బ్యూరో క్రాట్ల వలస బాట

-కేంద్ర సర్వీసులకు దరఖాస్తుల వెల్లువ
-బాబు సర్కారుపై తీవ్ర అసంతృప్తి
-రాజకీయ ఒత్తిళ్లు తాళలేకనేనా?
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

కరువు కాలంలో ఉపాధి పనుల కోసం కూలీలు వలసలు పోవడం చూశాం. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిళ్లు తట్టుకోలేక ఎపిలో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఎఎస్‌, ఐపిఎస్‌లు కేంద్ర సర్వీసులకు, కాదంటే వేరే రాష్ట్రాల కేడర్లకు మూకుమ్మడిగా వలస బాట పట్టడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. తస్మదీయులకు అడ్డంగా పనులు చేసిపెట్టాలన్న అధికారపార్టీ వేధింపులు, ఫలితాలపై కంటే ప్రచార లక్ష్యంతో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహిస్తున్న వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాల బాధలు తట్టుకోలేక ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాల నుంచి సబ్‌ కలెక్టర్‌ స్థాయి వరకు ఐఎఎస్‌లు, అదనపు డిజిపిల నుంచి ఎస్పీల వరకు ఐపిఎస్‌లు విసిగి వేసారి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు క్యూ కట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర సర్వీసులకు వెళ్లే అవకాశం లేకపోతే కనీసం డిప్యూటేషన్‌పై వేరే రాష్ట్రాలకు పంపాలని, అదీ కుదరకపోతే కనీసం తాము ఇప్పుడున్న స్థానం నుంచి బదిలీ అయినా చేయాలని పలువురు మొర పెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే అదనపు డిజిపి స్థాయి ఐపిఎస్‌ అధికారి విఎస్‌కె కౌముది సర్కారుపై అసంతృప్తితో దరఖాస్తు పెట్టుకొని మరీ ఇటీవల కేంద్ర సర్వీసులకు వెళ్లారు. దీంతో బ్యూరోక్రాట్లలో వలస బాట పట్టేవారి సంఖ్య పెరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తమ వారికే పట్టం
తమ సేవలు ఉపయోగించుకోవడంపై పెద్దగా సర్కారుకు ఆసక్తి లేదని కౌముది భావించినట్లు సమాచారం. సమర్ధతను గుర్తించకుండా సర్కారీ పెద్దల అడుగులకు మడుగులొత్తే కొంత మంది అధికారులకు మంచి పోస్టింగ్‌లిచ్చి అందలం ఎక్కిస్తుండటంతో విసిగిపోయిన కౌముది సెంట్రల్‌ సర్వీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఆయన సిఆర్‌పిఎఫ్‌లో పోస్టింగ్‌ అడగ్గా, ట్రాక్‌ రికా ర్డును గమనించిన కేంద్రం ఉగ్రవాద చర్యలపై ప్రత్యే కంగా దర్యాప్తు చేసే ప్రసిద్ధ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ)లో కీలక స్థానం ఇచ్చి గౌరవిం చిందని ఐపిఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి బాబు సర్కారు సిన్సియార్టీకి ప్రాధాన్యత ఇవ్వట్లేదని అర్థమవుతోందని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సిఎం, మంత్రులే కాకుండా టిడిపికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, అమాత్యుల పుత్ర రత్నాలు, చివరికి జన్మభూమి కమిటీ సభ్యులు సైతం తమ పనులు చేసి పెట్టాలని ఐపిఎస్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో పలువురు అధికారులు రాష్రా ్టన్ని వదిలేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఉత్తరకోస్తాలో ఒక సీనియర్‌ పోలీస్‌ అధికారిపై అమాత్యుడొకరు తమ వారికి పనులు చేసి పెట్టాలని ఇబ్బంది పెడుతుండటంతో తాళలేక తానున్న స్థానం నుంచి బదిలీ చేయాలని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. కౌముది బాటలో పలువురు అధికారులు, చివరికి ఎస్పీ స్థాయి అధికా రులు కూడా పయనిస్తున్నట్లు తెలిసింది.

