ‌తాశ‌యుల‌య్యారు. మ‌హిళ‌ల నుంచి ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఎదురురావ‌డంతో మౌనంగా ఉండాల్సి వ‌చ్చింది. జ‌న‌చైత‌న్య యాత్ర‌లో పాల్గొన్న ఆయ‌న కు జ‌నం ఎదురుతిర‌గ‌డంతో కొంత సేపు స‌హ‌నంగా ఉండాల్సి వ‌చ్చింది.

హుదూద్‌ పరిహారం ఇంతవరకూ అందలేదంటూ విశాఖ జిల్లా చీడికాడలోని ఎస్‌సి కాలనీ మహిళలు నారా లోకేష్‌ను నిలదీశారు. విశాఖ జిల్లా మాడ‌గుల , చీడిగాడ ప్రాంతాల్లో జ‌న‌చైత‌న్య యాత్ర‌ల‌కు లోకేష్ హాజ‌ర‌య్యారు. సందర్భంగా స్థానిక మహిళలు తమ ఇబ్బదులను లోకేష్‌కు వివరించారు. ఎస్‌సి కార్పొరేషన్‌ రుణాలు మంజూరు చేయలేదని, గ్రామ సమీపంలో బంజరు భూముల పట్టాలను తమకు ఇవ్వలేదని, రేషన్‌కార్డులు, పింఛన్లు, మరుగుదొడ్లు వంటి సమస్యలపై పట్టించుకునే నాథుడే లేడని నిరసన వ్యక్తం చేశారు.

ప్ర‌భుత్వం త‌మ‌ను పట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఓట్లేసిన పాపానికి త‌మ‌కు క‌ష్టాలు మిగులుతున్నాయ‌న్నారు. దాంతో లోకేష్ కొంత సేపు మౌనంగా వారి ఆగ్ర‌హం చ‌విచూసిన త‌ర్వాత స్పందిస్తూ సమస్యలన్నీ చక్క దిద్దడానికే జనచైతన్య యాత్రలు చేస్తున్నామని, ఇందుకోసం కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు మీ వద్దకు వస్తారని తెలిపారు. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం మీకు న్యాయం చేస్తుందంటూ అక్క‌డి మ‌హిళ‌ల‌కు హామీ ఇచ్చారు.

http://updateap.com/nara-lokesh-faced-heat-from-public-in-visakha-district/

ప్ర‌త్యేక హోదా పాయే..! మోడ్ర‌న్ హోదా ఆయే..!!
http://updateap.com/now-special-issue-turned-as-modern-status/

3 Comments

Filed under Uncategorized

3 responses to “నారా లోకేష్ కి చుక్కెదురు..!

 1. Veera

  కలలో కూడా కులమేనా?
  ముందు ముందు బాబు PM , లోకేష్ CM, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారు
  -TDP MLC రాజేంద్రప్రసాద్ చౌదరి కామెడీ
  ఏమి పాపం మనవడు దేవాంష్ ను వదిలేసారు, త్వరలో ఒబామా దిగిపోతున్నాడు, ఇస్తే పోలా!!!
  (కలాం గారు కలలు కనమన్నారు కాని పగటి కలలు కాదు)
  కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువగా నవ్విస్తున్నాడు ఈ పొలిటికల్ కమెడియన్ రాజేంద్ర ప్రసాద్
  ముందు బాబు సొంత అసెంబ్లీ చంద్రగిరి ,సొంత జిల్లా చిత్తూర్ లో, అలాగే ఎన్టీఆర్ సొంత అసెంబ్లీ గుడివాడ లో మొన్నఎన్నికల్లో TDP ఎందుకు ఒడిందో???
  గుంపులు గుంపులుగా వెళ్లి దొంగ హామీలు ఇచ్చినా కూడా కేవలం1% వోట్ల తో గెలిచిన మీరా మాట్లాడేది?

 2. Veera

  బాబు కంటే కెసిఆర్ చాలా బెటర్ గురూ!!!
  మొన్న జూన్ లో జరిగిన 14 MLC నియామకాల్లో 7గురు బాబు కులస్తులు (కమ్మ)
  కాని ఇప్పుడు తెలంగాణా లో జరుగుతున్న 12 MLC ఎన్నికల్లో కెసిఆర్ ఒక సీట్ తన వెలమ కులస్తులకు ,6 మంది రెడ్లకు ఇచ్చారు. అదీ తేడా ఇద్దరికీ.
  కెసిఆర్ అన్ని కులాలను సమ దృష్టి తో చూస్తుంటే బాబు మాత్రం కేవలం తన కులస్తులకే పెద్ద పీట వేస్తున్నాడు.పరిపాలనలో కూడా బాబు కంటే కెసిఆర్ చాలా బెటర్

  [TRS MLC అభ్యర్థులు
  నల్గొండ:చిన్నపరెడ్డి
  నిజామబాద్: భూపతిరెడ్డి
  మహబూబ్‌నగర్:జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి
  మెదక్:భుపాల్‌రెడ్డి
  రంగారెడ్డి :పట్నం నరేందర్‌రెడ్డి, శంభిపూర్ రాజు
  ఆదిలాబాద్: పురాణం సతీష్‌
  వరంగల్‌ : కొండా మురళి
  ఖమ్మం:బాలసాని
  కరీంనగర్ :భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్‌రావు]

 3. Veera

  ఛీ ఛీ -తెలంగాణా లో 33 ఏళ్ల TDP (20 సం అధికారం) తుడిచిపెట్టుకుపోయింది
  రంగారెడ్డి జిల్లాలోని నవాబ్‌పేట్ ZPTC ఉప ఎన్నిక ఫలితం!!!
  మొత్తం 21,425 ఓట్లు పోలవగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డికి 10,607 (49.5%)ఓట్లు పడ్డాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెపు మల్లారెడ్డికి 9,908 ఓట్లు (46.24%), టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌కు కేవలం 641(2.9%) ఓట్లు మాత్రమే వచ్చాయి.ఈ లెక్కన పోలైన మొత్తం ఓట్ల లో 3 శాతం కూడా టీడీపీకి పడలేదు
  TRS పార్టీ కాంగ్రెస్ పై 699 వోట్ల తో గెలిచింది

Leave a Reply to Veera Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s