లేటెస్ట్ సర్వే
ఒక ప్రైవేట్ సంస్థ పార్టీ మారిన MLA లు ఉన్న విజయవాడ,జగ్గం పేట,నంద్యాల లో సర్వే చేసింది, 90% బాబు ను,పార్టీ మారిన MLA లను తీవ్రంగా తప్పు పట్టారు
10% మాత్రం ఇవన్నీ మామూలే అని చెప్పారు.
[ఆ ఎమ్మెల్యేలతో టీడీపీకి ఎంత కలిసొచ్చింది..!
మూడు నియోజకవర్గాల్లో ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాయలసీమ, రాజధాని, గోదావరి జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించినట్టు తెలిసింది.
చంద్రబాబు విధానాలతో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. విసిగివేసారిపోయిన జనాలు సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఆ నేపథ్యంలో సాగుతున్న పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే వ్యవహారం కూడా ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది. అధికారపక్షానికి అవసరం లేనప్పటికీ ఇప్పుడు విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్న ప్రచారం దిగువస్థాయి వరకూ వెళ్లింది. దాంతో పలువురు ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. రుణమాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని నిధులు లేవని చెప్పిన చంద్రబాబుకి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడివంటూ ఓ రైతు ప్రశ్నించిన తీరు దానికి అద్ధంపడుతోంది. డ్వాక్రా మహిళలు కూడా మాట తప్పిన చంద్రబాబుగానే చూస్తున్నారు. దాంతో ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నప్పటికీ జనాలు మాత్రం తిప్పుకోవడం అంత సులువగా కనిపించడం లేదు.
ఈ సందర్భంగా సర్వేలో కొందరు చేసిన వ్యాఖ్యలు
1.చంద్రబాబు రుణమాఫీ చేస్తానన్నారు. కానీ మా ఊరిలో ఒక్కరికి కూడా రుణమాఫీ జరిగలేదు. రైతులకు 30 వేల చొప్పున బ్యాంకుల్లో వేశారు. రుణమాఫీ అంటే అదే కాదుగా..మరి ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొంటున్నారని పేపర్లో వస్తోంది..డబ్బులెక్కడివి- వెంకటేశ్వర రావు , రైతు, మల్లిశాల, జగ్గంపేట నియోజకవర్గం
2.చంద్రబాబు ఆస్తులు ఎప్పుడూ లక్షల్లో ఉంటాయి..కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు 30 కోట్లు ఇస్తున్నారంటున్నారు..అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో- జనార్థన్, ఆర్ఎంపీ, జగ్గంపేట నియెజకవర్గం
3.5ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడానికి ఇబ్బందులు పడిపోయే నేతలు ఇక పోటీ చేయడం ఎందుకు..ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలో చేరిపోవడం మంచిది కదా..సూరిబాబు , వ్యాపారి, గోకవరం
4.పదేళ్లుగా అప్పుల్లో ఉన్న నాయకులు పార్టీ మారుతున్నారు. కానీ రేపు మళ్లీ అధికారం మారితే వెంటనే మరో గూటికి చేరిపోతారా- రమేష్, మురారి, గండేపల్లి మండలం
5.ఇంటికో ఉద్యోగం అన్నారు..డీఎస్సీ రాశాను. రెండేళ్లు దాటిపోతోంది. పోస్టింగ్స్ లేవు. కానీ మా సమస్యలు వదిలేసి ప్రభుత్వం ఎమ్మెల్యేలను చేర్చుకోవడం చుట్టూ తిరుగుతోంది- ప్రభాకర్, విజయవాడ
6.మా ఆవిడ అంగన్ వాడీ వర్కర్, జీతాలు పెంచామన్నారు. ఇప్పటి వరకూ ఇవ్వలేదు. కానీ ఎమ్మెల్యేలకు అన్నేసి కోట్లు ఇస్తున్నారని వింటున్నాం. జనాలకిస్తే ఉపయోగం గానీ అలా నేతలకివ్వడం ఏమిటి- కృష్ణ, ఆటో డ్రైవర్, విజయవాడ
7.ప్రశాంతంగా ఉన్న పార్టీలో చిచ్చు పెడుతున్నారు. ఏం నష్టమొచ్చిందని ఇప్పుడు మా ప్రత్యర్థులను తెచ్చి నెత్తిన పెడుతున్నారు. మళ్లీ విబేధాలతో అనవసర వివాదాలకు అధినేతే కారణమవుతున్నారు- మునెప్ప, టీడీపీ సభ్యుడు, కర్నూలు
8.సీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. పైగా రాయలసీమను కించపరిచేలా మాట్లాడుతున్నారు. కానీ రాయలసీమ ఎమ్మెల్యేలను మాత్రం చేర్చుకుంటున్నారు. – గౌస్ దేశాయ్, నంధ్యాల
9.ఎమ్మెల్యేలు పార్టీలు మారడం కొత్త కాదు ఇప్పటితో ఆగదు గానీ..రెండేళ్ల తర్వాత ఇప్పుడు పార్టీలు మారుతున్న తీరు సమంజసంగా లేదు. యల్లాగౌడ్, లైబ్రేరియన్, కర్నూలు జిల్లా
Kotlu dochukuntu ……aa dabbu tho prajaprathinidhulanu kontundhi chalaka
Ee niru pedhalu …..Jeethalu penchukunnaru !!
