‘తాత్కాలిక’ సచివాలయా హంగుల ఖర్చు 581 కోట్లు..!
తాజాగా మౌలిక వసతులకు అంచనాలు
– మొత్తం 800 కోట్లు దాటనున్న వ్యయం
– ఇదంతా ‘తాత్కాలిక’ సచివాలయానికే..
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో
తాత్కాలిక సచివాలయ ఖర్చులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. నిర్మాణ వ్యయం రూ.180 కోట్ల నురచి రూ.220 కోట్లకు పెరిగి పోగా, దీని విస్తరణ, లోపలి హంగుల కోసం మరో రూ.581 కోట్లు వెచ్చిరచనున్నారు. దీరతో తాత్కాలిక సచివాలయానికే వ్యయం ఏకంగా రూ.800 కోట్లకు చేరుతోంది. తాత్కాలిక సచివా లయ నిర్మాణరలో భాగంగా అత్యాధునిక హర గుల కల్పనకు రూ.581 కోట్ల అంచనాతో క్రిడా అధికారులు తాజాగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు మౌలికాభివృద్ధి శాఖ ద్వారా ఆర్థిక శాఖకు చేరాయని తెలిసిరది. వాటిని ఆమోదిర చేరదుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత డిజైన్‌లో జి ప్లస్-1 తరహా నిర్మాణాలు చేపట్టేర దుకు నిర్ణయిరచగా, తాజాగా వాటిని జి ప్లస్-3గా మార్పు చేయాలని సంకల్పించారు. ఇందుకు అద నంగా అయ్యే ఖర్చూ రూ.581 కోట్ల అంచనా నుంచే సమకూర్చాలని భావిస్తున్నారు. కేవలం తాత్కాలిక సచివాలయ నిర్మాణాలకే ఇరత భారీగా నిధులు ఖర్చు చేయడం ఎరతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమ వుతోరది. రెరడు మూడేళ్లలో శాశ్వత సచివాలయాన్ని నిర్మిరచు కుంటే తాత్కాలిక నిర్మాణానికి ఇరత భారీ ఖర్చు దేనికని అధికారులే ప్రశ్నిస్తున్నారు.
http://www.prajasakti.com/Content/1781418
చంద్రబాబుకి కత్తిమీద సాములాంటి వ్యవహారం..!
ఏపీ క్యాబినెట్ లో మార్పులు, కూర్పులు ఖాయంగా కనిపిస్తోంది. తొలగింపులు ఎలా ఉన్నప్పటికీ శాఖల కేటాయింపుల్లో మార్పులు తప్పనిసరిగా కనిపిస్తోంది. పలువురు కొత్త వారికి అవకాశం కూడా దాదాపు ఖాయమే. అయితే కొత్త వారిలో ఎవరిని చేర్చుకోవాలన్న దానిపైనే సీఎం చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు, ఇప్పటి విశ్వసనీయత ఆధారంగా క్యాబినెట్ బెర్త్ లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆశావాహులు మాత్రం సీఎం చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. సామాజిక సమీకరణల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా క్యాబినెట్ విస్తరణ ఉగాది తర్వాత ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. విస్తరణ ముహూర్తం ఓకే కాగానే ఈసారి 8మందికి అవకాశం కల్పించబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే ఈ జాబితాలో సీఎం తనయుడు , పార్టీ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యింది. ఆయనకు ఐటీ , పరిశ్రమల శాఖలు కేటాయిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆ తర్వాత అవకాశం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదేనని చెప్పవచ్చు. గతంలోనే కీలక శాఖలు నిర్వహించిన సోమిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో అవకాశం కోల్పోయారు. ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నప్పటికీ క్యాబినెట్ ఛాన్స్ కోసం చాలాకాలంగా ఆయన వేచిచూస్తున్నారు. దాంతో సోమిరెడ్డి సీటును చంద్రబాబు ఓకే చేసినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ ని ఢీకొట్టడంలో సోమిరెడ్డి సమర్థవంతంగా కృషి చేస్తున్నందుకు ప్రతిఫలంగా ఆయనకు అవకాశం దక్కబోతోంది. మూడో ఛాన్స్ పార్టీ ఫిరాయింపుదారుల్లో ఒకరికి ఉండవచ్చన్న అంచనాలున్నాయి. వారిలో గతంలో మాట ఇచ్చిన దాని ప్రకారం భూమా నాగిరెడ్డికి అవకాశం ఇస్తారా..లేక మైనార్టీ కోటాలో జలీల్ ఖాన్ అవకాశం కొట్టేస్తారా అన్నది చూడాలి. భూమాకి మునిసిపల్ శాఖ దాదాపు ఖాయం అనుకున్నారు. కానీ టీడీపీలో మైనార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ కోటాలో జలీల్ ఖాన్ ముందుకొచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిదాయకం.
ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం అనేకమంది క్యూ కడుతున్నారు. అందులో పలువురు సీనియర్లు ఉన్నారు. కిమిడి కళా వెంకటరావు, కాలవ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వారితో పాటు పతివాడ నారాయణ స్వామి నాయుడు, బండారు సత్యనారాయణ మూర్తి, గొల్లపల్లి సూర్యారావు, గౌతు శ్యాం సుందర శివాజీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా రేసులో ఉన్నారు. అందరూ సీనియర్ నేతలే కావడంతో ఎవరికి ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి. ఇక మండలి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంవీఎస్ మూర్తి వంటి వారు కూడా మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఒక సందర్భంలో బాలకృష్ణ పేరు కూడా ప్రతిపాదనలోకి వచ్చినప్పటికీ తాజాగా లోకేష్ కి ఖరారయినందున ఆ పేరు వెనక్కి పోయింది. స్పీకర్ కోడెల పేరు కూడా ప్రతిపాదనలో ఉంది. అయినప్పటికీ ఆయన్ని అదే స్థానంలో కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్నవారిలో స్థాన భ్రంశం లేదా పదవులు చేజారే వారి జాబితాలో గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, కిమిడి మృణాళిని తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని మంత్రివర్గంలో కొనసాగించి శాఖలు మారుస్తారా అనేది కూడా ఇంకా తేలలేదు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా మంత్రిపదవి దక్కించుకున్న రావెల కిషోర్ వ్యవహారం కూడా ఊగిసలాటలో ఉంది. అచ్చెన్నాయుడు కి ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక శాఖ కన్నా మంచి స్థానం కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. దాంతో ఈసారి మంత్రి వర్గం కూర్పు ఆసక్తిగా మారుతోంది.
అదే సందర్భంలో చంద్రబాబుపై అసంతృప్తులు కూడా ఖాయంగా కనిపిస్తోంది. అన్నింటినీ ఎలా సర్థుబాటు చేస్తారన్నది పెద్ద చర్చనీయాంశం.
మీరు మొదటిసారి MLA లు, మీకు ఏమి తెలీదు-నిప్పు
వార్డ్ మెంబర్ కూడా కాని పప్పు కి ఏమి తెలుసని మంత్రి పదవి ?