దాసరి తో జగన్ భేటి !!!

దాసరి తో జగన్ భేటి !!! 10TV
టీడీపీకి వ్యతిరేకంగా.. కాపులు సమైక్యమవుతున్నారా..? కాపుల మద్దతును కూడగట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారా..? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌హాట్‌గా జరుగుతున్న చర్చ ఇది. కొంతకాలంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా కాపులు నిరసన గళం వినిపిస్తుండడం.. ఇవాళ దాసరి నారాయణరావు ఇంటికి జగనే స్వయంగా వెళ్లి మంతనాలు సాగించడం.. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే సంభవించే కీలక మార్పులకు సంకేతమన్న ప్రచారం జరుగుతోంది.
కాపులు టీడీపీకి పూర్తిగా దూరమవుతున్నట్లేనా..?
కాపుల్లో అసంతృప్తిని జగన్‌ క్యాష్‌ చేసుకుంటున్నారా..? వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జగన్‌ పావులు కదుపుతున్నారా..? అందుకే దాసరి నారాయణరావును కలిశారా..?
కాపు కమిషన్‌ ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు….
అన్ని ప్రశ్నలకూ అవుననే సమాధానమే వస్తోంది. గత ఎన్నికల్లో కాపులు తెలుగుదేశం పార్టీని భుజానికెత్తుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అనూహ్య విజయాన్ని అందించారు. అప్పట్లో కాపులను బీసీల్లో చేరుస్తామని.. కాపుల అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, ఏటా వెయ్యి కోట్ల రూపాయలను కేటాయిస్తానని.. చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. దీనికి పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాక్టర్‌ కూడా పనిచేసింది. తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను చంద్రబాబు పరిష్కరిస్తారన్న నమ్మకంతో.. కాపులు గంపగుత్తగా టీడీపీకి ఓట్లేశారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. టీడీపీయే ఊహించని రీతిలో.. అన్ని స్థానాల్లోనూ ఆపార్టీ అభ్యర్థులనే గెలిపించార ఓటర్లు.
మరో ఉద్యమానికి సన్నద్ధమైన ముద్రగడ పద్మనాభవం…..
ఎన్నికలై అధికారం చేపట్టాక.. చంద్రబాబు కాపుల సమస్యపై పెద్దగా స్పందించింది లేదు. దీంతో ముద్రగడ పద్మనాభం మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహించాలనీ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించరాదంటూ సెక్షన్‌ 30 కింద ఆంక్షలు విధించింది. దీంతో కాపులు మరింతగా రగులుతున్నారు. తెలుగుదేశం అధినేత తమను నమ్మించి వంచించాడన్న భావనలో ఉన్నారు. ఈ తరుణంలో కాపుల్లోని అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. జగన్‌ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారని భావిస్తున్నారు.
టీడీపీకి కాపులకు మధ్య సంధానకర్తగా పవన్‌ కల్యాణ్‌……
టీడీపీకి కాపులకు మధ్య సంధాన కర్తగా.. అదే వర్గానికి చెందిన పవన్‌ కల్యాణ్‌ వ్యవహరిస్తున్నారు. కానీ కాపుల సమస్యపై గానీ.. రాజధాని భూముల సేకరణ అంశంపై గానీ.. పవన్‌ ఇటీవల ఉదాసీనంగా ఉన్నారు. దీంతో.. ఆయనపైనా ప్రజల్లో ముఖ్యంగా కాపుల్లో అసహనం ఉందని భావిస్తున్న జగన్‌.. దాసరిని అస్త్రంగా వాడుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సెక్షన్‌ 30 ప్రయోగంపై కాపుల్లో ఆగ్రహం…….
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు సభ నిర్వహించకుండా.. సెక్షన్‌ 30 కింద ప్రభుత్వం ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను జరిపి తీరతామని కాపు నేతలు.. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం లాంటి వారు ప్రకటిస్తున్నారు.

