బెడిసికొట్టిన అంచనాలు

-మంత్రుల్లో మొదలైన చర్చ
-ఓటర్లను నిలబెట్టుకోలేకపోతే కష్టమే
-హైదరాబాద్‌ ఫలితాలే ఉదాహరణ
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి

రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ అన్నీ సవ్యంగానే ఉన్నాయనే ఆలోచనతో ముందుకెళుతున్న అధికారపార్టీ నాయకత్వానికి కాపు ఉద్యమం, హైదరాబాద్‌ ఎన్నికలపై అంచనాలు బెడిసికొట్టాయి. అతి అంచనాలు ప్రచారంతో ఏడాదిన్నరగా ప్రజలకు దూరమయ్యామనే భావన నాయ కత్వంలోనూ, సాక్షాత్తూ మంత్రుల్లోనూ వ్యక్తమవుతోంది. క్యాబినెట్‌ సమావేశాల్లోనే ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నా మంత్రులను నోరెత్తనీయ కుండా చేయడం ద్వారా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. కాపు ఉద్యమ నేపథ్యంలో మంత్రుల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే తరుణంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బిజెపితో జట్టుకట్టినా చావు దెబ్బతిని టిడిపి ఒక్క సీటుకే పరిమితమైంది. నిరంతరం హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్నా సీట్లు ఎందుకు రాలేదో ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రులు సూచిస్తున్నారు. కాపు ఉద్యమ విషయంలోనూ ఆ సామాజిక వర్గం మంత్రులను చులకనగా మాట్లాడారనే భావన వ్యక్తమవుతోంది. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఒక్కరే ముద్రగడపై ఎదురుదాడికి దిగుతున్నారు. మిగిలిన వారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నారాయణ ఓట్ల రాజకీయం నుండి రాలేదు కాబట్టి, క్షేత్ర వ్యవహారం తెలియదని ఓ మంత్రి సిఎం క్యాంపు కార్యాలయం వద్ద విశ్లేషించారు. ఇదే రీతిలో ముందుకు పోతే ఓటర్లను నిలబెట్టుకోవడం కష్టమని క్యాబినెట్‌ సమావేశం నుండి బయటకు రాగానే మరో సీనియర్‌ మంత్రి అభిప్రాయపడ్డారు. ‘అంతా మీ చేతుల్లోనే ఉందంటూ’ మీడియా ప్రతినిధులతో అంటూ ఆయన బయటకెళ్లిపోయారు. ఇంతవరకు రాష్ట్రాన్ని మీడియా ప్రచారంతోనే నడుపుకొస్తున్నారని, నియోజకవర్గాల్లో ప్రజలకు ఇవేమీ పట్టవని ఆయన వ్యాఖ్యానించారు. ‘ నియోజకవర్గానికి కోటి రూపాయలు కూడా కచ్చితంగా ఇవ్వలేని పరిస్థితులుంటే ఇక పెట్టుబడులొస్తాయని ప్రజలకు చెప్పడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు’ అని ఆయన పెదవి విరిచారు. క్రమంగా మంత్రుల్లో పెరుగుతున్న అసహనానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తాయి. మరోవైపు లోకేష్‌కు నేరుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టిన తరువాత, ఆయన తొలిసారి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎక్కడా జనాన్ని ఆకర్షించలేకపోయారని, అపరిపక్వమైన వ్యాఖ్యలు విమర్శలతో టిఆర్‌ఎస్‌కు ఊతమిచ్చినట్లయిందని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే మీడియా లైజనింగ్‌ అధికారులను పెట్టి చేతులు కాల్చుకున్న ‘చినబాబు’ గ్రేటర్‌లోనూ సరైన వ్యూహరచన చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. నగరంలో పలువురు టిడిపి నాయకులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం లేకుండా పదవులు కట్టబెడితే ఇదే పరిస్థితి దాపురిస్తుందని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. సభ్యత్వం గొప్పగా చేయించారని చెప్పుకున్న నాయకత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని విజయవాడలో ఓ సీనియర్‌ నాయకుడు ప్రశ్నించారు.

కొంపముంచిన అతి అంచనాలు
పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు అతి అంచనాలే కొంప ముంచాయని, అన్నీ తానై వ్యవహరిస్తున్న సిఎం కాపుల ఉద్యమాన్ని తమపై తోసేశాని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరుగుతోందని, దీనికితోడు పంచాయతీల్లో కనీస పనులు చేయలేక పోవడమూ ఇబ్బంది కలిగించే అంశమేనని చెబుతున్నారు. రాజధాని పేరుతో వీటన్నిటినీ కప్పిపుచ్చి ఇప్పుడు కాపు నాయకత్వ బాధ్యత అనడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాన్ని మంత్రులే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కృష్ణయ్య విషయంలోనూ నాయకత్వం కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తుందనే విషయాన్నీ ప్రసా ్తవిస్తున్నారు. కాపుల విషయంలో సున్నితమైన అంశమంటూ కృష్ణయ్య ఏం చేసినా ఆయన్ను అదుపు చేయకపోవడం నాయకత్వ లోపమేనని మంత్రులు చెబుతున్నారు. అధికారం లోకి వచ్చిన తొలినాళ్లలో సర్వేల్లో అన్నీ బాగున్నాయని చెప్పిన నాయకత్వం ఇప్పుడు ఎందుకు సర్వేలు చేయించడం లేదని మరో మంత్రి ప్రశ్నించారు. పార్టీ నాయకత్వం తీరుపై మంత్రుల్లోనూ నెమ్మదిగా అసహనం పెరుగుతోంది.

http://www.prajasakti.com/Content/1754617

18 Comments

Filed under Uncategorized

18 responses to “బెడిసికొట్టిన అంచనాలు

 1. Kulala kumpatlatho ……
  Pacchani rastranni ….Brastu pattisthunna
  Cheeda Purugula jathi anti ? Vare viluvalu anti ??
  Veedhi …veedhi ki oka kula sangham ..prapancham lo inka akkadanna vundha ?
  Ee Manushulu mundhu puttara …..Kulam mundhu puttindha ??

  http://www.sakshi.com/news/district/ap-state-to-fire-on-chandrababu-naidus-statements-312680?pfrom=home-top-story

  Has Tv9, Etv, Abn,Ntv,Cvr, Tv5 etc got the guts to discuss this topic ?
  Babu should be taken to High court and Supreme court for making such stupid comments . The National media should get involved.
  Please use the social media to post Babu’s comments on SC’s.

 2. Veera

  ఉదయం లేస్తే రైలు కాల్చినవాళ్ళు పులివెందుల ,కడప రాయలసీమ రౌడీలు అని బాబు సీమ ప్రజలను అవమానిస్తున్నాడు ,నేను కడప SP కి RTI చట్టం ద్వారా లేక వ్రాసాను పులివెందుల రౌడీలు ఉన్నారా అని ఇంతవరకు సమాధానం లేదు-ప్రో నాగేశ్వర్

  [ఇంతకుముందు ఒక సం క్రితం రాజధాని భూములు తగలపెటించింది జగనే అని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి 3 రోజుల్లో అరెస్ట్ అని చెప్పారు ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేదు కాని ఆ పని చేసింది TDP వాళ్ళే అని అక్కడ ఉద్యోగులు రైతులు నాటో చెప్పారు అని మాజీ TDP మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు చౌదరి చెప్పారు
  అలాగే జగన్ ఒక హోటల్ లో హరీష్ రావు ను కలిసి స్తీపేన్సన్ కు MLC ఇవ్వమని చెప్పాడు ఆ CCTV ఫుటేజి మా దగ్గర ఉంది రేపు బయటపెదటాము అని చెప్పి కూడా 4 నెలలు అయింది.
  వీళ్ళు కడుపుకు ఏమి తింటారో ?]

 3. One more wicket down …..
  35 year old KDP heading for a clean sweep in Telangana ?

  http://www.greatandhra.com/politics/gossip/jolt-to-tdp-as-another-legislator-joins-trs-72584.html

  Where there is no Weed …….there is no KDP .

 4. Babu should be taken to High court and Supreme court for his comments …
  We should let the Nation know about these unethical narrow minded caste fanatics .

  http://www.sakshi.com/news/district/registered-a-case-against-andhra-pradesh-chief-minister-n-chandrababu-naidu-312502?pfrom=home-top-story

  @ Babu garu …Oka Nakka jathiki thappa migatha variki konni viluvalau vuntayi . Mundhu adhi telusukuni matladu.
  Mamani vennupotu podichi kurchi lakko vatam …
  Kurchini kapadukovataniki vaadingaddam …veedi kallu pattu kovatam
  MLA’s ni dabbu tho konatama etc etc etc
  Siggu malina varika sadhyam.

