చంద్ర‌బాబు ఇంత కుట్ర చేశారా..?

-ప్ర‌త్యేక హోదా కేవ‌లం రాజ‌ధానికే కావాల‌ట‌
-మోడీని కోరిన చంద్ర‌బాబు
-రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర కి వ‌ద్ద‌ని ఆయ‌న విన‌తి
-‘ఈనాడు’ క‌థ‌నంలో వెలుగు చూసిన వాస్త‌వాలు
-బాబు విన‌తులు ప‌క్క‌న పెట్టేసిన మోడీ

అభివృద్ధి పూర్తిగా అమ‌రావ‌తికే ప‌రిమితం కావాల‌ని ఆయ‌న ఆశిస్తున్నారు. ఇది ఆరోప‌ణ కాదు. ఈనాడు క‌థ‌నం ప్ర‌కారం కేంధ్రం ముందు చంద్ర‌బాబు పెట్టిన ప్ర‌తిపాద‌న‌లు చూస్తే అది వాస్త‌వం అని రుజువ‌వుతోంది. చంద్ర‌బాబు చిట్టా ప్ర‌కారం అమ‌రావ‌తిలో పెట్టిన ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆయ‌న ప‌దేళ్ల పాటు 100శాతం ఎక్సైజ్, ఐదేళ్ల పాటు 100శాతం ఆదాయ‌పు ప‌న్ను రాయితీలు అడిగారు. ప్లాంట్లు, యంత్రాల‌పై రాయితీలు పెంచాల‌ని, ఇత‌ర అనేక రాయితీలు ఏపీ రాజ‌ధాని ప్రాంతానికి ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. అంటే ప్ర‌త్యేక హోదా ప్ర‌కారం ల‌భించే అన్ని స‌దుపాయాల‌ను అమ‌రావ‌తికి ఇవ్వాల‌ని మాత్ర‌మే ఆయ‌న విన్న‌వించారు. త‌ద్వారా ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ద్దు..కేవ‌లం రాజ‌ధాని వ‌ర‌కూ మాత్ర‌మే ఆ స‌దుపాయం క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు కోరిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అది కూడా కేంధ్రం స్పందించ‌క‌పోవ‌డం ఒక భాగ‌మైతే ఏపీకి సీఎంగా ఉన్న వ్య‌క్తి ఇంత‌గా దిగ‌జారి వ్య‌వ‌హ‌రించ‌డం ఏవిధంగా స‌మంజ‌స‌మ‌న్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. అమ‌రావ‌తి మిన‌హా మిగిలిన ప్రాంతాల‌న్నింటినీ విస్మ‌రించి కేవ‌లం ఒక్క రాజ‌ధాని కోసం ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ 28 సార్లు ప్ర‌త్యేక విమానం లో ఢిల్లీ వెళ్ల‌డం భావ్య‌మా అన్న వాద‌న వ‌స్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరడం ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌తినిధిగా ఆయ‌న క‌ర్త‌వ్యం. అంతేగాకుండా క‌నీసం ప్యాకేజీ, రాయితీలు వంటివి ప్ర‌క‌టిస్తే అవ‌న్నీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌కు ద‌క్కాల‌ని కోర‌డం బాధ్య‌త‌. అందులోనూ వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు మేలు చేసేలా చూడ‌డం మాన‌వ‌త‌. కానీ ఇవ‌న్నీ చంద్ర‌బాబు మ‌ర‌చిపోయారు. పూర్తిగా రాజ‌ధాని చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు విస్మ‌రిస్తున్నార‌న్న వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టి అమ‌రావ‌తిని తీర్చిదిద్దాల‌ని ప్ర‌య‌త్నించారు. స‌మ‌గ్ర‌దృష్టి మ‌ర‌చిపోయారు. సొంత సామాజిక‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే ఆయ‌న పాటుప‌డుతున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు ఊత‌మిచ్చారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు వైఖ‌రి మొన్న‌టి ద‌స‌రా సంద‌ర్భంగా నిర్వ‌హించిన అమ‌రావ‌తి శంకుస్థాప‌న రోజునే ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యింది. అయితే అప్ప‌ట్లో తాను ప్ర‌త్యేక హోదా అన‌బోయి..ప్యాకేజీ అన్నానంటూ ఆయ‌న మాట మార్చేసిన సంగ‌తిని ఏపీ ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేరు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర స‌హా రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల‌ను విస్మరించి తాను పూర్తిగా క్యాపిట‌ల్ సీఎంగా నిరూపించుకున్నారు. దాంతో ఇది ఇప్పుడు ఏపీ వాసుల‌ను ర‌గిలిస్తోంది. రాష్ట్రాన్ని నిలువునా ముంచుతున్న కేంధ్రంతో పాటు ఏపీ ఆశ‌లు నీరుగార్చ‌డానికి మూల‌కార‌కుడిగా ఉన్న చంద్ర‌బాబు తీరుపైనా జ‌నం భ‌గ్గుమంటున్నారు. కేవ‌లం రెండు జిల్లాల ప‌రిధిలో ఉన్న సీఆర్డీఏ ప్రాంతం కోసం 11 జిల్లాల‌ను బ‌లిచేస్తారా అంటూ నిల‌దీస్తున్నారు. ఇది చంద్ర‌బాబు లాంటి అనుభ‌వ‌శీలికి ఎలా తగునో అర్థం కావ‌డం లేదు.

