ఆపరేషన్ ఆకర్ష్!

ఆపరేషన్ ఆకర్ష్!
హైదరాబాద్: తెలంగాణలో పోయిన పరువును కాపాడుకునేందుకు ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్ష్‌కు టిడిపి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు సరికదా బెడిసి కొట్టాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవడం, ఎమ్మెల్యేలు వరుసపెట్టి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నివ్వెర పోతున్నారు. దీంతో కొంత మంది మంత్రులు రంగంలోకి దిగి కొంత మంది వైకాపా ఎమ్మెల్యేలకు ఎరవేసి పార్టీలోకి తెస్తే ఆధిపత్యం నిలబెట్టుకున్నట్లవుతుందని, ఆంధ్రాలో టిడిపి బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లవుతుందని భావించారు. కాని ఈ ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.

http://andhrabhoomi.net/content/state-937

టిఆర్ఎస్ లో టిడిఎల్పి విలీనం-ఎర్రబెల్లి లేఖ
మూడు రోజుల క్రితం చెప్పినట్లే జరిగింది. టిడిపిని టిఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు లేఖరాసే అవకాశం ఉందని ఈ వెబ్ సైట్ లో పేర్కొన్నట్లే సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు స్పీకర్ మదుసూదనాచారికి ఒక లేఖ రాస్తూ టిఆర్ఎస్ లో విలీనం అవడానికి పది మంది ఎమ్మెల్యేలు అంగీకరించారని తెలిపారు.గురువారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం అయి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ నిబంధన ప్రకారం తమ విలీనానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలోనూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు, సాయన్న, ప్రకాశ్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవం కృష్ణారావు, కేవీ వివేకానంద గౌడ్, ధర్మారెడ్డి, రాజేందర్ రెడ్డి సంతకాలు చేశారు.దీంతో తెలంగాణ శాసనసభ లో టిడిపి పక్షం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.అయితే రేవంత్ నాయకత్వంలోని వారు మరో లేఖ రాసి దీనిపై వివాదపడాలి.లేదా ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరవచ్చు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160212_22.php?p=1455259924495

6 Comments

Filed under Uncategorized

6 responses to “ఆపరేషన్ ఆకర్ష్!

 1. Veera

  సొంత పార్టీ MLA లకు కూడా డబ్బులిచ్చి పార్టీ మారొద్దు అని బ్రతిమలాడుకొనే క్యారెక్టర్ బాబుది -తలసాని శ్రీనివాస్ యాదవ్,6 నెలల క్రితం
  (అదేంటి సర్ అయన దగ్గర కేవలం 40 లక్షలే కదా ఉంది అలా అంటారేమిటి?)
  2014 ఎన్నికల్లో MLA ల ఎన్నికల ఖర్చు అంతా బాబే భరించాడు అయిన ఈ TDP MLA ల అవినీతి తట్టుకోలేకపోతున్నాం -చంద్ర జ్యోతి రాదక్రిష్ణ చౌదరి
  (అయినా 40 లక్షల బాబు నిప్పు అంటారు అంతేనా చౌదరి)

 2. Veera

  బాబు పాలన దారుణంగా ఉంది,మహా అయితే ఒకరు ఇద్దరు తప్పితే ఎవరూ చేరారు-కాంగ్రెస్ తులసిరెడ్డి, NTV
  రైతులు ఉద్యోగులు నిరుద్యోగులు మహిళలు కూలీలు.. ఇలా ఏ వర్గం కూడా బాబు పాలన పట్ల సంతృప్తిగా లేరు కొంతమంది ఇసుక మాఫియ వాళ్ళు ,లిక్కర్ షాప్ ల వాళ్ళు తప్ప .
  కాబట్టి YCP వాళ్ళు ఒకరో ఇద్దరో వాళ్ళ అవసరాలను బట్టి వెళితే వెళ్ళవచ్చు

  తెలంగాణా లో TDP ఖాళీ అని ఇలా YCP కూడా ఖాళీ అని ప్రచారం చేయిస్తున్నాడు బాబు

 3. Veera

  ఆది నారాయణరెడ్డి TDP లోకి -చంద్ర జ్యోతి/CBN
  జగన్ నమ్మిన బంటు TDP లోకి-చంద్ర జ్యోతి/CBN
  జమ్మలమడుగు MLA TDP లోకి-చంద్ర జ్యోతి/CBN
  YS ప్రాణస్నేహితుడు TDP లోకి -చంద్ర జ్యోతి/CBN
  గత 10 నెలలుగా అది నారాయణ రెడ్డి TDP లోకి అని రకరకాలుగా హెడ్డింగ్ లు పెట్టి పేజీలు పేజీలు వ్రాసిన జ్యోతి MD రాదక్రిష్ణ చౌదరి

  కొసమెరుపు:ఏమైనా నీకు కుల పిచ్చి ఎక్కువే రాదక్రిష్నా అని మోహన్ బాబు అడిగితె నేను తెలంగాణా లో పుట్టాను కాబట్టి నాకు కుల పిచ్చి లేదు అని చెప్పాడు మీరు నిజ్జంగా నమ్మాలి

 4. Veera

  మాది జాతీయ పార్టీ -హైదరాబాద్ మేస్త్రి
  మీది జాతి పార్టీయే కాని జాతీయ పార్టీ కాదు అని హైదరాబాద్ వాళ్ళు చెప్పారు రాజా-పోసాని

 5. Veera

  బాబ్బాబు 20 కోట్లు ఇస్తాం మా పార్టీలో చేరండి మా కుల మీడియా ఆల్రెడీ మీరంతా వచ్చేస్తారు అని వ్రాసింది ,మా పరువు పోతోంది ,ప్లీజ్ వచ్చేయండి- హైదరబాద్ మేస్త్రి

 6. Veera

  టీచర్:రామూ, రెండు లేఖలిచ్చి పార్టీ మూసేసుకొన్న కుల మేధావి ఎవరు?
  రాము:ఇంకెవరు మా హైదరబాద్ మేస్త్రి
  టీచర్:మా బాబే !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s