అనంతలో పెన్షన్ కోసం వృద్ధుల వెతలు..10TV

అనంతపురం : ఏపీ రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ లు పెంచిన ఘనత తమదే..వారికి ఎలాంటి సమస్యలు రాకుండా పెన్షన్ లు ఇస్తున్నామంటూ బాబు సర్కార్ గొప్పలు చెప్పుకొంటుంటుంది. కానీ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇది అంతా శుద్ధ అబద్ధమని నిరూపిస్తోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సోమవారం భారీ సంఖ్యలో వృద్ధులు చేరుకున్నారు. తమకు పెన్షన్ రావడం లేదని, నెలల పాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారు కనికరించడం లేదని వారు వాపోయారు. శరీరం సహకరించక..కర్ర సాయంతో వీరంతా అక్కడకు చేరుకున్న పరిస్థితిని చూసిన వారికి హృదయాలు చలించిపోయాయి. గ్రీవెన్స్ సెల్ కు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా జిల్లాలో వృద్ధులకు సరియైన విధంగా పెన్షన్ లు అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కుంటిసాకులు చెబుతూ వీరికి పెన్షన్ లు అందచేయడం లేదని తెలుస్తోంది.
వీరి పెన్షన్ లను అధికార పార్టీకి చెందిన వారు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఇప్పటికైనా ఈ వృద్ధుల పట్ల ఏపీ ప్రభుత్వం కనికరం చూపిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

http://www.10tv.in/content/Old-people-waiting-for-pension-at-Anantapur-AP-29134

సమైక్య ఉద్యమ కేసులో వైసిపి ఎమ్మెల్యే అరెస్టు
సమైక్య ఉద్యమంలో పాల్గొన్న సమయంలో అప్పట్లో పోలీసులు పెట్టిన కేసును ఆధారంగా చేసుకుని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని మరోసారి పోలీసులు అరెస్టు చేశారు.పైగా ఈయనను నెల్లూరు కోర్టుకు తీసుకువెళ్లి రిమాండ్ తీసుకున్నారు.చెవిరెడ్డి భాస్కరరెడ్డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు నాయుడు అదికారంలోకి వచ్చాక సమైక్య ఉద్యమ కేసులను ఎత్తివేస్తామని ప్రకటించారని, కాని ఇప్పుడు తనను అరెస్టు చేయడం ఏమిటని చెవిరెడ్డి ప్రశ్నించారు. తెల్లవారుజామున చెవిరెడ్డిని అరెస్టు చేయడం గమనించదగిన అంశమే. సమైక్య ఉద్యమంలో కేసులు ఉంటే మిగిలినవారి విషయంలో ఎత్తివేస్తారు కాని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలపై కాదన్నమాట.

http://kommineni.info/articles/dailyarticles/content_20160118_36.php?p=1453191237781

9 Comments

Filed under Uncategorized

9 responses to “అనంతలో పెన్షన్ కోసం వృద్ధుల వెతలు..10TV

 1. Are these caste fanatics human beings ?? – JAGAN

  Kula gajj …..Dhana picch tho Manava viluvalanu manta kalupthunna konni cheeda purugulu.
  It s everyone responsibly to expose this Weed destroying the society.

 2. YS Fan

  ప్రశ్నిస్తా అన్న నాయకుడు దళిత విద్యార్ధి ఆత్మహత్య పై ప్రశ్నించాడా?విద్యార్దులంతా చందాలు వేసుకుని ప్యాకేజి ఇవ్వండి.ప్రశ్నిస్తాడెమో?

 3. Veera

  రోహిత్ మృతి – తెలుగు మీడియా..
  తెలుగు మీడియా స్పందించిన తీరు దానికి మించిన దుర్మార్గంలా క‌నిపిస్తోంది.

  రోహిత్ మ‌ర‌ణానికి ముందు ఏం జ‌రిగిందంటూ తెలుగు మీడియాలోని ప్ర‌ముఖ చానెళ్ల‌లో ఓ వీడియో ప్ర‌సారం చేశారు. ఎన్టీవీ, టీవీ9, టీవీ5, ఏబీఎన్ వంటి ప్ర‌ముఖ చానెళ్లు ఈ క‌థ‌నాలు ప్రసారం చేశాయి. రోహిత్ మ‌ర‌ణానికి ఒక‌రోజు ముందు ప‌రిణామాలంటూ ఊక‌దంపుడు క‌థ‌లు అల్లారు. కానీ వాస్త‌వాల‌ను విస్మ‌రించి, దారుణంగా వ‌క్రీక‌రించిన తీరు మీడియా ధోర‌ణికి అద్దంప‌డుతోంది. నిజాలు పాత‌రేయ‌డంలో తెలుగుమీడియా పెద్ద‌ల తీరు అందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. కేసుల్లో ఇరుకున్న వీసీ అప్పారావుకి ప్ర‌స్తుతం కేంధ్రంలో మంత్రులుగా ఉన్న బీజేపీ, టీడీపీ మంత్రుల అండ ఉంది. సామాజిక కోణంలో ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌డానికి ఆ పెద్ద‌లంతా పావులు క‌దుపుతున్నారు. త‌మ పార్టీ నేత‌తో పాటు వీసీని కూడా కాపాడుకోవ‌డ‌డ‌మే ల‌క్ష్యంగా అనేక క‌హానీలు చెబుతున్నారు.

