http://www.thehansindia.com/posts/index/Telangana/2016-04-06/Now-Andhra-likes-KCR/219230
కాకి లెక్కలు..!
-ఇళ్లు, ఇళ్ల స్థలాలపై అంకెల గారడీ
-తప్పుల తడకగా సిఎం డాష్‌బోర్డు
-లక్షలాది జన్మభూమి అర్జీలన్నీ పెండింగే
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
జన్మభూమి మా ఊరు గ్రామసభలు జరిగి రెండు నెలలైంది. శాశ్వత గృహాలు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్ల కోసం లక్షలాది అర్జీలను ఆ గ్రామసభలలో ప్రజలు అందజేశారు. రెండు నెలల్లో ప్రభుత్వం ఒక్క ఇంటిని గానీ, ఇంటి స్థలాన్నిగానీ అర్జీదారులకు అందజేయలేదు. కానీ వచ్చిన అర్జీల్లో 86 నుంచి 97 శాతం పరిష్కారమైపోయినట్లు అధికారిక నివేదికల్లో కాకిలెక్కలు చూపడం గమనార్హం. టిడిపి అధికారంలో కొచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క పక్కా గృహాన్నీ నిర్మించలేదు. ఒక్క ఇంటి స్థలాన్నీ పంపిణీ చేయలేదు. ప్రచారం మాత్రం హోరెత్తుతోంది.
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలలో శాశ్వత గృహాలకు 5,33,158 అర్జీలు అందగా, ఇప్పటి వరకు 4,58,726 (86.04 శాతం) పరిష్కారం అయినట్లు సిఎం డ్యాష్‌బోర్డు సమాచారంలో అధికారులు పేర్కొన్నారు. కేవలం 74,432 దరఖాస్తులే పెండింగ్‌లో ఉన్నాయనటం గమనార్హం. ఇంటి స్థలాలు కావాలంటూ కొత్తగా 3,13,089 దరఖాస్తులు రాగా 3,05,061(97.44 శాతం) అర్జీలను పరిష్కరించగా, 8,028 మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.
రెండేళ్లలో ఒక్క ఇల్లూ కట్టలేదు
ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల కు1.93 లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంతవరకు ఒక్కటంటే ఒక్క ఇంటిని కూడా అధికారికంగా మంజూరు చేయలేదు. ఒక్క లబ్ధిదారుడైనా ఇంటి నిర్మాణ పనులను చేపట్టలేదు. వాస్తవం ఇలావుంటే శాశ్వత గృహాలు, కొత్త ఇంటి స్థలాల సమస్యలను పరిష్కరించినట్లు నివేదికల్లో చూపుతుండటం గమనార్హం. ఇంతవరకు ఎన్‌టిఆర్ గృహాల పథకం కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియే పూర్తికాలేదు. ఈ విషయంపై చంద్రబాబునాయుడే ఇటీవల కలెక్టర్ల సమావేశంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్చి కల్లా లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను మంజూరు చేయాలని ఆదేశించినా అధికారుల్లో కదలిక లేదు. గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్‌లోనూ పెద్దగా నిధులు కేటాయించలేదు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకు అప్పగించారు.
పెండింగ్‌లో 20 లక్షల అర్జీలు
శాశ్వత ఇళ్ల కోసం మూడు విడతల జన్మభూమి సభలలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కాని వాటిని ప్రభుత్వం వడపోసి పది లక్షలకు కుదించింది. ఇళ్లుగానీ, ఇళ్ల స్థలాలుగానీ మంజూరు చేయకుండానే కేవలం 16 వేల దరఖాస్తులే పెండిం గ్‌లో ఉన్నాయని ప్రభుత్వం కాకి లెక్కలు చూపిస్తోం ది. ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నంలో భాగంగానే సిఎం డ్యాష్‌బోర్డులో తప్పుడు నివేదికలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
TDP MP JC దివాకర్ రెడ్డి సెటైర్లు
ఎలక్షన్ కమిషన్ ప్రకారం సీట్లు పెరగవు కాని వెంకయ్య , బాబు సీట్లు పెంచుకోగలరు, ప్రత్యెక హోదా మాత్రం సాధించలేరు
అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మ గా ఉందిరో అబ్బా !!!
