డాక్టరేట్‌పైనా అబద్ధాలే!

గౌరవ డాక్టరేట్ విషయంలోనూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు
♦ ప్రఖ్యాత షికాగో యూనివర్సిటీ ఇస్తున్నట్లు ట్వీటర్‌లో వ్యాఖ్యలు
♦ కానీ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ
♦ ప్రతి ఏటా గుర్తింపు పునరుద్ధరణకు తంటాలు పడుతున్న సంస్థ
♦ దానికే పచ్చ పత్రికలు, తెలుగు తమ్ముళ్ల ప్రచార హంగామా

సాక్షి, హైదరాబాద్: తాను విలువలున్న రాజకీయాలే చేస్తాననీ, 30 ఏళ్లుగా మచ్చలేకుండా రాజకీయం చేశాననీ నిత్యం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లోని నిజమెంతో మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా తిరస్కరించాననీ, ప్రపంచ ప్రఖ్యాత షికాగో విశ్వవిద్యాలయానికున్న చరిత్ర చూసి అంగీకరించానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికోసం కృషి చేస్తున్నందుకుగాను షికాగో యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు ట్వీటర్ సాక్షిగా ప్రకటించారు. ఇదే అదనుగా పచ్చ పత్రికలు చంద్రబాబు ఘనత గురించి కథనాలు వండాయి. బ్రాండ్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న పచ్చ తమ్ముళ్లు తమ ప్రచారానికి పదును పెట్టారు.

షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించడమే చంద్రబాబు పాలన దక్షతకు ఇదే నిదర్శనమని, అసలా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక విదేశీ రాజకీయ వేత్తకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఇదే ప్రథమమని బాకాలూదారు. అయితే తెలుగుదేశం అధిపతి, ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించింది ప్రపంచ ప్రఖ్యాత ‘షికాగో యూనివర్సిటీ’ కాదు.. అనామక ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’.

గంపెడు ఆరోపణలున్న వర్సిటీ…
అమెరికాలో నాణ్యతాపరంగా పేరున్న యూనివర్సిటీల పేర్లకు దగ్గరగా మరికొన్ని సాధారణ యూనివర్సిటీల పేర్లుంటాయి. అలాగే ఇల్లినాయిస్‌లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’, ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ పేరిట రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. విద్యా ప్రమాణాల్లో ఈ రెండింటికీ మధ్య నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వీటిలో చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’పై నిధులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగం వంటి ఆరోపణలున్నాయి. దీంతో 2009 నుంచి అమెరికా ప్రభుత్వ హయ్యర్ లెర్నింగ్ సెంటర్ ఇచ్చే గుర్తింపు పునరుద్ధరణకు నానా తంటాలు పడుతోంది.

ఈ పరిస్థితులనుంచి గట్టెక్కేందుకు ఏపీలో వర్సిటీని స్థాపించి భారీగా ప్రోత్సాహకాలు పొందాలని ఆ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రావు ఆచంట, దేవిశ్రీ పొట్లూరి ప్రణాళిక రచించారు. వీరిలో రావు ఆచంటకు ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ సాన్నిహిత్యంతోనే పరస్పర ప్రయోజనాలు చేకూర్చుకునే పథకంలో భాగంగానే చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన సంపాదించిన డాక్టరేట్‌కు ఏదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, ఆయన అనుయాయులకే చెల్లిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రచారం కోసం పవిత్రమైన విద్యాసంస్థల పేర్లను సైతం వాడుకోవడం గర్హనీయమని ప్రముఖ విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

http://www.sakshi.com/news/hyderabad/chandrababu-false-campaigns-against-honorary-doctorate-299669?pfrom=home-top-story

14 Comments

Filed under Uncategorized

14 responses to “డాక్టరేట్‌పైనా అబద్ధాలే!

