అధికారపు అహం!

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలను ఈ కోవలోనే చూడాల్సిఉంది.
రాబోయే ఎన్నికల్లో ఎంఎల్‌ఏల గెలుపుకోసం అవసరమైన ఖర్చంతా తానే పెట్టుకుంటాననడం, ఖర్చు గురించి భయపడొద్దని అభయమివ్వడం ఉన్నత స్థాయిలో అవినీతికి గేట్లు తెరుస్తున్నామని బాహాటంగా సంకేతాలు ఇవ్వడమే.

మంత్రులు, ఎంఎల్‌ఏలు ఇతర అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఆయన ఇచ్చిన సందేశం ప్రజా స్వామ్యానికి విరుద్ధం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కాదుకదా.. కనీసం పంచాయతీ ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు. అధికారపార్టీకి చట్టసభల్లో కావాల్సినంత బలముండటమూ, ఉన్న దాన్ని మరింతగా పెంచుకోవడానికి సాధ్యమైనన్ని అడ్డదోవలు తొక్కతుండటంతో ముందస్తుగా వచ్చే అవకాశమూ లేదు. ఈ అనుకూలతను ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధికి ఉపయో గించుకోవడానికి బదులుగా వక్రపు ఆలోచనల వలయంలో బాబు చిక్కుకుపోవడం విచారకరం.

రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్షాలను పాతరేయాలని ఆయన మంత్రులకూ, ఎంఎల్‌ఏలకూ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ఒకట్రెండు సీట్లు తామే ఇచ్చి గెలిపించుకునే స్థితి రావాలట! సింగపూర్‌లో ఇదే విధానం అమలువుతోందని, రాష్ట్రంలోనూ ఆ తరహా రాజకీయం రావాలని సెలవియ్యడం ఆయన అధికార దాహానికి తప్ప విజ్ఞతకు అద్దం పట్టడం లేదు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్‌ఏల గెలుపుకోసం అవసరమైన ఖర్చంతా తానే పెట్టుకుంటాననడం, ఖర్చు గురించి భయపడొద్దని అభయమివ్వడం ఉన్నత స్థాయిలో అవినీతికి గేట్లు తెరుస్తున్నామని బాహాటంగా సంకేతాలు ఇవ్వడమే.

దీనిలో భాగంగా ఏ పార్టీ నుండి ఎవ్వరొచ్చినా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుం టానని, అలా వచ్చే వారికి అడ్డుచెప్పొద్దని కూడా ఆయన కోరినట్లు వార్తలు వచ్చాయి. శాసనసభతోపాటు మండలిలో కూడా స్థానాలు పెరుగుతున్నందువల్ల కొత్తగా ఎందరొచ్చినా పదవులకేమీ ఢోకా ఉండదని కూడా ఆయన చెప్పడం రాజకీ యాల స్థాయిని తక్కువ చేయడమే. ఈ వ్యాఖ్యల ద్వారా రాజకీయాలంటే పదవులు, అక్రమార్జన తప్ప మరొకటి కాదన్న సంకేతాన్ని ఆయనిచ్చారు.

http://www.prajasakti.com/EditorialPage/1779156

అసెంబ్లీ సీట్ల పెంపునకు అవకాశం లేదు
ఇతర రాష్ట్రాలూ కోరే వీలుంది
♦ పెంచాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి
♦ డీ లిమిటేషన్ కమిటీ వేసినా ఆరేడేళ్లు పట్టే పరిస్థితి
♦ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదీ జరగదు
♦ ఇష్టారీతిన ఎందుకు మాట్లాడుతున్నారో..?
♦ మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతారనే వాదన తాజాగా వినపడుతోంది. అయితే రాష్ట్ర విభజన చట్టం గెజిట్‌లో సెక్షన్-26 కింద రాజ్యాంగంలోని 170 అధికరణకు లోబడి మాత్రమే ఉభయ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల సంఖ్యను పెంచుతాం అనే మాటను పొందుపరిచారు. దీని ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకుండా శాసనసభ స్థానాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదు’ అని శివాజీ స్పష్టం చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలని, దీంతోపాటు దేశంలోని మెజార్టీ శాసనసభలు తీర్మానాలు చేయాల్సి ఉంటుందని వివరించారు.

గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సాధ్యం కాదన్నారు..
అంతేకాకుండా పునర్వ్యవస్థీకరణకు డీలిమిటేషన్ కమిటీ కూడా వేయాల్సి ఉందని శివాజీ తెలిపారు. 2002లో కులదీప్‌సింగ్ అధ్యక్షతన డీలిమిటేషన్ కమిటీ వేయగా.. ఆ కమిటీ నిర్ణయాలు 2009 ఎన్నికల్లో అమల్లోకి వచ్చాయని తెలిపారు. దీని ప్రకారం ఒకవేళ కేంద్రం పునర్వ్యవస్థీకరణ కమిటీని వేసినా అమలుకు ఆరేడేళ్లు పట్టే పరిస్థితి ఉంటుందని వివరించారు. గత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని అప్పట్లో ఒక ప్రకటన చేశారని గుర్తుచేశారు. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని వారందరితో చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వెళ్లాలని, లేకుంటే లేనిపోని ఉపద్రవాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచడానికి సాధ్యం కాదని గతేడాది ఫిబ్రవరి 7న లోక్‌సభలో కేంద్రం తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. గతంలోనూ నియోజకవర్గ కేంద్రాల స్థానాలు మారా యే తప్ప సంఖ్య మారలేదన్నారు. తాజా వాదన లేవనెత్తితే ఇతర రాష్ట్రాలు కూడా శాసనసభ స్థానాలు పెంచాలనే డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఉత్తరాంచల్‌లో 70 అసెంబ్లీ స్థానాలను 101కి, జార్ఖండ్ 81 నుంచి 160 స్థానాలకు, ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలను ఇంకా పెంచాలని ఇటీవల కోరుతున్నాయని వివరించారు.

http://www.sakshi.com/news/hyderabad/no-opportunity-to-increase-assembly-seats-328697

రోడ్డు దున్నేసారు, రాజధాని భూముల్లో సాగు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5111909

13 Comments

Filed under Uncategorized

13 responses to “అధికారపు అహం!

 1. Some ethical human beings in a cruel and greedy world …

 2. Veera

  పవన్‌కు బాబు చెక్‌ ?
  కాపు కులస్థులపై ఏపి సిఎం కన్ను?
  పవన్‌ రాక ముందే కాపు ఓట్లకు గాలం
  పవన్‌+బిజెపి కలుస్తారన్న ప్రచారం
  బాబు ముందస్తు ప్రతివ్యూహం?
  పవన్‌ నిర్వీర్యానికి ఎత్తుగడ?
  అన్ని పార్టీల్లో ఉన్న కాపులను చేర్చండి
  కాపు మాజీ ఎమ్మెల్యేలు, మంు్తల్రతో మాటలు
  కాపు ఎమ్మెల్యే, మంు్తల్రకు బాబు దిశానిర్దేశం

  గత ఎన్నికల్లో పవన్ ఇమేజ్, సినిమా గ్లామర్‌తో పాటు, పవన్‌కు ఉన్న కాపు కార్డు తెలుగుదేశం పార్టీని గెలిపించింది.

  కాపుల్లో ఇమేజ్ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, బూరగడ్డ వేదవ్యాస్ వంటి ప్రముఖులు కూడా ఓడిపోయారంటే దానికి కారణం టిడిపికి పవన్ ప్రచారం చేయడమే. పవన్ బరిలోకి రావడంతో కాపు యువకులు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ, టిడిపికి ఓటేసి గెలిపించారు.

  ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ వర్గంతో కాపులకు తీవ్రమైన శత్రుత్వం ఉన్నప్పటికీ, పవన్ కారణంగా కాపు జాతి టిడిపికి ఓటు వేసింది. అందుకే నాయకత్వం పవన్‌కు అంత ప్రాధాన్యం ఇస్తోందన్నది నిర్వివాదం.

  అదే కారణంగా.. ఎన్నికలకు ఏడాది ముందు పవన్ రాజకీయాల్లోకి దిగితే, కాపు జాతి ఆయన వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కాపుల సంఖ్య ఎక్కువయినందున, బిజెపి-జనసేన కూటమి ఆ జిల్లాల వరకూ విజయం సాధించినా తెలుగుదేశం పార్టీ విజయావకాశాలకు గండిపడే ప్రమాదం లేకపోలేదు. అది పరోక్షంగా జగన్ పార్టీకి లాభించవచ్చు.

  ఈ సమీకరణలను దృష్టిలో ఉంచుకునే.. చంద్రబాబునాయుడు కాపులపై ఇప్పటినుంచే దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ రాజకీయ తెరపైకి వచ్చే నాటికి, ఆయన వెంట కాపులెవరూ లేకుండా చేసేందుకే.. టిడిపి నాయకత్వం కాపులపై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

  http://www.suryaa.com/news/regional/article.asp?contentId=241514

 3. Veera

  రోజా ‘చౌదరి’ అయి ఉంటె ఇదే ప్రశ్న TV9 అడిగేదా?
  తారా చౌదరి ని కూడా అడగలేదు ఈ ప్రశ్న

  3-4 సం క్రితం TV9 MD రవి ప్రకాష్ చౌదరి ని కర్నూల్ లో TV9 మాజీ విలేఖరి రమణ “నీతులు చెప్పడం కాదురా ముందు నీవు పాటించు” అని అందరూ చూస్తుండగా బహిరంగ సభలో చెప్పు తో కొట్టారు

  2014 ఎన్నికలు అయిపోగానే ఇదే TV9 లో తెలంగాణా MLA ల ప్రమాణ స్వీకారం మీద నీచ మైన జోకులు వేస్తూ ఒక ప్రోగ్రాం వేస్తె బ్యాన్ చేయించాడు కెసిఆర్ దానితో దిగివచ్చి కాళ్ళు పట్టుకొని బయటపడింది TV9

  నిన్న రోజాను జాఫర్ అనే TV9 విలేఖరి మీరు బూతు సినిమాలో నటించారా అని అడిగాడు.

  రోజా చౌదరి అయి ఉంటె ఇదే ప్రశ్న TV9 అడిగేదా?
  తారా చౌదరి ని కూడా అడగలేదు ఈ ప్రశ్న

  పేరుకు మెరుగైన సమాజం కోసం, కుల రహిత సమాజం కోసం అని డైలాగులు
  మెరుగైన కమ్మ సమాజం కోసం అంటే కరెక్తేమో !!!

  No bad comments please !!!

 4. Veera

  BJP, KCR కే పెద్ద పీట వేస్తూ AP ను, నన్ను పట్టించుకోవడం లేదు-నిప్పు
  సొంతంగా గెలిచినోడు కెసిఆర్, BJP వలన గెలిచినోడివి నువ్వు, నీకు ఇదే పెద్ద హెల్ప్
  1997 లోనే మీ మీద 101 అవినీతి ఆరోపణలు చేస్తూ సింగపూర్ లో మీకు ఆస్తులున్నాయి అని చెప్పిన BJP కి మీ దోపిడీ గురించి తెలియదా? ఎంత డబ్బు ఇచ్చినా హుండీ బాబా జేబు లోకే అని వాళ్ళ అభిప్రాయం మరి !!!
  [బిజెపిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
  ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీపై చేసినట్లు వచ్చిన వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి. మిత్రపక్షంగా ఉన్న మనల్ని పట్టించుకోకుండా తెలంగాణలో టిఆర్ఎస్ కు దగ్గర కావాలని యత్నిస్తోందని ఆయన అన్నారని మీడియాలో కధనం వచ్చింది. ఎపికి విభజన చట్టం ప్రకారం చేయవలసిన సాయం చేయడం లేదని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు దగ్గరవడానికి ఆరాట పడుతూ , ఎపిలో వారి ఎదుగుదలకు అడ్డుపడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుందో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారట.రాజకీయంగా బలంగా ఉంటే అంతా మనచుట్టూనే తిరుగుతారని కూడా చంద్రబాబు అనడం విశేషంగా ఉంది.కేంద్రం తమ పట్ల అలుసుగా ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20160403_16.php?p=1459659203779 ]

