బెజవాడ ‘కాలాపాని’

బెజవాడ ‘కాలాపాని’
బ్రిటిష్‌ పాలనలో అండమాన్‌ కాలాపాని జైలులో జరిగిన అకృత్యాలను మించిపోతున్నాయి బెజవాడలో కాల్‌మనీ రాక్షసుల దురాగతాలు. అభినవ రావణాసురులు, దుశ్సాసనులు, కీచకుల అవతారమెత్తిన కాల్‌మనీ ముష్కరుల దారుణాలను చెప్పలేకున్నామని సాక్షాత్తు బెజవాడ పోలీస్‌ కమిషనరే అన్నారంటే ఈ చీకటి వాస్తవాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఊహించడానికే భయమేస్తుంది. నాలుగు రోజులుగా కాల్‌మనీ పుట్ట పగిలి ఒక్కటొకటిగా బయటికొస్తున్న అధిక వడ్డీ పాముల ఉందంతాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. మనం ఉన్నది నాగరిక ప్రజాస్యామ్యంలోనా లేక మధ్య యుగాల్లోనా అనే అనుమానం కలుగుతోంది. అవసరార్ధం వడ్డీకి డబ్బు అప్పు తీసుకుంటున్న పేదలు, అల్పదాయవర్గాల రక్తాన్నే కాదు ఎముకలను, మూలుగనూ పీల్చి పిప్పి చేస్తున్నారు, వారి వ్యక్తిత్వాలను నాశనం చేస్తున్నారు కాల్‌మనీ రాబందులు. ఖాళీ పత్రాలపై సంతకాలు, ఎమౌంట్‌, తేదీలు వేయని చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఒకటేమిటి రుణ గ్రహీతలకు పెడుతున్న నిబంధనలెన్నో. అంతేనా? అసలు, వడ్డీ చెల్లించకుంటే రుణ గ్రహీతల భార్యలను బలవంతంగా ఎత్తువెళ్లడం, అశ్లీలంగా చిత్రీకరించి బెదిరించడం, పడుపు వృత్తిలోకి దించడం, లైంగిక దాడులకు పాల్పడటం కలచివేసే రాక్షస క్రీడలు. ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నదీ, వెనకుండి నడిపిస్తున్నదీ, కాల్‌మనీలో పెట్టుబడులు పెడుతున్నదీ ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికై రాజ్యాంగంపై, చట్టసభల నియమావళిపై ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారపార్టీకి చెందిన నేతలు, వారి అనుచరగణం. బెజవాడ మహిళ ఒకరు కాల్‌మనీ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా తీగ లాగితే డొంక కదిలింది. అధికార మదంతో కైపెక్కిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు అడ్డూ అదుపూ లేకుండా సాగిస్తున్న అధిక వడ్డీ వ్యాపారం గుట్టురట్టు కావడంతో కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది రాష్ట్ర సర్కారు పరిస్థితి. షరా మామూలే అన్నట్లు తమ వారిని తప్పించేందుకు, కేసు నీరుగార్చేందుకు ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లొస్తున్నాయి.

తెలుగుదేశం వచ్చాక వరుస సంఘటనల కథాకమామిషును దగ్గరగా గమనిస్తున్న వారికి కాల్‌మనీ కేసు చివరికి ఏమౌతుందో తెలుస్తుంది. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కల్తీ నెయ్యి వ్యవహారాలను సర్కారే మసకబార్చింది. రాజకీయంగా దుమారం లేవడంతో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌్‌లో కాల్‌మనీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని పాత పాట పాడారు. సిఎం, టిడిపి నేతల ప్రకటనలు కాల్‌మనీ- సెక్స్‌ రాకెట్‌ వ్యవహారాన్ని వ్యూహాత్మకంగా పక్కదారి పట్టిస్తున్నాయి. అప్పు తీసుకున్నవాళ్లు తిరిగి చెల్లించొద్దని బాబు పిలుపునివ్వగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మరో అడుగు ముందుకేసి తమను బాధితులు సంప్రదిస్తే సెటిల్‌మెంట్‌ చేస్తామంటున్నారు. వాస్తవానికి పోలీసులు కేసును మొదట్లో బాగానే ఛేదించారు. అధికారపార్టీవారున్నారని తెలిశాక జంకుతున్నారు. బెజవాడలో కాల్‌మనీ కొత్త కాదనీ, అదొక రుగ్మతనీ పోలీస్‌ కమిషనర్‌ అభివర్ణించడమే కాకుండా బాధితులు న్యాయపరంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్న మాటలు కేసు నీరుగార్చేవిగా స్ఫురిస్తున్నాయి.
బెజవాడలో కాల్‌మనీ సిండికేట్లు యాభైకిపైమాటేనంటున్నారు. ఇంత విశృంఖలంగా వడ్డీ వ్యాపారులు స్వైర విహారం చేస్తున్నా పోలీస్‌, నిఘా వ్యవస్థలకు తెలియకపోవడం విచిత్రం. ఆయా వ్యవస్థలు వాటాలు, లంచాలు మేసి కిమ్మనకుండా ఉన్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులూ అధిక వడ్డీ దందాలో మునిగి తేలుతున్నట్లు ఇప్పటికే రుజువైంది. కాల్‌మనీ దురాగాతాలకు ప్రధాన కారణం ప్రజలకు సంస్థాగత పరపతి అందుబాటులో లేకపోవడమే. బ్యాంకులు రుణాలివ్వకుండా మొరాయిస్తున్నాయి. గతంలో రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్‌ కోరలు చాచడానికి ఈ పరిస్థితే కారణం. మైక్రోలకు అడ్డుకట్ట వేసేందుకు చట్టం తెచ్చాక సదరు వ్యాపార గణాలే కాల్‌మనీ కాలయములుగా మారిపోయారు.