  1. Paccha chokkalu ……..Nindu jobulu ?

    http://www.sakshi.com/news/district/cms-son-in-the-sand-mafia-300153?pfrom=home-top-story

    Manam ……Kulam……..Dhanam……Jeevitham …..Vyardham ?

  2. A man who did not invent the computer or build charminar ….
    But re built the Nation – PV

    http://www.sakshi.com/news/hyderabad/congress-leaders-solid-tribute-to-pv-300082?pfrom=home-top-story

  3. Need more of this ….

    Ethical people across all communities should come together to condemn the bad.

    http://www.ndtv.com/india-news/underworld-don-dawood-ibrahims-car-set-on-fire-near-delhi-1258378?pfrom=home-cities

  4. Veera

    పాకిస్తాన్:మీ గవాస్కర్ ను మాకివ్వండి, అన్ని టీం లను ఓడిస్తాం
    ఇండియా:మీ ఇద్దరు అంపైర్ లను మాకివ్వండి ,ప్రపంచాన్ని ఓడిస్తాం
    కట్ చేస్తే
    TDP విప్ కాల్వ శ్రీనివాసులు:జగన్ కు వ్యూహమే లేదు
    బ్రహ్మి:మీ స్పీకర్ చౌదరి ని జగన్ కు ఇచ్చి చూడండి గేమ్!!!

  5. Veera

    జగన్ కు సలహా!!!!
    నేటి జగన్ ప్రెస్ మీట్ ను సాక్షి తప్ప ఏ చానల్ కూడా చూపలేదు
    అదే TDP లో ఒక గల్లీ లీడర్ మాట్లాడినా కూడా గంటలు గంటలు లైవ్ లో చూపుతారు అంత కులాభిమానం మరి. కాబట్టి బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ఈ 18 నెలల కాలం లో బాబు అవినీతి కులప్రీతి అసమర్ధ పాలన గురించి ప్రజలకు చెప్పండి, అదే మీకు శ్రీరామరక్ష!!!
    [కమ్మ యజమానుల అధీనం లోని మీడియా
    1.TV9:రవి ప్రకాష్ .
    2.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ
    3.ETV/ఈనాడు:రామోజీ రావు
    4.MahaTV:ఐ వెంకట్ రావు /సుజన చౌదరి.
    5.Express TV:చిగురుపాటి జయరాం
    6.జెమినీ న్యూస్:అక్కినేని మనోహర్
    7.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు.
    8.NTV:తుమ్మల నరేంద్ర చౌదరి
    9.Studio N:నార్నే శ్రీనివాస్ రావు (Junior NTR మామ).
    10:6TV:లోకేష్.
    11.CVR:చలసాని వెంకటేశ్వర రావు
    Source: Kammasworld ]
    నోట్:ఎలాంటి కించపరిచే కామెంట్స్ పెట్టవద్దు.
    మీడియా మాఫియా ను ఎత్తి చూపుదాం
    90% మీడియా అంతా ఒక కులం చేతిలో ఉండడం, వారు అంతా బాబు కోసం పనిచేయడం, మిగిలిన ఏకైక సాక్షి ని చూడొద్దు అని బాబు చెప్పడం కూడా చూసాము!!!! మీడియా ప్రజల పక్షాన పోరాడాలి కాని అధికార పక్షాన కాదు.
    అయితే NTV తరువాత TV5 కొంచెం నయం!!!

    • Every Telugu person out there who want’s or wanted to do something good to fellow people from AP should use all means to expose the narrow minded caste fanatics ruining a peaceful state.
      Please use the social media as much as possible.
      Write / Email / Facebook / Twitter etc ettc to Modi , BJP leaders , leaders from all other communities including Tdp leaders from KDP.
      All we are asking for is a little bit of your time and skills to restore some human and ethical values in the land were born.
      It is as worth as visiting a holy place no matter which reiligion you come from.
      Ethical people from yellow community should also tell their friends what they are doing is wrong.