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2108:2016-04-01-06-05-57&Itemid=665
Chee ….chee …..kondhari brathukulu.
అధికారపు అహం!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలను ఈ కోవలోనే చూడాల్సిఉంది.
రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏల గెలుపుకోసం అవసరమైన ఖర్చంతా తానే పెట్టుకుంటాననడం, ఖర్చు గురించి భయపడొద్దని అభయమివ్వడం ఉన్నత స్థాయిలో అవినీతికి గేట్లు తెరుస్తున్నామని బాహాటంగా సంకేతాలు ఇవ్వడమే.
మంత్రులు, ఎంఎల్ఏలు ఇతర అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఆయన ఇచ్చిన సందేశం ప్రజా స్వామ్యానికి విరుద్ధం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కాదుకదా.. కనీసం పంచాయతీ ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు. అధికారపార్టీకి చట్టసభల్లో కావాల్సినంత బలముండటమూ, ఉన్న దాన్ని మరింతగా పెంచుకోవడానికి సాధ్యమైనన్ని అడ్డదోవలు తొక్కతుండటంతో ముందస్తుగా వచ్చే అవకాశమూ లేదు. ఈ అనుకూలతను ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయో గించుకోవడానికి బదులుగా వక్రపు ఆలోచనల వలయంలో బాబు చిక్కుకుపోవడం విచారకరం.
రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలను పాతరేయాలని ఆయన మంత్రులకూ, ఎంఎల్‌ఏలకూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఒకట్రెండు సీట్లు తామే ఇచ్చి గెలిపించుకునే స్థితి రావాలట! సింగపూర్‌లో ఇదే విధానం అమలువుతోందని, రాష్ట్రంలోనూ ఆ తరహా రాజకీయం రావాలని సెలవియ్యడం ఆయన అధికార దాహానికి తప్ప విజ్ఞతకు అద్దం పట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏల గెలుపుకోసం అవసరమైన ఖర్చంతా తానే పెట్టుకుంటాననడం, ఖర్చు గురించి భయపడొద్దని అభయమివ్వడం ఉన్నత స్థాయిలో అవినీతికి గేట్లు తెరుస్తున్నామని బాహాటంగా సంకేతాలు ఇవ్వడమే.
దీనిలో భాగంగా ఏ పార్టీ నుండి ఎవ్వరొచ్చినా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుం టానని, అలా వచ్చే వారికి అడ్డుచెప్పొద్దని కూడా ఆయన కోరినట్లు వార్తలు వచ్చాయి. శాసనసభతోపాటు మండలిలో కూడా స్థానాలు పెరుగుతున్నందువల్ల కొత్తగా ఎందరొచ్చినా పదవులకేమీ ఢోకా ఉండదని కూడా ఆయన చెప్పడం రాజకీ యాల స్థాయిని తక్కువ చేయడమే. ఈ వ్యాఖ్యల ద్వారా రాజకీయాలంటే పదవులు, అక్రమార్జన తప్ప మరొకటి కాదన్న సంకేతాన్ని ఆయనిచ్చారు.
http://www.prajasakti.com/EditorialPage/1779156
Unethical humans and unethical countries ….spread evil in this world.
