నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలుగుదేశం మాజీ ఎంపీపై చీటింగ్ కేసు
తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు, ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌రరావు పై కేసు న‌మోద‌య్యింది. సెక్ష‌న్ 420తో పాటు మ‌రికొన్నిసెక్ష‌న్ల కింద ఆయ‌న‌పై కేసు న‌మోద‌యిన‌ట్టు స‌మాచారం. సిబ్బందిని మోస‌గించిన కేసులో ఆయ‌న పై ఈ అభియోగాలు మోప‌బ‌డ్డాయి.

నామా నాగేశ్వ‌ర రావు కి చెందిన మ‌ధు కాన్ ఉద్యోగుల ఫిర్యాదుతోనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఉద్యోగుల పీఎఫ్ నిధులు కాజేసిన‌ట్టు వారి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. 2009 నుంచి వ‌సూలు చేసి దాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జ‌మ‌చేయ‌పోవ‌డంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దాంతో ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూళ్ల‌కు పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌ల‌పై పీఎఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం విచార‌ణ జ‌రిపింది. ఆరోప‌ణ‌లు రుజువు కావ‌డంతో మ‌ధుకాన్ సంస్థ చీటింగ్ కి పాల్ప‌డిన‌ట్టు రుజువ‌య్యింది.

దాంతో రంగంలో దిగిన పోలీసులు నామా నాగేశ్వ‌ర రావు స‌హా మ‌ధుకాన్ సంస్థ‌కు చెందిన మ‌రికొంద‌రిపై కూడా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తోంది. దాంతో వ్య‌వ‌హారం రాజ‌కీయంగా టీడీపీకి కొంత ఇబ్బందిక‌ర‌మే అని ఖ‌మ్మం టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. సిబ్బంది సొమ్ము కాజేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నించ‌డం పార్టీకి త‌ల‌నొప్పులు తెస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

http://updateap.com/?p=61745

TRS has every reason to be happy
http://www.thehindu.com/news/national/telangana/trs-has-every-reason-to-be-happy/article8052626.ece

5 Comments

Filed under Uncategorized

5 responses to “నూతన సంవత్సర శుభాకాంక్షలు

  1. Veera

    నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అని అడిగి మరి పెట్టించుకొనే ప్రిన్సిపాల్ ను ఆది సినిమాలో చూసాం!!!
    ఇప్పుడు నాకు న్యూ ఇయర్ విషెస్ చెప్పండని బస్సు ఏర్పాటు చేసే CM ను చూస్తున్నాం!!!
    [సి.ఎం. కు గ్రీటింగ్ చెప్పాలి-విజయవాడ రండి
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐఎఎస్ లు అబినందనలు తెలియ చేయడం కోసం ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళిన విషయంపై వచ్చిన కదనాలు ఆసక్తిగా ఉన్నాయి.ఎవరు ఇచ్చారో కాని హైదరాబాద్ లో ఉన్న ఐఎఎస్ లకు ఒక మెస్సేజ్ వచ్చిందట. ముఖ్యమంత్రిని కొత్త సంవత్సరం సందర్భంగా అబినందించేందుకు విజయవాడ బయల్దేరి రావాలని, అందుకోసం బస్ ను ఏర్పాటు చేశామని ఆ సందేశం సారంశం అట. ఇది చూసి ఐఎఎస్ లు ఆశ్చర్యం చెందారట. పిలిచి మరీ అబినందనలు చెప్పించుకుంటారా, ఇదేదో కొత్త సంప్రదాయంగా ఉందని వారు చమత్కరించుకున్నారు. ఇంతా బాస్ పెడితే అందులో వెళ్లింది ఆరుగురేనట. మరికొందరు విమానాలలోనే వెళ్లారట.ఈ ఖర్చైనా, ఆ ఖర్చు అయినా ప్రభుత్వానిదే కదా!
    http://kommineni.info/articles/dailyarticles/content_20160101_35.php?p=1451671398726 ]

