రంగారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ ,టిడిపి లు అవగాహనకు వచ్చాయని సమాచారం.
ఎమ్మెల్సీఎన్నికలలో ఈ రకమైన ఒప్పందానికి వచ్చారు.ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ఈ తరహాలో రెండు పార్టీలు సహకరించుకుంటుండగా, రంగారెడ్డి జిల్లాలో కూడా అదే ప్రకారం వెళుతున్నారు.రంగారెడ్డి జిల్లాలో రెండు సీట్లకు స్థానికసంస్థల నియోజకవర్గాల నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి.రెండు సీట్లకు టిఆర్ఎస్ పోటీచేస్తోంది.టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్,టిడిపిలు కూడా రంగంలో ఉన్నాయి. టిఆర్ఎస్ ను దెబ్బ తీయాలంటే తామిద్దరం సహకరించుకోవాలన్న భావానికి వచ్చారు. దీని ప్రకారం కాంగ్రెస్ ఓటర్లు మొదటి ప్రధాన్యత ఓటును కాంగ్రెస్ కు, రెండో ప్రాధాన్యత ఓటును టిడిపికి వేస్తారు.అలాగే టిడిపి ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటును టిడిపికి, రెండో ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ కు వేస్తారని చెబుతున్నారు.
రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.తల్లి కాంగ్రెస్ తో కలవడానికి టిడిపి అవగాహన కుదుర్చుకుందన్నమాట.
http://kommineni.info/articles/dailyarticles/content_20151226_30.php?p=1451137690125
రాష్ట్రమంతా కరువు కాని పదవుల్లో మాత్రం కమ్మదనం పచ్చదనం !!!
(చంద్రబాబు ఐటి సలహాదారుగా జెఎ చౌదరి నియమితులయ్యారు)
AP లో కీలక పదవులన్నింటిలో బాబు కులస్తులే!!!
రాష్ట్ర DGP JV రాముడు మొదలుకొని మొన్న నియమితులైన APPSC చైర్మన్ ,ఇప్పుడు IT సలహాదారు ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని కీలక పదవుల్లో బాబు కులస్తులే!!!
కనీసం మొన్న ఎన్నికల్లో పవన్ చెప్పాడని గంప గుత్తుగా వోటేసిన కాపు సోదరులకు అన్నా కొన్ని పదవులు ఇస్తే బాగుండేది అలాగే భూసురోత్తములు అయిన బ్రాహ్మణులు , వైశ్యులను విస్మరించడం తగదు సుమీ!!!.
బాబు పాలన లో అంతా కమ్మ కులస్తులకే పెద్ద పీట వేస్తున్నారు, కాపు ఉద్యోగులను అవినీతి పరులు అని ముద్ర వేసి పక్కన పెడుతున్నారు అని ముద్రగడ అన్నారంటే అనరు మరీ!
మొన్న AP లో 14 MLC పదవుల్లో 7 MLC బాబు కులస్తులకే ఇచ్చాడు, నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఒక కులానికే సగం పదవులు ఇవ్వడం ఇదే ప్రధమం-బొత్స
నిన్న తెలంగాణాలో 12 MLC పదవుల్లో వెలమ కులస్తుడైన కెసిఆర్ వెలమలకు ఒక్క MLC ఇచ్చాడు, రెడ్లకు 6 ,బ్రాహ్మణ లకు ఒకటి BC లకు SC లకు….. ఇచ్చాడు. ఎంత తేడా ఇద్దరికీ!!!
ప్రకాశం కర్నూల్ జిల్లాలలో YCP కి పూర్తీ మెజారిటీ ఉంది ఆయినా ZPTC MPTC లను కొని అక్కడ 2 MLC సీట్లు గెలిచాడు బాబు.గెలిచినా రెండవ రోజే YCP MP SPY రెడ్డి ని తరువాత కొన్ని రోజులకు YCP MP కొత్తపల్లి గీత లను చేర్చుకొంది కూడా బాబే.
అసలు 1999 లో నల్గొండ జిల్లా ఆలేరు నుంచి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన MLA మోత్కుపల్లి నరసింహులు ను TDP లో చేర్చుకొంది అప్పటి CMబాబు కాదా! ఈ ఫిరాయింపులకు ఆద్యుడు బాబు కాదా!!!
తెలంగాణా లో TDP వాళ్ళను పశువులను కొన్నట్టు కొంటున్నారు అని జోకులు
ఏది చెబుతాడో అది చేయడు బాబు అంటే కాదంటారా!!!
