రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిన్నర నుంచీ అంగన్వాడీలు వేతనాలు పెంచాలని ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో శాసనసభలో జీతాలు పెంచుతామని బాబు హామీ ఇచ్చారు. తదుపరి ఆగస్టులో కేబినెట్ సబ్ కమిటీ ఎంత పెంచేదీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన జీతాలు ఇవ్వాల్సి ఉండగా జీవో జారీలో ప్రభుత్వం కప్పదాట్లకు పాల్పడింది. కేంద్రం నిధులు తగ్గించిందని మెలిక పెట్టింది. ఇచ్చే జీతాలనూ నెలల పర్యంతం బకాయి పెట్టింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దశల వారీ ఆందోళనలు చేసినా అణచివేత తప్ప జీవో ఇవ్వలేదు. గత్యంతరం లేక అసెంబ్లీ జరిగే సమయంలో అంగన్వాడీలు చలో విజయవాడ చేపట్టారు. ఆందోళనకారులపై ఎంతగా నిర్బంధాన్ని ప్రయోగించిందో మీడియాలో చూసి లోకం విస్తుపోయింది. ఈసారి సిఎం ఏప్రిల్ నుంచి జీతాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని సవరించారు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నందున జీవో వచ్చే వరకూ పెంపుదల అనుమానమే.
అంతలోనే ధర్నాలో పాల్గొన్న వారి తొలగింపు ఆదేశాలు ఇవ్వడం అంగన్వాడీలపై ప్రభుత్వంలో గూడు కట్టుకున్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వం ఎలాగైనాసరే అంగన్వాడీల ఐక్యతను దెబ్బ తీసేందుకు రంగంలోకి దిగడం దారుణం. అంగన్వాడీలపై ఉక్కుపాదానికి బదులు వారి డిమాండ్ల పరిష్కారంపై సర్కారు ఉక్కు సంకల్పం, చిత్తశుద్ధిని అలవర్చుకోవాలి. అంగన్వాడీలు ప్రభుత్వ కుయుక్తులను చేధించి కోర్కెల సాధనకు మరింత దీక్షతో ఉద్యమించాలి.
http://www.prajasakti.com/EditorialPage/1733046
ప్రభుత్వ మెడకు టేపుల భాగోతం..!
అసెంబ్లీ టేపులు బయటకురావడం వెనుక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం హస్తం ఉందన్న ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ప్రసార హక్కులను చంద్రబాబు తన అనుకూల మీడియా ఏబీఎన్ కు అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే అధికారపక్షానికి అనుకూలంగా ఉండేలా వీడియో, ఆడియోల చిత్రీకరణ కోసం ఏర్పాట్లు చేశారు. చివరకు ప్రతిపక్షం ఆందోళన చేస్తుందని తెలిసి..వారి బెంచీలు, స్పీకర్ పోడియం సమీపంలో ప్రత్యేకంగా మైకులు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. దాన్ని పక్కనపెడితే..అసెంబ్లీ ప్రసార హక్కులు ఓ సంస్థకు ఇచ్చినప్పటికీ ..వాటిపై పూర్తి హక్కు అసెంబ్లీకి మాత్రమే ఉంటుంది. అయితే దాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా ఎడిట్ చేసిన విజువల్స్ ను ప్రసారానికి పెట్టడం ద్వారా ఏబీఎన్ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టే అవుతుందన్నది కొందరి వాదన. దాంతో వీడియో క్లిప్పుంగుల లీకేజీ భాగోతంపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సిందే అన్న ఆరోపణలు వస్తే సర్కారుకి, ఏబీఎన్ కి చిక్కులు తప్పవు.
అయితే సోషల్ మీడియాలో ప్రసారం అయిన ఫుటేజీ అసెంబ్లీ అధికారికంగా విడుదల చేసిన విజువల్స్ లో లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఏబీఎన్ రికార్డ్ చేసిన విజువల్స్ ను కట్ చేయడం ద్వారా అది తమకు సంబంధం లేని వ్యవహారంగా చెప్పుకోవడానికి ముందస్తు ప్రణాళిక వేసుకున్నట్టు రుజువుచేస్తోందని భావిస్తున్నారు. దానిపై ప్రతిపక్షం మండిపడింది. అసెంబ్లీ రికార్డుల్లో లేని ఫుటేజి సోషల్ మీడియాకు ఎలా వచ్చిందో స్పీకరే చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు అధికారపక్ష సభ్యులు ఏమీ అనకుండానే ప్రతిపక్షం ఇంతగా వ్యవహరించిందా..లేక కేవలం ప్రతిపక్షం వ్యాఖ్యలు మాత్రమే రికార్డ్ చేసి రిలీజ్ చేశారా..అన్న అనేక విషయాలు ముందుకొస్తున్నాయి ఈ తరుణంలో స్పీకర్ నియమిస్తున్న కమిటీ సమగ్రంగా దర్యాప్తు చేస్తే సర్కారుకు చిక్కులు తప్పవనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.
సినిమా బాష పై CM ఎన్టీఆర్
నన్నపనేని రాజకుమారి కాంగ్రెస్ లో ఉండగా శాసన సభలో ఆమె ఏదో కాగితం చూపి మాట్లాడుతుంటే CM ఎన్టీఆర్ కోపంగా మడిచి ………. పెట్టుకో అన్నారు
మరుసటి రోజు అసెంబ్లీ రికార్డ్స్ చూసి ఆమె సభలో బోరున ఏడ్చి హడావుడి చేస్తే మా సినిమా వాళ్ళకు ఇవన్నీ కామన్ , సినిమా వాళ్ళ భాష ఇలాగె ఉంటుంది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు-Murali Buddha
లెగ్గు బాబూ లెగ్గు-మైనస్ 9 శాతానికి పడిపోయిన వ్యవసాయ వృద్ధి
(YS హయములో వ్యవసాయ వృద్ది 6.82%, జాతీయ సగటు కంటే ఎక్కువ)
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగం వృద్ధి మైనస్ 9 శాతానికి పడిపోయింది. ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని సిఎం చంద్రబాబే స్వయంగా ప్రస్తావించారు-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు