అసెంబ్లీ సీట్ల పెంపు ఆగినట్టేనా?

అసెంబ్లీ సీట్ల పెంపు ఆగినట్టేనా?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం కనిపించడం లేదు.

శాసన సభ సీట్ల పెరుగుదలను ఆశగా చూపించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఫిర్యాదు చేసినందుకే పునరాలోచనలో పడినట్టు తెలిసింది. తెలంగాణలో బిజెపిని పటిష్ఠం చేయటంతోపాటు 2019 ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మే మూడో వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ వచ్చిన లక్ష్మణ్ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో రాష్ట్ర పరిస్థితిపై చర్చించారు. సోమవారం విలేఖరుల సమావేశం లో ఆ సమావేశాల విషయాలను వెల్లడించారు. రాజకీయ స్థిరత్వం కల్పించేందుకే రెండు రాష్ట్రాల శాసనసభల సీట్లు పెంచాలని ఏపీ విభజన చట్టంలో ప్రతిపాదించారు. అయితే రెండు రాష్ట్రా ల ముఖ్యమంత్రులు మాత్రం దీనిని తమ రాజకీయ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో టిఆర్‌ఎస్ తమ శాసనసభ్యులను కొనుగోలు చేస్తోందని ఆరోపించే తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి శాసన సభ్యులను తమ పార్టీలో చేర్చుకోవటం ఏ విధంగా సమర్థనీయమని ఆయన ప్రశ్నించారు.

శాసనసభల సీట్ల సంఖ్య పెరగాలని బిజెపి కూడా కోరుకుంటోందని, అయితే ఈ ప్రక్రియను ఆచితూచి చేయాలని అధినాయకత్వానికి, ఎన్‌డిఏ ప్రభుత్వానికి సూచించినట్లు లక్ష్మణ్ వివరించారు. తెలంగాణలో బిజెపిని పటిష్టం చేయటంతోపాటు 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి రాజకీయ శక్తిగా రూపొందిస్తామని ఆయన అన్నారు. ఏ మిత్రపక్షంతో సంబంధం లేకుండా ఒంటరిగా పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతామని ఆయన ప్రకటించారు.

తెలుగుదేశంతో ఉన్న పొత్తుల గురించి అడగగా, పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయి, ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి తెలుగుదేశంతో పొత్తు లేనట్లేనని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

http://andhrabhoomi.net/content/state-1729

9 Comments

Filed under Uncategorized

9 responses to “అసెంబ్లీ సీట్ల పెంపు ఆగినట్టేనా?

 1. Veera

  చంద్రబాబు కాబోయే ప్రధాని-తెలంగాణా లో ఏకైక TDP MP మల్లారెడ్డి
  ఎంత కాకా పట్టినా కేంద్ర మంత్రి పదవి గరికపాటి చౌదరి కే మల్లన్నా !!!

 2. Veera

  రాజువయ్యా !!!
  జగన్ నన్ను చాలా గౌరవంగానే చూసుకొన్నారు.ఆయనతో నేనెన్నడూ ఇబ్బంది పడలేదు.
  -TDP లో చేరిన బొబ్బిలి రాజు అయిన YCP MLA సుజయక్రిష్ణ రంగారావు

  12 మంది TDP లో చేరితే ఒక్క జ్యోతుల నెహ్రూ తప్ప ఎవరూ చెడ్డగా మాట్లాడలేదు పోనీలే పొతే పోయావు రాజువు అనిపించుకోన్నావు.
  (విశాఖ లో 500 కోట్ల విలువ చేసే రాజు గారి స్థలం గొడవల్లో ఉంది కాబట్టి TDP లో చేరుతునారు అని టాక్ )
  జ్యోతుల నెహ్రూకు అయన తోడల్లుడు, మేనల్లుడు కి మొత్తం 3 MLA టికెట్లు, జ్యోతుల కుమారుని ZP చైర్మన్ అభ్యర్ధిగా , జ్యోతులను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఇన్ని పదవులు టికెట్లు ఇచ్చినా కూడా పార్టీ మారుతూ రాళ్ళు వేసి వెళ్ళాడు

  అంటే కాకుండా పవన్ కళ్యాణ్ ఎప్పుడేమి మాట్లాడుడుతాడో ఆయనకే తెలీదు, ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట, హైదరబాద్ లో ఒక మాట తూల్లోరులో ఇంకో మాట అని TDP లో చేరగానే బాబు చెప్పినట్టుగా జగన్ పవన్ మీద రాళ్ళు వేసి క్యారెక్టర్ లేని వ్యక్తీ అయ్యాడు

 3. Human greed and its consequences ….
  Whilst the politicians are busy looting the land …GOD is busy drying it up.
  Even if you have crores ……you might have to fight for a glass of water ?
  Today it is Hyderabad ………Tomorrow it is Amaravathi ?

  http://www.ndtv.com/telangana-news/water-emergency-in-hyderabad-the-first-in-30-years-minister-ktr-tells-ndtv-1397447?pfrom=home-south

 4. Veera

  TDP సానుభూతి పరులు సైతం ఇంత అవినీతి ఏంటి బాబూ అని బాధపడుతున్నారు
  MLA లను చూసి ప్రజలు వోట్లు వేయరు, 90% ప్రజలు పార్టీని చూసి వోట్లు వేస్తారు అందువలన MLA లను కొనుక్కొని మేము బలపడ్డాము అని ఎవరు అనుకొన్నా పొరపాటే !!!
  -రాజకీయ విశ్లేషకులు కఠారి శ్రీనివాస రావు,TV5 ప్రవాస భారత్, ఏప్రిల్ 19,2016

