స‌భాసంఘం వేద్దాం..! వైఎస్సార్సీపీ స‌వాల్

పాత్రికేయుల స‌మ‌క్షంలో ఇరుప‌క్షాల స‌భ్యుల‌తో స‌భా సంఘం వేయ‌డానికి చంద్ర‌బాబుకి ద‌మ్ముందా అంటూ వైఎస్సార్సీపీ స‌వాల్ చేసింది. అసెంబ్లీలో వీడియోల విష‌యంలో ఎడిట్ చేసిన క్లిప్పింగుల‌తో మ‌భ్య‌పెట్ట‌వ‌ద్ద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి తెలిపారు. ప్ర‌జ‌లేమీ అమాయ‌కులు కాద‌ని, ఇలాంటి జిమ్మిక్కులు విశ్వ‌సిస్తార‌నుకోవ‌డం అవివేక‌మ‌ని వ్యాఖ్యానించారు. ఎవ‌రు త‌ప్పుగా మాట్లాడినా త‌ప్పే కాబ‌ట్టి..అంద‌రూ మాట్లాడిన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తే వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతాయ‌న్నారు.

అసెంబ్లీలో ఎవ‌రెవ‌రు..ఏం ఏం మాట్లాడార‌న్న దానిపై పూర్తిస్థాయి విచార‌ణ అవ‌స‌ర‌మ‌న్నారు. ప్ర‌తిప‌క్షాన్ని మాట్లాడ‌నీయ‌కుండా చేయాల‌ని చూడ‌డం త‌గ‌ద‌న్నారు. క‌ర్ణాట‌కా రాష్ట్రంలో మాదిరి అన్ని ఛానెళ్ల‌ను అసెంబ్లీ విజువ‌ల్స్ చిత్రీక‌రించుకోవ‌డాన‌కి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌శ్నిస్తే కేసులు, స‌స్ఫెన్ష‌న్ల‌తో ప్ర‌జాస్వామ్యం కాల‌రాయాల‌ని చూస్తే త‌గిన బుద్ధి త‌ప్ప‌ద‌న్నారు. చంద్ర‌బాబు కుప్పిగంతుల‌కు వైఎస్సార్సీపీ వెనుక‌డ‌గు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టంచేవారు.

టీడీపీ అధ్య‌క్షుడికే క‌ష్టాలు ‘అనంతం’…!
అధికార పార్టీలో వ‌ర్గ‌పోరు ఉధృత‌మ‌వుతోంది. అన్ని చోట్లా అదే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. పార్టీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. అందులో మంత్రుల‌కు కూడా మిన‌హాయింపు క‌నిపించ‌డం లేదు. అనంత‌పురం జిల్లాలో అయితే పార్టీ జిల్లా అధ్య‌క్షుడికే షాక్ త‌గిలే స్థాయిలో వైరం ముదురుతోంది. అయితే పార్టీ జిల్లా అధ్య‌క్షుడిని కూడా ఢీ కొడుతున్న ఆ నేత ఎవ‌ర‌ని వింటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఎందుకంటే అతడు కూడా ఓ సీనియ‌ర్ ఎంపీ కావ‌డం విశేషం.

అనంత‌పురం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు బీకే పార్థ‌సార‌ధి కి కొత్త స‌మ‌స్య‌లు చుట్టిముడుతున్నాయి. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పెనుగొండ‌లో పోరు ముదురుతోంది. ఏకంగా ఎంపీ నిమ్మ‌ల కృష్ణ‌ప్ప‌తో పార్థ‌సార‌ధి విబేధాలు తీవ్ర‌రూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణ‌ప్ప సొంత మండ‌లం గోరంట్ల దానికి వేదిక‌గా మారుతోంది. త‌న మండ‌లంలో ఎవ‌రు అడుగుపెట్టినా త‌న అనుమ‌తి ఉండాల‌న్న కృష్ణ‌ప్ప ఆదేశాల‌తో పార్థ‌సార‌ధి బేఖాత‌రు చేయ‌డంతో వ్య‌వ‌హారం రచ్చ‌కెక్కేలా క‌నిపిస్తోంది. ఎంపీకి స‌మాచారం కూడా ఇవ్వ‌కుండా పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ల‌కు బ‌య‌లుదేర‌డ‌మే ఈ దుమారానికి కార‌ణంగా చెబుతున్నారు.

