చిరు బీజేపీ ప్రవేశానికి చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆయనకు అంత వీజీగా కనిపించడం లేదు వ్యవహారం. దానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఇప్పటికే హవా చెలాయిస్తున్న వర్గాలే కావడం విశేషం. సుదీర్ఘకాలంగా పార్టీని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్న నేతలు ఇప్పుడు మరొకరిని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో చిరంజీవికి బీజేపీలో స్థానం కొంత గందరగోళంగానే కనిపిస్తోంది.
ఏపీలో బీజేపీ లో చాలాకాలంగా కమ్మ సామాజికవర్గం హవా నడుస్తోంది. ఆర్ఎస్ఎస్ లో బ్రాహ్మణ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్నప్పటికీ రాజకీయ విభాగంలో మాత్రం కమ్మ నేతలదే అక్కడ పట్టు కొనసాగుతోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత కాపు సామాజికవర్గంపై ఆపార్టీ కన్ను వేసింది. ఇప్పటికే నలుగురిలో ఇద్దరు కాపు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నారు. వారిలో ఒకరికి మంత్రిపదవి కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కాపులకే కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో చిరంజీవి ఆరంగేట్రం జరిగితే బీజేపీ పూర్తిగా కాపుల హస్తగతమవుతుంది.
దాంతో అది కమ్మ నేతలకు కాస్త కంటగింపుగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలపై కొందరు నేతలు అయిష్టత ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపార్టీలో కేంధ్రమాజీ మంత్రులు పురందేశ్వరి, కావూరి వంటి వారి సహా సుదీర్ఘకాలంగా ఆపార్టీలో చక్రం తిప్పుతున్న నేతలు కంభంపాటి హరిబాబు వంటి వారు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు సమాచారం. వారందరికీ జాతీయ స్థాయిలో కీలకనేతగా ఉన్న వెంకయ్యనాయుడు అండదండలు అందిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. దాంతో పార్టీలో తమ సామాజికవర్గం పట్టు కోల్పోకుండా చేయడం కోసం అనేకరకాలుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చిరంజీవి రాకకు ఆటంకాలు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే చిరంజీవి సత్తా మీద పలు వాదనలు ముందుకు తెస్తున్నారు. ప్రజారాజ్యం పెట్టి ఫెయిల్ అయిపోయిన నేతగా చిరంజీవికి కాపుల్లో కూడా ఆదరణ తగ్గిన విషయాన్ని వారంతా ముందుకు తెస్తున్నారు. కాంగ్రెస్ కి ఏవిధంగానూ చిరంజీవి స్టామినా తోడ్పడలేదని వివరిస్తున్నారు. అంతేగాకుండా సినీహీరోలు రాజకీయంగా ఒక్కసారి ప్రభావం చూపగలరు తప్ప..అంతకుమించి వారి ప్రభావం ఉండదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతేగాకుండా చిరు లాంటి వారు పెద్దగా ప్రజల్లో కనిపించరని…దానివల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం లేదని కూడా చెబుతున్నారు. ఈపరిస్థితుల్లో చిరంజీవి చుట్టూ అనేకరకాల ఆటంకాలు కలుగుతున్నట్టు కనిపిస్తోంది. చిరు కమల గృహ ప్రవేశం ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారుతోంది.
Kulanni …Kalam ni addam pettukuni desam ni dochukuntunna rojullo
Manava viluvalanu kapaduthunna kondharu …
https://m.facebook.com/humansofbombay/posts/455518767990439:0?locale2=en_GB&__tn__=%2As
http://www.sakshi.com/news/family/sunil-special-interview-for-sakshi-318042?pfrom=home-top-story
నేను ‘విలువ’ లు కలిగిన మనిషిని -బాబు
అవును వోటుకు 5 కోట్లు,పార్టీ మారే MLA లకు 50 కోట్లు విలువ కట్టే మనిషి
కుక్క తోక వంకర !!!
YCP MLA లతో బాబు అండ్ కో ఆడిన బేరసారాలు ఆడియో వీడియో లతో త్వరలో బయటపెడతాం-అంబటి రాంబాబు