6 వేల కోట్ల లూటీకి ఏపీ కేబినెట్ ఓకే

ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా పట్టించుకోని మంత్రివర్గం
సాగునీటి ప్యాకేజీల్లో రూ. 6 వేల కోట్ల లూటీకి కేబినెట్ ఓకే
అంచనా వ్యయం పెంపులో భారీ కుంభకోణం
ఆమోదించలేదని 15న అబద్ధమాడిన మంత్రి నారాయణ
ఆమోదించినట్లు 16న బైటపెట్టిన మంత్రి దేవినేని
ఫైలు రెండోసారి కేబినెట్‌కు ఎందుకు వచ్చిందో అడగని మంత్రులు

సాక్షి, హైదరాబాద్: అనుకున్నదే జరిగింది. ఇరిగేషన్‌లో భారీ కుంభకోణానికి కేబినెట్ నిస్సిగ్గుగా ఆమోదముద్ర వేసేసింది. ఇద్దరు ప్రధానకార్యదర్శులు సంతకం చేయడానికి తిరస్కరించినా రెండుసార్లు మంత్రివర్గం ఆమోదించేసిందంటే ఈ కుంభకోణం విషయంలో ప్రభుత్వం ఎంత పచ్చిగా వ్యవహరించదలచుకుందో తేలిపోయింది. 15న మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి నారాయణ హంద్రీ-నీవా, గాలేరు-నగరి అంచనా వ్యయం పెంపు విషయంలో ఏమీ నిర్ణయించలేదని అబద్ధమాడేశారు. అయితే ఇక దాచడానికి ఏమీ లేదన్నట్లు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం అంచనాల పెంపు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో బైటపెట్టేశారు. ఇక జీవో వెలువడడమే తరువాయి. ‘చినబాబు’ స్క్రీన్‌ప్లేలో.. ‘పెదబాబు’ డెరైక్షన్‌లో రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడానికి రంగం సిద్ధమైనట్లే.

లీకులపైనే సీఎం ఆందోళన.. అవినీతిపై కాదు..
మంత్రివర్గ సమావేశంలో.. అంచనాల పెంపు ప్రతిపాదనలను ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన సమాచారం ‘సాక్షి’కి ఎలా చేరిందనే అంశం మీద చర్చించారే తప్ప, అడ్డగోలు అవినీతి వ్యవహారం గురించి చర్చించే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు మీడియాకు చేరకుండా జాగ్రత్త పడాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించడానికే పరిమితమయ్యారే కానీ, అవినీతికి పాల్పడవద్దని హితవు చెప్పలేకపోయారు. అవినీతి వ్యవహారాలు మీడియాకు లీక్ అయితే సంబంధిత మంత్రి, ముఖ్య కార్యదర్శి బాధ్యత వహించాలని చెప్పిన చంద్రబాబు.. అవినీతి జరిగితే బాధ్యత వహించాలని హెచ్చరించలేకపోయారు. అక్రమార్కులతో అంటకాగుతున్న ఫలితంగానే అవినీతి విషయంలో ముఖ్యమంత్రి మెతకవైఖరి అవలంభించాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పారదర్శకత గురించి పదేపదే కబుర్లు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంచనాల పెంపు వ్యవహారంలో స్వయంగా పారదర్శకతకు పాతరేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కులకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే అండగా నిలిచి, మంత్రివర్గంలోనే అవినీతి భాగోతానికి ఆమోదముద్ర వేస్తే.. జల వనరుల శాఖ అవినీతికి అడ్డాగా మారిపోతుందని, ప్రజా ధనాన్ని దోచుకోవడానికి అవినీతిపరులు ఈ శాఖను వేదికగా చేసుకుంటారనే ఆందోళన ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది.

http://www.sakshi.com/news/hyderabad/ap-cabinet-approves-irrigation-projects-file-314680?pfrom=home-top-story

5 Comments

Filed under Uncategorized

5 responses to “6 వేల కోట్ల లూటీకి ఏపీ కేబినెట్ ఓకే

 1. Veera

  పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే గ్రేటర్ రాయలసీమకు 90TMC నీళ్ళు రావు ఈ విషయం పై గతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి కూడా లేఖ రాశాం,రిక్వెస్ట్ చేశాం,అయినా ఫలితం కనబడలేదు, AP CM బాబు వోటుకు కోట్లు కేసులో కెసిఆర్ తో కుమ్మక్కై పట్టించుకోవడం లేదు -జగన్

  పోయేది సీమ , ప్రకాశం నెల్లూరు కదా బాబు ఎందుకు పట్టించుకొంటాడు ?

