కుకట్ పల్లిలో లక్ష ఓట్లు బోగస్ అని తేలిందా

హైదరాబాద్ లోని కుకట్ పల్లి నియోజకవర్గంలో లక్ష కు పైగా ఓట్లు బోగస్ వని నిర్దారణ అయినట్లు సమాచారం వస్తోంది. కొంతకాలం ఆధార్ కార్డు ఆధారంగా ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను ఏరివేసినప్పుడు విపక్షాలు ఆందోళన చేశాయి. సీమాంద్రుల ఓట్లను కావాలని తొలగిస్తున్నారని ఆరోపించి దర్నాలు కూడా చేశాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించి విచారణకు ఆదేశించింది.ఆ మీదట ఎన్నికల అదికారులు అర్హులైన వారు తిరిగి ఓటు నమోదు చేసుకోవచ్చని పలువురి ఇళ్లకు వెళ్లారు.అయినా నియోజకవర్గంలో తొలగించినట్లు చెబుతున్న ఓటర్ల నుంచి స్పందన రాలేదని కధనం.కేవలం 1203 మంది ఓట్లు మాత్రమే తిరిగి చేర్చడానికి అర్హమైనవిగా గుర్తించారు.మొత్తం లక్ష ఎనిమిది వేల ఓట్లను తొలగిస్తే,వారిలో 1250 మంది మాత్రమే ఇళ్లలో ఉన్నట్లు తేలిందని అదికారులు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే అప్పుడు నలబై వేల ఓట్ల ఆదిక్యతతో గెలిచిన టిడిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు. బోగస్ ఓట్లతోనే కృష్ణారావు గెలిచారని ఆరోపించిన టిఆర్ఎస్ అభ్యర్ది పద్మారావు కోర్టుకు వెళ్లినా ఉపయోగం జరగలేదు.

http://kommineni.info/articles/dailyarticles/content_20151210_8.php?p=1449730901765

చంద్రబాబు సమీక్షలంటే హడలెత్తుతున్నారట
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుపై ఒక ఆసక్తికరమైన కధనం వచ్చింది. సమీక్షల పేరుతో చంద్రబాబు అదికారులను గంటల తరబడి వేచి ఉంచుతున్న తీరుపైన, ఆయా కార్యక్రమాలకు ఆలస్యంగా వెళుతున్న వైనం పై ఈ కదనం వివరిస్తుంది. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా ప్రచారంలో ఉన్న మీడియాలోనే ఈ రకమైన వార్త రావడం విశేషం.చంద్రబాబు తన దినచర్యను ఉదయం నుంచే ఆలస్యంగా ఆరంభించడం, దానికి తగ్గట్లు షెడ్యూల్ లో మార్పులు చేసుకోకపోవడం ఫలితంగా అదికారులు సమీక్షలు జరిగే అరగంట కోసం కొన్ని గంటల సేపు వేచి ఉండవలసి వస్తోంది.రెండు రోజలు క్రితం కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశానికి దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ఆయన హాజరయ్యారు.ఆ తర్వాత సమావేశం 45 నిమిషాలు జరగవలసి ఉండగా,ఆయన రెండు గంటలకు పైగా ఉన్నారు.దాంతో గంటల తరబడి వేచి ఉండలేక కార్పొరేట్ కంపెనీల,విద్యాసంస్థల ప్రతినిధులు అల్లాడిపోయారట. బహుశా కొందరు అదికారులే ఈ మీడియాలో వస్తే చంద్రబాబు దృష్టిని ఆకర్షించి, ఆయన వైఖరిలో ఏమైనా మార్పు చేసుకుంటారేమోనన్న ఆశతో ఈ వార్తకు ఉప్పు అందించి ఉండవచ్చేమో!

http://kommineni.info/articles/dailyarticles/content_20151210_20.php?p=1449730990838

ఈసారి ”జన చైతన్యం”పై పేల్చిన జేసీ
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అధికారపక్షంలోనే ఓ మంచి విమర్శకుడిగా తయారయ్యారు. ప్రభుత్వంపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పే ప్రభాకర్ రెడ్డి… టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్యయాత్రలపైనా కామెంట్స్ చేశారు. జనచైతన్య యాత్రకు జనం నుంచి స్పందన లేదని తేల్చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. పంటలకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్ సబ్సిడీ, నష్టపరిహారం ఇలా ఏదీ అందలేదని అందుకే జనచైతన్యయాత్రకు స్పందన లేకుండా పోయిందని విమర్శించారు.

