ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబునాయుడు ఇప్పుడు చక్ర బంధంలో ఇరుక్కు పోయారు. సొంత రాష్ట్రంలో, ఢిల్లీలో, చివరకు పొరుగు రాష్ట్రం ఆయనకు అన్నీ సమస్యలుగా మారాయి. పివి నరసింహారావు తరువాత ఢిల్లీలో కీలక భూమిక పోషించిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ‘‘ఐకె గుజ్రాల్, దేవగౌడలను ప్రధానమంత్రులను చేసింది నేనే. బిఆర్ అంబేద్కర్‌కు భారత రత్న ఇప్పించింది నేనే. వాజ్‌పాయికి స్వర్ణచతుర్భుజి ఐడియా చెప్పింది నేనే,’’ అంటూ కొన్ని అతిశయోక్తులను ప్రచారం చేసుకున్నా, కేంద్రంలో రాజకీయంగా కీలక భూమిక పోషించిన విషయం మాత్రం వాస్తవం. ముఖ్యమంత్రిగా తిరుగులేని నాయకునిగా ఉంటూ ఢిల్లీలో ఫ్రంట్ కన్వీనర్‌గా కీలక భూమిక పోషించారు.
ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు తప్పటడుగులు వేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రచారంతోనే దేన్నయినా సాధించవచ్చు అనే భ్రమ నుంచి చంద్రబాబు బయటపడాలి. గతంలో మాదిరిగా మీడియా ఒకే పార్టీకి, ఒకే వర్గానికి లేదు. ఒకవైపు అన్యాయంగా విభజించి కట్టుబట్టలతో పంపించారు. రాజధాని లేదు అంటుంటారు. మరోవైపు నర్సరావుపేటను ప్రపంచంలోనే టాప్ 10 నగరాల్లో ఉండేట్టు చేస్తానంటారు. మరో నెల రోజులకే అమరావతిని ప్రపంచంలో టాప్ టెన్ నగరాల్లో ఒకటిగా నిలుపుతానని అంటారు. దేశానికి ఆర్థిక రాజధాని ముంబై నగరమే ప్రపంచంలో టాప్ 10 నగరాల జాబితాలో లేదు. ఇక నర్సరావుపేట ముంబైని దాటుకుని వెళ్లాలి.
చక్రం తిప్పడం అటుంచి మోదీ దర్శన భాగ్యం కూడా బాబుకు అంత సులభంగా దక్కడం లేదు.
సొంత రాష్ట్రం విషయానికి వస్తే కులాల ఆధిపత్య పోరుసాగుతోంది. మహిళా అధికారిపై ఎమ్మెల్యే దాడి జరిపినా చర్య తీసుకోలేదనే విమర్శ ప్రభుత్వానికి మచ్చగా నిలిచింది. గోదావరి పుష్కరాలు మొదలుకొని ఎన్నో విషయాల్లో ప్రభుత్వం విమర్శల పాలైంది. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని విపక్షాలు బలంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.
రాజకీయాల్లో నైతిక విలువల గురిం చి, నేను నిజాయితీపరుణ్ణి, నిప్పును అంటూ తన గురించి తాను ఎక్కువగా చెప్పుకునే రాజకీయ నాయకుడు దేశం మొత్తంలో చంద్రబాబు తప్ప ఎవరూ ఉండరు. నాయకుల నిజాయితీ నచ్చితే ప్రజలు వేనోళ్లుగా పొగుడుతూ ఉండవచ్చు కానీ తనకు తానే ఇలా ఎవరూ చెప్పుకోరు. వేలికి ఉంగరం, చేతికి వాచీ కూడా లేని నాయకుణ్ణి అంటూ ఈ రెండింటిని తన నిజాయితీగా నిదర్శనంగా చూపడం నవ్వులపాలయ్యేట్టుగా ఉంది. సెల్‌ఫోన్‌లు వచ్చాక వాచీలు వాడేవారు అరుదు. గతంలో రోజుకు రెండు ఇడ్లీలు, పుల్కాలు మాత్రమే తింటాను అని తానెంత నిజాయితీ పరుడో గతంలో చెప్పుకునే వారు.
