నిలువు దోపిడీ

అవకాశం దొరికిందే తడవుగా ప్రజలను ప్రైవేటు బస్సు ఆపరేటర్లు నిలువుదోపిడీ చేస్తున్న తీరు దుర్మార్గం!
ప్రైవేటు బస్సు ఆపరేటర్లు బరి తెగించిన తీరు ఆందోళన కలిగిస్తోంది. బస్సు ఛార్జీలను అమాంతం మూడు నుండి నాలుగు రెట్లు ఇష్టారాజ్యంగా పెంచేశారు.

పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో కార్పొరేట్‌ శక్తులది కీలకపాత్ర అన్నది కాదనలేదని సత్యం! విద్య, వైద్య రంగాలతో పాటు రవాణా రంగంలోనూ ఆధిపత్యం వహిస్తున్న ప్రైవేటు శక్తులు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నాయి. విధాన నిర్ణయాల్లో భాగస్వాములవుతున్నాయి. ఈ పరిణామం ఆకస్మికంగా వచ్చిందేమీ కాదు! ఎప్పటినుండో అధికారంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న కొన్ని శక్తులు ఇటీవల విజృంభించాయి.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా హైదరాబాద్‌ వంటి దూరప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ఓటర్లను తరలిం చడంతో బాహాటంగా వెల్లడైన ఈ సంబంధం ఆ తరువాత మరింత వికృత రూపం దాల్చింది. అధికార పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి బస్సు ప్రయాణంలో రాయితీ ఇస్తున్నట్లు కొందరు ఆపరేటర్లు ప్రకటించడం, దానిని ఇప్పటికీ కొనసాగిస్తుండటం దీనికో నిదర్శనం. ఈ భారమంతా ఇప్పుడు సాధారణ ప్రజలపై పడుతోంది. సొంత పార్టీ కోసం అంత చేస్తున్న వారి కోసం ఎంతో కొంత చేయాలిగా! ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమూ అదే! నడిరోడ్డు మీదే నిలబెట్టి నిలువుదోపిడీ చేస్తున్నా, నిబంధనలకు వ్యతిరేకంగా పైశాచిక వసూళ్లకు దిగుతున్నా చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వంలో చక్రం తిప్పే నేతలే అడ్డగోలుగా అక్రమాలకు దిగుతూ, అదేమని ప్రశ్నిస్తే అంతు చూస్తా మని రంకెలేస్తుంటే నిలువరించే ధైర్యాన్ని ఏ అధికారి మాత్రం చూపగలరు?

పాలనను అజమాయిషీ చేస్తూ మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలే అడ్డగోలు వసూళ్లకు పచ్చజెండా ఊపి, అండగా నిలుస్తుంటే వారి అజమాయిషిలో నడిచే సంస్థలూ మరో విధంగా ఎలా ఆలోచించగలుగుతాయి?

http://www.prajasakti.com/EditorialPage/1742507

8 Comments

Filed under Uncategorized

8 responses to “నిలువు దోపిడీ

 1. Veera

  అమ్మతోడు,సినిమా మద్యలో లేచి ఎవరు బయటకి వచ్చినా వేసేస్తా బాబాయి-అబ్బాయ్
  ఒకటి మొత్తం సినిమా చూసినా నీకే డేంజర్ మద్యలో లేసి వచ్చినా నీకే డేంజర్-బాబాయ్

 2. This is what happens when there is no unity among Indians on foreign land .
  Kulalu……Mathalu ani India lona champuku chasthundhi chalaka
  USA lo ..Tana ….thandhana anukuntu brathikitha ….result ila na vuntundhi ?

  http://www.sakshi.com/news/international/in-indian-grandfather-assault-judge-throws-out-case-against-alabama-cop-305422?pfrom=home-top-story

 3. Veera

  కేక పోస్ట్ from Ramesh Adusumilli
  11 January at 04:40 ·
  పోయిన సంవత్సరం డిసెంబర్ లో సెలవు మీద వెళ్లి ఈ సంవత్సరం జనవరిలో వచ్చా. సరిగ్గా వార్తలు ఫాలో అయ్యి చాలా రోజులయింది. ఈ మధ్య కాలంలో జరిగిన వాటి మీద కొంచెం నన్ను అప్డేట్ చెయ్యండి తమ్ముళ్ళు.

  1) రైతు రుణ మాఫీ చేసేసారా? చేసే ఉంటారులే, మరి వాగ్దానం చేసింది ఎవరు అనుకున్నారు!

  2) డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ చేసేసారా? ఇదీ చేసే ఉంటారు. మాట ఇస్తే తప్పే మనిషా ఏమిటి ఆయన!

  3) ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించేసారా? ఇచ్చే ఉంటారు, లేకపోతే నెలకు 2000 రూపాయల భ్రతి అన్నా అందుతూ ఉండాలి. యువత మీద ప్రేమ ఉన్నాయన కదా!