ఆర్భాటంగా ప్రకటించిన రైతు రుణమాఫీ కూడా అమలు కాలేదని కుండ బద్ధలు కొట్టారు. తాను టీడీపీ ఎమ్మెల్యేనే అయినా వాస్తవాలు మాట్లాడకతప్పదని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోమంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి వేదికపైనే ఉన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో జరిగిన జనచైతన్యయాత్రలో ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

http://teluguglobal.com/jc-prabhakar-reddy-says-jana-chaitanya-yatra-failed/

14 Comments

Filed under Uncategorized

14 responses to “కుకట్ పల్లిలో లక్ష ఓట్లు బోగస్ అని తేలిందా

  1. Veera

    ఫైర్ పై ఫైర్ అయిన కాపు టైగర్ ముద్రగడ!!!
    ఖబడ్దార్ బాబూ,మాపై దాడులు చేస్తే పారిపోము!!!!
    పిల్ల నిచ్చిన మామ ను చెప్పులతో కొట్టిస్తే పారిపోయాడని మా జాతి కూడా పారిపోతుంది అనుకొన్నావా??? తిరగబడే జాతి మాది!!!
    వాహ్ క్యా బాత్ హై సర్ !!!

  2. Veera

    బెజవాడ సెక్స్ రాకెట్ లో TDP నేతలు
    (సీమ లో కల్చర్ లేదు అందుకే విజయవాడ లో రాజధాని అన్న బాబు
    మాటలను నిజం చేస్తున్నతమ్ముళ్ళు యలమంచిలి రాము చౌదరి, చెన్నుపాటి శ్రీను చౌదరి…)
    [సెక్స్‌రాకెట్ టీడీపీ నేతలు! జల్సా చేస్తున్న ఎమ్మెల్యే?
    బెజవాడలో వెలుగుచూసిన దుర్మార్గపు వడ్డీవ్యాపారం కాల్ మనీ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో అధికారపార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కాల్‌ మని వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా చెబుతుండగా… ఏపీలో ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రిక ఏకంగా సదరు ప్రజానిధులకు సంబంధించి క్లూ కూడా ఇచ్చింది.

    వందల కోట్లలో కాల్ మనీ దందా నడుపుతున్న బడాబాబులు డబ్బు వసూలు కోసం మహిళలను వేధిస్తున్నారు. వీరి బారిన వందలాది మంది పడ్డారు. డబ్బు చెల్లించలేని పక్షంలో సదరు కుటుంబానికి చెందిన మహిళలను లైంగికంగా వాడుకోవడం ఈ బ్యాచ్ స్టైల్. అంతేకాదు తమ దందాకు అండగా ఉండే అధికారులు, నాయకుల వద్దకు సదరు మహిళలను బలవంతంగా పంపుతున్నట్టు వెలుగుచూసింది. వీరి బారిన కొందరు విద్యార్థినులు కూడా పడ్డారు. చివరకు ఒక మహిళ ధైర్యం చేసి విజయవాడ సీపీని ఆశ్రయించడంతో డొంక కదిలింది. 12 మందిని అరెస్ట్ చేశారు.

    మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించిన ఎలక్ట్రికల్ ఉద్యోగి ఒకరు ఒక యువతిపై ఇదే తరహాలో అత్యాచారం చేశారని వార్తలొస్తున్నాయి. విజయవాడకు పక్కనే ఉండే నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కాల్ మనీకి అండగా ఉన్నారని ఒక పత్రిక రాసింది. సదరు ఎమ్మెల్యే ప్రస్తుతం కాల్ మనీ డబ్బుతోనే విదేశాల్లో విహరిస్తున్నారని ప్రచురించింది. సదరు ఎమ్మెల్యే వెంట కాల్ మనీ సూత్రధారి కూడా ఉన్నారని సమాచారం. ఈ కాల్ మని బ్యాచ్ ఒకే సామాజికవర్గానికి జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేను గతంలో సన్మానం చేయడం కూడా చర్చనీయాంశమైంది. కాల్ మని దందాలో అరెస్ట్‌ అయిన యలమంచిలి శ్రీరామ్ టీడీపీలో క్రీయాశీలకంగా ఉంటున్నారని చెబుతున్నారు.
    http://teluguglobal.com/tdp-leaders-behind-call-money/ ]

