ఓటింగ్‌పై ఉత్కంఠ‌

-మూజువాణికోసం అధికారపక్షం పక్కా కసరత్తు
-ఓటింగ్‌ కోసం వైసిపి గట్టిపట్టు
-ద్రవ్య వినిమయ బిల్లుపై తీవ్ర ఉత్కంఠ
-ఫిరాయింపు ఎమ్మెల్యేలే ఇరువురి లక్ష్యం
-బడ్జెట్‌ సమావేశాలకు నేడు ముగింపు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారంతో ముగుస్తుండగా ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌ ఓటింగ్‌ (తలల లెక్కింపు)కు ప్రతిపక్ష వైసిపి పట్టుబడుతుండటంతో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ కంటే కూడా ఇటీవలికాలంలో వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలనే అధికార, ప్రతిపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో పరిస్థితి రసకందాయంలో పడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు వైసిపి శతవిధాలా ప్రయత్నిస్తుండగా, విపక్షాన్ని ఎలాగైనాసరే చిత్తు చేసి తమ పంచన చేరిన శాసనసభ్యులను అనర్హత నుంచి కాపాడుకునేందుకు టిడిపి అంది వచ్చిన అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అధికార, ప్రతిపక్షాల ఎత్తులు, పైఎత్తుల మధ్య ముగింపు ఎలా ఉండబోతోందన్న జిజ్ఞాస రాజకీయవర్గాల్లో అధికమైంది.

ఈ నెల 5న గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలుకాగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై, వెనువెంటనే స్పీకర్‌పై వైసిపి అవిశ్వాసం ప్రతిపాదించింది. కాగా సర్కారుపై అవిశ్వాస తీర్మానం సమయంలో డివిజన్‌ లేకుండా చేసిన అధికారపక్షం, స్పీకర్‌ దగ్గరకొచ్చేసరికి డివిజన్‌కు అవకాశం కల్పించినా, విపక్షానికి విప్‌ జారీ చేసేందుకు తగిన సమయం ఇవ్వకుండా వ్యవహరించింది. దీంతో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం వైసిపి చేసిన రెండు ప్రయత్నాలూ విఫలం చేసింది.

తాము అవిశ్వాసం పెడుతున్నది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత కోసమేనని వైసిపి పక్ష నేత జగన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అనర్హత కోసం విపక్షం చేసిన రెండు ప్రయత్నాలనూ టిడిపి వ్యూహాత్మకంగా, అసెంబ్లీ రూల్స్‌లోని అవకాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని భగం చేసింది.

దీంతో చివరి అస్త్రంగా ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్‌ కోసం వైసిపి గట్టిగా పట్టుబట్టాలని నిర్ణయించింది. నాలుగు రోజుల ముందే తమ సింబల్‌పై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. తప్పనిసరిగా సభకు హాజరై ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరింది. డివిజన్‌ కోరుతూ స్పీకర్‌కు లేఖ ఇచ్చింది. తమ ఎమ్మెల్యేల జాబితాను అందజేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్‌ అందేలా అన్ని చర్యలూ తీసుకున్నట్లు, వీడియోలు, ఫొటోలు, సంతకాల వంటి ఆధారాలు సేకరించి పెట్టుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఎమ్మెల్యేల వలసలను కట్టడి చేసేందుకు పార్టీ ఫిరాయింపు చట్టం, అనర్హతవేటు, విప్‌ జారీ తదితర అంశాలను జగన్‌ ఉపయోగించుకోవాలని చూస్తున్నా తాజాగా జ్యోతుల నెహ్రూ, మరొక ఎమ్మెల్యే పి. సుబ్బారావు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీన్నిబట్టి జగన్‌ ఆత్మ విశ్వాసంపై దెబ్బ కొట్టేందుకు టిడిపి మంత్రాంగం నడుపుతున్నట్లు అర్థమవుతోంది. రెండు అవిశ్వాస తీర్మానాలకుమల్లే ద్రవ్య వినిమయ బిల్లును కూడా మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకోవాలని చూస్తోంది. డివిజన్‌ కోసం ముందుగా స్పీకర్‌కు వైసిపి రాతపూర్వకంగా నోటీసు ఇచ్చినప్పటికీ ఏదోక విధంగా డివిజన్‌ పెట్టకుండా మూజువాణితో బిల్లును నెగ్గించేందుకు పావులు కదుపుతోంది. సభ అదుపులో లేనప్పుడు స్పీకర్‌ మూజువాణి తీసుకుంటారని, ఆ పరిస్థితులను కల్పించేందుకు అధికారపక్షం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

http://www.prajasakti.com/Content/1777933

10 Comments

Filed under Uncategorized

10 responses to “ఓటింగ్‌పై ఉత్కంఠ‌

 1. Veera

  AP లో అవినీతి పెరిగింది-కాగ్ (Comptroller And Auditor General )
  హేం మాట్లాడుతున్నారు ,నిప్పు ఇక్కడ, నిప్పు ఆ !!! -హైదరబాద్ మేస్త్రి

 2. Veera

  పబ్లిక్ ఒపీనియన్
  అసెంబ్లీ లో చండాలంగా జగన్ మీద వాడిన పదాలు, జగన్ MLA లను బాబు కొంటున్న తీరు, పాలన పట్ల అసంతృప్తి ,మొత్తంగా జగన్ మీద చాల సానుభూతి వచ్చింది ప్రజల్లో !!!
  ఒక పచ్చ పాత TV రిపోర్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు ఈరోజు