  4) మహిళల మీద దాడులు ఆగిపోయాయా? ఆగే ఉంటాయి. ఆ కాల్ మనీ నిందితుల్ని, మహిళాధికారి మీద దౌర్జన్యం చేసిన ఎం.ఎల్.ఎ ని జైలులో పెట్టి కఠినశిక్షలు వేసి ఉంటారు. ఆయన అసలే నిప్పు కదా!

  5) పోలవరం పనులు ఊపందుకున్నాయా? అందుకునే ఉంటాయిలే. మన రాష్ట్రానికి సంజీవని అయిన ఆ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చెయ్యకుండా ఉంటాడా ఈ విజనరీ!

  6) ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజి వచ్చేసాయా? వచ్చే ఉంటాయిలే. ఈయన్ని చూసే రాజకీయం నేర్చుకున్న ఈయన భాగస్వామే కదా అక్కడ ప్రధానమంత్రి.

  7) పట్టిసీమ నీళ్ళు రాయలసీమ చేరిపోయాయా? చేరే ఉంటాయి. ఏదైనా అనుకుంటే బుల్లెట్లా దూసుకు పోయే మనిషి కదా ఆయన!

  8) అమరావతిని సింగపూర్, అక్కడి రోడ్లని జపాన్ ఉచితంగా కట్టేస్తున్నారా? కట్టేస్తూనే ఉంటారు, అసలు ప్రపంచ దేశాలన్ని అక్కడే ఉండి ఉంటాయి. మరి ఆయన ప్రపంచ దేశాల నాయకుడు కదా!

  9) మంత్రులు, అధికారులు అందరు కష్టపడుతున్నారా? మామూలుగానేంటి క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తూ ఉండి ఉంటారు. మరి ఆయన అడ్మినిస్ట్రేటర్ కదా!

  10) అవినీతి పూర్తి గా ఆగిపోయిందా? ఆగే ఉంటుంది. ఆయన నిద్రపోయేదే అవినీతిపరుల గుండెల్లో కదా!

  11) డిల్లి నుంచి రావలసిన నిధులు వస్తున్నాయా? ఇంకా ఎక్కువే వస్తూనే ఉంటాయి. మరి ఆయన చాణుక్యుడు కదా!

  12) ఆంధ్ర మీద అప్పుల భారం తగ్గించారా? తగ్గే ఉంటుంది. ఆయనకి దుబారా అంటే అసలు ఇష్టం ఉండదు. ఎకనామిస్ట్ కదా!

  పైన వాటిలో ఏ ఒక్కటి జరక్కపోయినా, ఆయన్నే నాయకుడు అనే పొగిడేవారు ఉన్నారా? ఉండి ఉండరు. అందరికి రాష్ట్రాభివ్రిద్ధి కన్నా ముఖ్యమైనది మరేది లేదు కదా!

 4. Veera

  సంక్రాంతికి ఊర్లకు వెళ్ళిన మిత్రులకు మనవి!!!
  బాబు పాలన, అలాగే మోడీ గురించి ప్రజలను అడిగి తెలుసుకోండి
  ముక్యంగా బాబు పాలన లో అవినీతి కులప్రీతి రుణమాఫీ, రైతు సమస్యలు నిరుద్యోగ సమస్య…. లాంటి విషయాల మీద ప్రజలను అడిగి తెలుసుకోండి.

 5. Veera

  ఆయనొచ్చాడు మరి…
  [No festive mood in West Godavari this Sankranti
  Tanuku/Eluru: Sankranti, the festival that brings joy to farmers and business communities alike, failed to cheer the communities. Once celebrated on a large with fervor lasting three days (from Bhogi to Kanuma), the festival is fading out in rural areas and towns. Apart from the State government sponsored Sankranti Sambaralu, celebrations are largely subdued and business has been dull in the West Godavari region.

  While the district headquarters, Eluru registered second dull season on the trot, the situation is more or less the same in Tanuku, Nidadavole, Kovvuru, Narsapuram and other towns. Tanuku lacked the festive spirit. With no disposable income among farmers, wo are the majority in the town, the business has been largely dull. Mohammad Azam, owner of Jeans Gallery said, “We have invested lot of money for new varieties of clothes in view of this Pongal season.

  But, the sales are nowhere near expectations. Customers are hardly stepping in and stock hasn’t moved an inch. We have to pay the bonuses and salaries from our reserve cash.” Tailors, fruit merchants are also on the same boat. Babu Rao, a tailor in Tanuku town said, “We always look forward for this season and used to engage four to five workers. Now the workers have no work.” As far as the rural areas are concern, the festival mood hasn’t set in. The farmers are in distress due to losses in cultivation.

  In Eluru, the business is going on a dull note. Though the sales have picked up from Tuesday in the city for the cloth merchants, it is nowhere near their expectations. “We are unable to pinpoint the reason for the dull sales,” said Krishna Mohan, a cloth merchant. Another cloth merchant Satyanarayana said “We announced offers like one plus one. But the response is average. Online business is also one of the reasons besides no cash reserves among farmers and workers.”

  The situations more or less the same in other business “During this period, we used to have gala sales. But, when compared to last year, the business is dull,”said Y Srinivas, a furniture shop owner.

  http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-01-13/No-festive-mood-in-West-Godavari-this-Sankranti/200120%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s