  3. Veera

    బాబు భ్రమరావతి ప్లానింగ్ ఉచితం కాదు ..12 కోట్లు
    సూడు సూడు సింగ పూర్ సినిమా !!!
    http://epaper.vaartha.com/662573/Vaartha-Andhra-Main/10-12-2015#page/1/2

  4. Veera

    జాబేది బాబూ అన్నందుకు దాడి చేసిన పచ్చ గూండాలు
    [టీడీపీ దాడి: డీఎస్సీ అభ్య‌ర్థికి గాయాలు
    అధికార పార్టీ కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోతున్నారు. అడ్డ‌గోలుగా దౌర్జ‌న్యాలు సాగిస్తున్నారు. తాజాగా త‌మ ఉద్యోగాల గురించిన నిన‌దించినందుకు కాబోయే ఉపాధ్యాయుడి త‌ల‌పై దాడి చేశారు. తీవ్ర గాయాల పాల‌జేశారు. సీఎం స‌మ‌క్షంలో ఇది జ‌ర‌గ‌డం ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది.

    డీఎస్సీకి సంబంధించి మెరిట్ లిస్టును విడుదల చేయాలని అడిగినందుకు తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. న‌ర‌సారావు పేట‌ పురపాలక శతాబ్ది ఉత్సవాలను ప్రారంభ స‌భ‌లో ఈ దారుణం జ‌రిగింది.

    ఈ సభలో డీఎస్సీ-2014 లిస్ట్‌ను విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో గందరగోళం చోటుచేసుకుంది. దాంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తల దాడిలో డీఎస్సీ అభ్యర్థి తలకు గాయమైంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
    http://updateap.com/dsc-candidate-injured-in-attack-of-tdp-workers/ ]

  5. Veera

    కమ్మ కులాన్ని బూచిగా చూపి కాపులు, రాజులను తనవైపు తిప్పుకొంటున్న TRS
    [సెటిలర్లను చీల్చే పనిలో అధికారపార్టీ
    జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారనున్న విషయం తెలిసిందే..అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్ల అంతా టిడిపి పక్షానే నిలబడ్డారు. తెలంగాణ వారంతా టీఆర్ఎస్ కు ఓటేశారు..ఇదే ఈక్విషేన్స్ తో కాంగ్రెస్ కు చేదు ఫలితాలు ఎదురయ్యాయి..అయితే ఈసారి తెలంగాణ ఓటర్లతో పాటు సెటిలర్ల ఓట్లను కూడా తమవైపు తిప్పుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు..ఇందులో భాగంగానే కొందరు సెటిలర్ల నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు..

    సెటిలర్లలో అత్యధికంగా ఉన్న కమ్మ, కాపు, రెడ్డి, రాజు, బిసిల్లో వర్గాలుగా విడగొట్టి కొందర్ని తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు..కమ్మ కులాన్ని బూచిగా చూపి కాపులు, రాజులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు..మావైపు వస్తే మీకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు గుప్పిస్తున్నారని సమాచారం..

    ఇప్పటికే రాజులతో మీటింగ్ పెట్టిన కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు వారి నుంచి హామీ పొందారట..అలాగే కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ కాపు కులస్తుడ్ని కూడా కార్పోరేటర్ సీటు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉత్తరాంధ్ర నుంచి వచ్చేవారిని మంచిగా చూసుకుంటామని హామీలు ఇప్పిస్తూ ఆయా సంఘాలతో మహేందర్ రెడ్డి, హరీష్ రావు, కృష్ణారావు తదితరులు మంతనాలు జరుపుతున్నారని సమాచారం..టీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా లేదో చూడాలి.