 5. Veera

  షాక్ షాక్ షాక్ జగన్ కు షాక్-పచ్చపాత అను కుల మీడియా ఆనందం
  గ్రేటర్ లో TDP కి సింగల్ వార్డ్-జగన్ కు షాక్
  కాపు ఉద్యమం -జగన్ కు షాక్
  కాల్ మనీ- జగన్ కు షాక్
  పట్టిసీమ-జగన్ కు షాక్
  వరుసగా తెలంగాణా TDP MLA లు TRS లో చేరిక- జగన్ కు షాక్
  (ఫైనల్ షాక్ ఇస్తారు బాబుకు ఎన్నికల్లో-సామాన్యుడు)

 6. Veera

  కుల రాజకీయాలు మొదలుపెట్టింది బాబే -జర్నలిస్టు కృష్ణా రావు, NTV ,Feb 9
  1985 లోనే రోశయ్య TDP ని విమర్శిస్తే TDP లో ఉన వైశ్య లీడర్ చేత తిట్టించేవాడు రోశయ్యను,అలాగే రెడ్డి ని రెడ్డి తో కాపును కాపుతో… ఇలా చేసేవాడు బాబు.ఇంతెందుకు మొన్న ముద్రగడను తిట్టించింది కూడా కాపు నాయకులతోనే

  అసలు కాపు గర్జన లో హాజరైన బొత్స, కన్నా,వట్టి,పల్లంరాజు ఇలా అన్ని పార్టీల ల నాయకుల చేత మాట్లాడిస్తారు ముద్రగడ అని అనికొంటే అయన ఒక 10 నిముషాలు మాట్లాడి చలో రైల్ స్టేషన్ అనేసరికి మాకే అర్ధం కాలేదు-గంగా భవాని ,కాంగ్రెస్ కాపు నేత

 7. Veera

  ఎవరు మాత్రం SC కులంలో పుట్టాలని కోరుకుంటారు?
  కాపుల గురించి పార్టీ పెట్టి, వారి గురించే దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశానని చెప్పి, ఒక్కరోజు కూడా ఆ విషయం గురించి మాట్లాడని చిరంజీవి.. ముద్రగడను పరామర్శించడానికి వెళతారా?
  http://www.sakshi.com/news/district/who-will-seek-to-birth-as-sc-people-312381?pfrom=home-top-story

 8. SC’s are human beings and most of them have ethical values in life .
  It is only the narrow 5% yellow caste fanatics in AP that is destroying the state.
  Manushulaki ……Manava viluvalu manta kaluputhunna NAKKA jathiki teda ledha Babu ?
  Veedhi veddhi ki ….Oka Kula sangham pettina Gajji/ Gaja donaglu avaru ?

  http://www.sakshi.com/news/district/who-will-seek-to-birth-as-sc-people-312381?pfrom=home-top-story

  Babu should be taken to Court for making such irresponsible statements.
  Please use the social media to post the above article and let the people judge for themselves. Every stupid statement they make is a golden opportunity to expose them.

 9. Human greed blinds humanity ….
  Those who are supposed to save lives are taking their own lives.

  http://www.sakshi.com/news/hyderabad/firing-at-himayath-nager-made-hyderabad-tence-312276?pfrom=home-top-story

  Did they take their money with them ?

 10. NTR ni vennupotu podichi na Pedda actor ki ….
  Inko actor PK thodu ayyadu – Narayana Chowdary

  http://www.sakshi.com/video/news/cpi-naryana-slams-actor-pawan-kalyan-over-kapu-reservations-45815?pfrom=home-top-videos

  KDP making PK a comedian out of an actor ? His fans need to wake him up.

 11. Veera

  నక్కా మజాకా!!! పవన్,ముద్రగడలను జీరో చేసాడు,BCలను కాపులపై ఉసిగొల్పాడు !!!
  (నాతొ స్నేహం చేసినా నీకే డేంజర్, వైరం పెట్టుకొన్నా నీకే డేంజర్)

 12. Veeri Papam pandedhi appudu ?

  http://telugu.greatandhra.com/politics/political-news/prajaswamyaniki-pacha-pathara-69105.html

  Please use the social media and buy some clothes for these naked caste fanatics.

 13. @ PK garu ….

  Idhi kuda …..asanghika sakthula kutra ?

  http://www.sakshi.com/news/district/raghuveera-reddy-chiranjeevi-arrest-in-rajahmundry-312217?pfrom=home-top-story

  Are mango baskets more valuable than your brother ?
  The fanatics tried to crush Chiru in Tollywood and they are now trying to bring you down …don’t be fooled…….please beware.

 14. లోకేశం: మా నాన్న హైటెక్ సిటీ కట్టాడు
  మేస్త్రి: ఏ రోజు కూలీ ఆరోజే తీసుకోవాలె ఇన్నేళ్ళ తరువాత అడిగితె ఇయ్యం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s