తెరవెనకేనా?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దూరంగా అధినేత!
తముళ్ళకు స్పష్టం చేసిన బాబు
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బాబు ప్రచారం సందిగ్డం
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండక తప్పని పరిస్థితి
ఏమి చేయాలో అర్థంకాక అయోమయంలో తముళ్ళు
టీఆర్ఎస్‌తో పెటుకుంటే ఇబ్బందులు తప్పవనుకుంటున్న బాబు!
http://www.suryaa.com/news/regional/article.asp?contentId=232069

5 Comments

Filed under Uncategorized

5 responses to “దాసరి తో జగన్ భేటి !!!

 1. Veera

  From Koppara Gandhi, Vizag
  కొత్త సంవత్సరం కదాని గత వారమంతా పలువుర్ని కలిసి, కొందరికి ఫోన్ చేసి, శానా విషయాలు మాట్లాడా..అందులో వివిధ అంశాలపై అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి..అవి ఎలా ఉన్నాయంటే..

  ఆటో అప్పల్రాజు : గవర్మెంట్ పెద్దగా ఏం బాలేదన్నా..అంతా పటాటోపమే…

  టీ దుకాణం దాలిరాజు: ఏటో బాసూ అంతా అయోమయంగా ఉంది..పేపర్లలో అయితే వార్తలు అహో ఒహో అని అదరగొడుతున్నారు..బయట చూస్తే అంతా అస్కా మస్కాగా ఉంది

  సీనియర్ తహశీల్దార్ : నా ఉజ్జోగం నేనే చేస్తున్నానా లేదా… ఒక్కోసారి ఇంకెవరో చేస్తున్నారా అనిపిస్తోంది.

  ఎక్సైజ్ సూపరింటెడెంట్: చాలా సిన్సియర్ గా ఉజ్జోగం చేయమంటారు. ఏదో షాపుమీద రైడ్ చేయగానే ఫోన్లమీద ఫోన్లు…..ఏం చేస్తాం..

  డిప్యూటీ కలెక్టర్(ఆర్టీవో): హహహ వేదికలపైన మాటలకు కింది స్థాయిలో చేతలకు పొంతనెక్కడుంది గురూ…ఎంతసేసూ సర్వేలూ..రివ్యూలూ…అన్ ప్రొడక్టివ్ వర్క్… నో ప్రాగ్రెస్..జనమూ అదే అంటున్నారుగా..

  డీఎస్పీ: మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరో హైజాక్ చేసిన ఫీలింగ్ ఉంది తమ్ముడూ..చూద్దాం..ఏమవుద్దో.. గవర్నమెంట్ బాలేదన్న ఫీలింగ్ జనంలో ఉంది

  సీనియర్ ఐయ్యేఎస్: గవర్నెన్స్ కంప్లీట్లీ స్పాయిల్డ్…అమరావతి మినహా మిగతా ఎక్కడా ఏం జరగడం లేదుగా..దాన్ని చూపి కథ నడుపుతున్నారు.. పాతికేళ్ల అనుభవంతో చెబుతున్నా..డామేజీ అవుద్ది..

  జూనియర్ అయ్యేఎస్: నేను దేవుడ్ని అన్న భ్రమలోంచి జగన్ బయటకు వస్తే…తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది..

  టీడీపీ ఎమ్మెల్యే: ఏం చెప్పమంటావ్ తమ్ముడూ..చాలా ఖర్చు పెట్టేశా…ఏదో చేసి రికవరీ చేయకపోతే మునిగిపోతా..ఇప్పటికే అప్పుల్లో ఉన్నా..తప్పడం లేదు మరి

  టీడీపీ ఎంపీపీ : మా ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల మీద నమ్మకం లేదు..అందుకే ఉన్నంతలో సర్దుకుంటున్నాడులే..మరేం అనకు..

  ఉద్యోగ సంఘం నేత: సర్కారును ఎవరో వెనక నుండి నడుపుతున్నట్లుంది…ఏదో తేడా మాత్రం జరుగుతోంది…జగన్ అందర్నీ కలుపుకుని వెళితే తిరుగుండదు..అలా కాకుండా తన చేయిపడితే చాలు గెలిచేస్తారు అన్న భ్రమల్లో ఉంటే మరి కోలుకోలేడు..