One day it will bite them too.
http://www.ndtv.com/india-news/india-hits-back-at-china-after-it-blocks-ban-on-masood-azhar-at-un-1299955?pfrom=home-lateststories
What is the difference between Madarasas in Pakistan and
Kulasanghams in AP ?
One spread religious hatred and the other spread caste hatred towards fellow human beings .
End result is destruction.
http://www.economist.com/news/leaders/21695903-country-threatened-not-just-terrorism-widespread-religious-extremism-hard
What are these fanatics learning from their patents and in school ?
Are there better things in life than just caste, religion and money ??
Fanatism in different forms ….
Gets dangerous when linked with caste or religion.
http://www.sakshi.com/news/national/love-india-but-only-one-god-in-islam-deobands-fatwa-against-bharat-mata-ki-jai-328576?pfrom=home-top-story
GOD save AP ………..GOD save India.
జగన్ ఒక బాహుబలి-BJP రామకోటయ్య
తాజాగా టీవీ లైవ్ ఛానల్ చర్చలో సీనియర్ బీజేపీ నాయకుడు వైయస్సార్ సీపీ అధినేత జగన్ ను రాజకీయాల్లో ఓ ‘ బాహుబలి ‘గా చెప్పడం ఆసక్తి కలిగించింది.
బీజేపీ సీనియర్ నేత రామకోటయ్య ఏమన్నారంటే – ” ఇక్కడ ఏకైక హీరో … ఒక ‘ బాహుబలి ‘ ఎవరైనా ఉన్నారంటే అది వై.యస్. జగనే ! ఇప్పుడు చెప్పడం కాదు, నేను గతంలో పలుసార్లు కూడా ఇదే చెప్పాను. బాహుబలి లాంటి వారు జగన్ ఎందుకంటే వారికున్నటువంటి కేపబులిటీస్ … ఏంటంటే – కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్‌పై పోరాటం చేయడానికే వచ్చాడని చూపాడు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగా, ఇబ్బందికరమైన పరిస్థితులు చేసిన సమయంలో కూడా గట్టిగా పార్టీని స్థాపించి, ప్రజల ఆదరణతో బ్రహ్మాండంగా ప్రతిపక్ష పార్టీగా నిలబడ్డారు ”
ఆ చర్చను నిర్వహిస్తున్న ప్రెజెంటర్ కూడా బాహుబలి మాటను ఎందుకు ఉపయోగించారని ఆసక్తిగా ప్రశ్నించారు. ” ఇక్కడ జగన్ ‘ బాహుబలి ‘ గా ఎందుకన్నాను అంటే బ్రహ్మాండమైనటువంటి ప్రజా నాయకుడుగా ఉన్నాడని అర్థం ” అని వివరణ కూడా ఆ బీజేపీ నేత ఇచ్చేశారండోయ్. అంతేనా ” పార్టీలో ఎంతమంది అయినా పోనీయండి, భయపడకూడదంటూనే … ఇవన్నీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని … ముందు ప్రతిపక్ష పార్టీని వై.యస్. జగన్ సమర్థవంతంగా నడిపించాలి ” అని రామకోటయ్య సూచించారు.
http://24x7telugu.com/latest-news/%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%AC%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B1%87%E0%B0%AA%E0%B1%80/
ఒక TDP అభిమాని మాటలు…..
“నీ యవ్వ రెండేళ్ళ నుండి చేసింది లేదు పెట్టింది లేదు మాట్లాడినప్పుడల్లా సింగపూర్… సింగపూరు…జపాన్ అంటూ దేశాల పేర్లు వాడుకోవడం తప్పించి బొట్టు పని చేయలేదు
ఇసుక పంపకాలు,జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు రాయబారాల మీద పెట్టినంత ద్యాస కూడా అభివృద్ది మీద పెట్టలే…టార్గెట్ వచ్చే ఎన్నికలే తప్ప ఇంకేం చేయట్లేదు…
అక్కడ కేసీఆర్ కొడుకు అమేజాన్…యాపిల్ కంపెనీల లాంటివి హైదరాబాద్ కి తెప్పించుకుంటూ దూసుకపోతుంటే ఈయన మాత్రం ఇంకా కారణాలు చెప్పుకోవడంలోనే ఉన్నాడు…
విజయవాడ కనక దుర్గమ్మ గుడి దగ్గర ప్లై ఓవర్ బ్రిడ్జి ఆరంబానికి టెంకాయ కొట్టడం తప్ప ఇంకేం చేయలేదు…..