  2. Veera

    ఛీ ఛీ ఛీ !!! ఎంత చీపో కదా!!!
    [సి.ఎం. కు గ్రీటింగ్ చెప్పాలి-విజయవాడ రండి
    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐఎఎస్ లు అబినందనలు తెలియ చేయడం కోసం ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళిన విషయంపై వచ్చిన కదనాలు ఆసక్తిగా ఉన్నాయి.ఎవరు ఇచ్చారో కాని హైదరాబాద్ లో ఉన్న ఐఎఎస్ లకు ఒక మెస్సేజ్ వచ్చిందట. ముఖ్యమంత్రిని కొత్త సంవత్సరం సందర్భంగా అబినందించేందుకు విజయవాడ బయల్దేరి రావాలని, అందుకోసం బస్ ను ఏర్పాటు చేశామని ఆ సందేశం సారంశం అట. ఇది చూసి ఐఎఎస్ లు ఆశ్చర్యం చెందారట. పిలిచి మరీ అబినందనలు చెప్పించుకుంటారా, ఇదేదో కొత్త సంప్రదాయంగా ఉందని వారు చమత్కరించుకున్నారు. ఇంతా బాస్ పెడితే అందులో వెళ్లింది ఆరుగురేనట. మరికొందరు విమానాలలోనే వెళ్లారట.ఈ ఖర్చైనా, ఆ ఖర్చు అయినా ప్రభుత్వానిదే కదా!
    http://kommineni.info/articles/dailyarticles/content_20160101_35.php?p=1451666982575%5D

  3. Veera

    గతం లో నేను ఎంతో అభి రుద్ది చేసాను-బాబు
    అందుకే వరుసగా 2004, 2009 లో ఓడించారు TDP ని.
    మీరు ప్రపంచ పటం లో పెట్టిన హైదరాబాద్ లో ఉన్న 15 అసెంబ్లీ లలో 2004 లో ఒక్క సీట్, 2009 లో సున్నా గెలిచింది TDP.
    2009-2014 మద్య 52 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సగం స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు TDP కి. అన్నీ ఓడిపోయింది TDP
    2014 లో కూడా ఓడిపోతాను అని తెలిసి మోడీ గడ్డం, పవన్ కాళ్ళు పట్టుకొని , రుణమాఫీ అని దొంగ హామీలతో అత్తెసరు మార్కులు 1.6% ఎక్కువ వోట్ల తో గెలిచావు బాబూ! గుంపులు గుంపులుగా వెళితేనే నీ పరిస్థితి అది బాబు!!!

    మీ సొంత నియోజక వర్గం చంద్రగిరి లో YCP MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచాడు , సొంత జిల్లా చిత్తూర్ లో ఎక్కువ సీట్లు YCP గెలిచింది, అలాగే ఎన్టీఆర్ సొంత నియోజక వర్గం గుడివాడ లో కూడా YCP MLA కొడాలి నాని చౌదరి గెలిచాడు .
    ఊరికే అన్నారా వినేవాడు వెర్రి బాబు అయితే సెప్పే వాడు సెంద్ర బాబు అని!!!

  4. Veera

    మంత్రి సురేష్ ప్రభు లా స్పందించాలి
    కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన మంత్రి పదవిని సద్వినియోగం చేశారని చెప్పాలి.బీహారులోని తన మామ గారి ఇంటికి వెళ్లి రైలులో బెంగుళూరు తిరిగి వెళుతున్న శంకర్ పండింట్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ చేసిన విజ్ఞప్తి కి వెంటనే స్పందించిన తీరు అబినందనీయంగా ఉంది.శంకర్ పండిట్ చిన్న కూతురుకు సడన్ గా అస్వస్థత సోకింది. ఏమి చేయాలో పాలుపోక ఆయన రైలు నుంచే రైల్వేశాఖ మంత్రిత్వ శాఖ ఖాతాలో ట్వీట్ చేస్తూ సాయం చేయాలని కోరారు. దానిని మంత్రి సురేష్ ప్రభు చూసి వెంటనే కోల్ కోతాలోని తూర్పు రైల్వే అదికారులను అప్రమత్తం చేశారు. అంతే క్షణాలలో శంకర్ పండిట్ కు పోన్ లు వచ్చాయి. తదుపరి స్టేషన్ వచ్చేసరికి అంబులెన్స్ సిద్దం చేశారు. ఆ తర్వాత పాపకు చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారని శంకర్ పండిట్ మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.ఈ విషయం దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చి మంత్రికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

  5. Veera

    చత్తీస్ గడ్ లో బిజెపికి ఎదురు దెబ్బ
    భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలైన చత్తీస్ గడ్ ,మధ్యప్రదేశ్ లలో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం మద్య ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ బాగా పుంజుకున్నట్లు వార్తలు వస్తే, చత్తీస్ గడ్ లో స్థానిక సంస్థలలో బిజెపకి గట్టి దెబ్బే తగిలింది.11 స్థానాలకు గాను ఏడు స్థానాలను బిజెపి కోల్పోవడం విశేషం.కాంగ్రెస్ పార్టీ నాలుగు కార్పొరేషన్లు, మూడు నగర పంచాయతీలను గెలుచుకోవడం విశేషం.మూడో టరమ్ లో ఉన్న బిజెపి పాలనలో కొంత అసంతృప్తి పెరుగుతోందని అనుకోవాలి.
    http://kommineni.info/articles/dailyarticles/content_20160101_14.php?p=1451623868140

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s