అయితే కృష్ణ‌ప్ప కండీష‌న్స్ వెనుక కార‌ణాలు మాత్రం నిధుల వినియోగంలో ప‌ర్సంటేజీల వ్య‌వ‌హార‌మేన‌ని జిల్లా పార్టీ నేత‌లు భావిస్తున్నారు. అటు అనంత‌పురంలో అన్ని ప‌థకాల్లోనూ ఎంపీకి ల‌భిస్తుండ‌గా..నిమ్మ‌ల‌కు మాత్రం ఎందుకు ద‌క్క‌ద‌ని ఆయ‌న వ‌ర్గీయులు నిల‌దీస్తున్నారు. దానికితోడు ఇటీవ‌ల పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో శంకుస్థాప‌న జ‌రిగిన ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన పెద్ద‌ల‌తో మాట్లాడుకుని పార్థ‌సార‌ధి భారీగా మామూళ్లు తెచ్చుకున్నార‌న్న విమ‌ర్శు నిమ్మ‌ల వ‌ర్గీయులు చెబుతున్నారు. దానిలో కూడా ఎంపీ కి రావాల్సిన వాటా రాకుండా పోయింద‌న్న మ‌నోవేధ‌న‌లో కూడా నిమ్మ‌ల కృష్ణ‌ప్ప వ‌ర్గీయులు ఉన్నారు.

మొత్తానికి వాటాల పంపకం వ్య‌వ‌హారం ముదురుతోంది. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా ఉన్న పార్థ‌సార‌ధి కాబోయే రాష్ట్ర‌మంత్రిగా కూడా సాగుతున్న ప్ర‌చారం నేపథ్యంలో ఆయ‌న‌కు , ఎంపీకి మ‌ధ్య సాగుతున్న ర‌చ్చ వీధికెక్కితే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

http://updateap.com/tdp-anantapuram-president-facing-problems/

3 Comments

Filed under Uncategorized

3 responses to “స‌భాసంఘం వేద్దాం..! వైఎస్సార్సీపీ స‌వాల్

 1. Veera

  Shiv Lingaa
  మల్టిపుల్ చాయిస్ క్వొశ్చన్స్ ఫర్ నెక్ట్స్ MLA టికెట్ ఇన్ TDP పార్టీ
  ——————————————————————————-
  1: బాబు కి ఇష్టమైన రాయి
  a) కల్పనా రాయి
  b) గులక రాయి
  c) వైశ్ రాయి

  2: బాబు కి ఇష్టమైన పూస
  a) వెన్ను పూస
  b ) వెన్న పూస
  c ) కారప్పూస

  3: బాబు కి నచ్చని ఇజం
  a) నిజం
  b) ఖనిజం
  c) పవనిజం

  4: బాబు కి నచ్చని గన్
  a ) దివాలి గన్
  b ) YS జగన్
  c ) పితామగన్

  5: బాబు కి నచ్చని సాయం
  a )వ్యవసాయం
  b )మాటసాయం
  c ) కషాయం

  6: బాబు కి నచ్చే కేసు
  a )షోకేసు
  b ) లోకేసు
  c )సూట్ కేసు

 2. Veera

  మా సినిమా వాళ్ళకు కామన్
  నన్నపనేని కాంగ్రెస్ లో ఉండగా శాసన సభలో ఆమె ఏదో కాగితం చూపి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ కోపంగా మడిచి ………. …. పెట్టుకో ….. అన్నారు
  మరుసటి రోజు అసెంబ్లీ రికార్డ్స్ చూసి ఆమె సభలో బోరున ఏడ్చి హడావుడి చేస్తే మా సినిమా వాళ్ళకు కామన్ సోదరి అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు
  -Murali Buddha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s