-Yarranagu Ravi
నాయుడు బ్రదర్స్ నయా నాటకం..!
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల చుట్టూ హడావిడి సాగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ పలువురు నేతలు ఒకే పాట పాడుతున్నారు. అధికారంలో ఉన్నవాళ్లంతా ఒకే మాదిరి స్పందిస్తున్నారు. తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీ లో టీడీపీ, కేంధ్రంలో బీజేపీ అందరిదీ ఒకటే స్వరం. కేసీఆర్ నుంచి చంద్రబాబు వరకూ అందరది ఒకటే వాయిస్. వెంకయ్య నాయుడిది వారికి కోరస్. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం అన్న రీతిలో సాగిస్తున్న ప్రచారం బోనస్. కానీ వాస్తవాలకు ఇది చాలా దూరంగా ఉందన్నదే అసలు సిసలైన నిజం కావడమే వారికి మైనస్.
వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన అన్నది చారిత్రక అవసరాలతో వచ్చింది. ఒక నియోజకవర్గంలో ఒక వర్గం, సామాజిక తరగతి ఆధిపత్యమే కొనసాగకుండా చూడడానికి ప్రతీ ఇరవై ఏళ్లకు ఒకమారు పునర్విభజన చేస్తున్నారు. అదే సమయంలో రిజర్వడ్ సీట్లలో కూడా మార్పులు సాగిస్తున్నారు. దాని ప్రకారం 2026 వరకూ తెలుగు రాష్ట్రాల్లో కూడా పునర్విభజన అవకాశాలు లేవు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంధ్రంలో వెంకయ్య నాయుడు వినిపిస్తున్న వాదన ప్రకారం 2019 నాటికే అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి.
ఏపీలో అదనంగా 50 కొత్త అసెంబ్లీ స్థానాలు వస్తున్నాయి. దాంతో సంఖ్య 225 కి చేరుతుంది. అదే సమయంలో తెలంగాణాలో 34 సీట్లు పెరుగుతాయి. తద్వారా 153 కి అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం ఖాయం అన్నట్టు వెంకయ్య సిగ్నల్ ఇస్తుంటే చంద్రబాబు, కేసీఆర్ లు నిజంగానే పెరుగుతున్నాయన్న సంకేతాలు జారీ చేస్తున్నారు. ఇటీవల ఏపీలో వైఎస్సార్సీపీ నుంచి చేరుతున్న వారికి, త్వరలో కాంగ్రెస్ నుంచి కూడా చేర్చుకోబోతున్నట్టు సీఎం ప్రకటించిన వారికి సీట్లు ఇబ్బంది ఉండదని చెప్పడం కోసమే ఈ ప్రహసనమా అన్న సందేహం కలుగుతోంది. అదేసమయంలో తెలంగాణాలో కూడా కేసీఆర్ కి అలాంటి అవసరాలే ఉన్నాయి. దాంతో ఇద్దరు ఇద్దరే అన్న చందంగా వ్యవహరిస్తుంటే వంత పాడడానికి వెంకయ్య సిద్ధమైపోతున్నారు.
కానీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. దానికోసం చాలా ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుత సభలో ఎగువ సభలో మోడీ సర్కార్ మైనార్టీలో ఉంది. దాంతో అనేక బిల్లుల అమోదానికి కాంగ్రెస్ దయ మీద ఆధారపడాల్సి వస్తోంది. చివరకు విపక్షాలు మొండికేయడంతో భూ సేకరణ బిల్లు వంటివి బుట్టదాఖలు చేసుకోవాల్సి వచ్చింది. అదే రీతిలో ఇప్పుడు రెండు రాష్ట్రాలలో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామంటే మిగిలినవారంతా అంగీకరిస్తారా అన్నది సందేహమే. ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి కాబట్టి..చాలామంది ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాజ్యసభలో వ్యవహారం ముదిరే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో రాజ్యాంగ సవరణ కోసం కేంధ్రం ముందడుగు వేస్తుందా అంటే సందేహమే.