Note:దయచేసి ఎలాంటి దూషణలతో కూడిన కించపరిచే కామెంట్స్ రాయవద్దు
పచ్చ చొక్కాలకు ‘ప్రత్యేకం’
-ప్రత్యేక అభివృద్ధి నిధులు వారికే
-ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నో
-బడ్జెట్‌లో 500 కోట్లు
-కుప్పానికి 275 కోట్లు
– 45 నియోజకవర్గాలకు 106 కోట్లు
– ఒక్కటి తప్ప అన్నీ టిడిపి ప్రతిపాదనలు
-విపక్ష ప్రజా ప్రతినిధులకు తెలీకుండా పనులు
-ఎసిడిపి బంద్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ప్రభుత్వ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌పిఎఫ్) అధికార తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతోంది. గతంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఎసిడిపి)ను ఎత్తేసి ఎస్‌డిఎఫ్‌ను చంద్ర బాబు సర్కారు కొనసాగిస్తోంది. కేవలం టిడిపి ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అడిగిందే తడవుగా ఎస్‌డి ఎఫ్‌ను పందేరం చేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజక వర్గాలను పక్కనబెడుతున్నట్లు ఆరోపణలొసు ్తన్నాయి. ప్రతి పక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన నాయ కులు, నియోజ కవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ల ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి పనులను మంజూరు ఇస్తూ ప్రొటో కాల్ నిబందనలను తుంగలో తొక్కుతున్నట్లు విమర్శలొ స్తున్నాయి. 2015-16 బడ్జెట్‌లో ఎస్‌డిఎఫ్‌కు రూ.500 కోట్లు కేటా యించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి సగానికి పైగా నిధులిచ్చారు. కుప్పంతో కలుపుకొని 46 నియోజక వర్గాల్లోని అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ప్రణాళికా శాఖ రూ.381 కోట్ల ఎస్‌డిఎఫ్ విడుదల చేసింది. ఒక్క కుప్పానికి రూ.275 కోట్లివ్వగా, మిగిలిన 45 నియోజకవర్గాలకూ రూ.106 కోట్లి చ్చింది. వైసిపికి 67 మంది ఎమ్మెల్యేలుండగా ప్రకాశంజిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు ప్రతిపా దించిన పనులకు నిధులిచ్చారు. ఆయనకు టిడిపిలో దూకే ఆలోచన ఉన్నందున ఎస్‌డిఎఫ్ ఇచ్చినట్లు ఆరోపణ లొస్తు న్నాయి.
ఎసిడిపి ఎత్తివేత కుట్రే
కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.కోటి చొప్పున ఎసిడిపి నిధులిచ్చేవారు. కిరణ్ కుమార్‌రెడ్డి సిఎంగా ఉండగా ఎసిడి పితో పాటు ఎస్‌డిఎఫ్‌ను తీసుకొచ్చారు. కాంగ్రెస్‌లో నుంచి బయటికెళ్లే వారిని బుజ్జ గించడానికి, వేరే పార్టీల నుంచి తమ పార్టీలోకి జంప్ చేసే వారిని ప్రోత్సహించడానికి ఎస్‌డి ఎఫ్‌ను సంధించారనే ప్రచారం ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎస్‌డిఎఫ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధికారంలోకొచ్చాక మొత్తంగా ఎసిడిపిని రద్దు చేసి ఎస్‌డిఎఫ్‌ను తెచ్చి, కాంగ్రెస్ దారిలో వెళుతున్నారు. ఎసిడిపి అయితే పార్టీలతో నిమిత్తం లేకుండా అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ నిధులివ్వాలి. ఎస్‌డిఎఫ్ అయితే ప్రభుత్వ ఇష్టం. ప్రతిపక్ష నియోజకవర్గాలకు ఎగ్గొట్టొచ్చు.
ఎమ్మెల్యేకు తెలీకుండానే..
ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల వారిచ్చిన ప్రతిపాదనలు పక్కనపెట్టి టిడిపి నాయకుల కనుసన్నల్లో ఎస్‌డిఎఫ్ పనులకు మంజూరిస్తున్నారు. టిడిపి నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సెగ్మెంట్లను గుర్తించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్రజలకు దగ్గరయ్యేం దుకు ఎస్‌డిఎఫ్ ఉపయోగిస్తున్నారు. విశాఖ జిల్లా అరకు వ్యాలీ వైసిపిది కాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎస్ సామా ఇచ్చిన ప్రతిపాదనలపై నిధులిచ్చారు. అలాగే మాడుగులలో టిడిపి మాజీ ఎమ్మెల్యే జి రామానా యుడు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, కర్నూలు జిల్లా పాణ్యం లో టిడిపి నేత ఏరాసు ప్రతాపరెడ్డి, కడప జిల్లా కమలా పురంలో మాజీ ఎమ్మెల్యే పి నర్సింహారెడ్డి, మైదుకూరులో టిడిపి నేత పి సుధాకర్ యాదవ్, రాయచోటిలో టిడిపి నేత ఆర్ రమేష్ కుమార్‌రెడ్డి ప్రతి పాదనలపై నిధులిచ్చారు. శ్రీశైలంలో మరీ విడ్డూరం. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిని శ్రీశైలం ఎమ్మెల్యేగా జీవోలో పేర్కొన్నారు. శ్రీశైలానికి వైసిపికి చెందిన బి రాజశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల వైసిపిది కాగా గుంటూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పనులు ప్రతిపాదించారు.
http://www.prajasakti.com/Content/1734566
ఇవేం సమీక్షలు బాబో!
– మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి
– అర్ధరాత్రి సమీక్షలపై అధికారుల ఆందోళన
– జిల్లా కేంద్రాలు వీడి కదల్లేకపోతున్న కలెక్టర్లు
– సెలవులు కూడా మర్చిపోతున్న చంద్రబాబు
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
చంద్రబాబు పాలన విధానంపై అధి కారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. అర్ధరాత్రి సమీక్షల వల్ల విశ్రాంతి లేకుండా పోతోందని వారు అంటున్నారు. ఇందువల్ల తమ పనులు కూడా తాము చేసుకోలేకపో తున్నట్లు వారు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కూడా జిల్లా కేంద్రాలకే పరిమితం కావాల్సి వస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పాలనలో వేగం పెరుగుతుందని అంతా భావించారు. ఆయన కూడా వరుస సమీక్షలతో అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. మొదట్లో ఇది పాలనలో వేగంగా అరతా భావించినప్పటికీ, తరువాత కాలంలో సమీక్షలు తప్ప పాలన కనిపించడం లేదన్న భావానికి అధికారులు వచ్చేస్తున్నారు. రోజుకు నాలుగైదు సమీక్షల్లో బాబు బిజీగా మారిపోతున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక భేటీలు, వీడియో కాన్ఫరెన్స్‌లు మరింతగా పెరిగిపోయాయి. ఇదే ఇప్పుడు అధికారుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. సెలవు రోజుల్లో కూడా బాబు సమీక్షలు తప్పడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సదస్సు తొలిరోజు రాత్రి 10.30 గంటల వరకు జరగ్గా, రెరడో రోజు సమావేశం అర్ధరాత్రి దాటేంతవరకు సాగడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయాల్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో మహా అయితే రాత్రి ఏడు గంటల వరకు జరిగేవి. అది కూడా ఒకరోజే నిర్వహించేవారు. ఇప్పుడు ఆ సదస్సులను రెండు రోజులకు పొడిగించడం, అది కూడా అర్ధరాత్రివరకు సాగదీస్తుండడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సెలవు రోజుల్లో కూడా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ సెలవు రోజులు కూడా ఇందుకు అతీతం కాదని తేలిపోతోంది. ఇది ఉద్యోగులు, అధికారులకు మింగుడు పడడం లేదు. అనునిత్యం నిర్వహించే సమీక్షల్లో కలెక్టర్లను కూడా భాగస్వాములుగా చేయడం, వారికోసం ప్రత్యేకంగా వీడియో కాన్ఫెరెన్సులు కూడా నిర్వహిస్తుండడంతో కలెక్టర్లంతా ఆ సమావేశాల్లో బిజీగా మారిపోతున్నారు. ఇరదులో భాగంగానే వారు జిల్లా ప్రధాన కేంద్రాలను వదిలివెళ్లేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి మాత్రం జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లాలని ఆదేశిస్తూనే వారిని సమీక్షలు, వీడియోకాన్ఫెరెన్స్‌లతో బిజీగా మార్చడంతో కలెక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే కొద్ది కాలంగా ముఖ్యమంత్రి పెడుతున్న సమావేశాలు, వీడియోకాన్ఫెరెన్స్‌లపై అధికారులంతా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాము సక్రమంగా తమ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వారంతా అంటున్నారు. నేరుగా చంద్రబాబుకు చెప్పే ధైర్యం, చొరవ లేకపోవడంతో వారంతా లోలోపలే మథన పడుతున్నారు. ముఖ్యమంత్రి తన సమీక్షలను తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తాము విధులు చేసుకునే సమయం ఇస్తే అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
http://www.prajasakti.com/Content/1734114