  6. Veera

    నారాయణ నారాయణ!!!
    రాయణ పదవిపై వేలాడుతున్న క్రిమినల్ కేసు
    మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఒక క్రిమినల్ కేసు ఇప్పుడు వెంటాడుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైనా సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన క్రిమినల్ కేసు అంశాన్ని దాచడం దుమారం రేపుతోంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయాలని ప్రోబ్‌ అనే స్వచ్చంధ సంస్థ నిర్ణయించింది. ఒక వేళ నారాయణ తప్పు చేసినట్టు తేలితే ఆయనపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అసలు కేసు ఏమిటంటే…

    2010లో ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీకి చెందిన పుస్తకాలను కాపీరైట్స్‌ ఉల్లంఘించి నారాయణ విద్యాసంస్థలు ముద్రించాయి. తెలుగు అకాడమీ పుస్తకాల్లోని పాఠాలను ఉన్నది ఉన్నట్టుగా కాపీ చేసి పుస్తకాలు సొంత పుస్తకాలు ముద్రించుకున్నారు. దీంతో అప్పట్లో తెలుగు అవాడమీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణ కాలేజీల అధినేత నారాయణపై క్రిమినల్ కేసు నమోదైంది. కేసులో ఏ1గా నారాయణ ఉన్నారు. కేసు విచారణ నిలిపివేయాలంటే ఓ దశలో నారాయణ హైకోర్టుకు కూడా వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే తనపై ఈ క్రిమినల్ కేసు ఉన్న విషయాన్ని ఎమ్మెల్సీగా ఎన్నికైన సమయంలో నారాయణ సమర్పించలేదు. దీంతో ప్రోబ్ సంస్థ ఈసీకి ఫిర్యాదు చేయబోతోంది. అప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
    http://teluguglobal.com/narayana-hide-his-criminal-case/%5D

  7. Veera

    తిరుపతిలో ప్రముఖ IT కంపెనీలు Cognizant, TCS , HCL …..
    మొన్న వచ్చిన భారీ వరదలకు చెన్నై లో ఉన్న ప్రముఖ IT సంస్థలు
    దాదాపు నెల రోజుల పాటు పనిచేయక భారీ నష్టాలూ వచ్చాయి.
    అందువలన Cognizant, TCS , HCL … అతి సమీపం లో ఉన్న తిరుపతిలో తమ కంపెనీ లు ప్రారంభిస్తున్నాయి.

    కులప్రీతి తో బాబు అన్నీ విజయవాడ లో పెడుతున్నా అవసరాల కోసం IT కంపెనీ లు తిరుపతిలో పెడుతున్నాయి, ఇంక రేపు నుంచి నన్ను చూసి వాళ్ళంతా తిరుపతిలో పెట్టారు నేనే చెప్పాను అక్కడ పెట్టటమని అని డప్పు వేసుకుంటాడు మన పిట్టల దొర!!!

  8. Veera

    రాజకీయాలలో హుందాగా ఉండాలి- బాబు కా కమ్మ కబుర్లు
    రెడ్డిని రెడ్డితో…కాపుని కాపుతో… కమ్మని కమ్మతో… దళితులను దళితులతో…
    ఇలా తిట్టీస్తూ రాజకీయాలు హుందాగా ఉండాలి అని భలే కాకమ్మ కబుర్లు చెబుతారు
    వినేవాడు వెర్రి బాబు అయితే సెప్పేవాడు సెంద్ర బాబే !!!
    -Vijay Ram Naidu.