    http://kommineni.info/articles/dailyarticles/content_20151211_35.php?p=1449846042893 ]

  6. Babu ….KCR garu maa nayakulanu atla dochukuntunnaru

    KCR ….Mari AP ni Gajji donaglu dochukunta thappu ledha Babu ?
    Akkuva matladitha …Khan gari deggara mee tapes vunnai jagrattha .
    Babu ….abba kudithalo paddanu kadha ?
    Prajalu ….Pillani icchina mamani vennupotu podichina papam mare ?

    http://www.sakshi.com/news/hyderabad/former-minister-vijayarama-rao-to-goodbye-to-tdp-297193?pfrom=home-top-story

    One more wicket down for KDP.

  7. Veera

    రెండు కల్ల సిద్దాంతం కాదు, రెండు కాళ్ళ సిద్దాంతం!!!
    కాంగ్రెస్ హయాములో మోడీ, అమిత్ షా, జగన్ ల మీద కేసులు!!!
    బీజేపి హయాములో సోనియా రాహుల్ చిదంబరం మీద కేసులు!!!
    కాని అటు కాంగ్రెస్ హయాములో అటు బీజేపి హయాములో కేసుల్లోంచి బయటపడుతున్న నిప్పు!!! (అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్)
    నోట్: కాళ్ళను నమ్ముకున్నోడు కేసుల్లో ఇరుక్కున్నట్టు చరిత్ర లో లేదు

  8. Veera

    భ్రమరావతి భ్రమలు-సింగ పూర్ సిత్రాలు-నిప్పు డప్పు అంతా ఉత్తిదే!!!
    [Source:గొంతెమ్మ కోర్కెలే -ఈనాడు, డిసెంబర్ 11,2015
    సింగపూర్ కంపెనీల డిమాండ్లు
    సింగపూర్ కంపెనీ లు పెట్టేది 300 కోట్లు కాని ఇవ్వాల్సింది రాజధాని కోర్ ఏరియా లో 4 వేల ఎకరాలు.25 కిలో మీటర్ల వ్యాసార్ధం లో వాళ్ళ అనుమతి లేనిదే ఏదీ ఇవ్వకూడదు, పూర్తి హక్కులు సింగపూర్ కంపెనీ లకు ఇవ్వాలి , రైతులకు భూములు కూడా 25 KM బయటే.
    రాజధాని ఏరియా అభివృద్దికి 25-30 సం పడుతుంది , లాభం వస్తే సరే ,నష్టం వస్తే మాత్రం ప్రభుత్వం భరించాలి.రాజధాని ప్రాంతంలో మూడు వేల ఎకరాలు అబివృద్ది చేయడానికి గాను అవసరమైన రుణం పొందడానికి ఎపి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి]

    [సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అన్న బాబు మాటలు వట్టివే ,12 కోట్లు చెల్లించారు
    (Source:రాజదాని-సింగపూర్ కు నష్టం వస్తే భారం ఎపిదే
    -కొమ్మినేని ఇన్ఫో ,డిసెంబర్ 11)]

    నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అన్న ముని శాపం వలన బాబు నిజం చెప్పలేడు అర్ధం చేసుకోండి!!!

    బాబు కరపత్రిక ఈనాడు లోనే ఇలా వచ్చింది అంటే వాస్తవం ఇంకెంత భయకంరంగాఉంటుందో?

    విశాఖ రిటైర్డ్ IAS శర్మ గారు రాజధాని విషయములో అంతా సీక్రెట్ గా ఉంది భారీ అవినీతి జరుగుతోంది అని చెప్పింది ఇందుకే కదా!!!

    అసలు మన నిప్పు నారా బాబు గారు అన్ని ఫైల్స్ ప్రజల ముందు ఉంచితే నిజాలు తెలుస్తాయి కాదా అన్నీ సీక్రెట్ ఎందుకు???

    రాజధాని విషయములో 2 లక్షల కోట్లు లోకేష్ కు అందాయి అని ఒకప్పటి TDP మంత్రి దేవినేని నెహ్రూ చౌదరి ఊరికే అన్నాడా?