http://updateap.com/?p=68575

12 Comments

Filed under Uncategorized

12 responses to “చంద్ర‌బాబు ఇంత కుట్ర చేశారా..?

  1. PFK

    How about signing a online petition against the MLA movements as a whole/for each MLA?

  2. Rastram lo …….Dongalu paddaru

    http://www.sakshi.com/news/district/it-is-an-international-scam-319051?pfrom=home-top-story

    Please post this article on the social media and let the world know about these looters who talk about character.

  3. Thousands of religious fanatics attend the funeral of a fanatic hanged for killing a secular minister in Pakistan !!
    When will these people change ?

    http://www.thehindu.com/news/international/multitudes-attend-funeral-of-mumtaz-qadri/article8300636.ece

    How are caste fanatics different from religious fanatics ??
    One loot their own people and the other kill their own people.

  4. Veera

    ప్రతి 100 కి.మీ కి ఒక ఎయిర్ పోర్ట్ కడుతున్న సింగపూర్ రాజా ఉన్న AP కి కొత్త రైళ్ళు అవసరమా?

  5. Can these fanatics stop playing dramas and fooling the public ?
    Every evening they speak to each other over the phone to discuss unethical strategies no matter whic Party they are in.

    http://www.sakshi.com/news/district/closed-options-for-purandeswari-to-join-in-tdp-says-varla-ramaiah-318954?pfrom=home-top-story

    Shame on those fanatics who say Johar Ntr with their left hand and with their right hand say Zindabad to Babu who backstabbed Ntr.
    Babu is worse than Aurangazeb in history- Ntr

  6. We will kick out Indians – Donald Trump
    I don’t balme him …atleast he is thinking of his country
    Whilst some shameless caste fanatics from India keep singing TANA thandhana and opening Ntr statues in their backgardens in USA.
    They are niether Indian nor American ?

    http://indianexpress.com/article/world/world-news/us-presidential-election-donald-trump-again-blames-india-for-taking-away-american-jobs/

  7. Veera

    అదండీ విషయం !!!
    గతం లో హైదరబాద్ వస్తే మోడీ ని అరెస్ట్ చేయిస్తాను, BJP తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేసాను అన్న బాబు ను నమ్మలేము ,నమ్మకమైన నేస్తం కాదు అని డిల్లీ లో టాక్ బహుశా అందుకే AP ని కేంద్రం పెద్దగా పట్టించుకోవడం లేదు .ప్రత్యెక విమానాల్లో బాబు ఊరికే డిల్లీ వెళ్లి రావడం బాగా లేదు-ఆర్ధిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు, డిల్లీ

  8. Veera

    కేంద్రంపై మేం పోరాడితే వచ్చేదేమీ లేదు-యనమల..
    అవును ఓటుకు కోట్లు కేసులో నోటీసులు తప్ప-బ్రహ్మి
    -Suresh Emmareddy

  9. Veera

    అవసరమా? ఆహా అవసరమా అని డిల్లీ పెద్దలు అనుకొన్నారేమో!!!!
    హైదరాబాద్ ను ఒంటిచేత్తో నిర్మించిన మేస్త్రికి అమరావతి ఒక లెక్కా ?
    ఎంతో సంపదను సృష్టించిన మేధావికి పోలవరం నిర్మాణం ఇంకో లెక్కా?
    సెల్ ఫోన్ ను ఇండియాకు తీసుకొచ్చిన వ్యక్తికి.. ఇంటర్నెట్ ను ఇండియాకు పరిచయం చేసిన వ్యక్తి పాలనలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు?
    -GA

  10. Veera

    జగన్ రాసి పెట్టుకో, 2018 కి పోలవరాన్ని పూర్తి చేస్తాం-దేవినేని ఉమా చౌదరి
    (ముందు కేంద్రం ఇచ్చిన 100 కోట్లు రాసిపెట్టుకో)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s