రైతు, డ్వాక్రా రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న బాబు సర్కారు వెన్నుపోటు పొడిచి మరింత అప్పుల ఊబిలో దించింది. బ్యాంకుల్లో అప్పు పుట్టకుండా డిఫాల్టర్లుగా మార్చివేసింది. అవసరానికి అప్పు కోసం కాల్‌మనీని ఆశ్రయిస్తున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలే వారి దాష్టీకాలకు బలవుతున్నారు. ప్రభుత్వ విధానాలతో విద్య, వైద్యం ప్రైవేటుపరమై ఖరీదైన సరుకుగా మారింది. ఎగువ మధ్యతరగతిలో వినిమయ సంస్కృతి పెరిగి అప్పుల పాలవుతున్నారు. కాల్‌మనీ మాఫియా రూ.లక్ష అప్పిచ్చి రోజుకు రూ.రెండు వేల వడ్డీ పిండుతున్నారంటే ప్రజల అవసరాల స్థాయి అర్థమవుతుంది. బెజవాడకే కాకుండా ఇతర జిల్లాలకూ విస్తరించిన కాల్‌మనీ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలి. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా నిందితులను శిక్షించాలి. అధిక వడ్డీ వ్యాపారం నియంత్రణకు కఠిన చట్టం తేవాలి. వివిధ వర్గాలకు తక్కువ వడ్డీపై బ్యాంక్‌ రుణం ఇప్పించాలి.

http://www.prajasakti.com/EditorialPage/1727564

10 Comments

Filed under Uncategorized

10 responses to “బెజవాడ ‘కాలాపాని’

 1. Veera

  ఊరంతా అనుకొంటున్నారు!!!
  బాబు గురించి ఈనాడు లో చదివి ఆహ ఓహో అనుకోన్నవాళ్ళు ఇప్పుడు నోరేల్లపెడుతున్నారు.ఇదేంటి ఇంత అవినీతి కుల ప్రీతి అని ముక్కున వేలేసుకొంటున్నారు.చాల అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు, తమాషా ఏమిటంటే TDP కార్యకర్తలు కూడా తిట్టు కొంటున్నారు.
  ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు,ఎందుకు వొతేసామురా బాబూ అనుకొంటున్నారు

 2. Veera

  సెక్రటరీ:సర్ సర్ మనవాళ్ళు సెక్స్ రాకెట్ కేసులో బాగా దొరికి పోయారు
  నిప్పు:అయితే రాష్ట్ర మంతా దాడులు చేసి కొంతమందిని అరెస్ట్ చేసి జగన్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని మన కుల మీడియా ను ఉస్కో అని చెప్పండి.బ్యాలన్స్ అవుద్ది.
  పోసాని:అహ ఏమి బుర్ర, కులాన్ని ఎంత ముద్దుగా వాడు కొంటున్నావు, ఐ లవ్ యు రాజా!!!

  కుల మీడియా కవరింగ్!!!
  మొన్న వోటుకు కోట్లు కేసును వోటుకు నోటు అని, ఫోన్ ట్యాపింగ్ కేసు అని, సెక్షన్ 8 అనీ మబ్య పెట్టిన కుల మీడియా ఇప్పుడు ఈ కాల్ మనీ- సెక్స్ రాకెట్ కేసును అధిక వడ్డీ కేసులుగా చూపి ఇది రాష్ట్రమంతా ఉంది అని చెప్పి డ్యామేజ్ కంట్రోల్ చేస్తోంది, బహు పరాక్!!

  2050 నాటికీ నంబర్ వన్ రాష్ట్రం AP-పిట్టల దొర
  (2040 నాటికీ ప్రపంచం లో నెంబర్ వన్ దేశం ఇండియా-వరల్డ్ బ్యాంక్ )

  హైదరాబాద్ ను ప్రపంచ పటం లో నేనే పెట్టాను-పిట్టల దొర
  మరయితే హైదరాబాద్ లో “ఒంటరిగా” పోటీ చేసి మొత్తం 150 వార్డ్ లలో 10 గెలువు చూద్దాం!!!

