రాయలసీమలో కన్నా కోస్తాలోనే నేరాలు ఎక్కువా!

రాయలసీమ ను ఉద్దేశించి, పులివెందుల ను లక్యంగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. నేరాలు ఎక్కువగా జరుగుతున్నది కోస్తా ప్రాంతంలో అయితే రాయలసీమను అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడతారా అంటూ రాయలసీమ ప్రముఖులు విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి సమితి వ్యవస్థాపకుడు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి ఎ. హనుమంతరెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించారు.

కాపుల నేత రంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుండగా బస్సులో వచ్చి హతమార్చిన సంస్కృతి ఎవరిదని విజయవాడలో 1988 లో జరిగిన ఘటన గురించి ప్రశ్నించారు.అదే రంగా అన్న రాధాని మోసగించి చంపిన సంస్కృతి ఎవరిదని నిలదీశారు. అదే ఎత్తుగడ ముద్రగడ పద్మనాభం పై కూడా ప్రయోగించారన్న అనుమానం కలుగుతోంది. అది సాధ్యం కాక , రాయలసీమ ప్రజలపై నిందలు మోపుతున్నారా అని హనుమంతరెడ్డి ద్వజమెత్తారు. కారంచేడు వంటి హింసాత్మక ఘటనలు ఎవరి సంస్కృతి, అలాగే ఆస్తి కోసం చిన్నారి వైష్ణవిని చంపిన సంస్కృతి ఎవరిదని ఆయన అన్నారు. శ్రీలక్ష్మి వంటి ఎందరో అమాయక స్త్రీలను చంపిన సంస్కతి ఎవరిదో ప్రజలకు తెలియనది కాదన్నారు.

2014లో రేప్ కేసుల్లో కృష్ణా జిల్లాలో 144, పశ్చిమ గోదావరిలో 139, తూర్పు గోదావరి జిల్లాలో 77, గుంటూరు జిల్లాలో 87 నమోదు అయితే తరచు సీఎం బాబు ప్రస్తావించే పులివెందుల ఉన్న కడప జిల్లాలో 29, కర్నూల్‌లో 31, అనంతపురంలో 35, చిత్తూరులో 49 కేసులు నమోదు అయ్యాయని హనుమంతరెడ్డి లెక్కల చిట్టా విప్పారు.క్రైమ్ రేట్ ఒక లక్ష జనాభాకు గుంటూరులో 620, కష్ణాలో 623, పులివెందుల ఉన్న కడపలో 182 నమోదుఅయిందని అన్నారు.

ఇదే ప్రకారం రాయలసీమ ప్రజలను అవమానిస్తే ప్రత్యేక రాస్ట్రం కోసం యువత ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం కోసం ఏది బడితే అది మాట్లాడితే ఎంత ప్రమాదమో అర్దం చేసుకోవాలి. ఒక ప్రాంత మనోభావాలను దెబ్బతినేలా పాలకులు మట్లాడడం వల్ల హనుమంతరెడ్డి వంటివారు లెక్కల చిట్టా విప్పారనుకోవాలి.

http://kommineni.info/articles/dailyarticles/content_20160213_8.php?p=1455346727826

18 Comments

Filed under Uncategorized

18 responses to “రాయలసీమలో కన్నా కోస్తాలోనే నేరాలు ఎక్కువా!

  1. Veera

    ప్రజానాడి!!!
    నాకు తెలిసిన గవర్నమెంటు టీచర్ అనంతపూర్ నుంచి రోజూ షేర్ ఆటో లో పల్లెలో ఉన్న బడికి వెల్లివస్తాడు, 70% బాబు ను తిడుతున్నారు ,25% ఇంకో సంవత్సరం చూద్దాం అంటున్నారు ,5% పర్లేదు అంటున్నారు అని చెప్పాడు
    చాలామంది రుణమాఫీ ,డ్వాక్ర రుణాలు మాఫీ అని ఇలా దొంగ మాటలు నమ్మి వోటేసాము లేకపోతె జగన్ కే వేసేవాళ్ళం ,చాల మోసాపోయము అని చెబుతున్నారట.ముందుంది మొసళ్ళ పండుగ బాబూ!!!!

    • Veera

      2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాబు రుణమాఫీ అంటున్నాడు జగన్ రుణమాఫీ అనకపోతే ఓడిపోతాడు అని చెప్పిన వ్యక్తి ఈ టీచర్

  2. KDP …..adhikara prathinidhi kuda paya !!

    http://www.sakshi.com/news/district/party-spoke-person-potla-nageswara-rao-gives-shock-to-tdp-party-313995?pfrom=home-top-story

    Cheeda purugula sontha intiki …….Chedhalu ?
    Where there is no KDP there is no TDP.