మనవడితో ఆడుకునేంత సమయం కూడా లేకుండా 18 గంటల పాటు కష్టపడుతున్నానని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి మనవడితో ఆడుకుంటున్నారా? వంకాయ మసాలాతో తిన్నారా? ఎన్ని గంటలు పడుకుంటున్నారు అనేది ప్రజలకు అనవసరం. ముఖ్యమంత్రిగా అధికారం అప్పగించిన తరువాత ప్రజలకు ఏం చేశారు అనేది ముఖ్యం.
ఇక అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ పరువు తీసేట్టుగా సాగుతున్నాయి. రికార్డులోకి ఎక్కని మాటలను పక్కన పెడితే ఇక కొవ్వు ఎక్కిందా? మగతనం ఉందా? ఇవీ అసెంబ్లీలో వినిపించిన కొన్ని ‘ఆణిముత్యాలు.’ బాబుకు ఢిల్లీలో, సొంత రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా ఇబ్బంది తప్పడం లేదు.
పాలనకు కొత్తే అయినా మొదట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 1956 నిబంధన వంటి కొన్ని తప్పటడుగులు వేసినా పథకాల్లో తమకు తిరుగులేదని తెలంగాణ ప్రభుత్వం నిరూపించుకుంటోంది. మీడియాలో అనుకూల వార్తలు ఎన్ని వచ్చాయి? వ్యతిరేక వార్తలు ఎన్ని అనే లెక్కలు పాలనకు కొలమానం కాదు. ఎన్నికల ఫలితాలే కొలమానం. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం వంటివి ప్రభుత్వానికి ప్రత్యేక ఇమేజ్ తెచ్చి పెట్టాయి.
బాబు హయాంలో క్లింటన్‌ను హైదరాబాద్‌కు రప్పిస్తే, ముందు మీ రాష్ట్రంలో తాగునీరు లేని గ్రామాలు చాలా ఉన్నాయి వాటికి నీటి సౌకర్యం కల్పించండి అని ఆయన హైటెక్ సిటీవద్ద జరిగిన సమావేశంలో చెప్పి వెళ్లారు.
తెలంగాణలో ఏం జరుగుతుందో ఆంధ్రలో చూస్తున్నారు, ఆంధ్రలో ఏం జరుగుతుందో తెలంగాణలో చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పాలనను బేరీజు వేసుకుంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల తీరును పోల్చి చర్చించుకుంటున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే. మొత్తం మీద ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణ బాబుకు అన్నీ చక్రబంధాలే. రెండేళ్లు గడిచాయి
@ Venukayya ….
Rastram anta kulam kadhu……Rastram anta manushulu
Stop sleeping in your chair and stop flattering Modi and do something good for everyone in AP.
http://www.greatandhra.com/politics/gossip/fact-sheet-gods-curse-to-ap-73485.html
No matter how much you hate or loot others in your own state…you will die taking nothing with you.
మోడీ చేతిలో ‘బాబు జాతకం’!
ఎంపీల వద్ద ప్రధాని సంచలన వ్యాఖ్యలు
నివ్వెరపోయిన ప్రజా ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ సర్కారును కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదా ఊసే లేదు. అది వచ్చే అవకాశంలేదని ఇప్పటికే టీడీపీ ఎంపీలు బహిరంగంగానే చెబుతున్నారు. మొన్నటికి మొన్న రాజమండ్రి బహిరంగ సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీకి ఇప్పటికే 1.4 లక్షల కోట్ల రూపాయలకు పైగా సాయం చేయబోతున్నామని ప్రకటించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని ఒక్క మంత్రి కానీ..ఎమ్మెల్యే కానీ అవన్నీ హామీలే తప్ప..వచ్చింది శూన్యం అని ఎందుకు చెప్పలేకపోయారు?. అసెంబ్లీలో తాజాగా చంద్రబాబునాయుడు బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలకు స్పందిస్తూ….కూల్ గా నవ్వుతూ అవన్నీ పీపీపీ ప్రాజెక్టులు..రకరకాల హామీలే అని చెప్పారు తప్ప..కొంత కఠినంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కేంద్రం ఏపీకి ఇచ్చామని చెబుతున్నది అన్నీ విభజన చట్టంలో ఉన్నవే. ఒకటి అరా ఉంటే..అదనంగా ఇఛ్చి ఉండొచ్చు. కానీ కీలకమైన ప్రత్యేక హోదా..పోలవరం విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా మాట్లాడకపోవటానికి కారణం ఏమిటి?. టీడీపీతో పాటు అన్ని పార్టీల్లో ప్రస్తుతం ఇదే చర్చ.
దీనికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అడ్డగోలు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ మోడి చేతిలో ఉన్నాయి. ఏ ప్రాజెక్టు వెనక ఏ స్కాం జరుగుతుందనే విషయాలతో కూడిన నివేదిక మోడీ దగ్గర ఉంది. అంతే కాదు సుమా సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ వద్దే ఏపీలో అవినీతి కంపు కొడుతోంది..మీరైనా మీ నాయకుడికి చెప్పొచ్చు కదా? అని వ్యాఖ్యనించటంతో అవాక్కవటం ఆయన వంతు అయింది. తొలుత పది నిమిషాల సమయమే ఇఛ్చిన మోడీ..తర్వాత ఇరవై నిమిషాలు ఆయనతో మాట్లాడి అక్కడ సాగుతున్న వ్యవహారాల గురించి ప్రస్తావించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పోలవరం అంచనాల పెంపు దగ్గర నుంచి పట్టిసీమ ప్రాజెక్టులో గోల్ మాల్, రాజధానికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ వ్యవహారం అన్నింటిపై కేంద్రం వద్ద పూర్తి నివేదికలు ఉన్నాయని ఆ ఎంపీ తెలిపారు.
సింగపూర్ సంస్థల విషయంలో చంద్రబాబు చూపిస్తున్న చొరవను ప్రధాని మోడీ, కేంద్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అధికార వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. స్వయంగా మోడీ అధికారులతో సింగపూర్ కంపెనీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. ఇన్ని లోటుపాట్లు, లోపాయికారీ వ్యవహారాలు ఉన్నందునే చంద్రబాబు కేంద్రం విషయంలో మౌనంగా ఉంటున్నారని..లేకపోతే బాబు తీరు చాలా భిన్నంగా ఉండేదని పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. తేడా వస్తే మోడీతో ఎలా ఉంటుందో మాకూ తెలుసులే అని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కూడా ఏపీ ప్రత్యేక హోదా అంశం ప్రస్తావనకు వస్తే మోడీ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
http://www.telugugateway.com/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%95%E0%B0%82/
Motto of KDP rule ……Dochuko Dachuko
http://www.sakshi.com/news/hyderabad/ysrcp-mlc-kolagatla-veerabhadra-swamy-takes-on-tdp-govt-325064?pfrom=inside-news-arround-hyd
Meeru antha dochukunna ….don’t forget that your body starts rotting within 10 miutes of death.
ప్రతి నా ..కు రాయలసీమ గుండాలు కడప గుండాలు ,పులి వెందుల గుండాలు అంటున్నాడు, కుల పిచ్చి తో సినిమాలలో కూడా సీమ రౌడీలు అని చూపెడుతున్నారు
2014 లో ప్రతి లక్ష జనాభాకు క్రైమ్ రేట్ వివరాలు
కృష్ణ జిల్లా-625, గుంటూర్-623, కడప-185
క్రైమ్ రేట్ లో ఢిల్లీ తర్వాత విజయవాడ 2 వ స్థానం
No comments please!!!