పునర్విభజనపై గాఢమైన రాజకీయ ఆకాంక్ష వుంటే రాజ్యాంగ సవరణ ద్వారా పునర్విభజన సాధ్యమే! లోక్ సభలో, రాజ్యసభలో పునర్విభజన ప్రతిపాదన నెగ్గాలి. దేశవ్యాప్తంగా వున్న రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల అసెంబ్లీలు దాన్ని ఆమోదించాలి..భూసేకరణ బిల్లుని, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్లుని రాజ్యసభలోనే ఆమోదించుకోలేని నిస్సహాయ స్ధితిలో వున్న కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల బిల్లుని నెత్తికెత్తుకునే పరిస్ధితే లేదు.
దాంతో విషయాన్ని గ్రహించిన నేతలు పని పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి పొలిటికల్ గేమ్ కి తెరలేపినట్టు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో అందరూ బీజేపీని నిలదేసే పరిస్థితి ఉంది. దాన్ని పక్కన పెట్టాలంటే పునర్విభజన వ్యవహారం ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది. తద్వారా ఏపీకి ఏదో చేయాలన్న ప్రయత్నంలో తామున్నామనే కలరింగ్ కి సిద్ధం చేస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ సహా వివిధ పక్షాలు ముందుకు తెచ్చే ప్రతిపాదనల ఫలితంగానే తాము పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయలేకపోయామన్న వాదనలతో బంతిని అపొజిషన్ కోర్టులోకి నెట్టేసే యత్నం సాగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు వ్యవహారం మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు. పూర్తిగా పొలిటికల్ గేమ్ లో భాగంగా ముందుకొచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదలను దాదాపు అన్ని పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
http://telugu.updateap.com/?q=latest/949
బాబు గొప్ప అడ్మినిస్ట్రేటర్-కుల మీడియా
గత ఎనిమిదేళ్లు వరుసగా మిగులు సాధించిన రాష్ట్రంలో 2014-15లో మాత్రం 24,194 కోట్లు రెవిన్యూ లోటు నమోదైంది-కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్)
అంటే 2006 నుంచి రాష్ట్రం లో మిగులు బడ్జెట్ లో ఉంది
1995 లో బాబు CM అయినప్పుడు 1500 కోట్ల లోటు బడ్జెట్ ఉండేది,బాబు 2004 లో దిగిపోయేనాటికి 22 వేల కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడు, కాని 2006 వచ్చే సరికి YS మిగులు బడ్జెట్ సాధించాడు
మరి ఎవరిది ఉత్తమ పాలన? ఎవరు తిన్నారు? మరి ప్రతి రోజూ బాబు సంపద సృష్టించాను నేను సంపద సృష్టించాను అంటాడేమిటి?
విభజన నాటికి AP వాటాగా వచ్చిన అప్పులు 97 వేల కోట్లు( మొత్తం 60 సం లకు) కాని బాబు ఈ సంవత్సరము తో కలిపి అంటే 3 సం లకు చేసిన అప్పు 93 వేల కోట్లు
GSDP(రాష్ట్ర స్థూల ఉత్పత్తి)లో 3% కి మించి అప్పులు చేయకూడదని FRBM చట్టం చెబుతోంది. కానీ 2014-15లో చంద్రబాబునాయుడు GSDPలో 6.10 % అప్పు చేసి FRBM చట్టాన్ని ఉల్లంఘించారని కాగ్ తేల్చింది
GSDPలో అప్పులు(లయబులిటీస్) 27.60 %కి మించకూడన్నది FRBM చట్టం నిబంధన. చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్ల 2014-15లో అప్పులు ఏకంగా GSDPలో 32.03% కి చేరుకున్నాయని కాగ్ తేల్చి చెప్పింది.
20రోజుల్లో 32 వేల కోట్లు ఖర్చు చేశారా?
