అన‌ర్హ‌త చుట్టూ‌నే అంతా

-ముగిసిన బడ్జెట్‌ భేటీ
-సంప్రదాయాలు గాలికి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

అధికారంలోకొచ్చి రెండేళ్లన్నా కాకమునుపే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నికల భయం గూడుకట్టుకుందని అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తేటతెల్లం చేశాయి. వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా రక్షించడమొక్కటే ఏకైక లక్ష్యంగా ఆధ్యంతం టిడిపి జిత్తులు, ఎత్తులు సాగాయి. అధికారాన్ని, ‘మంద’ బలాన్ని చేతుల్లో పెట్టుకొని శాసనసభ నిబంధనావళి, నైతిక విలువలు, సభా సంప్రదాయాలు అన్నింటినీ తమకనుకూలంగా మార్చుకొని ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హత నుంచి బయటపడేయడంలో సఫలీకృతమైంది. ఒక పార్టీ సింబల్‌పై గెలిచి తదుపరి వేరొక పార్టీలో చేరినప్పుడు పదవికి రాజీనామా చేయడం ఆయా ఎమ్మెల్యేల నైతిక ధర్మం. విపక్ష శాసనసభ్యులను సాదరంగా ఆహ్వానించిన టిడిపి వారితో పదవులకు రాజీనామా చేయించడం కనీస బాధ్యత. కాగా ఫిరాయించిన ఎమ్మెల్యేలు, వారిని చేర్చుకున్న టిడిపిలకు ఎన్నికల ఫోబియా పట్టుకుంది. అందుకే అనర్హత వేటు పడకుండా అడుగడుగునా విపక్ష వైసిపి హక్కులను నిర్ద్వందంగా సర్కారు తొక్కేసింది.

రెండు అవిశ్వాసాలు
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 5న ప్రారంభం కాగా సెలవులు పోను లేకుండా చివరికి డివిజన్‌ పెట్టకుండా మూజువాణి ఓటుతో వీగిపోయేలా చేసింది. మరునాడు స్పీకర్‌పై వైసిపి అవిశ్వాస నోటీసు ఇవ్వగా అసెంబ్లీ రూల్‌ 71లోని కొన్ని భాగాలను సస్పెండ్‌ చేసి ఆగమేఘాల మీద ఆ రోజే చర్చ చేపట్టి మమ అనిపించింది. ఈ రెండు చర్యలూ వైసిపికి విప్‌ జారీ చేసే వెసులుబాటు ఇవ్వకుండా చేశాయి. తద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పడకుండా ప్రభుత్వం పక్కాగా వ్యవహరించింది. చివరిరోజు ద్రవ్యవినిమయ బిల్లుపై సైతం డివిజన్‌ లేకుండా చేసింది. వైసిపి డివిజన్‌ కోరినా ఏవో రూల్స్‌ను తెరమీదికి తెచ్చి స్పీకర్‌తో తోసిపుచ్చేలా చేసింది. మూజువాణిని ప్రయోగించింది. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్‌ కోసం వైసిపి నాలుగైదు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. అందుకే సర్కారు డివిజన్‌ లేకుండా జాగ్రత్త పడింది. సభలో డివిజన్‌ పెడితే టిడిపికి తలనొప్పి. వైసిపి ఇచ్చిన విప్‌ను ఫిరాయింపు ఎమ్మెల్యేలు ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుంది. ఉప ఎన్నికలొస్తాయి. ప్రభుత్వానికేమీ ఢోకా లేనందున ఒకవేళ వైసిపికే ఓటు వేస్తే రాజకీయంగా టిడిపి చిక్కుల్లో పడుతుంది. మొత్తమ్మీద ఉప ఎన్నికలకు భయపడే అనర్హత పడకుండా ఎమ్మెల్యేలను కాపాడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రోజాపై పంతం
వైసిపి ఎమ్మెల్యే రోజా విషయంలోనూ ప్రభుత్వం పంతానికి పోయింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ మధ్యంతర ఉత్తర్వులపై డివిజన్‌ బెంచిలో సవాల్‌ చేసి స్టే తెచ్చినా, జ్యూడీషియరీ, లెజిస్లేచర్‌ మధ్య వివాదంలా ప్రచారం చేసినా సస్పెన్షన్‌ సందర్భంగా ఉదహరించిన రూల్‌ తప్పని అంగీకరిస్తూనే, ప్రివిలేజి కమిటీ నివేదిక తీసుకొచ్చి రోజాను సభకు రాకుండా అడ్డుకుంది. ఇదిలా ఉండగా రాజధాని భూములు, పట్టిసీమ, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు తదితర అవినీతిపై విపక్షం నిలదీసినప్పుడు సర్కారు ఎదురుదాడి చేసింది మినహా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. రాజధానిలో టిడిపి నేతల భూముల కొనుగోలుపై సిబిఐ దర్యాప్తును తోసిపుచ్చింది. మరికొన్ని విషయాల్లోనూ విచారణపై వెనక్కిపోయింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రాన్ని విన్నవిస్తూ రెండోసారి తీర్మానం చేయడం తప్ప గట్టిగా కేంద్రంపై ఒత్తిడి చేయలేదు. ఈ విషయంలో సభలో బిజెపి, టిడిపి దాగుడు మూతలాడాయి. రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు తదితర ఎన్నికల హామీలపై సైతం ఎదురుదాడే