ఏకంగా 18 మంది!
ఐఎఎస్‌లు కూడా ప్రభుత్వంపై అసంతృప్తితో కేంద్ర సర్వీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. పాలనపైనా, నిర్ణయించిన అభివృద్ధి, (పేజీ…10)
సంక్షేమ లక్ష్యా ల ఫలితాలపైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెడితే వేరని, అలా కాకుండా తాము పని చేస్తున్నామని ప్రజలను నమ్మించేందుకు, ప్రచారం పొందేందుకు సిఎం, మంత్రులు నిర్వహిస్తున్న సమీక్షా సమాy ేశాలు, టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు ఇబ్బందికరంగా మారాయని పలువురు అధికారులు ఆందోళన చెందుతున్నారు. దానికితోడు ‘పనులు’ చేసి పెట్టాలన్న ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సీనియర్‌ ఐఎఎస్‌ల్లో ఏకంగా 18 మంది సెంట్రల్‌ సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వేధింపులతో మానసిక వేదన, శరీర అలసటకు తోడు తమ కుటుంబాలకు దూరమవుతున్నామని ఒక అధికారి ఆవేదన వెలిబుచ్చారు. నిబంధనల మేరకు రాష్ట్రాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులను ప్రతి ఏడాదీ పరిమిత సంఖ్యలో కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటారు. ఆ పరిమితిని దాటి పెద్ద సంఖ్యలో ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు వలస బాట పట్టి ఎలాగైనా రాష్ట్రం నుంచి బయట పడేందుకు పైరవీలు సాగిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

http://www.prajasakti.com/Content/1785222

7 Comments

Filed under Uncategorized

7 responses to “బ్యూరో క్రాట్ల వలస బాట

 1. Veera

  నారాయణ కరివేపాకేనా !!! మంత్రులలో నారాయణకు చివరి ర్యాంకు ఇచ్చిన బాబు
  నారాయణ 2014 ఎన్నికల్లో TDP కోసం దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాడు అని టాక్, అందుకని MLC పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు బాబు. భ్రమరావతి కోసం కోల్పోయే భూముల్లో ఎక్కువగా కాపులు రెడ్లు దళితులవే , అందుకని కాపులను దువ్వి భూములు గుంజుకోవడానికి నారాయణ ను ముందు పెట్టి భూములు లాగేసుకునారు, ఇంకా నారాయణ తో పనైపోయింది
  ఆ మద్య ముద్రగడ అన్నాడు చాలామంది TDP MLA లు మంత్రులు నాకు ఫోన్ చేసి మీరు చాల మంచి పనిచేస్తున్నారు, మేము బయటపడలేక పోతున్నాం అని చెప్పారు, ఒకాయన అయితే ఏదో మున్సిపాలిటీ ఇచ్చి నా చేత భూములు ఇప్పించి రాజధాని శంకుస్థాపన అప్పుడు నన్ను స్టేజి మీదకి కూడా పిలువలేదు, నన్నో కరివేపాకు లాగా వాడుకునారు అని బాధపడ్డాడు అని చెప్పాడు
  ఇప్పుడు జరుగుతుంది అదే, నారాయణతో పని పోయింది కాబట్టి నారాయణ పని తీరు బాగా లేదు అని చెప్పి సన్నగా పక్కకు తప్పించదమో, పనికిరాని మంత్రి పదవి ఇవ్వడమో చేస్తాడు
  వెన్నుపోటు రాజా మజాకా!!! Old habits die hard !!!

  [మంత్రులకు ర్యాంకులు ఇచ్చిన బాబు
  పీతల సుజాత – 1వ ర్యాంక్
  దేవినేని ఉమామహేశ్వరరావు- 2వ ర్యాంక్‌
  ప్రత్తిపాటి పుల్లారావు- 3వ ర్యాంక్‌
  రావెల కిశోర్‌బాబు- 6వ ర్యాంక్‌
  అచ్చెన్నాయుడు- 7వ ర్యాంక్‌
  పల్లె రఘునాథ్‌రెడ్డి- 11వ ర్యాంక్‌
  కిమిడి మృణాళిని- 13వ ర్యాంక్‌
  నారాయణ-లాస్ట్ ర్యాంక్‌ ]

 2. Veera

  జగన్ కంటే బాబు లో నాయకత్వ లక్షణాలు ఎక్కువ-జలీల్ ఖాన్
  అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు నైజం-కెసిఆర్
  ఊసరవెల్లి కూడా బాబు ఎదురైతే సిగ్గుతో సచ్చిపోద్ది-హరీష్ రావు
  నాకంటే గొప్ప నటుడు బాబు-ఎన్టీఆర్
  మేకలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు-హరికృష్ణ

  జలీల్ ఖాన్ చెబుతున్న లక్షణాలు ఇవేనండీ !!!