రోజా విషయములో మా పార్టీ తప్పు చేస్తోంది అని TDP వాళ్ళు ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నారు-సూర్య పత్రిక
ఏపిలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా సస్పెన్షన్ వ్యవహారం కూడా ఇలాగే మారింది. ఆమెను సభకు రాకుండా అధికార పక్షం అడ్డుపడిన వైనం.. దానిని ఎదుర్కొనే క్రమంలో వచ్చిన పబ్లిసిటీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రోజాను నిజజీవితంలో హరోను చేసిందన్న వైనం వివిధ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తనను ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ, అధికారపక్షం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి, హైకోర్టుకు ఆదేశాలిప్పించి, హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ సాధించిన రోజా వ్యవహారం, గత కొద్దిరోజుల నుంచి ఇంటా, బయటా చర్చనీయాంశమయింది. మీడియాలో ఆమె గురించే చర్చ జరుగుతోంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజా కేంద్ర బిందువుగా చర్చ జరుగుతున్న వైనం, ఆమెను హీరోను చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హైకోర్టు స్టే ఇచ్చినా తనను సభలోకి అనుమతించని వైనంపై, గత రెండు రోజుల నుంచి రోజా చేస్తున్న హడావిడి అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమయింది. తాజాగా మండుటెండలో ఫుట్‌పాత్ మీద పడుకుని, అనారోగ్యం పాలయి నిమ్స్‌లో చేసిన రోజా వ్యవహారం చానెళ్లలో నిరంతరం ప్రసారం కావడం, ఆమెను ప్రముఖులు పరామర్శించడంతో అందరి దృష్టి రోజావైపు మళ్లింది. ఇవన్నీ ఒక మహిళను అనవసరంగా వేధిస్తున్నారన్న చర్చకు సంకేతాలకు దారితీస్తున్నాయి. చివరకు తెలుగుదేశం పార్టీలో కూడా రోజా సస్పెన్షన్‌పై పూర్తి స్థాయి ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం.
రోజాను ఒక మహిళ అని కూడా చూడకుండా, ప్రభుత్వం అనవసర ప్రతిష్ఠకు వెళ్లి, రోజాకు ఉచిత పబ్లిసిటీ ఇచ్చిందన్న అభిప్రాయం టిడిపి వర్గాల్లో ఉంది. అయితే, పైకి చెప్పకపోయినా మీడియా వద్ద అంతర్గత సంభాషణల్లో మాత్రం వారు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు రాజమండ్రి ప్రజలు ఏమనుకొంటున్నారు?
జర్నలిస్టు మిత్రుడు (సాక్షి కాదు) ఈ రోజు (మార్చి19) రాజమండ్రి లో 27 మందిని అసెంబ్లీ, రోజా, బాబు పాలన పై ప్రజలను అడిగాడు, ఇందులో మహిళలు తో సహా అన్ని వర్గాల వారు ఉన్నారు
ఒకరు కూడా బాబును ప్రభుత్వాన్ని మెచ్చుకోలేదు, అందరూ తిట్తారట
బాబు ఎమన్నా కొత్త రాజ్యాంగం రాసాడా? కోర్ట్ లంటే కూడా గౌరవం లేదా ?
TDP వాళ్ళు జగన్ ఆ తిటడం ఏమిటి? అది అసెంబ్లీ నా? రోజా ను అంత ఏడిపిస్తారా? ఎల్లకాలం ఈయనే అధికారం లో ఉంటాడా? ఈ ధరలేంటి?
ఎంతసేపూ సింగపూరు అమరావతి అని అనడమే ఒక పని జరగడం లేదు అని అన్నారట !!!
ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ బాబూ???
ప్రతిపక్షం పట్టు సాధించిందా..?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి దశకు వచ్చాయి. ఇప్పటికే మూడు వారాల సమావేశాలు ముగిశాయి. ఇక ఆఖరి వారం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాలు నేరుగా తలబడ్డాయి. సభలో మరో పార్టీ లేకపోవడంతో అన్ని అంశాల్లోనూ ఫేస్ టూ ఫేస్ వార్ నడిచింది. అందులోనూ చంద్రబాబు అండ్ కో తో నేరుగా జగన్ తలబడ్డారు. చాలా పరిమితమైన అంశాల్లో మినహాయిస్తే మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ప్రతిపక్ష నేత జగన్ ఒంటరి పోరాటం చేశారు. అధికారపక్షం నుంచి మంత్రులు, ఓ డజనుమంది నేతలు ఎదురు పడినప్పటికీ ప్రతిపక్షం నుంచి జగన్ ఒంటరిగానే వారందరినీ ఢీకొట్టారు. దాంతో ఈ సమావేశాలు జగన్ కి, అధికారపక్షానికి మధ్య వైరం మాదరిగా సాగింది.