    అలాగే రాజధాని లో దోపిడీ అంతా బాబు ది మరియు బాబు కులస్థులదె అని విజయవాడ మాజీ MLA అడుసుమల్లి జయప్రకాశ్ చౌదరి ఊరికే చెప్పాడా?

    రాజధని అంతా అవినీతి కంపు అని లోక్ సత్తా JP చౌదరి , మాజీ TDP మంత్రి వడ్డే చౌదరి అనలేదా?

  9. Veera

    ఎర్రబెల్లి:ట్రింగ్ ట్రింగ్ సర్ మీరు హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి రావాలి
    నిప్పు బాస్: (వామ్మో …) హలో హలో సిగ్నల్ సరిగా లేదు ఉంటాను
    పోసాని:ఎంత బాగా కవర్ చేసావు రాజా, ఐ లవ్ యు రాజా!!!

  10. Veera

    అవును BJP అంటే ఇక బాబు జేబు పార్టీ!!!
    ఒక వైపు భజన సేన పార్టీ, ఇంకో వైపు బాబు జేబుపార్టీ పోటీ పడి భజనచేస్తాయి అన్నమాట. నారీ నారీ నడుమ మురారి అంటే ఇదే కదా, అలా కానీండి!!!
    పాపం సోము వీర్రాజు గారు బలిపశువా???
    [తెలుగుబిజెపినేతలకు అమిత్ షా షాక్
    ఎపి, తెలంగాణల్లో బిజెపి నేతలకు అమిత్ షా షాక్ ఇచ్చినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది..మొన్నటి వరకు టిడిపితో స్నేహబంధంపై కాస్త అటుఇటుగా ఉన్న బిజెపి నేతలకు అమిత్ షా వైఖరిని స్పష్టం చేశారని తెలుస్తోంది..ఢిల్లీ , బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ బ్యాచ్ లో గణనీయమైన మార్పు వచ్చిందని సమాచారం..ఉత్తరాదిలో పార్టీ పరిస్థితి అంచనా వేసిన తర్వాత దక్షిణాదిలోనూ అదే పరిస్థితి ఎదురైతే భవి ష్యత్ లో ఇబ్బందేనని గ్రహించారట..వచ్చే లోక్ సభ నాటికి మరికొందరు మిత్రులను చేర్చుకోవాలి కానీ ఉన్నవాళ్లను వదులుకునే పరిస్థితి వద్దని తేల్చి చెప్పేశారట..టిడిపితో సంబంధాలపై అనుమానాలు అనవసరమని, కలిసి పనిచేయాల్సిందేనని కిషన్ రెడ్డి, సోమువీర్రాజు, పురందేశ్వరి, కన్నా, కావూరి తదితర నేతలకో సంకేతాలు అందినట్లు తెలుస్తోంది..ఎపిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాల్సినవసరం లేదని, మిత్రపక్షంగానే ఉండండని తెలిపారట..గతంలో అయితే వీరందరికి టిడిపిపై అమిత్ షా ఎగదోశారట..ఇప్పుడు మాత్రం సైలెంట్ ఉండాలని సూచించడంతో టిడిపి వ్యతిరేక నేతలు ఖంగు తిన్నారని సమాచారం..అలాగే చంద్రబాబుతో సమస్యలుంటే మాతో చెప్పండని కూడా తెలిపారట..అందుకే ఇటీవల గడ్కరీ వరాలు ప్రకటించారని తెలుస్తోంది. త్వరలో మోడీ కూడా ఎపికి వరాలు కురిపిస్తారని, అది కూడా చంద్రబాబు సమక్షంలోనే జరగబోతుందని ఢిల్లీలో కొందరు బిజెపి నేతలు చెప్తున్నారు..అంతేకాదు ఎపి , తెలంగాణ విషయాలన్నీ వెంకయ్యనాయుడుతోనే చర్చించండని, ఆయన సలహా మేరకే నిర్ణయం తీసుకుంటామని కూడా తేల్చినట్లు సమాచారం..

    http://kommineni.info/articles/dailyarticles/content_20151210_35.php?p=1449768643633 ]