  9. Veera

    బాబు అను ‘కుల’ పత్రిక లో బాబు అసమర్ధత, అవినీతి ఏ స్థాయిలో ఉందొ వ్రాసారు
    [సమర్థుడని తాము అధికారం అప్పగిస్తే చంద్రబాబు ఎందుకు ఇలా మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు? అని ప్రజలు భావించే పరిస్థితి తెచ్చుకోకూడదు. మొత్తం పరిస్థితిని సమీక్షించి ఇప్పుడు తన ముందున్న కర్తవ్యం ఏమిటి? ఎక్కడెక్కడ లోపం ఉంది? తనవైపు నుంచి సరిదిద్దుకోవలసిన తప్పులేమిటి? మొదలైన అంశాలపై చంద్రబాబు ముందుగా స్పష్టత తెచ్చుకోవాలి. శాసనసభలోనే కాకుండా వెలుపల కూడా ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ చోటుచేసుకుంటున్న అవాంఛనీయ పరిణామాలపై కొరడా ఝుళిపించవలసిన తరుణం ఆసన్నమైంది. లేనిపక్షంలో ఏ నమ్మకంతోనైతే ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగించారో ఆ నమ్మకాన్ని కోల్పోడానికి ఎంతో కాలం పట్టదు

    పరిస్థితి అదుపు తప్పుతోంది… పారాహుషార్‌!

    అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే చంద్రబాబుకు అటు పార్టీపైనా, ఇటు ప్రభుత్వంపైనా పట్టు తప్పుతోందన్న అభిప్రాయం వ్యాపించడానికి కారణమైంది.
    అంతా తానై వ్యవహరించాలనుకోవడం కూడా ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన అతిగా స్పందిస్తున్నారు. దీంతో ప్రతిపక్షానికి ఆయుధాన్ని ఆయనే అందిస్తున్నారు. కాల్‌మనీ వ్యవహారమే తీసుకుందాం. విజయవాడకు చెందిన కొంతమంది మదమెక్కినవాళ్లు అప్పు తీసుకున్న మహిళలను లైంగికంగా వేధించారన్న ఫిర్యాదులు వచ్చాయి. ఈ అంశాన్ని పోలీసులకు వదిలేసి ఉంటే వారే నిందితులను శిక్షించి ఉండేవారు. చంద్రబాబు ఆ పని చేయకుండా ఈ వ్యవహారాన్ని తన నెత్తిన వేసుకున్నారు. కరీంనగర్‌ జిల్లాలో కిందిస్థాయి పోలీసు అధికారి మోహన్‌రెడ్డి కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ మీడియాకు చిక్కారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌గానీ, ప్రభుత్వంగానీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. చేయాల్సిన పనిని పోలీసుశాఖతో చేయించారు. నిందితులను అరెస్ట్‌ చేయించారు. విచారణలో దోషులుగా తేలిన కొంతమందిని తప్పించారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయినా ఆ వ్యవహారంతో ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అంతా సాగిపోయింది. చంద్రబాబు ఇందుకు భిన్నంగా అతిగా స్పందించి రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేయించారు. దీంతో ధర్మవడ్డీకి అప్పులిచ్చే వారిని కూడా పోలీసులు వేధించి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ చర్యవల్ల గ్రామాలలో అప్పులిచ్చేవారు లేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక సమస్యను పరిష్కరించాలనుకుని చంద్రబాబు కొత్త సమస్యను కొనితెచ్చుకున్నారు. కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిపోవడం అంటే ఇదే!
    సమీక్షలు, సమావేశాల పేరిట గంటలకు గంటలు గడిపేస్తూ, అసలు విషయాలను పట్టించుకోకపోవడం వల్ల కూడా చంద్రబాబు చిక్కుల్లో పడుతున్నారు.