అయితే అనేక కీలక సందర్భాల్లో అధికారపక్షం అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్షనేతను టార్గెట్ చేసింది. సమస్యలకు సమాధానం లేనప్పుడు దానిని దారిమళ్లించే వ్యవహారానికి దిగింది. వ్యక్తిగత దూషణలకు కూడా దిగింది. సీఎం సైతం సవాళ్లతో సభను అడ్డుకున్నారు. కొద్దిసేపటికే మళ్లీ సర్థుకుని విషయం దాటవేయడం యధేశ్చగా సాగిపోయింది. అయితే ఈసారి సమావేశాల్లో జగన్ తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతానికి భిన్నంగా జగన్ లో వచ్చిన మార్పు ప్రతిపక్షాన్నే కాకుండా అధికారపక్షాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో జగన్ ని పక్కదారి పట్టించడం చాలా సులువుగా సాగిపోయేది. ఆయనకి సంబంధించిన కేసులు నుంచి ఇతర వ్యవహారాల వరకూ ప్రస్తావిస్తే చాలు వాటికి సమాధానం చెప్పుకోవడానికే జగన్ సమయమంతా వెచ్చించేవారు. దాంతో విషయం పక్కదారి పట్టడం చాలా ఈజీగా సాగిపోయేది. కానీ ఈసారి దానికి భిన్నంగా అన్ని సందర్భాల్లోనూ తాను చెప్పాలనుకున్న అంశానికే కట్టుబడి సభలో ప్రసంగాలు సాగించడం జగన్ లో కనిపించిన మార్పు. దాని ఫలితంగా అధికారపక్షం ఆటలు సాగడం చాలా కష్టమయ్యింది. ప్రజల ముందు ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపించేవి. సమస్యకు సమాధానం చెప్పలేకపోతోందన్న విషయం ప్రస్ఫుటమయ్యేది. ఉదాహరణకు ప్రాజెక్టుల్లో అవినీతి సందర్భంగా హంద్రీనీవాలో కాంట్రాక్ట్ 23 కోట్ల వర్క్ ని 75 కోట్లకు కట్టబెట్టడంపై జగన్ నిలదీసినప్పుడు చివరకు బీజేపీ సభ్యుడు విష్ణు కుమార్ రాజు కూడా జగన్ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దంపట్టింది. ఇలాంటి అనేక కీలకాంశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
ముఖ్యంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం సందర్భంగా జగన్ పక్కా హోంవర్క్ తో వచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. లెక్కల సహాయంతో నిలదీయడంతో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా చేసిన చిన్న చిన్న తప్పిదాలు అధికార పార్టీకి అవకాశం ఇచ్చాయి. కానీ చివరకు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడానికి అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. దానికితోడు మూజువాణీ ఓటుతో తీర్మానం వీగిపోయిందంటూ ప్రకటించడం ద్వారా అధికారదుర్వినియోగం సాగుతూ ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలను కాపాడే ప్రయత్నం యధేశ్చగా సాగుతున్న విషయం ప్రజలకు చేరింది. ఆ వెంటనే అనూహ్యంగా స్పీకర్ పై అవిశ్వాసం ప్రతిపాదించడం ద్వారా జగన్ తన వ్యూహాలకు పదును పెట్టినట్టు కనిపించింది. కానీ అక్కడ కూడా రూల్స్ సస్ఫెండ్ చేయడం ద్వారా ప్రభుత్వం మరోమారు అసెంబ్లీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన విషయం తేటతెల్లమయ్యింది.