 2. Veera

  సర్వీస్ లో చేరిన 5 సం లలో 40 మందిని ఎన్ కౌంటర్ చేశా , దిస్ ఈస్ నాట్ జస్ట్ ట్రాక్ రికార్డు, అల్ టైం రికార్డు -దూకుడు లో మహేష్ బాబు
  అదేమీ గొప్ప, గత 5 సం లలో నన్నువదిలి 32 మంది MLA లు గోడ దూకారు, దిస్ ఈస్ నాట్ జస్ట్ ట్రాక్ రికార్డు, అల్ టైం రికార్డు -MLA ల దూకుడు పై బాబు

 3. Veera

  బాబంటే ఏదీ భయం? పార్టీపై పట్టు పోతోందా?
  `దేశం’లో పెరుగుతున్న నిరసన స్వరం అనంతలో పల్లె వర్సెస్‌ పరిటాల
  కాంగ్రెస్‌ నేతల వలసలతో కట్టుదాటుతున్న క్రమశిక్షణ
  గుంటూరులో డొక్కా, రాయపాటి ధిక్కారం
  బాబును విమర్శిస్తున్న మంద కృష్ణకు దన్నుగా నిలిచిన డొక్కా
  ఆయనను సమర్థించిన రాయపాటి
  పార్టీని పట్టించుకోని జెసి సోదరులు
  కృష్ణా జిల్లాలో వంశీ వర్సెస్‌ ఉమ
  విశాఖలో పాత్రుడు-గంటా ఢీ
  యధేచ్చగా మీడియా ముందుకు నేతలు
  ఎవరిపైనా చర్యలు తీసుకోని అధినేత చంద్రబాబు
  కాంగ్రెస్‌ మాజీల చర్యలతో కట్టుదాటుతున్న సొంత పార్టీ నేతలు

  (సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్): క్రమశిక్షణ ఆరోప్రాణంగా గర్వంగా ప్రకటించుకునే తెలుగుదేశంలో ఇప్పుడు అదే లోపించిందా? టిడిపి అధినేత, ఏపి సీఎం చంద్రబాబునాయుడుపై నాయకులలో భయం పోతోందా? అసలు ఆయనకే పార్టీపై పట్టు తప్పుతోందా? అధినేత ఎవరినీ నియంత్రించలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారా? బాబు ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ సంస్కతి పార్టీ క్రమశిక్షణను దెబ్బతీస్తోందా? డబ్బున్న వారికి టికెట్లు ఇస్తున్న ఫలితం వికటించి, అది మొత్తం పార్టీ క్రమశిక్షణనే దెబ్బతీస్తోందా? మొత్తంగా ‘దేశం’లో క్రమశిక్షణ కట్టుదాటుతోందా?… తాజాగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ సీనియర్లలో పెరుగుతున్న ఆందోళన ఇది.

  రాజకీయ అవసరాలు, కాంగ్రెస్ నేతలు వైసీపీలోకి వెళ్లకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలకు రెడ్‌కార్పెట్ వేస్తోన్న చంద్రబాబునాయుడు విధానాల వల్ల, తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగానే అరాచకంగా మారే ప్రమాదం ఏర్పడిందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నాయ కులకు చంద్రబాబునాయుడంటే భయం, భక్తి, గౌరవం ఉండేదని, ఇప్పుడు అలాంటివేమీ లేకుండా పోయాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

  ‘కాంగ్రెస్ నాయకుల నోటికి అడ్డు అదుపు ఉండదు. వాళ్లది జాతీయ పార్టీ. వాళ్ల పార్టీ అధినేతను పొగిడి, సహచరులను బహిరంగంగా విమర్శించినా ఆ పార్టీ పట్టించుకోదు. కానీ మాది అలా కాదు. అడిగేవాడు లేకపోవడంతో స్వేచ్ఛగా బతికిన కాంగ్రెస్ వాళ్లను మా పార్టీలో చేర్చుకున్నారు. మరి వారి అలవాట్లు ఎలా మారతాయి? చంద్రబాబును నిరంతరం విమర్శించే మందకృష్ణను డొక్కా మాణిక్యప్రసాద్ పొగిడి, మంత్రిని విమర్శించారు. ఇంకోవైపు బాబునూ పొగిడారు. ఇలాంటి సంస్క�ృతి వల్ల పార్టీ నష్టపోక ఏమవుతుంది? వాళ్లేదో కట్టుదాటుతున్నారని అనుకోవడం కంటే, అలాంటి వారిని తీసుకున్న నాయకత్వానిదే తప్పు కదా’ అని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు.

  గుంటూరు జిల్లాలో మంత్రి-మాజీ మంత్రి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో.. తాజాగా ఎంపి కూడా తలదూర్చడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మందకృష్ణ తమ నాయకుడిగా పొగిడి, సొంత పార్టీ మంత్రి పులా ్లరావును విమర్శించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యవహారశైలిపై పార్టీ వాదుల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పతిపక్షంలో పార్టీని మోసిన పుల్లారావును విమర్శించే నైతిక హక్కు డొక్కాకు గానీ, ఆయనను సమర్ధించిన రాయపాటికి గానీ లేదంటున్నారు.