  • Veera

   Koppara Gandhi
   30 December 2015 at 11:20 ·
   మొన్నొకరోజు విజయవాడ వెళ్లా….బస్టాండ్లో కనిపించిన ఓ పెద్దాయన దగ్గరకెళ్లి
   సార్..అమరావతికి ఎలా వెళ్లాలి? అని అడిగా…… దానికాయన ఒరిజినల్ అమరావతా? డూప్లికేట్ దా? అన్నాడు..అదేంటి సార్ అలా అనేశారు అన్నాను..దానికాయన ఒరిజినల్ అమరావతైతే గుంటుర్ జిల్లాలో ఉంది బస్సులో పోవాలి…మన నాయుడు గారు కడుతున్న డూప్లికేట్ చైనా మోడల్, గ్రాఫిక్స్ అమరావతైతే పక్కనే ఉంది..ఆటోలో వెళ్లొచ్చు అన్నాడు చిరాగ్గా…

 2. Veera

  కుల మీడియా పచ్చ పాతం
  CBI మాజీ డైరెక్టర్ విజయ రామా రావు TDP లో చేరినప్పుడు ఆహా ఓహో ఆయనలాంటి మేధావులు TDP లో చేరారంటే బాబు ఎంత గొప్పవాడో కదా అని వ్రాసాయి, ఇప్పుడు అదే విజయ రామా రావు TRS లో చేరితే అసలు పట్టించుకోలేదు ,కెసిఆర్ గొప్పోడు కాబట్టే చేరాడు అని చెప్పలేదు.
  మన పార్టీ లో చేరితే గొప్పోల్లు మరి!!!

 3. Veera

  మాజీ కర్ణాటక CM ఎడ్యూరప్ప పై కేసులన్నీ కొట్టివేశారు
  నేతలపై వచ్చే కేసులు భలే తమాషాగా ఉంటాయి. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్పపై వచ్చిన కేసులను హైకోర్టు కొట్టివేసింది.ఎడ్యూరప్ప రాజకీయ జీవితాన్నే మార్చి వేసిన ఆ కేసులు ఇప్పుడు లేకపోవడం విశేషమే.తన కుటుంబ సభ్యులకు పారిశ్రామికవాడలో భూముల డీనోటిఫికేషన్ చేశారన్న అబియోగం పై కేసులు నమోదయ్యాయి. లోకాయుక్త ఈ కేసులను అప్పట్లో విచారించింది. ఈ కేసుల కారణంగా ఆయన జైలుకు వెళ్లవలసి వచ్చింది.ముఖ్యమంత్రి పదవిని వదలుకున్నారు. హైకోర్టు జడ్జి రత్నకళ ఈ కేసులను విచారించి వాటిని కొట్టివేయడం విశేషం. ప్రస్తుతం బిజెపిలోనే ఎమ్.పిగా ఉన్న ఎడ్యూరప్పపై అప్పట్లో పెట్టిన పదిహేను కేసులు పోయినట్లే
  http://kommineni.info/articles/dailyarticles/content_20160106_21.php?p=1452063191444%5D

 4. Veera

  ‘సుజ‌నా’ స్ట్రింగ్ ఆప‌రేష‌న్?: టీడీపీలో క‌ల‌క‌లం
  టీడీపీలో క‌ల‌క‌లం రేగుతోంది. నిఘా వ్య‌వ‌హారం ఇప్పుడు తీవ్ర దుమారం దిశ‌గా సాగుతోంది. పార్టీ నేత‌ల‌పైనే ప్రైవేటు నిఘా పెట్టార‌న్న ప్ర‌చారం చాలామంది నేత‌ల్లో క‌ల‌వ‌రం క‌లిగిస‌తోంది. కేంధ్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి ఇందుకు సాహ‌సించిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాల్లో వార్త‌లు గుప్పుమంటున్నాయి. పార్టీలో త‌న‌కు ప్ర‌త్య‌ర్థుల‌కుగా భావిస్తున్న నేత‌ల చుట్టూ ఈ నిఘా సాగిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