 3. Veera

  కుంటలతో తమ్ముళ్లకు పంట..!
  – 6,800 కోట్ల ‘ఉపాధి’ దోపిడీ
  – గట్టి నేలల్లో యంత్రాలతోనే పని
  – అదీ పెద్ద రైతుల పొలాల్లోనే..
  ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ తీస్తోంది. పేదలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ చట్టం కింద చేపట్టిన పథకాన్ని తెలుగుతమ్ముళ్లు, కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించేలా మార్చేసింది. ఈ నిధులను వివిధ శాఖలకు మళ్లించి నేరుగా యంత్రాలతోనే పనులు చేయించే స్థాయికి ప్రభుత్వం చేరింది. ఇది బహిరంగంగానే ఉపాధి నిధులను దోచుకోవడం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.6,800 కోట్లతో పంట కుంటలను తవ్వించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. భూగర్భ జలాలను పెంచడానికి రూ.2 వేల కోట్ల ఉపాధి హామీ నిధులతో 2.50 లక్షల పంట కుంటల తవ్వకానికి కేంద్రం అనుమతించింది. ఇదే అదనుగా టిడిపి ప్రభుత్వం పంట కుంటల సంఖ్యను 8.50 లక్షలకు పెంచేసింది. ఒక్కో కుంటకు సగటున రూ.80 వేల అంచనా రూపొందించారు. గట్టి నేలల్లో కుంటల తవ్వకం మనుషులు తవ్వలేకపోతున్నారని, యంత్రాలను వాడుకునేందుకు వీలు కల్పించారు. అయిదెకరాలకు మించి

  ఉన్న రైతుల పొలాల్లో గట్టినేలలుంటే ఈ పంట కుంటల తవ్వకానికి యంత్రాలను వాడుకోవచ్చని సిఎం చంద్రబాబునాయుడు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చేశారు. రాతి నేలలు, మెట్ట భూములలో ఉపాధి కార్మికుల స్థానే ఈ తవ్వకం పనులకు యంత్రాలతో ఇక తెెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు రంగప్రవేశం చేయనున్నారని పలువురు అనుమానిస్తున్నారు.

  మూడు రకాల అంచనాలు
  పంట కుంటలు మూడు రకాలుగా ఉంటాలని ప్రభుత్వం సూచించింది. పొలం విస్తీర్ణాన్ని బట్టి వాటిని తవ్వాలి. రెండు మీటర్ల లోతు, ఐదు మీటర్ల పొడవు, వెడల్పు కొలతలతో తవ్వే కుంటకు రూ.32 వేలు, పది మీటర్ల పొడవు, వెడల్పయితే రూ.80 వేలు వ్యయం చేయవచ్చు. అదే 20 మీటర్ల పొడవు, వెడల్పుతో తవ్వే కుంటకు రూ.1.50 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చని ప్రభుత్వం సూచించింది. కోస్తా జిల్లాల్లోని మెట్ట భూముల్లో కుంటల తవ్వకం నేల కఠినంగా ఉన్నందున మాన్యువల్‌గా వీలుపడదనే సమస్య చర్చకొచ్చినప్పుడు ట్యాంకర్లతో నీటిని తీసుకెళ్లి భూమిని తడిపి మరీ తవ్వకాలు ఉపాధి కార్మికులతోనే చేయించాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజులు కార్మికులతో పని చేయించి, ఆ తర్వాత రాజకీయ పలుకుబడితో యంత్రాలను వినియోగించునేలా సిఎంతోనే సూచనలు ఇప్పించగలగడం విశేషం.

  ఉపాధి నిధులు వృథా
  – ఏపి వ్యకాస ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
  పంటకుంటల తవ్వకం వల్ల ఉపాధి నిధులు వృథా అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము మొదటి నుంచి పంట పొలాల్లో కుంటల తవ్వకాన్ని వ్యతిరేకి స్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పథకం పెద్ద రైతులు, భూస్వాములు, కాంట్రాక్టర్లకే దోహదపడు తుందని విమర్శించారు. చట్టానికి విరుద్ధంగా యంత్రాలను ఉపయోగించు కోవచ్చంటూ సిఎం చంద్రబాబు ప్రకటించటాన్ని ఆయన ఖండించారు. యంత్రాలను ప్రవేశపెట్టటం వల్ల కార్మికులకు ఉపాధి పనులు లభించవని, యంత్రాలతో తవ్వకం ఉపాధి నిధులను కొట్టేసే ప్రయత్నంలో భాగమేనని ఆయన విమర్శించారు. ప్రజా ధనంతో అదీ పేదలకు పనులు చూపడానికి ఉద్దేశించిన నిధులతో బడా రైతుల పనులు చక్క బెట్టడం వల్ల ఫలితం ఎవరికనేది పునరాలోచించు కోవాలని ఆయన సూచించారు.

