రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించిన 22వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ప్రవాహం చూస్తే కళ్ళు తిరగాల్సిందే. మొదటి రోజు ఒక లక్షా 92 వేల 571 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన 281 ఎంఓయులు (అవగాహనా ఒప్పందాలు), మలి రోజున 3 లక్షల 88 వేల 28 కోట్ల విలువైన 313 ఎంఓయులు , ముగింపు రోజున కుదిరిన ఒప్పందాలతో కలిసి మొత్తంగా రూ 4లక్షల 67 వేల577 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు చెబు తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న కాలంలోే ఇదే సిఐఐతో కలిసి ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో నాలుగు భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ తరువాత ఏం జరిగింది? ఎన్ని కార్యరూపం దాల్చాయి? దీనికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఈ తొలి సదస్సులో అమెరికా, చైనాతో సహా 41 దేశాల నుంచి 1600 మంది దాకా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు తరలిరావడంతో ఇది సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఎంఒయులన్నీ కాకపోయినా, వీటిలో సగం కార్యరూపం దాల్చినా, ముఖ్య మంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లుగా రాష్ట్రం 2029 నాటికల్లా దేశంలో నెంబర్ వన్‌గా నిలవొచ్చు. విభజన తరువాత ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవాలన్నదే అయిదు కోట్ల మంది ఆంధ్రుల ప్రగాఢ ఆకాంక్ష. అది నెరవేరితే సంతోషమే. కానీ, ఈ పేరుతో ప్రస్తుతం సాగుతున్న ప్రచారమే విస్తు గొలుపుతోంది. గత ఆరు దశాబ్దాలలో ఆకర్షించలేని పెట్టుబడులు కేవలం ఈ మూడు రోజుల్లోనే సాధించేసినట్లు, వద్దంటే ఉద్యోగాలు వచ్చిపడిపోతున్నాయన్నట్లుగా ప్రచారం హోరెత్తుతోంది. ఇది ఒక రకంగా ప్రజలను పరిహసించడమే. ఉపాధి కల్పనపై ఈ ప్రభుత్వానికి నిజంగా అంత శ్రద్ధే వుంటే వేల సంఖ్యలో వున్న ఉద్యోగ ఖాళీలను ఏనాడో భర్తీ చేసివుండేది. 2015 జవనరిలో జరిగిన వైబ్రాంట్ గుజరాత్ సదస్సులోను, ఆ తరువాత రాజస్థాన్‌లోని జైపూర్ సదస్సులోను, ప్రస్తుతం విశాఖకు సమాంతరంగా జరిగిన కొల్కతా బిజినెస్ సదస్సులోనూ పాల్గొన్న ఇదే అంబానీలు, బిర్లాలు, రహేజాలు, గోద్రెజ్‌లు అక్కడ కూడా లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఒయులపై సంతకాలు చేశారనే విషయం మరచిపోరాదు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయకుండా, కొత్త ఎంఒయులు కుదుర్చుకోవడం వాటికి అలవాటే. లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి తీసుకుని ఎగ్గొట్టిన బడా కంపెనీలు కూడా భాగస్వామ్య సదస్సులో దర్జాగా పాల్గొన్నాయి. వాటి చరిత్ర తెలిసి కూడా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన ప్రభుత్వం, కార్పొరేట్లను ఖుషీ చేసేందుకు కైలాస్గిరిపైన ఖరీదైన విందులు, నృత్యాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే నీరు, భూమి, సహజవనరులు ఎంత కావాలంటే అంత సమకూర్చుతామని, నిపుణత గల లేబర్‌ను కారుచౌకగా అందిస్తామని, పన్నుల్లో రాయితీలు కల్పిస్తామని, 21 రోజుల్లో అన్ని రకాల అనుమతులు లభించేలా చూస్తామని చెప్పింది. కార్పొరేట్లకు దండిగా లాభాలొచ్చేలా చూసేందుకు లక్షలాది మంది చిల్లర వ్యాపారుల పొట్ట గొట్టేందుకు కూడా సిద్ధపడింది. చిల్లర వర్తక రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇన్ని గ్యారంటీలు ఇచ్చినా వారిపై ముఖ్యమంత్రికి నమ్మకం కుదరలేదేమో! భాగస్వామ్య సదస్సును వీడి వెళ్లే ముందు రాష్ట్రంలో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెడతారో స్పష్టమైన ఫిగర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరారు. దీంతో ఎవరికి తోచిన అంకెలు వారు చెప్పి చల్లగా జారుకున్నారు. కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన ఈ అంకెలను, కుదుర్చుకున్న ఎంఓయులను చూసి రాష్ట్ర ప్రభుత్వం తెగ మురిసిపోతోంది. వారు ప్రకటించిన పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఏమేరకు తోడ్పడతాయన్నది ఒక ప్రశ్న. దేశీయ, విదేశీ కంపెనీల ప్రతినిధులు ప్రకటించిన పెట్టుబడుల్లో చాలావరకు ఇప్పటికే రాష్ట్రం మిగులు సాధించిన విద్యుత్ రంగానికి సంబంధించినవే. ఆ తరువాత రియల్ ఎస్టేట్, పర్యాటక రంగాలపై అవి దృష్టి పెట్టాయి. కార్పొరేట్ కంపెనీలు భూములను కారు చౌకగా లీజుకు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడానికి తప్ప రాష్ట్ర పారిశ్రామికా భివృద్ధికి తోడ్పడేది కాదు. ప్రభుత్వ రంగంలో ఖాయిలా పడిన పరిశ్రమలను పున రుద్ధరించడం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం వంటి విధానా లను చేపట్టడానికి బదులు కార్పొరేట్లపై మితిమీరి ఆధారపడడం వల్ల ప్రయో జనం వుండదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పరిశ్రమలు, పెట్టుబడుల కోసం పోరాడకుండా కార్పొరేట్ల వెంట పరుగు తీసే ఈ ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రానికి ఒనగూరేదేమీ వుండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయం గ్రహించాలి.
http://www.prajasakti.com/EditorialPage/1742034
భాగస్వామ్య సదస్సు
Filed under Uncategorized
2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో YCP పోటీ చేయడంలేదు
(మాకు బలం లేదు అని 2009 గ్రేటర్ ఎన్నికల్లో TRS పోటీ చేయలేదు)
1.గ్రేటర్ హైదరబాద్ లో TDP కి పడే కొద్ది వోట్లు కూడా రేవంత్ రెడ్డి ని చూసే కాని బాబును చూసి కాదు-కాంగ్రెస్ MLC చెంగలరాయుడు
2.వోటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న బాబు జైలు భయముతో కెసిఆర్ తో కుమ్మక్కయ్యాడు అందుకే కెసిఆర్ ను ఏమీ అనడు-మంద కృష్ణ మాదిగ
3.కెసిఆర్ ను బాబు విమర్శించకపోవడం TDP కి కొంత మేర నష్టమే-BJP రఘునందన్
-NTV KSR లైవ్ షో ,జనవరి13,2016
నేను ఎక్కడికీ పోలేదు. ఇక్కడే ఉన్నాను-హైదరబాద్ సభలో బాబు
(రెండు కాళ్ళను నమ్ముకున్నారు మీకు తిరుగేంటి బాస్ ???)
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్
మోడీ గడ్డం పవన్ కాళ్ళు పట్టుకొని దొంగ వాగ్దానాలతో కేవలం 1% వోట్ల తో గెలిచాడు బాబు
-C రామచంద్రయ్య , MLC