 3. Veera

  టీచర్:బాబుకు బాలయ్య కు తేడా ఏమిటి?
  స్టూడెంట్: బాలయ్య కు కోపమొస్తే తన తొడ కొడతాడు, బాబుకు కోపమొస్తే పక్కోడి తొడ మీద కొడతాడు
  (నిజాం సుగర్స్ ప్రైవేట్ పరం చేయవద్దు అని చెబితే కోపం తో బాబు నా తొడ మీద కొట్టాడు
  -మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి)

 4. Veera

  బాబు కంటే కెసిఆర్ 100 రెట్లు మేలు !!!
  తెలంగాణా లో MLA లకు నియోజక వర్గ అభివృద్ధి కోసం 3 కోట్లు.
  AP లో నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు కేవలం TDP MLA లకు మాత్రమే, YCP MLA లు ఉన్న చోట మాత్రం ఓడిన TDP MLA లకు.
  ప్రపంచానికి ఈయన చెప్పిన పాఠాలు ఇవే మరి !!!
  http://teluguglobal.com/differences-between-kcr-and-chandrababu/

 5. Veera

  ఎపి ప్రభుత్వం దుబారా ఖర్చు -కాగ్ ఆక్షేపణ
  ఎపి ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ తీరును కాగ్ తప్పు పట్టింది.అదనపు వ్యయ నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని కాగ్ వ్యాఖ్యానించింది. శాఖాపరమైన ఆమోదం లేకుండానే ప్రభుత్వం 13315 కోట్ల రూపాయల మేర అదనపు వ్యయం చేసిందన్న విమర్శను కాగ్ చేయడం విశేషం. ఆర్ధిక సంస్కరణలను అమలు చేయడం లేదని కూడా కాగ్ ఆక్షేపించింది.దీంతో భారీ లోటును ఎపి ప్రభుత్వం నమోదు చేసిందని కాగ్ వ్యాఖ్యానించినట్లు కధనం.ఒక ప్రణాళిక లేకుండా 3026 కోట్లు కేటాయింపులు చేసిన ప్రభుత్వం చివరికి వాటిని వినియోగించకుండానే సరెండర్ చేసిందని కూడా కాగ్ తెలిపింది.2015 మార్చి ముప్పై ఒకటి నాటికి 274 ప్రాజెక్టులు పూర్తి కావల్సి ఉండగా,అవి పూర్తి కాలేదని తెలిపింది.సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల 42.82 శాతం వ్యయం పెరిగిందని కాగ్ పేర్కొంది.కేంద్రం ఆధార్ కార్డుల కోసం ఇచ్చిన డబ్బును వేరే అవసరాలకు మళ్లించినట్లు కాగ్ తెలియచేసింది.2014-15 లో అభివృద్ది వ్యయానికి నిధులు కేటాయించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాగ్ వ్యాఖ్యానించింది.ఎపి ప్రభుత్వం నిదులు దుబారా చేసిందని కాగ్ చెబుతోందా!దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్దిక మంత్రి యనమల ఎలా స్పందిస్తారో !
  http://kommineni.info/articles/dailyarticles/content_20160330_34.php?p=1459345042700

 6. Veera

  సినిమాల్లో సీమ ప్రజలను గూండాలుగా చూపిస్తూ కించపరుస్తున్నారు కాని నలుగురికి అన్నం పెట్టే గుణం సీమ ప్రజలది-YCP MLA శ్రీకాంత్ రెడ్డి
  చిరు కుటుంబం మినహా సినిమా పరిశ్రమ మొత్తం కమ్మ వాళ్ళ చేతుల్లో ఉంది, సాక్షి మినహా మొత్తం మీడియా కూడా కమ్మ వాళ్ళ చేతుల్లో ఉంది.
  ఒక లక్ష జనాభాకు 2014 లో నేరాలు ఘోరాలు
  క్రిష్ణ జిల్లా-625, గుంటూర్-623, కడప-185
  అయినా రాయలసీమ గూండాలు అని సినిమాల్లో చూపుతారు, కుల మీడియా కూడా వంత పాడుతోంది.ఉదయం లేస్తే సీమ వాళ్ళ మీద, రెడ్ల మీద విషం చిమ్ముతుంటారు
  No bad comments please !!

 7. Veera

  సాఫ్ట్ వేర్ అభివృద్ధి ఎవరి హయాములో ఎంత?
  బాబు(2003-04 నాటికి), YS (2009-10 నాటికి)
  1.సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో బాబు పాలనలో ఇండియా లో 5 వ స్థానం(8,66%) AP ది, YSపాలనలో 3 వ స్థానం (14.93%)
  2.బాబు దిగిపోయే నాటికి కంపెనీ ల సంఖ్య: 909, YS: 1584
  3.బాబు దిగిపోయే నాటికి ఉద్యోగాల సంఖ్య :85,945, YS :2,64,375
  4.బాబు దిగిపోయే నాటికి వచ్చిన పెట్టుబడులు (కోట్లలో): 3,533, YS :13,250
  5.బాబు దిగిపోయే నాటికి IT టర్నోవర్ (కోట్లలో):5,025,YS: 33,483
  6.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గత 60 సం లలో హైదరబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందింది YS హయాములోనే-JNTU శాస్త్రవేత్తలు

 8. Veera

  జ్యోతుల నెహ్రూ పార్టీ మారడం పై అయన నియోజక వర్గమైన జగ్గం పేట లో ఉన్న గండేపల్లి మండలం మురారి గ్రామంలో రోడ్డు మీద కనపడిన 8 మందిని జర్నలిస్టు ఫ్రెండ్ (సాక్షి కాదు) అడిగితె 8 మంది కూడా జ్యోతుల నెహ్రూ చేస్తుంది తప్పు అన్నారట .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s