  3. Veera

    2014 లో జరిగిన నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన వోట్లు-1,57,868
    కాంగ్రెస్ కిష్టా రెడ్డి-62,347-39.5%
    తెరాస భూపాల్ రెడ్డి-47,601-30%
    TDP విజయ్ పాల్ రెడ్డి-40,405-25.6%
    Feb 13 న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కిష్టా రెడ్డి కొడుకు పోటీ చేసాడు, మిగితా అభ్యర్ధులు వాళ్ళే. బాబు అభి రుద్ది చూసి ఇప్పుడు TDP కి ఎన్ని వోట్లు వేస్తారో చూద్దాం?

    మెదక్ వరంగల్ లో BJP కాకుండా TDP పోటీ చేసి ఉంటె TRS కు చుక్కలు చూపెవాళ్ళం అన్నTDP వాళ్ళు నారాయణ్ ఖేడ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక లక్ష వోట్లు అన్నా తెచ్చుకొంటారేమో???

  4. Veera

    From Sekhar Babu
    రాజధానిలో నిర్మాణాలు ఇంకా మొదలు పెట్టకపోవడానికి అసలు కారణాలు ఇవే.
    ————————————————————————
    రాబోయే కాలంలో అమరావతిలో అంతా ఆ కట్టిన నిర్మాణాల వంక చూస్తూ వాహనాలు నడపడం వల్ల,రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, జనాలు అంతా గుడ్లగూబలంతా కళ్ళు చేసి నోరేళ్లపెట్టి, నాలుక బయటకు వేసి తదేకంగా చూడడం వల్ల, కంటి సంబందిత వ్యాదులు, ఈగలు, దోమలు, దూరడమ్ కారణంగా నోటి,ఉదర, ఊపిరితుత్తుల సంబందిత వ్యాదులతో ప్రజలు బాద పడతారని. అదెపనిగా తల పైకి పెట్టి భవన శిఖరాలు చూడడం వల్ల మెడ, వెన్నునొప్పులు వస్తాయని, అంతా ఆకాశహర్మ్యాల వంకచూస్తూ, ఒకరినొకరు చూసుకోకుండా నడవడం మూలంగా గుద్దుకునే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని, దూర ప్రాంతాల నుండి అమరావతి చూడడానికి వచ్చిన వారు తిరిగి మళ్లీ వాళ్ల స్వగ్రామానికి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే తిష్ట వెయ్యడం వల్ల జనాభా పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని, ఎటునుండి వచ్చారో, ఎటు వెళ్ళాలో దారి తెలీక ప్రజలు ప్రబుత్వ సమాచార కేంద్రాన్ని సంప్రదించడం వల్ల తద్వారా సిబ్బంది కొరత వల్ల ఒత్తిడి పెరుగుతుందని, దేశం నలుమూలల నుండి ఇతరరాష్ట్రాల వాళ్ళు కూడా సందర్శనకు రావడం వల్ల ఇక్కడ నివసించే ప్రజలకు బాష, వసతి ఇబ్బందులు తలెత్తుతాయని, ముందు తమ ప్రాంతానికే, తమ సామాజికవర్గానికే ఎక్కువ సార్లు సందర్శించే విధంగా రిజర్వేషన్ కల్పించాలని ఆయా వర్గాలవారు నిరవధిక నిరాహార దీక్షలు చేసే ప్రమాదం ఉందని, యాచకులకు వివిద దేశాల సందర్శకులు వెయ్యడం ద్వారా వచ్చిన విదేశీ నగదును దేశీ మారక ద్రవ్యం కింద మార్చడానికి బ్యాంక్లకు అవసరమైన టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, అన్నింటి కంటే ముఖ్యంగా ఇక్కడ నిర్మాణాలు మొదలు పెట్టిన తర్వాత తమ దేశానికి వచ్చే సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తద్వారా పర్యాటకరంగం ఆయువుపట్టుగా ఉన్న సింగపూర్ ఆదాయానికే గండిపడుతుంది అని,
    నిర్మాణానికి ముందు, సింగపూర్వారు వేసిన అద్యయనకమిటీ పరిస్తితి అంచనా వేసి బహిర్గత పరిచిన రహస్యాలు. అందుకే ప్రజల, దేశం మేలు కోరి నిర్మాణం జరపడం లేదు సహృుదయులు దయతో బాబు గారిని అర్ధం చేసుకోగలరు.

