నాకు 20 కోట్లు ఇస్తామన్నారు అయినా పార్టీ మారను-YCP MLA రాజేశ్వరి

తనకు ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని , పార్టీ మారాలని ఒత్తిడి వచ్చిందని ,అయినా తాను పార్టీ మారబోనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వి.రాజేశ్వరి స్పష్టం చేశారు.తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి ఆమె ప్రాతినిద్యం వహిస్తున్నారు.జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావులతో పాటు ఆమె కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది.దీనిపై ఆమె మాట్లాడుతూ పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు.జగన్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, తాను పార్టీ మారుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని,వార్తలు రాస్తున్నారని,అవి బాద పెడుతున్నాయని రాజేశ్వరి స్పష్టం చేశారు.డబ్బు కోసం పార్టీ మారనని ఆమె అన్నారు.మరో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ వంద కోట్లు ఇస్తానన్నా తాను పార్టీని వీడనని చెప్పారు. తమను సంప్రదించకుండా పార్టీ మారతారంటూ కొందరు వార్తలు రాస్తున్నారని ఆమె అన్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160329_17.php?p=1459230271875

బాబు టూర్లు, పుష్కర ప్రచారాలకు అంత ఖర్చా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనల కోసం,పుష్కరాలు తదితర ప్రచారం కోసం
అదనపు వ్యయం కోసం 133 కోట్లు ఖర్చుపెట్టినట్లు వచ్చిన వార్త తెలుగుదేశం పార్టీ కి ఇబ్బంది కలిగించేదే. ఒకవైపు రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలలో ఉందని చెబుతూ ఇంత పెద్ద ఎత్తున అదనపు వ్యయం చేయడంపై ప్రభుత్వం వివరణ ఇస్తే బాగానే ఉంటుంది.కాని వీటి గురించి ప్రస్తావించడం పెద్దగా జరగదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సీఎం స్వదేశీ,విదేశీ పర్యటనలతో సహా కృష్ణా పుష్కరాలకు ప్రచారం చేయడానికి గాను అదనంగా పెట్టిన ఖర్చు గా చూపారు.ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ అదనపు పద్దులను సభలో పెట్టారు. కాగా స్వాతంత్ర దినోత్సవాలకు,రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అదనంగా 19 కోట్లు ఖర్చు పెట్టినట్లు కూడా చూపారు. కాగా అవతరణదినోత్సాలు జరపకపోయినా ఖర్చు అంటూ పేర్కొన్నారని ఒక మీడియా వ్యాఖ్యానించింది.

జగన్ లేవనెత్తిన కీలక పాయింట్

ఎపి శాసనసభలో అగ్రిగోల్డ్ చర్చ సందర్భంగా ఒక మంచి పాయింట్ లేవనెత్తారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థకు సంబందించి 57౦ కోట్ల డిపాజిట్లు ఉన్నాయని కొద్ది నెలల క్రితం చెప్పారని, కాని ఇటీవల హైకోర్టులో సిఐడి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆరు లక్షల రూపాయలే డిపాజిట్ ఉందని తెలిపారని జగన్ వెల్లడించారు. యనమల ప్రభుత్వానికి ప్రాతినిద్యం వహిస్తారని, అలాగే సిఐడి కూడా ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థ అని,మరి అగ్రిగోల్డ్ సంస్థ డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. సిఐడి విచారణలో అనేక అంశాలు కనిపించడం లేదని అన్నారు.సంస్థ టూరిజం ప్రాజెక్టులు, ఇతర సంస్థల పై దర్యాప్తు జరగడం లేదని అన్నారు.ప్రకాశం జిల్లాలో క్లేరియంట్ అనే పేరుతో ఉన్న ఆస్తి అమ్ముతుంటే డిపాజిట్ దారులు పట్టుకుని హైకోర్టుకు తెలిపారని అన్నారు. వందకు పైగా అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థలు ఉన్నాయని, అగ్రిగోల్డ్ చైర్మన్ కుమారుడు దుబాయిలో బంగారం షాపు పెట్టారని చెబుతున్నారని అన్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160328_14.php?p=1459233771614

7 Comments

Filed under Uncategorized

7 responses to “నాకు 20 కోట్లు ఇస్తామన్నారు అయినా పార్టీ మారను-YCP MLA రాజేశ్వరి

  1. Veera

    ఐటి ఎవరి టైమ్ లో పెరిగింది.బాబా, వైఎస్సా
    చంద్రబాబు నాయుడు హయాంలో 85 వేల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వారి సంఖ్య 2 లక్షలకు చేరుకుందని చెప్పారు. చంద్రబాబు పాలన సమయంలో ఐటి పెట్టుబడులు 3533 కోట్ల రూపాయల మేర ఉంటే, వైఎస్ హయాంలో అది 13250 కోట్లకు చేరుకున్నాయని ఆయన చెప్పారు. చంద్రబాబు హయాంలో ఐటీ ఎగుమతుల టర్నోవర్ రూ. 5,025 కోట్లు అయితే వైఎస్ హయాంలో రూ. 33,482 కోట్లు జగన్ వివరించారు