  ‘నిన్నగాక మొన్న వచ్చిన డొక్కాకు ఈ పార్టీ సిద్ధాంతాలేమి తెలుసు? ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా తనను ఎవరూ అడగరనుకుంటున్నారు. ఆయనను గత ఎన్నిక ల్లో కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరి, ఎంపి అయిన రాయపాటి సాంబశివరావు సమర్ధించడం మరీ దారుణం. ఇలాగే మౌనంగా ఉంటే మా పార్టీ తెలుగు కాంగ్రెసయిపోతుంద’ని మరో సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. డబ్బున్న వారిని పార్టీలో చేర్చుకోవడం, పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడం వల్ల వచ్చిన సమస్యలని, ప్రస్తుతం ఎన్టీఆర్ హయాం నాటి మానవ సంబంధాలు లేవని నేతలు విశ్లేషిస్తున్నారు.

  అటు కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరి ఎంపి అయిన జెసి దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్‌రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్లు మీడియాతో మాట్లాడుతుండటాన్ని పార్టీ సీనియర్లు సహించలేకపోతున్నారు. ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వ వైఖరికి నిరసనగా గన్‌మెన్లను వెనక్కి పంపి, అజ్ఞాతంలోకి వెళ్లారు. తమకు తెలుగుదేశం పార్టీ ఎంత అవసరం ఉందో తమతో పార్టీకీ అంతే అవసరం ఉందని ప్రభాకర్‌రెడ్డి మీడియా వద్ద బాహాటంగానే వ్యాఖ్యా నించారు. గతంలో నాలుగుసార్లు జెసి ప్రత్యక హోదా అంశంపై పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. బాబు అంటే అధికారులకు భయం పోయిందని వ్యాఖ్యానించారు. అయినా రాయపాటిని కనీసం మందలించలేదు.నర్సరావుపేట అధికార పార్టీ ఎంపి రాయపాటి సాంబశివరావు పేరుకు టిడిపి ఎంపి అయినప్పటికీ, ఇంకా కాంగ్రెస్ సంస్క�ృతి కొనసాగిస్తున్నారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. గతంలో ఆయన ప్రధాని మీదనే విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపి నాశనం అవుతుందని శపించారు. తాజాగా తన శిష్యుడయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సమర్ధించారు. డొక్కా చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు.

  అటు ఉత్తరాంధ్రలో మంత్రులు గంటా శ్రీనివాస్-అయ్యన్నపాత్రుడు మధ్య బహిరంగ యుద్ధం జరుగుతోంది. ఇద్దరి మధ్యన అధికారులు నలిగి పోతున్నారు. చివరకు కీలకమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి వద్దకు చేరుతున్నాయి. ఒక దశలో ఇద్దరూ సీఎం వద్ద పంచాయితీ పెట్టుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమ- ఎమ్మెల్యే వంశీ మధ్య రామవరప్పాడు పేదలభూములపై పెద్ద వివాదమే మొదలయింది.
  బాధితులకు నచ్చ చెప్పేందుకు వెళ్లిన వంశీని, ఏ-1 ముద్దాయిగా చేర్చిన వైనం సీఎం వద్దకు చేరింది. తాను జైలుకయినా వెళతానని, బెయిలు కూడా తెచ్చుకోనని వల్లభనేని వంశీ తెగేసి చెప్పారు. దీని వెనుక మంత్రి ఉమ హస్తం ఉన్నట్లు వంశీ అనుచరులు ఆరోపిస్తున్నారు.కాంగ్రెస్ నుంచి వచ్చిన వారితో పార్టీ క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతింటోందని, వారిని చూసి తమ పార్టీ నాయకులు కూడా క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పార్టీలోకి కాంగ్రెస్ నేతలు వెళ్లకూడదన్న తమ అధినేత వ్యూహం చివరకు పార్టీని క్రమశిక్షణ, కట్టుబాటును దెబ్బతినేలా చేస్తోందన్న ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది.

  http://www.suryaa.com/news/andhra-pradesh/article.asp?contentId=235997

 4. Veera

  రాసి పెట్టుకో జ‌గ‌న్ అంటున్నమంత్రులు !!!
  2018 కి పోలవరం పూర్తి-మంత్రి దేవినేని ఉమా చౌదరి
  10 మంది YCP MLA లు 15-20 రోజుల్లో TDPలోకి-మంత్రి పుల్లా రావు చౌదరి
  (బాబు బినామీ చంద్రజ్యోతి రాదక్రిష్ణ చౌదరి వ్రాసారు
  గవర్నర్ ను మారుస్తున్నారు , కొత్త గవరనర్ మోత్కుపల్లి అని 100 సార్లు.
  ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు కమ్మ MLA లు TDP లోకి అని వ్రాసారు, కర్నూల్ కు చెందిన 5 మంది MLA లు సంక్రాంతి లోపు అని రాసారు,
  సంక్రాంతి పోయి శివరాత్రి కూడా వస్తోంది.
  సిగ్గు లేకుండా ఒక్కో MLA కు 50 కోట్లు అయినా ఇస్తాము రండి అనేదాకా వెళ్ళింది నిప్పు బాస్ వ్యవహారం !!!)
  కొసమెరుపు:రేపు అలా జరగలేదు కదా అంటే తూచ్ మా బాస్ కేనా ముని శాపం అంటారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s