[సీమకు మళ్లీ అన్యాయం చేస్తున్న సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్నారా..పుట్టిన ఊరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదా..కేటాయించిన తర్వాత కూడా కొర్రీ వేస్తున్నారా..అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా రాయలసీమ నుంచి మరో ఉన్నత స్థాయి సంస్థ తరలింపు కోసం సాగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే అదే వాస్తవం అనిపిస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు తిరుపతికి దక్కిన క్యాన్సర్ పరిశోధనా కేంధ్రాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించాలన్న ప్రతిపాదన వెనుక పెద్ద కుట్రే ఉందన్న ప్రచారం సాగుతోంది. చాలాకాలంగా చంద్రబాబు సీమ ప్రయోజనాల పట్ల శీతకన్ను వేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా 2014 పిబ్రవరి నెలలో శంఖుస్దాపన జరిగిన క్యాన్సర్ పరిశోధనా కేంధ్రాన్ని కూడా గుంటూరు తరలించాలని ప్రయత్నించడం దుమారం రేపుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం వ్యతిరేకతను పక్కన పెట్టి ముందుకు పోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమచారం.
ఇటీవలే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేశారు. గుంటూరు, విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. మంత్రి ప్రకటనల్లోనే అసలు మర్మం దాగి ఉందని రాయలసీమ అభివృద్ధి వేదిక నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలో శంకుస్థాపన జరిగిన పరిశోధనా కేంధ్రాన్ని గుంటూరు తరలించేసి, మిగిలిన మూడు సెంటర్లలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. సీమ వాసుల ఐక్యతను విచ్చిన్నం చేయడానికే వ్యూహాత్మకంగా కర్నూలు ప్రతిపాదన తెచ్చారని చెబుతున్నారు. వాస్తవానికి కర్నూలు లో ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోతే క్యాన్సర్ ఆస్పత్రి వచ్చే అవకాశం లేదంటున్నారు. అయినప్పటికీ తిరుపతి నుంచి తరలించిపోవడానికి అడ్డు చెప్పకుండా ఉండడానికే కర్నూలు పేరును ప్రతిపాదనల్లోకి చేర్చినట్టు కనిపిస్తోందని చెబుతున్నారు.
దాంతో ఇప్పుడు సీమ వాసులు మండిపడుతున్నారు. ఇటీవల జీవో120 రద్దు కోసం ఉద్యమించిన స్ఫూర్తితో మరోమారు తిరుపతి క్యాన్సర్ పరిశోధనా కేంధ్రం పరిరక్షణకు సాగాలని భావిస్తున్నారు. మరి చంద్రబాబు కళ్లు తెరుస్తారో..లేక చిత్తూరు ప్రజల ఆశలు తుంచేస్తారో చూడాలి.
http://telugu.updateap.com/?q=latest%2F1045 ]
నేనేమైనా పశువునా అమ్ముడుపోవటానికి -TDP లో చేరిన MLA పాశం సునీల్
ఊరుకోండి, పశువులు ఫీల్ అవుతాయి !!!
చంద్రబాబుకి BJP మంత్రి మాణిక్యాల రావు ‘పంచ్’ పడింది..!
ఏపీలో చంద్రబాబు క్యాబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రుల్లో కామినేని శ్రీనివాస్ దాదాపు చంద్రబాబు సొంత మనిషిలా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ముద్ర లేకపోయినా ఆ పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. కానీ మరో కమలం మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తీరు మాత్రం చంద్రబాబుకి మింగుడుపడడం లేదు.