అన్నింటికీ మించి రోజా విషయంలో ప్రభుత్వ వైఖరి జగన్ పార్టీకి అయాచితవరంగా మారింది. అధికారంలో ఉంటూ న్యాయవ్యవస్థలను గౌరవించకుండా వ్యక్తిగత కక్షలకు పోయిన చంద్రబాబు తీరు చాలామందిని విస్మయానికి గురిచేసింది. ప్రతిపక్షానికి అవకాశాలివ్వడంతో తన కంట్లో తానే వేలు పెట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరించిందన్న వాదనలు వినిపించాయి. అతివిశ్వాసం,వ్యక్తిగత కక్షతో వ్యవహరించడం ద్వారా చంద్రబాబు సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో జగన్ పని సులువుగా మారిపోయింది. దానికి తగ్గట్టుగా జగన్ దూకుడు ప్రదర్శించారు. తొలిరోజు సభకు హాజరుకాకపోవడం తాజాగా నల్లదుస్తులతో నిరసన వంటి కార్యక్రమాలతో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం పై చేయి సాధించడానికి తగ్గట్టుగా ప్రయత్నించారు. అయితే వచ్చే వారం కీలకంగా మారుతున్న తరుణంలో జగన్ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తిదాయకం. అసెంబ్లీ సమావేశాలకు ముందు 8మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పటికీ అలాంటి ప్రభావం పార్టీపై కనిపించకుండా సభలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా జగన్ ప్రభావం చూపించారు. కానీ ఇప్పుడు వచ్చే వారంలో సాగే సమావేశాల సందర్బంలో అనేక మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
http://telugu.updateap.com/?q=latest/671
Those narrow minded people from AP who talk only about caste and money even in USA should read this ….
The fact is the whites really care a foot about you.
Trump is openly saying that he will kick out Indians ,and your Ntr statues in backgardens will not protect you.
http://www.ndtv.com/world-news/i-yelled-black-lives-matter-at-a-trump-rally-this-is-what-happened-next-1288745?pfrom=home-lateststories
@ Fanatics … Stop hating and looting your own people. You take nothing with you when you die. Death is inevitable, so don’t waste your life.
Respecting even enemies with grace ….Well done Virat Kohli !!
Some narrow minded caste fanatics from AP who hate and loot their own people can learn something from you.
http://www.sakshi.com/news/sports/today-india-vs-pakistan-dhee-324578?pfrom=home-top-story
Life is short ….do and be good to all…..die with Grace and happiness and not with hearts and minds filled with hatred.
తెలంగాణా లో లక్షా 7 వేల 444 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి-మంత్రి ఈటెల
మీరు నయం సర్, కొద్దో గొప్పో ఫిల్ చేసారు, అదే AP లో లక్షా 50 వేల ఉద్యోగాలు ఉన్నాయి అయినా బాబు భర్తీ చేయడం లేదు మరి
పదవులన్నీ పెద్దోల్లకే! సూర్య పత్రిక,మార్చి 18,2016
ఏపిలో ఐపిఎస్, ఐఎఎస్‌లలో కమ్మ వర్గానిేక పెద్దపీట
-ఏపీ సీఎం చుట్టూ అంతా ఆ వర్గమే
-సలహాదారులు, చైర్మన్లు అంతా కమ్మవారే
ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కమ్మదనం పరిమళి స్తోంది.కీలక స్థానాల్లో ఐఏఎస్, ఐపిఎస్, జిల్లా కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్డీఓ పోస్టింగులు కమ్మ వర్గాన్నే వరిస్తున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకూ అంతా కమ్మ వర్గానిదే పెత్తనం. బాగా ఆదాయం వచ్చే పోస్టింగులు, కీలక నిర్ణయాలు తీసుకునే పోస్టులలో 80 శాతం కమ్మ వర్గానికే ప్రాధాన్యం దక్కుతోంది. మిగిలిన వారికి లాబీ చేసుకుంటే గానీ పోస్టింగులు దక్కడం లేదు. సీనియర్ బీసీ అధికారులు, అనుభ వజ్ఞులైన బీసీ అధికారులున్నప్పటికీ వారికి లూప్‌లైన్లే దిక్కవుతున్నాయి. వారికి పోస్టింగులు రావా లంటే సంబంధిత ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకూ ముడుపులు చెల్లించుకోవలసిందే. ఒకవేళ కమ్మ వర్గం కాని కులానికి పోస్టింగు లభిస్తే ఆరు నెలల్లోగా అతనిని మార్చి, సొంత కులం వారిని తెచ్చుకుంటున్న దృశ్యా లు కనిపిస్తున్నాయి. ఇది మిగిలిన కులాలను సంఘటితం చేసేలా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి కొత్తగా వేసే చైర్మన్లు, వివిధ విభాగాలకు నియ మిస్తున్న సలహాదారులు, కన్సల్టెంట్లలో 80 శాతం కమ్మ వర్గం ఖాతాలోకే చేరుతున్నాయి.