  5. Veera

    Ramanaath Reddy Bheemireddy
    మా రాయలసీమ జనం కూడా బాగానే ఆలోచిస్తున్నారు!
    రెండు రోజుల క్రితం ఊరెళ్లా..!. ఒకాయన కలిశాడు. కీళ్ల నొప్పులు ఎక్కువయ్యాట. ఆయుర్వేద వైద్యం చేయించుకోవాలనుకున్నాడట. స్టార్ హోమియో హాస్పటల్ కు వెళ్థామనుకుని ఆఖరి నిమిషంలో ఆగిపోయాడట.
    ఎందుకు ఆగిపోయావని ఆడిగా!.
    స్టార్ హోమియో ఆస్పత్రి ప్రకటనల్లో మురళీ మోహన్ నటించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. మురళీమోహన్ కు, వైద్యానికి సంబంధం ఏమిటని కాసింత దగ్గరకు వెళ్లి అడిగా.
    ఇటీవల రాయలసీమ సంస్కృతిని, ఇక్కడ జనాన్ని కించపరిచేలా మురళీ మోహన్ మాట్లాడారు కదా. అందుకే ”స్టార్ హోమియోపతి నేను నమ్మాను… మీరు నమ్మండి” అని మురళీమోహన్ టీవీల్లో చెప్పిన ప్రతిసారి కోపం వస్తోందట.
    మురళీ మోహన్ వ్యాఖ్యలకు నిరసనగా అతడు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఏ సంస్థల సేవలను తాను స్వీకరించడట. అంతే కాదు రాయలసీమ వాళ్లంతా తనను ఫాలో కావాలని ఒక పిలుపు కూడా ఇచ్చాడు.
    ఆయన చెప్పిన దాంట్లో అర్థముందనిపించింది. నట మోహన్ లాంటి వారి బ్రాండ్ బద్ధలు కొట్టాలంటే ఇదే కరెక్ట్. అప్పుడే పొగరు దిగి ప్రజలందరినీ సమానంగా చూసే బుద్ది వస్తుంది. మా ఊరి ఆయన చెప్పిన మాటలను ”నేను నమ్మాను… మీరు నమ్మండి”.

  6. Veera

    AP లో వార్ వన్ సైడేనా???
    నిన్న శ్రీకాకుళం లో జగన్ కు యువత నుంచి వచ్చిన రెస్పాన్స్ కేక
    కుర్రకారు ఎగబడ్డారు జగన్ కు షేక్ హ్యాండ్ ఇవడానికి, ప్రతి మాటకు విపరీతంగా చపట్లు కొటారు బాబు సభల్లో రెస్పాన్స్ ఉండదు అదీ తేడా !!!

  7. Veera

    ఇక నుంచి TDP కార్యకర్తలకు నెల నెలా 5-40 వేల జీతం ఇస్తారట
    -40 లక్షల అస్తి ఉన్న మన ఆంధ్రా నిప్పు పార్టీ
    [TDP offers perks to keep flock together
    Hyderabad: ‘Beleaguered’Telugu Desam Party (TDP) has found an ‘antidote’ to ‘Operation Akarsh’ launched by the ruling TRS to weaken TDP in Telangana state. The yellow party has decided to offer monthly salaries and special allowances to leaders from village level to state level in Telangana to protect its cadre and leadership from poaching.

    The party has fixed the salaries in the range of Rs 5,000 and Rs 40,000, depending on the capacity and rank of the leaders serving the party for at least 15 years. Village and mandal level leaders are being given between Rs 5,000 and Rs 7,000 and the district and state level leaders have been offered Rs 10,000 to Rs 20,000 per month.

    Senior leaders such as state secretaries, general secretaries, youth wing, SC, ST and minority wing leaders would be provided Rs 25,000 to Rs 40,000.

    Based on the seniority, services and financial status, a list of eligible leaders would be prepared. Already, some leaders in the state committee are drawing monthly salaries. They will be provided allowances during their visits to the districts henceforth.

