– ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ
– అవినీతి పేరిట ఎసిబి దాడులు
– సర్కారు జాబితాలో 72 మంది
– సెలవుపౖౖె వెళ్లిపోతున్న అధికారులు
ప్రజాశక్తి- విశాఖపట్నం ప్రతినిధి
మాట వినని అధికారులపై ప్రభుత్వం కత్తి గడు తోరది. అలాంటి కొందరిని ప్రాధాన్య తలేని శాఖలకు బదిలీ చేస్తోంది. మరి కొరదరిపై శాఖాపరమైన దాడులు, అవినీతి నిరో ధక శాఖను వినియోగిరచడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోర ది. ఈ ధాటికి తట్టుకోలేని అధికారులు కొరదరు సెలవుపై వెళ్లిపోతున్న సంఘ టనలూ తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక సీనియర్ పోలీసు అధికారి రాష్ట్రంలో పెరుగు తున్న ఒత్తిడిని తట్టుకోలేక కేంద్ర సర్వీసులకు వెళ్లి పోవడం తెలిసిరదే. ఇదే బాటలో మరికొరదరు ఐఏ ఎస్‌లు, ఐపిఎస్‌లు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కలెక్టర్లు కూడా ఒత్తిడికి గురవుతూ తమను వేరే పోస్టులకు బదిలీ చేయాలని అభ్యర్థిస్తున్నట్లు తెలు స్తోరది.
ప్రధానంగా మంత్రులు, శాసనసభ్యుల ఒత్తిడులను తట్టుకోలేకే అధికారులు హడలిపోతు న్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపైనా ఒత్తిడులొస్తున్నట్లు విమర్శలు వస్తు న్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు సహకరిం చని అధికారులు, జన్మభూమి కమిటీలకు, టిడిపికి అనుకూలంగా లేని అధికారులను ఏదో వంకతో ఇబ్బంది పెట్టేందుకు రాజకీయ ప్రణాళికలు సిద్ధమై నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అటు వంటి వారి జాబితాను తయారు చేసి అవినీతి శాఖ అధికారులకు అందించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఇలా 72 మందిని గుర్తించినట్లు తెలుస్తోంది. అవినీతి ప్రక్షా ళన పేరిట వీరిని దారికి తెచ్చుకునేర దుకు ఎసిబి అధికారులు కూడా రం గం సిద్ధం చేసుకురటున్నారు. అధికా రులంతా చెప్పిన మాట విరటూ తమ వారై ఉండాలన్నదే ప్రభుత్వ ఆలోచ నగా భావిస్తున్నారు. జన్మభూమి కమి టీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపిలు చెప్పిన విధంగా నడుచుకోని అధికారులపైనే ప్రభుత్వం నిశితంగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోరది.
చాలా కాలంగా టిడిపి నాయకులకు చెందిన పనులు చేయని అధికారులకు బెదిరింపులు వస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. నాయకులే నేరుగా బెదిరిస్తే ప్రజల్లో చులకనైపోతామన్న ఆలోచనతో తమ చేతికి మట్టి అంటకుండా ఎసిబికి ఈ బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. ముందు సానుకూలంగా చెప్పి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వినని అధికారులపై ఎసిబి ద్వారా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విధంగా బెదిరిస్తే కచ్చితంగా తమ దారికి వస్తారన్న ఆలోచనతో ముందుగా జాబితా తయారు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వ చర్యలకు భయాందోళన చెందిన కొంతమంది అధికారులు ఇప్పటికే దీర్ఘకాలిక సెలవులు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం గుర్తించిన 72 మందిలో సగం మంది సెలవులు పెట్టుకుని తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
ఏ రాయి అయితే నేమి !!!
[సుజన చౌదరి బదులు కేంద్ర మంత్రిగా గరికపాటి మోహన్ రావు (చౌదరి)?]
కాపు కాసిన కాపులు కరివేపాకేనా? కాపు MP తోట నరసింహం పనికిరాడా?
గోదావరి ప్రజల ఋణం తీర్చుకోవచ్చుగా?
http://telugu.updateap.com/?q=latest/1226
జగన్ కు ఇది రిలీఫ్ అవుతుందా
జగన్ ఆస్తుల కేసుకు సంబందింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులు కూడా సిబిఐ కోర్టుకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.ఇది ఈ కేసులో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జగన్ కు, విజయసాయిరెడ్డి తదితరులకు రిలీఫ్ కావచ్చు. రెండు కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుంది.అలాగే భిన్నమైన తీర్పులు వస్తే ఇబ్బందిగా కూడా ఉండవచ్చు.కేంద్రం కొంతకాలం క్రితం ఇడి కేసులను కూడా సిబిఐ కోర్టు విచారించవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.ఇడి తరపు న్యాయవాది కూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఒకేసారి రెండు కేసులు విచారించాలని కోరగా,దానికి హైకోర్టు ఆదేశం ఇవ్వకుండా సిబిఐ కోర్టు నిర్ణయించుకోవచ్చని తెలిపింది .దండమూడి తదితరులు ముప్పైనాలుగు కోట్ల రూపాయల మేర జగతి పబ్లికేషన్ లో పెట్టిన పెట్టుబడులకు సంబందించి ఇడి కోర్టు విచారణ బదిలీపై తొలుత సిబిఐ కోర్టు ఒప్పుకోలేదు.దాంతో విజయసాయిరెడ్డి,జగతి పబ్లికేషన్ లు హైకోర్టును ఆశ్రయించారు.సిబిఐ పెట్టిన కేసుల ఆధారంగానే ఇడి కేసు నమోదు చేసిందని,ఒకే అంశంపై రెండు కోర్టులు విచారించడం సరికాదని వీరు వాదించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160416_18.php?p=1460776707906