  బిల్ క్లింటన్ నన్ను చూసి వచ్చాడు-బాబు
  (మొన్న ఇండియా కు వచ్చిన ఒబామా AP కి ఎందుకు రాలేదో?)
  అయితే మరి జార్జ్ బుష్ YS ను చూసి వచ్చినట్టేగా? కాని అయన ఏనాడూ చెప్పుకోలేదు

  కుల మీడియా:కాల్ మనీ(సెక్స్ రాకెట్) పై సీరియస్ గా ఉన్న బాబు
  బ్రహ్మి:ఏంటి గుట్టుగా సాగుతున్న సెక్స్ రాకెట్ బయటికి ఎలా లీక్ అయింది అనా?

  గూగుల్ కొత్త క్యాంపన్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం
  -గూగుల్ CEO సుందర్ పిచ్చయ్
  అదేంటి పెడితే బాబు ను చూసి విజయవాడ లో పెట్టాలి కాని తెలంగాణా లో ఏంటి?
  ఏంటో ఆయనేమో హైదరాబాద్ ను చూసి కాదు నన్ను చూసి వచ్చాయి అంటాడు మరి ఇప్పుడు బాబు ను చూసి ఎందుకు రావట్లేదో?
  (అ మద్య లోకేష్ 10 లక్షల టికెట్ కొని ఒబామా కు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినా లాభం లేదా?)

 3. Veera

  లోకేష్ అండ తోనే కాల్ మనీ (సెక్స్ రాకెట్)- C రామచంద్రయ్య, MLC
  (ఊరంతా అనుకొంటున్నారు ఏమని ఏమని!!!
  మొన్న బుద్ధా వెంకన్న 50 కోట్లు కాల్ మనీ డబ్బు లోకేష్ కు ఇచ్చి MLC అయ్యాడని??)

 4. Veera

  కాల్ మనీ-సెక్స్ రాకెట్ బయట పెట్టింది విజయవాడ TDP MP కేసినేని చౌదరి?
  MLA బొండా ఉమా, MC బుద్దా వెంకన్న, మంత్రి దేవినేని ఉమా చౌదరి…. తదితరులు పట్టించుకోవడం లేదని భావించి కేశినేని కడుపు మంట తో కాల్ మనీ- సెక్స్ రాకెట్ అంశాన్ని తెరమీదకు తెచ్చాడట
  కాని ఇంత స్థాయిలో పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని తెలియదట పాపం!!!
  http://kommineni.info/articles/dailyarticles/content_20151215_44.php?p=1450189380406

 5. Veera

  నిజమైన నిప్పు పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ సెలవులపై వెళ్లారు (పంపారు)
  నేడు విజయవాడ కమీషనర్ గా నిమ్మగడ్డ సురేంద్ర నియమితులయ్యారు
  రాష్ట్ర DGP JV రాముడు, సురేంద్ర ఇద్దరూ బాబు కులస్తులే!!!
  ఇక కాల్ మనీ కేసు వీరు చూస్తారు.
  అక్కడ సెక్స్ రాకెట్ లో ఉన్నది కూడా TDP MLA బోడే ప్రసాద్ చౌదరి, యలమంచిలి జయ, జ్వాలా చౌదరి, యలమంచిలి రాము, వడ్డే గాంధీ……
  నిన్న కాల్ మనీ-సెక్స్ రాకెట్ పై బాబు సీరియస్ అని వార్త-నేడు గౌతమ్ సవాంగ్ సెలవులపై వెళ్లారు
  అసలు గౌతమ్ సవాంగ్ లేకుంటే ఈ సెక్స్ రాకెట్ కేసు బయటపడేది కాదు అని కడుపు మంట అనుకొంటా!!! పెద్ద తలకాయలను తప్పిస్తారు ఇక!!!
  ఎటు పోతున్నాం మనం???

 6. Veera

  కాల్ మనీ(సెక్స్ రాకెట్) లో TDP MLC బుద్ధా వెంకన్న తమ్ముడు అరెస్ట్
  బుద్ధా నాగేశ్వరరావు కాల్ మనీ ద్వారా సంపాదించిన ఆస్తి విలువ 300 కోట్లు- పోలీస్
  అంతేలే ఒక BC నాయకుణ్ణి అరెస్ట్ చేసారు కాని అసలు బాస్ TDP MLA బోడె ప్రసాద్ చౌదరి ని టచ్ చేయగలరా ?
  (చింతమనేని చౌదరి, బాబూ రావు చౌదరి, బోడె ప్రసాద్ చౌదరిని అరెస్ట్ చేస్తారా? మాట వరసకి ఇతర కులాలవారిని అరెస్ట్ చేసి అసలు దోషులను రక్షిస్తారు
  అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే కమ్మగా ఉంటుంది మరి !!!)

 7. Veera

  స్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, సెక్స్ మాఫియా!!!
  (అవును ఆయనే రావాలి, ఆయనోస్తేనే సమ్మగా కమ్మగా ఉంటుంది!!!)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s