ఇప్పుడు నేరుగా సీఎం మీదే ఆయన చెణుకులు విసిరే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నారంటే అది పూర్తిగా పవన్ కల్యాణ్ దయేనన్న విషయాన్ని మరచిపోవద్దంటూ మాణిక్యాలరావు ఏకంగా చంద్రబాబు మొఖం మీదే చెప్పినట్టు వస్తున్న వార్తలు వింటుంటే ఆశ్చర్యం కలగడం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కల్యాణ్ చరిష్మాతో యువత, కాపు సామాజికవర్గం చంద్రబాబును భుజానికెత్తుకుంది. దాంతో అనూహ్యంగా అప్పటి వరకూ ఆధిక్యంలో ఉన్న జగన్ కి ఒక్కసారిగా గండిపడడంతో స్వల్ప తేడాతో పరాభవం ఎదురయ్యింది.
చంద్రబాబుకి సీఎం పీఠం దక్కింది. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ తీరు మారుతోంది. రెండేళ్ల తర్వాత చంద్రబాబు గ్రాఫ్ అమాంతం పడిపోతుండడంతో పవన్ కూడా పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. దాంతో చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పవన్ కి చెక్ పెట్టడానికి అనేక యత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి మాణిక్యాలరావు నేరుగా సీఎం చంద్రబాబుకే ఝలక్ ఇచ్చినట్టు చెబుతున్నారు. పవన్ వద్ద ఇలాంటి ప్రయత్నాలు నష్టం చేకూరుస్తాయన్న విషయాన్ని గ్రహించాలని సూటిగా చెప్పేసినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంగా చంద్రబాబుకి ఈ పరిణామాలు అంతగా రుచించవనే చెప్పవచ్చు.
http://telugu.updateap.com/?q=latest/1043
YCP MLA లను బాబు కొనడం పై ప్రజలేమనుకొంటున్నారు?
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో బలపడుతోంది .. ప్రజల్లో బలహీనమవుతోంది
-Ramanaraju Dusarlapudi, Kakinada
అప్పట్లో జైల్లో పెట్టారు కాబట్టి సానుభూతి వచ్చింది జగన్ కి
ఇప్పుడు ఆ పార్టీ ఎమెల్యేలను కొంటున్నారు కాబట్టి సానుభూతి వస్తోంది.
“డబ్బులెట్టి కొనేస్తున్నాడమ్మా ఆ చంద్రబాబు”
అంటూ ఊర్లో ముసలమ్మలు కూడా మొటికలు విరుస్తున్నారు.
ఎదవ గోర్లు ఎన్ని పెంచితే ఏం లాభం.ఉపయోగం లేని శరీరభాగం ఆ గోర్లు.
MLA లు పెంచుకోవడం గోర్లు పెంచుకోవడం రెండూ ఒకటే.
అందరినీ మీ దాంట్లో చేర్చేసుకుంటే ప్రతిపక్షం ఉండదు అనుకోవడం అపోహ.
మీ దాంట్లోనే పతిపక్షం తయారవుతుంది.
-Surya Vadrevu
బాబు రహస్య సర్వే !!!
బాబు సర్వే లో తూర్పు గోదావరి లో ఉన్న 19 అసెంబ్లీ లలో 11 అసెంబ్లీ లలో పూర్తిగా ఓడిపోతుంది, ఇంకో 4 అసెంబ్లీ లలో కూడా చాల కష్టంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది అని సర్వే సారంశం (2014 లో YCP 5 సీట్లు గెలిచింది)
అందుకే YCP MLA లను చేర్చుకొని మేము బలంగా ఉన్నాము అనే కలరింగ్ ఇస్తున్నాడు బాబు-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,YCP MLC
నీకంత సీన్ లేదు, నీవు గెలిచింది మోడీ పవన్ ల వలన అని బాబు తోనే BJP మంత్రి మాణిక్యాల రాప్ అన్నట్టుగా ది హన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక వ్రాసింది
(BJP move to cut ties in TS irks Naidu.
However,Manikyala Rao is understood to have told the CM that the TDP came to power because of the BJP and support from janasena Chief Pawan kalyan.
http://epaper.thehansindia.com/770532/THE-HANS-INDIA/HYDERABAD#page/4/2 )