  అయితే సుజ‌నా చౌద‌రి తీరుపై గుట్టుగా చ‌ర్చించుకుంటున్న నేత‌లు చంద్ర‌బాబు వ‌ద్ద విష‌యాన్ని ప్ర‌స్తావించి, త‌మ గోడు వెళ్ల‌బోసుకోవ‌డానికి మాత్రం వెనుక‌డుగు వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. బాబుతో సుజ‌నాకి ఉన్న సాన్నిహిత్యంతో మ‌ళ్లీ వారి మెడ‌కు చుట్టుకుంటుంద‌న్న ఆందోళ‌న వారిని వెంటాడుతోంది. అందులోనూ నారా లోకేష్ కి అత్యంత ద‌గ్గ‌రగా ఉండే నేత‌ల్లో ఈ కేంధ్ర‌మంత్రి ఒక‌రు కావ‌డంతో చిన‌బాబు ఆదేశాల‌తోనే ఇలాంటి నిఘా కొన‌సాగుతుంద‌న్న అనుమానాలు కూడా వ్య‌క్తం చేస్తున్నారు.

  ఇటీవ‌లే సుజ‌నా గ్రూపు సంస్థ‌ల‌పై ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), కేంద్ర ఆర్థిక శాఖలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనపై ఫిర్యాదులు చేస్తున్నవారెవరనే విషయంపై ప్రతిపక్షాలపై కంటే స్వంత పార్టీ నాయకులపైనే మంత్రికి అనుమానం అధికమైంది. అవినీతి ఆరోపణలపై తన మంత్రి పదవి ఊడితే పార్టీలో ఎవరెవరు రేస్‌లో ఉంటారు? చంద్రబాబుకు ఎవరు బాగా సన్నిహితంగా ఉంటున్నారు? అని అనుమానించి ఆ నేతల లక్ష్యంగా ప్రైవేటు డిటెక్టివ్‌లతో విచారణ జరిపిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

  ఈ వ్య‌వ‌హారం న‌డ‌ప‌డానికి దేశంలోనే పేరెన్నికగన్న ఒక ప్రముఖ ప్రైవేటు టిటెక్టివ్‌ ఏజెన్సీని రంగంలోకి దించారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆ సంస్థకు ముంబయి, బెంగళూరులో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక కాంప్లెక్స్‌లో ఆ డిటెక్టివ్‌ ఏజెన్సీ ఆఫీస్‌ నిర్వహిస్తోంది. సదరు మంత్రిపై మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలకు ఉప్పు అందిస్తున్న వారెవరో పసిగట్టడం, ఆయన వ్యాపారాలు, ఇతర అంశాలపై పనిగట్టుకొని కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్న వారెవరో నిర్ధరించడం డిటెక్టివ్‌ ఏజెన్సీకి ఇచ్చిన ముఖ్యమైన అసైన్‌మెంట్‌గా తెలుస్తోంది. టిడిపికి చెందిన సీఎం ర‌మేష్, గరిక‌పాటి రామ్మెహ‌న్ రావు తో పాటు , ఢిల్లీలో ఎపి వ్యవహారాలు చూస్తున్న కంభంపాటి , అలాగే రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నట్టు ప్ర‌చారంలో ఉన్న ఆంధ్ర‌జ్యోతి అధినేత రాధాకృష్ణ పై కూడా ఈ దర్యాప్తు జరుగుతున్న‌ట్టు స‌మ‌చారం.

  తనకు హాని తలపెట్టిన, తనను రాజకీయంగా, వ్యాపారపరంగా దెబ్బ తీస్తారని భయపడుతున్న ఆ నలుగురితో పాటు మరి కొందరు అనుమానితులపైనా దర్యాప్తు చేయిస్తున్నారు. అనుమానితుల వ్యాపారాలపై అనుక్షణం నిఘా వేసి చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అందుకు ప్రైవేటు ఏజెన్సీకి లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రైవేటు విచారణ విషయం బయటికి పొక్కడంతో టిడిపిలో ఆందోళనలు బయలుదేరాయి. పార్టీ వ‌ర్గాల్లో దీనికి సంబంధించిన ప్ర‌చారం సాగుతుండ‌డంతో ఏ నాయ‌కుడు కూడా మ‌రొక‌రిని విశ్వ‌సించే ప‌రిస్థిత క‌నిపించ‌డం లేదు.
  http://updateap.com/?p=62334

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s