  2. Veera

    రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే !!!
    2004 ఎన్నికలకు ముందు ఓడిపోతాను అని తెలిసిన బాబు కోటి వరాలు అని ప్రకటించి హైదరబాద్ లో 30 లక్షల మంది తో సభ ఏర్పాటు చేసి చాల హడావిడి చేసాడు కాని 42 (42/294=14%) సీట్లు మాత్రమే గెలిచి ఘోరంగా ఓడిపోయాడు.
    ఇప్పుడు మల్లా ప్రజలు తిట్టుకొంటున్నారు అని తెలిసి ఇలా MLA లను కొని నేను చాల బలంగా ఉన్నాను ను కలరింగ్ ఇస్తునాడు.
    పేరు గుర్తు లేదు హీరో గోపీచంద్ సినిమాలో కమెడియన్ ఆలి గాలి కొట్టిన ట్యూబ్ లు తగిలించుకొని నేను మైక్ టైసన్ అని బిల్డప్ ఇస్తుంటాడు మన నిప్పు లాగా!!!

  3. Veera

    జ్యోతుల నెహ్రూ పార్టీ మారడం పై అయన నియోజక వర్గమైన జగ్గం పేట లో ఉన్న గండేపల్లి మండలం మురారి గ్రామంలో రోడ్డు మీద ఉన్న ఒక 8 మందిని జర్నలిస్టు ఫ్రెండ్ (సాక్షి కాదు) అడిగితె 8 మంది కూడా జ్యోతుల నెహ్రూ చేస్తుంది తప్పు అన్నారట .

  4. Veera

    బాబు గ్రాఫ్ తగ్గింది-TDP MP లు JC దివాకర్ రెడ్డి ,రాయపాటి చౌదరి
    అందుకేగా 20-50 కోట్లు ఇచ్చి ఒక్కో MLA ను కొంటున్నాం-నిప్పు బాస్

  5. Veera

    ఉత్తరాఖండ్ ఫిరాయింపు రాజకీయాల పట్ల ఆందోళన వ్యక్తం చేసిన లోక్ సత్తా JP చౌదరి
    AP లో ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడండి సర్!!!
    ఆడు మనోడు అయితే ఓకే అంటారా !!!
    ఆ విధంగా ముందుకు పోతున్నారన్నమాట, అలా కానీండి!!!

  6. Veera

    Facts and Figures About IT Exports In United AP
    నిజానికి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన 1995 సెప్టెంబర్ నాటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎగుమతుల్లో దేశంలో మూడో స్థానంలో ఉండగా, చంద్రబాబు అధికారాంతమున అంటే 2004లో ఐదో స్థానానికి పడిపోయింది.

    సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ నగరాల నడుమ తేడా 1995-96లో కేవలం రూ.250 కోట్లు మాత్రమే కాగా, అది కాస్తా 2003-04కు వచ్చేసరికి రూ.2,500 కోట్లకు చేరింది. అదీ అప్పటి కర్ణాటక ప్రభుత్వ పనితీరుకూ, నాటి చంద్రబాబు ప్రభుత్వ పనితీరుకూ నడుమ తేడా!

    -2003-04 సాఫ్ట్‌వేర్ ఎగుమతుల గణాంకాల మేరకు దేశంలో కర్ణాటక వాటా 38 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా అప్పట్లో కేవలం 9 శాతం మాత్రమే!
    -తరువాత 2008-09 నాటికి ఆ వాటా 14 శాతానికి చేరింది.
    –చంద్ర బాబు 9 సంవత్సరాల హయాం లో 9 శాతం మాత్రమే వున్నా ఐటి ఎగుమతులు ఆ తర్వాత వచ్చిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 14 శాతానికి చేరింది .
    http://www.jagankosam.com/chandra-babu-it-story/

  7. Veera

    రామ రామ !!! సిబిఐ కి కొత్త అర్ధం చెప్పిన నిప్పు అండ్ కో
    అగ్రి గోల్డ్ పై సిబిఐ విచారణ చేస్తే బాధితులకు డబ్బులు రావు-అచ్చెం నాయుడు
    భ్రమరావతి భూ కుంభ కోణం పై సిబిఐ విచారణ చేస్తే పెట్టుబడులు రావు-నిప్పు
    CBI తో విచారణ చేస్తే మీరు దొబ్బిన లక్షల కోట్లు బయటకు వస్తాయి కదా రాజా !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s