    తాజాగా జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని అర్ధరాత్రి వరకు నిర్వహించారు. నిజానికి అంత అవసరం లేదు. తాను ఏమి ఆశిస్తున్నానో స్పష్టంగా చెప్పి, దాన్ని సాధించే బాధ్యతను అధికారులకే వదిలివేయవచ్చు. అలా కాకుండా ప్రతి అంశాన్ని సాగదీయడం వల్ల సమావేశం లేదా సమీక్ష అంటేనే అధికారులు భయపడే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు అదికూడా పోయి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. సమయపాలన లేకపోవడం వల్ల విలువైన సమయాన్ని చంద్రబాబు వృథా చేస్తున్నారనీ, అధికారులు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంవల్ల పనిగంటలు వృథా అవుతున్నాయనీ ఒక అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి తెలుసుకోవలసినది మరొకటి ఉంది. ఇతరుల సమయానికి కూడా విలువ ఇవ్వాలని ఆయన గమనించాలి. సమావేశాలు, సమీక్షలకు వచ్చే అధికారులకు సొంత కుటుంబాలు, సొంత పనులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అన్నీ సమకూర్చి పెట్టేవారు ఉంటారు. ఇతరులకు ఆ వెసులుబాటు ఉండదుగా!

    రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడుతున్న విషయం వాస్తవం కావచ్చుగానీ, ఇతరులను కష్టపెట్టకూడదుగా! నిజానికి ఆయన ఆడుతూపాడుతూ పనిచేసుకుపోవచ్చు. తన ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించి, వాటిని సాధించే బాధ్యత అధికారులకు అప్పగించితే సరిపోతుంది. అందుకోసం గంటలకొద్దీ టెలి కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించనవసరం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లపాటు పాలించి సమర్థుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడికి ఇప్పుడు 13 జిల్లాలతో కూడిన చిన్న రాష్ట్రాన్ని పాలించడం కష్టం కాకూడదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించిందీ చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి ఏర్పడింది. తెలంగాణలో ఏడాదిన్నరలో అధికారపక్షమైన టీఆర్‌ఎస్‌ బలం పెరగగా, ఏపీలో అధికారపక్షమైన టీడీపీ బలం తగ్గుతోంది.

    జనం ఏమాశించారు… ఏం జరుగుతోంది?

    తన నుంచి ప్రజలు ఆశించింది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? అని చంద్రబాబు ప్రశ్నించుకోవలసిన తరుణం ఆసన్నమైంది. అవినీతి విషయంలో అధికార పార్టీ శాసనసభ్యులు పలువురు గత పాలకులను మించిపోయారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోంది. ఇసుక అక్రమ వ్యాపారంతో పలువురు శాసనసభ్యులు అడ్డగోలుగా సంపాదించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగుల బదిలీలలో కూడా డబ్బుకోసం కక్కుర్తి పడుతున్నారు.

    తిరుపతి వెంకన్న దర్శనానికి సిఫారసు లేఖ ఇవ్వడానికి కూడా కొంతమంది చేయి చాస్తున్నారు. కోస్తా జిల్లాలకు చెందిన ఒక తహసీల్దార్‌ చెప్పిన విషయాలు వింటే శాసనసభ్యులు ఇంతగా దిగజారిపోతున్నారా? అన్న ఆవేదన కలుగుతోంది. సదరు తహసీల్దార్‌ పాస్‌ పుస్తకాల జారీకోసం డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ‘పాస్‌ పుస్తకాల కోసం రైతులను పీడించడమేమిటి? కావాలంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి తీసుకోండి’ అని ఒక పెద్దమనిషి సూచించగా ‘‘ఏం చేయమంటారు సార్‌! ప్రతిరోజూ ఎన్ని పాస్‌ పుస్తకాలు జారీచేసింది… ఎంత వసూలు చేసిందీ.. మా ఎమ్మెల్యేకి చెప్పి ఆయన వాటా ఆయనకు ముట్టజెప్పాలి’ అని ఆ తహసీల్దార్‌ జరుగుతున్న వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. మునిసిపాలిటీలలో ఇళ్ల నిర్మాణం కోసం ప్లాన్‌ సమర్పించినవారి నుంచి సిబ్బంది వసూలుచేసే మొత్తంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు వాటాలు వెళుతున్నాయట! ఇలాంటివి వినడానికే కంపరంగా ఉంటున్నాయి. టీడీపీ శాసనసభ్యులు డబ్బుకోసం ఇంతగా కక్కుర్తి పడవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఎన్నికైన శాసనసభ్యులలో పలువురికి పార్టీనే ఆర్థిక సహాయం చేసింది. సొంత డబ్బు ఖర్చుచేసి గెలుపొందిన శాసనసభ్యులు బహు తక్కువ. అయినా ఆబగా డబ్బు సంపాదన కోసం ఎగబడుతున్నారు.