  11. Veera

    పవన్ ప్రచారం చేయడం వల్లే ఒక పార్టీ(TDP) అధికారం లోకి వచ్చింది
    -బెంగాల్ టైగర్ సినిమాలో రవి తేజ డైలాగ్
    [నిజమే పవన్ చెప్పాడని కాపులు, మోడీ ని చూసి మద్య తరగతి, రుణమాఫీ అవుతుంది అని రైతులు వేస్తె బాబు కు జగన్ కంటే వచ్చింది కేవలం 1% వోట్లు(5 లక్షల వోట్లు )

    రాష్ట్ర జనాభాలో 70 లక్షల మంది కాపులు, కోటి మంది మద్య తరగతి ప్రజలు ఉన్నారు, (బ్యాంకు లెక్కల ప్రకారం) కోటి మంది రైతులు రుణాలు తీసుకొన్నారు

    గుంపులు గుంపులుగా వెళ్లి రుణమాఫీ అని చెబితేనే 1% ఎక్కువ వోట్లు ,లేకపోతె బాబు చిత్తు చిత్తుగా ఓడిపోయేవాడు,లేకపోతె బాబు ను చూసి ఎవరు వోట్లు వేసారు?

    నాన్నా సింహం సింగల్ గా వెళుతుంది పందులే గుంపులు గుంపులుగా వెళతాయి-రజనీకాంత్
    ఒకరి మీదికి ముగ్గురు నలుగురు వెళ్లి కొడితే అన్యాయం రౌడీయిజం అంటారు కదా మరి ఇదేంటో?

  12. Veera

    అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా?YS
    [వలసల ‘కుప్పం’
    -పనుల కోసం బెంగుళూరుకు
    -ముఖ్యమంత్రి ‘కుప్పం’లో అభివృద్ధి డొల్ల!
    -వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
    -ఏడాదిన్నరగా పూర్తి కాని పనులు
    ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

    ”ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుప్పాన్ని అభివృద్ధి చేస్తా..! ఇక్కడున్న వారికి పెద్దకొడుకులా సేవ చేస్తా.. బంగారు కుప్పంగా మార్చేంత వరకూ నిద్రపోను..! కుప్పం వాసుల రుణం తీర్చుకుంటా” – ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం వాసులతో ఎప్పుడూ అనే మాటలు. అయితే ఆయన చెబుతున్న మాటలకూ.. చేతలకూ చాలా తేడాలు కనిపిస్తున్నాయి. కుప్పం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అందరి దృష్టీ దానిపైనే ఉంది. ముఖ్యమంత్రి మన వాడే కదా నియోజకవర్గంలో ప్రగతిని పరుగులు పెట్టిస్తారని స్థానికులు ఆశించారు. కానీ ఇక్కడ ప్రగతి పూర్తిగా పడకేసింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం.. నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం.. మినహా ప్రగతి పట్టాలెక్కిన పాపాన పోలేదు. ప్రగతి పరుగులు కాగితాలకే పరిమితమయ్యాయి. కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడుతుంటే, చేసేందుకు పనుల్లేక కూలీలు, యువత పొట్ట చేతపట్టుకుని పొరుగు పట్టణాలకు వలసపోతున్నారు. పండించిన పంటకు సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఇలా కుప్పం వాసులు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పేరుకే ముఖ్యమంత్రి. మాకేమీ చేయలేదంటూ ఇక్కడున్న వారంతా చంద్రబాబు పాలనపై నిట్టూర్పులు విడుస్తున్నారు.

    అభివృద్ధి.. నత్తతో పోటీ
    నాలుగు నెలల క్రితం కుప్పం నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 426 కిలోమీటర్లు, ఆర్‌అండ్‌బి పరిధిలో 470 కిలోమీటర్లు మేర రోడ్ల అభివృద్ధికి మొత్తం రూ.269 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పంలో రోడ్ల డివైడర్లకూ, లైటింగ్‌ ఏర్పాటుకూ మరో రూ.ఏడు కోట్లు కేటాయించింది. ఐసిడిఎస్‌ బిల్డింగ్‌ పనులకు రూ.59 లక్షలు కేటాయించింది. అయితే కాంట్రాక్టు చేజిక్కించుకున్న వారు బిల్లులు వస్తాయో రావోనని తటపటాయిస్తున్నారు. దీంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. మొత్తం 15 శాఖల అధ్వర్యంలో 119 పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.884.51 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే సంవత్సరం పూర్తి కావస్తున్నా ఇప్పటివరకూ వీటిల్లో 14 పనులు మాత్రమే పూర్త య్యాయి. 40 పనులు అసలు ప్రారంభానికే నోచుకోలేదు. 66 పనులు మాత్రం పురోగతిలో ఉన్నాయని ఇక్కడి లెక్కలు విదితం చేస్తున్నాయి.