సీఎం సమీక్షించే కోర్ డ్యాష్ బోర్డు (సీఎం ఆఫీస్ రియల్‌టైమ్ ఎగ్జిక్యూటివ్ డ్యాష్‌బోర్డు) లో మార్చి 11, 2016 నాటికి 2015-16 బడ్జెట్లో రూ.68,104 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సరిగ్గా 20 రోజుల తర్వాత అంటే మార్చి 31, 2016 నాటికి అదే కోర్ డ్యాష్ బోర్డులో 2015-16 బడ్జెట్ మొత్తం వ్యయంలో రూ.1,03,046 కోట్లను ఖర్చు చేసినట్లు చూపారు. అంటే.. 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఖర్చు చేశారా? ఏమన్నా టెక్నాలజీనా ఇది.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? 20 రోజుల్లో రూ.32 వేల కోట్లను ఎక్కడ.. ఎలా ఖర్చు చేశారు? ఎవరిని మోసం చేయడానికి ఈ టెక్నాలజీ? 2014-15లో ఎఫ్బీఆర్ఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేసిన చంద్రబాబునాయుడు.. రూ.22,619 కోట్ల పబ్లిక్ డిపాజిట్లు(ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ వంటివి)ను ఆయన అత్తగారి సొమ్మనుకున్నట్లు వాడుకున్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రూ.1,66,522 కోట్ల అప్పు లుండేవి. విభజనలో తెలంగాణ వాటా 69,479 కోట్లు, ఏపీ వాటా రూ.97,123 కోట్ల అప్పు వచ్చింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ అంచనాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి అప్పులు రూ.1,90,513 కోట్లకు చేరుకుంటాయన్నా రు. అంటే బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 93,389 కోట్లు అదనంగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? బడ్జెట్లో అంకెలు తప్పుగా పేర్కొన్నారని కాగ్ తప్పుపట్టింది.
ఆస్తులు:అప్పులు
బాబు కు ముందు :101:100
బాబు హయములో :45:100
YS హయములో:120:100
GDP అనేది అభివృద్ధి సూచిక
GDP: బాబు కు ముందు రాష్ట్ర GDP 6 శాతం,బాబు హయములో(1995-2004) రాష్ట్ర GDP 5.6 శాతం , YS హయాములో GDP 9 శాతం
ఇప్పుడు చెప్పండి బాబు నిజంగా అడ్మినిస్త్రేటారా???
పిల్లనిచ్చిన మామ వెన్నుపై కత్తిపోటు
సహచర మంత్రికి తొడపాశం
భ్రమరావతి రైతుల నోట్లో మట్టి
వోట్లేసిన ప్రజల కంట్లో కారం
కాదేదీ కవితకు అనర్హం: శ్రీశ్రీ
కాదేదీ నా దాడికి అనర్హం: నిప్పు
2019 లో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా, ఇతర పార్టీ లో ఉన్న నాయకులనుTDP లోకి తీసుకు రండి -MLA లతో 40 లక్షల బీద బాబు
(సోర్స్: “80% వోటర్లు మన వైపే ఉండాలి” అనే శీర్షికలో-ఈనాడు, ఏప్రిల్ 1,2016)
అసలు 1995 లో బాబు ను వెన్నుపోటు లో దించింది మొదలు AP లో ఎన్నికలను డబ్బుతో గెలవడం మొదలు పెట్టింది బాబే -ఆంధ్ర జ్యోతి రాదక్రిష్ణ చౌదరి
1996 లో జరిగిన అత్తిలి ఉప ఎన్నికల్లో వోటుకు 500 రూపాయల నోట్ ఇవ్వడం మొదలు పెట్టింది బాబే- జర్నలిస్టు క్రిష్ణా రావు
2014 ఎన్నికల్లో బాబు 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు
AP , తెలంగాణా లో 294 సీట్లు ఉన్నాయి, ఒక్కో అసెంబ్లీ కి సగటున 10 కోట్లు ఇచ్చాడు (BJP అభ్యర్ధుల ఖర్చు కూడా బాబే పెట్టుకున్నాడు), ఆ విధంగా 3 వేల కోట్లు, 42 MP సీట్ల కు గాను దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు
పేపర్ TV ల ప్రకటనల కోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెతాడు బాబు
టోటల్ గా 5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు బాబు.
రాజధాని లో కొట్టేసిన 2 లక్ష ల కోట్లతో రేపు 2019 లో 15 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని బాబు ప్లాన్
అయన నిప్పండీ నిప్పు !!!