 5. Veera

  పోల ‘వరం’ లో తప్పు బాబుదే !!!
  (బాబు దోపిడీ చూసే కేంద్రం అంతంత మాత్రంగా నిధులు ఇస్తుంది)
  [పోలవరంలో బాబుకు మంచి పేరు రావాలంటే
  రాష్ట్రం చేపట్టదలిస్తే పోలవరం అదారిటీ తో అవగాహన కుదుర్చుకోవలసి ఉంటుందని కేంద్రం పేర్కొంది.పోలవరం వ్యయ అంచనాలు ముప్పైమూడువేల కోట్లకు పెరిగిన సమాచారం కూడా తమ వద్ద లేదని కేంద్రం చెబుతోంది.
  కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల క్రితం కేంద్రం చేపట్టేటట్లయితే వెంటనే అప్పగిస్తామని అన్నారు. కేంద్రమే నిర్మించవలసి ఉన్న ఈ ప్రాజెక్టును వారికి అప్పగించి నిర్ణీత కాలంలో పూర్తి అయ్యేలా ప్రయత్నం చేయాలి.లేదా రాష్ట్రం చేయదలిస్తే పోలవరం అధారిటితో అవగాహన కుదుర్చుకోవాలి. ఇవేవి జరగలేదన్న వార్తలు రాష్ట్రానికి మంచిది కాదు.

  అలాగే పట్టిసీమ ప్రాజెక్టును పోలవరంలో కలిపి చూపడాన్ని కూడా కేంద్రం అభ్యంతరం చెబుతోంది.

  ఒకవైపు 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఈ విషయాలపై ఎందుకు శ్రద్ద పెట్టడం లేదో తెలియదు.ఏది ఏమైనా ఎపికి జీవనాడిగా ఉండే పోలవరం ప్రాజెక్టు విషయంలో వివాదాలు లేకుండా సకాలంలో పూర్తి అయ్యేలా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపడితే మంచిది. అలాచేస్తే చంద్రబాబుకు ,టిడిపికి మంచి పేరు వస్తుంది. లేకుంటే వారిని చరిత్ర క్షమించదు.
  http://kommineni.info/articles/dailyarticles/content_20160403_12.php?p=1459657978014 ]

 6. Veera

  ఛీ ఛీ !!!
  ఇంకో 20 మంది YCP MLA లను తీసుకొనిరండి, YCP కి ఒక్క రాజ్యసభ సీట్ కూడా రాకూడదు-మంత్రులతో నిప్పు బాస్ (డెక్కన్ క్రానికల్)
  30 సం లు విలువలతో కూడిన రాజకీయాలు చేసాను నేను నిప్పు పప్పు అంటే ఇదేనా ???
  ఎవరో కన్న పిల్లల్ని నా పిల్లలు అని చెప్పుకోవడానికి కొంచెం అన్నా సిగ్గు ఉండాలి!!!

 7. Fanatic students in Kashmir and Fanatic VC’s in AP ….
  What comes first ….Country …..Caste……Religion ….Humanity ??

  http://www.sakshi.com/news/national/srinagar-nit-in-lockdown-after-clash-over-india-t20-world-cup-loss-328794?pfrom=home-top-story

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s