  అందుకు త‌గ్గ‌ట్టుగా తెలుగు మీడియా వారికి వంత పాడ‌డం మీడియా దుస్థితికి నిలువుట‌ద్దంలా క‌నిపిస్తోంది. వాచ్ డాగ్ లా ఉంటూ వాస్త‌వాలు చెప్పాల్సిన మీడియా అబ‌ద్ధాలు ప్ర‌సారం చేస్తూ త‌న దుర్నీతిని చాటుతోంది. తెలుగు చానెళ్లు ప్ర‌సారం చేసిన వీడియో మ‌ర‌ణానికి ఒక రోజు ముందు అని ప‌దే ప‌దే చెప్పారు. అందులో ఉన్న రోహిత్ కి అస‌లు గెడ్డం ఉన్న ఆన‌వాళ్లు లేవు. చ‌నిపోయిన రోహిత్ మృత‌దేహం ప‌రిశీలిస్తే పెరిగిన గెడ్డం ప‌క్కాగా ఉంది. అంటే ఒక్క‌రోజులో ఆయ‌న గెడ్డం పెరిగిపోయింద‌ని మీడియా పెద్ద‌లు మ‌భ్య‌పెట్టాల‌నుకుంటున్నారా..లేక వాస్త‌వాల‌కు మ‌సిపూయాల‌నుకుంటున్నారా అన్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

  ఇక ఆ వీడియోకి సంబంధించిన వివ‌ర‌ణ స‌ద‌రు మృతుడు సోష‌ల్ మీడియా ద్వారా స‌మాజానికి వెల్ల‌డించి ఏడు నెల‌లు గ‌డిచింది. దాన్ని ప‌ట్టుకొచ్చి ఇప్పుడే చిత్రీకరించిన‌ట్టు ఈ వ‌క్రీక‌ర‌ణ‌లు వ‌ల్లెవేయ‌డం ద్వారా తెలుగు మీడియా కుల‌ర‌క్క‌సికి ఏ స్థాయిలో వంత‌పాడుతుందో అర్థ‌మ‌వుతోంది. వాస్త‌వాల‌ను క‌ప్పిపుచ్చ‌డానికి ఏ రీతిన తోడ్ప‌డుతుందో తేట‌తెల్ల‌మ‌వుతుంది. రోహిత్ చ‌నిపోయిన త‌ర్వాత స్పందించ‌ని మీడియా..వ‌క్ర‌భాష్యాల‌కు ఉవ్విళ్లూరిన తీరు అందుకు నిలువుట‌ద్దంలా క‌నిపిస్తోంది. మీడియా సూత్రాల ప్రకారం బాధితుడి ప‌క్షాన ఉండాల్సిన ఈ ప్ర‌బుధ్దులంతా దోషుల‌కు అంట‌కాగ‌డానికి చేస్తున్న ప్ర‌య‌త్నం అర్థ‌మ‌వుతోంది.

  http://updateap.com/?p=63722

 4. Educated caste fanatics are worse than animals ….

  http://www.sakshi.com/news/hyderabad/rohith-mothers-express-her-grief-over-son-death-306596?pfrom=home-top-story

  Fanatics will rot in Helll for their sins no matter which caste they belong to.

 5. Veera

  BJP కి వెన్నుపోటు-Old habits die hard
  కెసిఆర్ తో మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా, BJP కి ఇచ్చిన 63 సీట్ల లో TDP వాళ్ళ చేత నామినేషన్ లు వేయించిన బాస్, ఇంక అక్కడ BJP గెలిచే ముచ్చటే లేదు!!!
  TDP గెలిచే 10 డివిజన్ల కార్పొరేటర్లు కూడా ఎలాగూ గెలిచాక TRS లోకి వెళతారు
  ఆ విధంగా ముందుకు పోతున్న బాస్!!!
  2009 లో కూడా TRS కు 44 సీట్లు ఇచ్చిన బాబు 30 స్థానాల్లో TDP రెబెల్స్ చేత పోటీ చేయించి TRSను10 స్థానాలకే పరిమితం చేసాడు అదీ వెన్నుపోటు అంటే !!!
  What an idea Baboo ??

 6. Veera

  ఖ(కు)ల్ నాయక్-రెడ్డిని అరెస్ట్ చేయ్, కమ్మ ను వదిలేయ్, కాపును తొక్కేయ్!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s