    ఒకరిద్దరు మంత్రుల పుత్రరత్నాలైతే ఏకంగా కౌంటర్లే పెట్టేశారు.
    ఉద్యోగుల బదిలీలు, నియామకాల్లో డబ్బు తీసుకునే శాసనసభ్యుల వల్ల పార్టీ బలహీనపడుతుందేగానీ బలపడదు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడన్న సానుభూతి ప్రజల్లో ఉన్నప్పటికీ, శాసనసభ్యుల అవినీతిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితికి ఒక రకంగా చంద్రబాబే కారణం! పార్టీ వ్యవహారాలు మొత్తం ఆయన తన కుమారుడు లోకేశ్‌కు అప్పగించి ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం కావడం వల్ల పార్టీలో పెడధోరణులు చోటుచేసుకుంటున్నాయి. ఒక తండ్రిగా తన కుమారుడిపై చంద్రబాబుకు అపారమైన నమ్మకం ఉండవచ్చుగానీ, ప్రస్తుత రాజకీయాలను ఆకళింపు చేసుకుని పార్టీని నడిపించడానికి లోకేశ్‌ అనుభవం సరిపోదు. చంద్రబాబు కూడా ఈ దశకు చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎన్టీఆర్‌ హయాంలో ఆయన చాలాకాలంపాటు సలహాదారుగానే ఉండిపోయారు. పరిమిత బాధ్యతలనే నిర్వహించారు. ఆ క్రమంలోనే పార్టీ నాయకుల నమ్మకాన్ని చూరగొనగలిగారు. లోకేశ్‌ నిన్నగాక మొన్న రాజకీయాలలోకి వచ్చారు. అంతేకాదు… తరాల అంతరం ఉంది. టీడీపీలో మొదటినుంచీ ఉన్న సీనియర్లను లోకేశ్‌ అదుపు చేయ లేరు. చంద్రబాబు అంతా లోకేశ్‌కే వదిలేసి పార్టీని పట్టించుకోవడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.]

  10. Veera

    IT exports లో బాబు CM కాకముందు హైదరబాద్ కి 3 వ స్థానం
    IT exports లో బాబు CMగా 9 సం పనిచేసి దిగిపోయే రోజున హైదరబాద్ కి 4 వ స్థానం
    IT exports లో బాబు CM గా దిగిపోయిన10 సం లకు అంటే కాంగ్రెస్ హయాములో (2013-14) హైదరాబాద్ కి 2 వ స్థానం
    ఇప్పుడు చెప్పండి హైదరబాద్ ను ప్రపంచ పటం లో బాబు పెట్టాడా?
    కుల మీడియా డప్పుతో ప్రచారం తప్ప చేసిందేమీ లేదు
    ఇప్పుచు చెప్పండి తమ్ముళ్ళూ What to do??? what not to do???

    [Hyderabad Pips Chennai, Pune in Software Exports -26th September 2014, Indian Express
    HYDERABAD: Hyberabad has emerged as the second largest city in the country for software exports pipping competitors Chennai and Pune. According to data from both STPI and the Department of Commerce, during the financial year 2013-14, Bangalore topped the chart with over 31% exports followed by Hyderabad at 12% and Chennai and Pune at a close 11 and 10% respectively.

    Other major cities like Mumbai, Gurgaon and Noida registered 8, 7 and 6% worth exports respectively

    http://www.newindianexpress.com/cities/hyderabad/Hyderabad-Pips-Chennai-Pune-in-Software-Exports/2014/09/26/article2449874.ece ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s