నో పోలీస్‌..!

నో పోలీస్‌..!
”కల్తీ జరిగిందని నిలదీసిన రైతును, అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే అదే నో పోలీస్‌..

కాంట్రాక్టర్లను చంపేసి, టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్‌ను తీసుకెళ్లి రేప్‌ చేసి చంపేస్తే… నో పోలీస్‌…

ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే.. దారుణంగా చంపేసినప్పుడు.. నో పోలీస్‌

కల్తీ పాలకు అరవై పసి ప్రాణాలు గాలిలో కలిసి పోతే.. అయ్యా ఇదీ పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి… నో పోలీస్‌

పోలిస్‌ స్టేషన్‌కు వెళ్లిన పాపానికి మూడువందల మందిని చంపి బావిలో పాతేస్తే.. నో పోలీస్‌..

అప్పుడు లేవని నోరు ఆఫ్ట్రాల్‌ ఒక క్రిమినల్‌ను చంపితే లేస్తోందే… ఏమ్‌”

నందమూరి నటసింహం ”సింహా” సినిమాలో పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్‌.

సీన్‌ కట్‌ చేస్తే…

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసుల తీరు కూడా ఈ డైలాగ్‌కు అన్వయించడానికి అవకాశం ఏర్పడుతోంది. సినిమాలో బాలయ్య ప్రాసకు ఏ మాత్రం తీసిపోకుండా… డైలాగులో డెన్సిటీ తగ్గకుండా.. ఈ మధ్యకాలంలో ఏపీలో జరిగిన సంఘటనల్లో పోలీసుల పాత్రను ప్రస్తావించుకోవచ్చు.

‘పట్టపగలు’ ఎమ్మార్వో ఆఫీసుకు వ్యక్తిని పిలిపించుకుని దారుణంగా నరికి చంపితే.. పక్కనే పోలీస్టేషన్‌ ఉన్నా… నో పోలీస్‌..

ఇసుక దోపిడీకి అడ్డుపడిన మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి అనుచరులు దాడి చేస్తే.. నో పోలీస్‌..

ఇదేంటి అని ఎదురు ప్రశ్నించిన ఆమెను ముఖ్యమంత్రి దండిస్తే.. నో పోలీస్‌..

ముఖ్యమంత్రి షార్ట్‌ఫిల్మ్‌ కోసం పుష్కరాల్లో తొక్కిసలా టతో ముప్పై మంది మరణిస్తే నో పోలీస్‌…

ర్యాగింగ్‌తో అమాయక బీఫార్మ్‌ సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే, అనుభవించిన వ్యథను అంతా సూసైడ్‌ నోట్‌ లో ఏకరువు పెడితే నో పోలీస్‌..

కాల్‌ మనీ అప్పుల పేరుతో ఆడవాళ్లను వ్యభిచారంలోకి దించుతున్న వారిని నియంత్రించడానికీ నో పోలీస్‌..

ఇన్ని జరిగినా లేవని నోరు.. ఇప్పుడు అదే కాల్‌మనీని పక్కదారి పట్టించడానికి మాత్రం లేస్తోందే.. అసలు దోషు లను తప్పించడానికి, కేసును పక్కదారి పట్టించడానికి మాత్రం చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారేం…”

http://telugu.greatandhra.com/politics/gossip/no-police-67950.html

5 Comments

Filed under Uncategorized

5 responses to “నో పోలీస్‌..!

 1. Veera

  కత్తి కన్నా కలం గొప్పది-నాడు
  కలం కన్నా కులం గొప్పది-ఈనాడు

 2. Kondharu Kulanni ….Kalanni addam pettukuni …
  Krishundi veshalu …..Devadasu pathralu vesthu Rastranni dochukunta
  Mare kondharu …Manava viluvalu vunna ..Kulam anda leni manchi natulu paristhithi ??

  Movie actor Ranganath commits suicide …..RIP

  http://www.sakshi.com/news/movies/telugu-actor-ranganath-no-more-299152?pfrom=home-movies

 3. Veera

  రోజా మీద రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాలి-వరుసగా 5 సార్లు ఓడిన సోది రెడ్డి
  (TDP మహిళా అధ్యక్షురాలిగా TDP తరపున 2 సార్లు MLA గా పోటీ చేసి ఓడారు రోజా )
  MRO వనజాక్షి ని ఇసుకలో వేసి కొట్టిన TDP MLA చింతమనేని చౌదరి మీద నో కేస్
  రాయడానికి వీలు లేని భాషలో అంగన్ వాడి లేడీస్ ను తిట్టినా చింతమనేని చౌదరి మీద నో కేస్
  స్టూడెంట్ రితికేస్వారి మృతిలో ప్రిన్సిపాల్ బాబూ రావు చౌదరి మీద నో కేస్
  కొడకా పాతెస్తా అని TDP MLA బోండా ఉమా అంటే నో కేస్
  జగన్ ను ఘోరంగా తిట్ట్టే అచ్చెం నాయిడు బుచయ్య చౌదరి ధూళిపాళ్ళ చౌదరి మీద నో కేస్
  సెక్స్ రాకెట్ లో TDP MLA లను రక్షిస్తున్న బాబు ను అసెంబ్లీ లో కామ(కాల్ మనీ) CM అన్నందుకు రోజా మీద కేస్!!!

  ఆహా ఏమి న్యాయం???

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s