పార్టీలు, నేతలు మాట్లాడిన సమయం
టిడిపి 60-09 గంటలు
వైసిపి 21-08 గంటలు
ముఖ్యమంత్రి 8-04 గంటలు
ప్రతిపక్ష నేత 6-54 గంటలు
బిజెపి ఫ్లోర్‌ లీడర్‌ 4-40 గంటలు
స్వతంత్ర, నామినేటెడ్‌ 0-25 గంటలు

http://www.prajasakti.com/Content/1778388

కోడెల దుష్ట సంప్రదాయం నెలకొల్పారా
ద్రవ్య వినిమయ బిల్లుపై విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ కోరిన విధంగా ఓటింగ్ ను అనుమతించకపోవడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పిన కారణం ఆశ్చర్యంగానే ఉంది.ఓటింగ్ వల్ల రాష్ట్రానికి నష్టమని, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని ఆయన అన్నారు.నిపుణులతో మాట్లాడానని, సవరణలు కూడా చేయరాదని చెప్పారని ఆయన అన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటింగ్ సరిపోతుందని,ఎలాగూ అదికార పక్షానికి మెజార్టీ ఉన్నందున, డివిజన్ అవసరం లేదని ఆయన అనడం విశేషం. ఆ తర్వాత ఆయన విపక్షం నిరసన పట్టించుకోకుండానే చకచకా లెక్కలు చదివి సభను ముగించారు. కోడెల తాను తప్పు చేస్తున్నానని తెలిసే చేస్తున్నట్లు అనిపించింది.ఎందుకంటే బిల్లులపై ఓటింగ్ కోరడం సభ్యుల హక్కు. పార్టీలతో సంబందం లేకుండా ఒక్క సభ్యుడు కోరినా ఓటింగ్ పెట్టవలసిన బాద్యత స్పీకర్ పై ఉంటుంది. అందులోను ఒక పార్టీ విప్ జారీ చేసిన తర్వాత ,ఆ మేరకు తనకు లేఖ ఇచ్చిన తర్వాత కూడా అలా చేయడం ఒక పార్టీని ,పిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడానన్న సంతృప్తి కోడెలకు దక్కవచ్చేమోకాని, చరిత్రలో ఆయన ఒక దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పిన వ్యక్తిగా అప్రతిష్టను మూటకట్టుకున్నట్లు అవడం బాధాకరం.

http://kommineni.info/articles/dailyarticles/content_20160331_26.php?p=1459406409188

4 Comments

Filed under Uncategorized

4 responses to “అన‌ర్హ‌త చుట్టూ‌నే అంతా

 1. Veera

  ఎప్పుడోచ్చాం అని కాదన్నయా బులెట్ దిగిందా లేదా అన్నదే ముక్యం !!!
  మీకు అనుభవం లేదు, నేను 7 సార్లు MLA ని-బాబు కితకితలు
  ఏమి లాభం, మీ కుప్పం లో ఇప్పటికీ 65 శాతం పాఠశాలల్లో మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ లేవు-YCP నెల్లూర్ MLA అనిల్ కుమార్ యాదవ్

 2. Veera

  దేవు డా ….?
  యూనివర్శిటీలలో కుల సంఘాలా, ఇదేం పిచ్చి-బాబు అసంతృప్తి
  నేను తిరుపతి లో SFI లీడర్ గా ఉన్నప్పుడు SV యూనివర్సిటీ లో కమ్మ స్టూడెంట్స్ కి లీడర్ గా ఉండేవాడు బాబు – CPI నారాయణ చౌదరి
  బాబు ఏమి చేసినా అవినీతి కుల ప్రయోజనాలు ఉంటాయి-లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali
  అమరావతి లో రాజధాని పెట్టడం బాబు కులస్థుల కోసమే-టైమ్స్ పత్రిక

 3. Veera

  గత ఎనిమిదేళ్లు వరుసగా మిగులు సాధించిన రాష్ట్రంలో 2014-15లో మాత్రం 24,194 కోట్లు రెవిన్యూ లోటు నమోదైంది-కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్).
  అంటే 2006 నుంచి రాష్ట్రం లో మిగులు బడ్జెట్ లో ఉంది
  1995 లో బాబు CM అయినప్పుడు 1500 కోట్ల లోటు బడ్జెట్ ఉండేది,బాబు 2004 లో దిగిపోయేనాటికి 22 వేల కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడు, కాని 2006 వచ్చే సరికి YS మిగులు బడ్జెట్ సాధించాడు.

  మరి ఎవరిది ఉత్తమ పాలన? ఎవరు తిన్నారు? మరి ప్రతి రోజూ బాబు సంపద సృష్టించాను నేను సంపద సృష్టించాను అంటాడేమిటి?
  అయన సృష్టించిన సంపద అంతా ఆయనకు అయన బినామీలాకేమో !!!

 4. Veera

  ఎంత పచ్చ పాతం అద్యక్షా?
  4 MLA లు ఉన్న BJP నాయకుడు విష్ణు కుమార్ రాజు కు 4 గంటల 40 నిముషాలు ఇస్తారా ?
  67 MLA లు ఉన్న YCP నేత జగన్ కు 6 గంటల 54 నిముషాలు ఇస్తారా ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s