 5. Veera

  నిన్న మా చుట్టాల్లో ఒకరు చనిపోతే పిడుగురాళ్ళ (గుంటూర్) దగ్గర ఉన్న మా ఊరికి పోయినా.
  పొలాలు ,పల్లెటూళ్ళు చూస్తే పరమ దరిద్రంలో వున్నాయ్ ,
  పొలాలు అన్నీ నున్నంగా ఎండి ,పచ్చి గడ్డిపరక కూడా లేదు, పాపం గొడ్లు ఎలా బతుకుతాయో ,కాలవల్లో మొత్తం ఎండిపోయి ఉన్నాయ్
  పనిలేక ప్రతీ ఒక్కడు చెట్లక్రింద కూర్చొని తెగ తిట్టుకుంటున్నారు.
  ఏందిరా ? సంగతి అన్నా , ఏముంది ? ఇలా పనుల్లేక ఖాళీగా కుసున్నాం. అన్నారు .
  బాబు గురించి ఏందిరా ? సంగతి అన్నాను ,ఇప్పటిదాకా తిట్టుకుంటుంది బాబునే అన్నారు .
  సరే మిగతా వారు ఏమనుకుంటున్నారు ? అన్నాను.
  బాబుకి ఓటు వేసిన వాళ్ళే బాబును ఎక్కువ తిట్టుకుంటున్నారు అన్నారు.
  పోనిలేరా రిస్క్ తీరుకొని ఎండకు గుంటూరు నుండి వచ్చినా బాబు గురించి గుడ్ న్యూస్ విన్నాలే అనుకోని హమ్మయ్యా అనుకున్నా.
  -Sryinivas Madisetty

 6. AP ni prathyakam ga choodaka potha naku anti ?
  Mana vallani nenu prathyakam ga choosukunta chalu ??

  Shame……shame……CM sitting on the same stage.

  http://www.sakshi.com/news/district/central-panchayati-raj-minister-chaudhry-birendrasing-comments-on-ap-334091?pfrom=inside-carousel-news

 7. Manam …….Kulam……Dhanam antu
  Manava viluvalanu manta kaluputhu
  Rastranni brastupattisthunna tharunam lo…….
  Kula mathalaku athitham ga ….
  Alupergani Praja Poratam chesthunna …..Oke Okkadu

 8. Veera

  అవును ఆయనే రావాలి ఆయనొస్తేనే బాగుంటుంది అన్న బ్రమ్మీస్,ఇది చదవండి

  1.పరిపాలనలో ఏమాత్రం అనుభవం లేని కేసియర్ పాలన లో గల రాష్ట్రం లో డీజిల్ లీటర్ మీద అన్నిపన్నులు కలిపి 27 రూపాయలు.

  2.కొద్ది పాటి అనుభవం కలిగిన ఒరిస్సా ముఖ్యమంత్రి పాలనలో 27.26 పైసలు.

  3.కొంచెం ఎక్కువ అనుభవం కలిగిన తమిళనాడు ముఖ్యమంత్రి పాలనలో ఇది కేవలం 21.43 పైసలు మాత్రమె.

  4.స్వల్ప అనుభవం కలిగిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పాలనలో ఈ పన్నులు 22.01పైసలు మాత్రమె.

  5.సుదీర్ఘానుభావం కలిగిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పాలనలో ఈ పన్నులు 33.32 పైసలు!!!!

  6.ఆంధ్ర ప్రదేశ్ లో డీజిల్ నింపుకోవడానికి భయపడుతున్న లారీల యజమానులు ఆంధ్ర బోర్డర్ లో ప్రవేసించే ముందే డీజిల్ ఫుల్ గా నింపుకుని ఆంద్ర ప్రదేశ్ దాటిపోయిన తరువాత మళ్ళీ పొరుగు రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నారు.

  7.2016 ఫిబ్రవరి లో 10 జిల్లాలు గల తెలంగాణా లో 2,66,822 లీటర్ల డీజిల్ అమ్ముడు పోయింది. 13 జిల్లాల ఆంద్ర లో 2,54,903 లీటర్ల డీజిల్ మాత్రమె అమ్ముడు పోయింది.

  8.ఈ విధంగా డీజిల్ అమ్మకాలు పడిపోవడం తో అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలలో అనేక పెట్రోల్ బంకులు మూతపడి పోయాయి.

  9. ఈ విషయం లో కాబినెట్ ఉప సంఘం ఏవో సిఫార్సులు చేసిందట. వాటిని ప్రభుత్వం బయటపెట్టడం లేదట. అసలు పట్టించుకోవడం లేదట.

  10.ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్ బంకులు వందల సంఖ్యలో మూతపడటం ఖాయం అని డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేసాడట.

  ఇది నా పైత్యం కాదు. ఆంధ్రజ్యోతి లో వచ్చిన వార్త. నమ్మితే నమ్మండి. లేకపోతె లేదు.

  రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు అని ఏడిస్తే, ఎలా వస్తాయి?
  చంద్రబాబు గతంలో ఉమ్మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసినపుడు రోజుకు 9 గంటల కరెంట్ కోతను, అధిక పన్నులను తట్టుకోలేక హైదెరాబాద్ లో సుమారు 2500 చిన్న తరహా పరిశ్రమలు మూతపడి పోయాయి. పెద్ద పరిశ్రమ అంటూ ఒక్కటి కూడా హైదెరాబాద్ లో నెలకొల్ప బడలేదు.

  ప్రస్తుతం కూడా ఆంధ్ర లో అదే విధానం… అదే తరహా పాలన!!!!!

  -Murali Mohan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s