అత్యంత కీలకమైన జిల్లాలు, కీలక మైన శాఖల్లో బీసీలు ఉన్న దాఖలాలు బహు అరుదు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బీసీ అధికారులు అణచివేతకు గురవుతున్నారు. చివరకు కొద్దో గొప్పో డబ్బున్న బీసీలు వైన్‌షాపులు, రెస్టారెట్ల వంటి వ్యాపారం ప్రారంభిస్తే అందులో కూడా వాటాలకు తెగబడుతున్న దౌర్జన్యకర పరిస్థితులు ఆ రెండు జిల్లాల్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్ప మిగిలిన డీజీపీ, ఇంటలిజన్స్ చీఫ్, వివిధ శాఖల్లో సలహాదారులంతా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారేనని బీసీ అధికారులు గుర్తు చేస్తున్నారు.
పంతమా? శాంతమా? ఆంధ్రభూమి
హైదరాబాద్: ప్రజాసమస్యలను చర్చించే వేదికైన శాసనసభలో అధికార, విపక్షాలు వాటిని పక్కన పెట్టి, పంతాలు, పట్టింపులకు పోతున్నాయి. విపక్షాన్ని రెచ్చగొట్టి, వారిని తప్పుదోవపట్టించి తమ లోపాలు బహిర్గతం కాకుండా చూసుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తున్నట్టు ప్రస్తుతం జరుగుతున్న శాససనభ సమావేశాలు చూస్తే అర్థం అవుతోంది.
తొందరపాటు చర్య?
అధికార పక్షాన్ని, అందునా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్న రోజా దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికారపక్షం ప్రయత్నించింది. ఇందుకోసం స్పీకర్‌కు ఉన్న అధికారాలను వాడుకుంది. రోజాను సస్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి, కార్యదర్శి, స్పీకర్ కలిపి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
2008 సంవత్సరంలో కరణం బలరాంను సభ నుంచి ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేసిన సమయంలో ఉత్తరోత్రా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా బాధ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లలేకపోయారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.
అదే రోజా విషయంలో ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వకమునుపే ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో కూడా సాంకేతిక లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోపాలను పట్టుకుని రోజా సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఇలా ఎందుకు జరిగింది? పార్టీ అధినేత వత్తిడి మేరకు రోజాను సస్పెండ్ చేసే ప్రక్రియలో పొరపాట్లు దొర్లాయన్న వాదన వినిపిస్తోంది. రోజాను సస్పెండ్ చేసిన తీరు సక్రమంగా లేదని హైకోర్టు పేర్కొంది. శాసనసభ వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోని కోర్టు రోజా ఉదంతంలో జోక్యం చేసుకోవడం గమనార్హం.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని లోపాలను వెతికి, రోజాను శుక్రవారం సభలోకి అడుగుపెట్టకుండా చేసి, అధికార పార్టీ వివాదాన్ని మరింత జటిలం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను మన్నించి, రోజాను సభలోకి అనుమతించి, మందలించి వదిలేస్తే అధికార పక్షానికి గౌరవం పెరిగేది. రాజకీయ క్రీడలో అలా జరగదు కదా!
రోజాను సభలోకి రానీయకపోవడం వలన ఆమె ఇమేజ్ మరింత పెరిగింది.