  http://www.prajasakti.com/Content/1785072

 4. Veera

  ఇంత చేసి నందుకు నాకు రాజ్యసభ సీటు ఇవ్వు బాబూ అంటున్న చంద్ర జ్యోతి/ A(C)BN రాదక్రిష్ణ చౌదరి (RK)
  [మీడియా ప్రముఖుడు ఎమ్.పి సీటు అడుగుతున్నారా?
  టిడిపితో వ్యక్తిగతంగా ,సంస్థాగతంగా ఉన్న సంబందాల దృష్ట్యా తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని టీవీచానల్,పత్రిక కలిగిన ఒక యజమాని గట్టిగా కోరుతున్నట్లు ఆ కధనం తెలిలిపింది.
  అందులో విశేషమైన పాయింట్ ఏమిటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల కొనుగోలు ప్రణాళికలను ఆయన అమలు చేస్తున్నారట.అందులో భాగంగా తన పత్రిక,చానల్ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ముందుగా వదంతులు ప్రచారం చేయడం,, ఆ తర్వాత ప్రత్యక్షంగానో,పరోక్షంగానో సమాలోచనలు చేస్తున్నారట.ఫలానా ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటూ నిజం ఉన్నా లేకపోయినా ప్రచారం చేయడం చేస్తున్నారట.అందువల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నందున రాజ్యసభ ఇవ్వాలని అడుగుతున్నారట.
  http://kommineni.info/articles/dailyarticles/content_20160417_12.php?p=1460864761116

 5. Veera

  పవన్,లోక్ సత్తా JP చౌదరి గురించి RK చౌదరి మాటల్లో
  [ఆరడుగుల బుల్లెట్టు… అరంగేట్రం!
  – ఆంధ్ర జ్యోతి RK చౌదరి చెత్త పలుకు , ఏప్రిల్ 17,2016
  Key Points:
  డబ్బు, కులానికి తమ పార్టీ వ్యతిరేకమని లోక్‌సత్తా జేపీ ప్రకటించారు. అప్పటివరకు విజిల్‌ బ్లోయర్‌గా ఉన్న జేపీ తన పార్టీ ఎన్నికల చిహ్నంగా ‘ఈల’నే ఎంచుకున్నారు. లోక్‌సత్తా పార్టీ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ చతికిలబడింది.

  జయప్రకాశ్‌ నారాయణ్‌ ఒక్కరే చచ్చీచెడీ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కూకట్‌పల్లిలో సీమాంధ్రకు చెందినవాళ్లు, అందులోనూ ఒక సామాజికవర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటమే జేపీ గెలుపునకు కారణం. ఇదొక చేదు నిజం కూడా!

  ఒక తొందరపాటు నిర్ణయంతోపాటు తమ గురించి ఎక్కువగా ఊహించుకోవడం, ప్రజలను సరిగ్గా అంచనా వేయలేకపోవడంవల్ల జేపీ ఒక విఫల ప్రయోక్తగా మిగిలిపోవలసి వచ్చింది.

  నిజానికి పవన్‌కల్యాణ్‌ను పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా భావించలేం. గత ఆదివారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలను విన్నవారికి, చదివిన వారికి ఇదే అభిప్రాయం కలుగుతుంది. అభిమానుల అభిప్రాయం ప్రామాణికం కాదు. తమ అభిమాన హీరోలు ఏమిచేసినా వారికి ఆనందంగానే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం సులువే! పార్టీని నడిపించడం మాత్రం ఆషామాషీ కాదు.]

  Summary:మొత్తానికి 2014 ఎన్నికల్లో పవన్ వలన కాపుల వోట్లు పొంది బాబు గెలిచాడు,ఇప్పుడు పార్టీ పెడితే ఆ వోట్లు దూరమవుతాయి కాబట్టి బాబు కు ఇబ్బంది లేకుండా రాజకీయాల్లోకి రాకు అని నర్మగర్బంగా చెప్పాడు చౌదరి.

  లోక్ సత్తా JP చౌదరి కూకట్ పల్లి లో గెలిచాదంటే అక్కడ ఉన్న సొంత కుల వోట్ల బలం తోనే అని చెప్పకనే చెప్పాడు.

 6. Veera

  హ హ హ !!!
  కష్టమైనా సరే మీ లాగా CM అవ్వాలని ఉంది సార్- బాబుతో బాలిక
  నువ్వు CM అవ్వాలంటే ముందు మీ మామ CM అయి ఉండాలి- నిప్పు
  -Sryinivas Madisetty

 7. Veera

  వాట్ యాన్ ఐడియా సర్ జీ !!!
  CRDA(కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ)ఉద్యోగాల్లో ‘నో’ రిజర్వేషన్స్ ?
  ఇంకేమి మొత్తం మనోల్లను పెట్టుకోవచ్చు,30 ఇయర్స్ ఇండస్ట్రీ మరి !!!
  అవును ఆయనే రావాలండయ్యా చాలా కమ్మగా ఉందండయ్యా !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s