    Party leaders said that the Rs 2-lakh insurance scheme meant for party workers attracted many in Telangana state during the membership drive conducted last year making the TDP as the second largest political organisation after TRS in the enrollments. The party workers are also provided free medical facility and free education to their children under NTR Trust.

    http://www.thehansindia.com/posts/index/Hans/2016-02-14/TDP-offers-perks-to-keep-flock-together/207089 ]

  8. Veera

    చక్రం తిప్పిన చంద్రం-AP కి 34 కోట్ల కరవు సాయం
    కరువు పరిస్థితుల నేపథ్యంలో 2 వేల కోట్లు కేటాయించాలని ఏపీ, 2వేల 601 కోట్లు కేటాయించాలని తెలంగాణ విజ్ఞప్తి చేశాయి.అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు 433 కోట్లు, తెలంగాణకు 791 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించింది.అయితే కేంద్రం మనసు మార్చుకుంది. జాతీయ విపత్తు సహాయ నిధిలో డబ్బులు లేవంటూ.. తెలంగాణకు 56 కోట్లు, ఏపీకి 34 కోట్ల సాయం ప్రకటించింది.

    కాని మాత్రం రైతు ఆత్మహత్యలు, కరువు విషయంలో తెలుగు రాష్ట్రాల కన్నా తీవ్రత తక్కువగా ఉన్నా.. BJP అధికారం లో ఉన్నమధ్యప్రదేశ్‌కు 14 వందల 81 కోట్ల రూపాయలు కేటాయించింది కేంద్రం

    http://www.10tv.in/Heavy-cuts-in-drought-relief-funds-to-Telugu-States-32759

  9. Aa Naidu ….Ee Naidu …Kula gajji , dveshama tho putti perigaru ….
    Vaariki maa Jathi lo putta arhatha kuda ledhu – Katthi Padma rao

    http://www.sakshi.com/news/district/chandrababu-cannot-born-in-dalith-community-eventhough-he-likes-katti-padmarao-critisises-313753?pfrom=home-top-story

  10. Veera

    టాలీవుడ్ లోనూ వైసీపీ గాలి…!
    http://updateap.com/?p=66853

  11. Veera

    డిల్లీ తరువాత క్రైమ్ రేట్ విజయవాడ లోనే ఎక్కువ-గణాంకాలు
    2014 క్రైమ్ రేట్: క్రిష్ణ-623,గుంటూర్-620,కడప-182
    సీమ ప్రజలు చాల మంచివారు-సైకిల్ పై ఇండియా చుట్టిన వెస్ట్ బెంగాల్ వీరుడు
    ప్రతి నేరం వెనక రాయలసీమ,కడప, పులివెందుల రౌడీలు-బాబు డైలాగు
    AP లో ఏ నేరం జరిగినా జగన్ ఖాతాలో వేయడం ప్రభుత్వ పాలసీ-జర్నలిస్టు కృష్ణారావు

    • Gajji dongalu akkada vunta ……Gaja dongalu akkada vuntaru .

      Kulanni kalanni addam pettukuni desam ni dochukuntu …
      Avathili vare vaipu velu choopistharu kondharu Cheeda purugulu
      Telugu samajaniki chedhalu pattisthundhi avaru ?

      • Papam panduthunnatlundhi ?
        Viceroy hotel lo MLA’s ni dachipetti …Ntr ni vennupotu podichadu
        Ippudu aa hotel tho paniliekundana ne …..KCR deggaraiki parigeduthunnaru Babu gari bantulu !!
        You pay for your sins ……..time is the only obstacle.

  12. Veera

    వోటుకు నోటు కేసులో మత్తయ్యకు ACB నోటీసులు
    -ఇప్పుడు సెక్షన్ 8 అవసర లేదా బాబూ?
    బాబు వాడకం ఈ రేంజ్ లో ఉంటుంది

  13. Veera

    బాబు ఇంత వీకా?
    2009 లో YS రెండవసారి CM అయ్యాక TDP కి చెందిన 56 మంది MLA లు(గెలిచినTDP MLA లు 92 ) మేము కాంగ్రెస్ లో చేరుతాము అని వచ్చారు అలా వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ముగ్గురు మంత్రులు గా ఉన్నారు AP లో, దానికి నేనే సాక్షం
    – చెంగలరాయుడు, కాంగ్రెస్ MLC , NTV KSR లైవ్ షో, Feb 13,2016

    2010-14 మద్య బాబు ను వదిలి 22 మంది MLA లు వెళ్లారు, ఇప్పుడు కూడా AP లో అధికారం లో ఉన్నా కూడా10 మంది TTDP MLA లు వెళ్ళిపోయారు

    YCP MP SPY రెడ్డి ని MP గా గెలిచిన రెండవ రోజే చేర్చుకునాడు బాబు, అలాగే 1999 లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మోత్కుపల్లి ని కూడా TDP లో చేర్చుకున్నాడు బాబు

    కాబట్టి ఇతరులకు పిల్లి శాపాలు పనిచెయ్యవు బాబూ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s