జగన్ కేసు- టిడిపి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందా!

జగన్ ఆస్తుల కేసులో భాగమైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూముల కేటాయింపు కేసులో సీనియర్ ఐఎఎస్ అదికారి శ్యాంబాబుకు హైకోర్టులో పూర్తి రిలీఫ్ వచ్చింది.ఆయనపై విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించింది.ఆయనపై ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతించలేదు.దీనిని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.సిబిఐ ఆధారరహితంగా ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నాలెడ్జ్ హబ్ కు భూములు కేటాయించడం జరిగిందని, మంత్రివర్గ తీర్మానం ప్రకారమే జరిగిందని,ఇందులో శ్యాంబాబు తప్పు ఏమీ లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు.దీనితో ఏకీభవించిన హైకోర్టు ఈ మేరకు శ్యాంబాబుకు ఊరట ఇస్తూ కేసు లో విచారణ చేయకుండా ఆదేశాలు ఇచ్చింది.జస్టిస్ ఇళంగో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. శ్యాంబాబు ప్రాసిక్యూషన్ కు ఎపి,తెలంగాణ ప్రభుత్వాలు కూడా అనుమతించలేదని ఆయన న్యాయవాది శివరాజ్ శ్రీనివాస్ కోర్టుకు తెలపడం విశేషం.ప్రస్తుతం ఎపిలో జగన్ కు పూర్తి ప్రత్యర్ధి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం అదికారంలో ఉంది. ఐఎఎస్ అదికారి విచారణకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటే, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్లే అవుతుందా!అదికారికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రభుత్వం జగన్ పై మాత్రం ఆరోపణను సమర్ధిస్తుందా?ఈ కేసు తమాషాగా నడుస్తోంది

http://kommineni.info/articles/dailyarticles/content_20160414_20.php?p=1460614043572

ఎపిలో రాజ్ భవన్,హైకోర్టు లకు ఖర్చు చేసేశారా
కేంద్రం మంజూరు చేసిన నిదులను వ్యయం చేస్తున్న తీరుపై వినియోగ పత్రాల వ్యవహారంపై అనుమానం ఏర్పడడంతో నీతి ఆయోగ్ గత రెండేళ్ల లెక్కలు అడిగిందని ఒక ప్రముఖ పత్రిక ఇచ్చిన వార్త ఆసక్తికరంగా ఉంది.ముఖ్యంగా రాజదాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 850 కోట్లను రాజ్ భవన్ ,హైకోర్టు,ఇతర నిర్మాణాలకు ఖర్చు చేసినట్లు ఎపి అధికారులు వినియోగ పత్రాలు పంపారని ఈ కధనంలో ఉంది.నిజంగానే అలా చేసి ఉంటే ఆశ్చర్యంగానే ఉంటుంది.ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించడం లేదన్నది ఈ రోజులలో పెద్ద విశేషం కాదు.కాని ఏకంగా రాజదాని లో రాజ్ భవన్ ,హైకోర్టు నిర్మాణాలకు నిదులు వ్యయం చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం నిజమే అయితే దారుణం అని చెప్పాలి.ఇంతవరకు రాజ్ భవన్ కాని,హైకోర్టు కాని నిర్మాణమే ఆరంభం కాలేదు.పైగా అసలు మాస్టర్ ప్లాన్ వ్యవహారమే ఒక కొలిక్కి రాలేదు.ఈలోగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు.మరి అలాంటప్పుడు రాజ్ భవన్ ,హైకోర్టు ల పేరుతో నిదుల వినియోగ పత్రాలు పంపిచారన్న సమచారంలో వాస్తవం ఏమిటో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుందో,లేదో చూడాలి.కేంద్ర ప్రభుత్వం కొన్ని పధకాలకు పంపిన నిదులను కూడా వేరే అవసరాలకు వాడారన్న దానిపై కూడా కేంద్రం వద్ద సమచారం ఉందని,అందుకే రెండేళ్ల వ్యయాల వివరాలు పంపాలని కేంద్రం కోరిందని చెబుతున్నారు.

http://kommineni.info/articles/dailyarticles/content_20160414_22.php?p=1460614144738

3 Comments

Filed under Uncategorized

3 responses to “జగన్ కేసు- టిడిపి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందా!

 1. I hope some caste fanatics from AP can teach similar values to their children ?

  “I believe in fate but I also believe that hard work and diligence plays a very important role in our lives. In a larger sense, we all write our own destiny. Take destiny in your own hands, dream of what you want to achieve, and write it in your own way. As you go ahead in life, I want you to climb the path to success one step at a time. Aim for the sky, but move slowly, enjoying every step along the way. It is all those little steps that make the journey complete.
  As you go forward, you will sometimes have to take difficult decisions, decisions that others might scorn at. But you must have the courage to stand up for what you believe in. Make sure you have that conviction to do what you know is right, and once you have it, don’t let skeptics distract you from your path.
  Aarti, there is no limit to what a determined mind can achieve, but in achieving your goal, don’t compromise on the values of fair play and honesty. Don’t cut corners or compromise to achieve your dreams. Remember to be sensitive to the feelings of people around you. And remember, if you don’t allow stress to overtake you, it will never become an issue in your life.
  Remember that good times and bad times will be part of your life equally, and you have to learn to handle both with equanimity. Make the most of life’s opportunities and learn from every opportunity, and challenge that life brings along”………Chanda Kochar – CEO ICICI

  http://www.ndtv.com/offbeat/chanda-kochhars-heartwarming-letter-to-daughter-is-winning-social-media-1395774?pfrom=home-topstories

 2. Kula gajji ……………Dhana picchi tho
  Manava viluvalanu mantakaluputhu
  Rastranni kulala kumapati ga marusthunna
  Cheedpurugulanu bhayatapettandi …

  Expose the Yellow weed on Social media ……SAVE AP

 3. Veera

  ఆ ఒక్కటీ అడక్కు !!!
  నిప్పు బాస్: మా అభి రుద్ది చూసి 80% ప్రజలు మా వెంటే ఉన్నారు
  విలేఖరి:అయితే YCP MLA ల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెల్లోచ్చుగా?
  నిప్పు బాస్: ఆ ఒక్కటీ అడక్కు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s