    వెక్కిరిస్తున్న శిలాఫలకాలు
    ముఖ్యమంత్రి ఈ నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేశారు. అయితే ఈ పనులేవీ ప్రారంభానికి నోచుకోక వెక్కిరిస్తున్నాయి. వచ్చే జనవరి నాటికి హంద్రీనీవా కాలువను కుప్పానికి తీసుకొస్తున్నట్లుగా ముఖ్యమంత్రి శిలాఫలకం వేశారు. అయితే ఇది అతీగతి లేకుండా పోయింది. కుప్పంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి, స్టేడియానికి, బిసిలకు కమ్యూనిటీ హాలు, గుడిపల్లి మండలంలోని వద్ద గుడివంకలో రూ.5.12 కోట్లతో టూరిజం డెవలప్‌మెంట్‌కు, కుప్పంలో రోడ్డు విస్తరణ పనులు, భూగర్బ డ్రైనేజీ, పబ్లిక్‌ టారులెట్స్‌, దళవాయిపల్లి చెరువులో వాటర్‌ ఫిల్టర్‌ హౌస్‌, రామకుప్పంలో ఆదర్శపాఠశాల, శాంతిపురంలో జూనియర్‌ కాలేజీ, నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోనూ మార్కెటింగ్‌ కమిటీలు, వీటిన్నింటికీ ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు స్వయంగా శిలాఫలకాలు వేశారు. వీటిల్లో ఒక్కటీ ఇప్పటివరకూ ప్రారంభానికి నోచుకోలేదు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇదీ ముందుకు సాగడం లేదు. అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి దానిలోనూ ఒక ఫ్యాక్టరీ నిర్మిస్తానని, తద్వారా ఎవరూ వలసలు పోకుండా సొంత ఊళ్లోనే పనులు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ ఇది ఆచరణకు నోచుకోలేదు. కాస్తో, కూస్తో అండగా ఉన్న ఉపాధిహామీ పనులు సైతం నియోజక వర్గంలో పూర్తిగా నిలిచిపోయాయి. చేసేందుకు పనుల్లేక కూలీలు వలసలు పోతున్నారు. కుప్పం నుంచి ప్రతి రోజూ కుష్భూ రైలులో వందలాది మంది పనుల కోసం బెంగుళూరు వలస పోతున్నారు. అక్కడ మేస్త్రీ, అంగళ్లల్లో, గార్మెంట్స్‌ కంపె నీల్లో పను లకు వెళుతున్నారు. ‘గత ంలో ఉపాధి పనులు ఉండేవి. ఆరు నెలలుగా ఆపేశారు. మా ఊళ్లో వాళ్లంతా బెంగుళూరు పోతున్నాం. అక్కడ ఏదో ఒక పని చేసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తాం. మా ఊళ్లో 55 కుటుంబాలుంటే 30 కుటుంబాలవాళ్లం పొరుగు ప్రాంతానికి పనులకు పోతున్నాం’ అని రామకుప్పం మండలంలోని అత్తికుప్పం గ్రామానికి చెందిన సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.

    అభివృద్ధిపై పెదవి విరుపు
    ‘నియోజకవర్గంలో.. సంక్షేమ పథకాలు నాయకుల కనుసన్నల్లోనే అమలవుతున్నాయి. మా వరకు రావడం లేదు. జన్మభూమి కమిటీలు వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసి రుణాలు టిడిపి నాయకులే పొందుతున్నారు.

    చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అనుకు న్నాం. ఏమీ జరగడం లేదు.’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ దళిత నాయకుడు ‘పజాశక’ి్త ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

    http://www.prajasakti.com/Content/1724952 ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s