జ‌గ‌న్ స‌క్సెస్ అయిన‌ట్టే..!

ఏపీలో పార్టీ ఫిరాయింపుల అంశంపై సేవ్ డెమెక్ర‌సీ అంటూ నిన‌దించిన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఢిల్లీకి చేరింది. మూడు రోజుల పాటు జాతీయ నేత‌ల చుట్టూ తిరిగింది. ప‌లువురితో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు కీల‌క‌నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చించారు. కేంధ్రంలో కీల‌క‌మైన ఆర్థిక‌, హాంమంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు.

మూడు రోజుల పాటు ఢిల్లీలో జ‌గ‌న్ హల్ చ‌ల్ చేసిన‌ట్టు భావించాలి. ప‌లు అంశాల‌కు ఆయ‌న కేంధ్రంగా మారినట్టు చెప్పాలి. ఓవైపు విజ‌య‌వాడ‌లో రోజుకొక్క ఎమ్మెల్యే చొప్పున చేజారిపోతున్న‌ప్ప‌టికీ ప‌ట్టుస‌డ‌ల‌కుండా పోరాట‌మార్గం ఎంచుకున్నట్టుగా క‌నిపిస్తోంది. అందుకే ఎంద‌రు ఎమ్మెల్యేలు పోయినా వెనుక‌డుగు లేద‌ని జ‌గ‌న్ సంకేత‌మిచ్చేశారు.

ఒక ఊరిలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు పార్టీ మారినంత మాత్రాన ఆ గ్రామంలో ప్ర‌భుత్వంతో విబేధించే జ‌న‌మంతా పార్టీ మారిన‌ట్టు కాద‌ని, అందుకే త‌మ వెంట జ‌నం ఉన్నార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే పోయిన వాళ్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రో, ముగ్గురో పోయినా పెద్ద‌గా ఆందోళ‌న లేద‌న్నారు. త‌ద్వారా ఎమ్మెల్యేలు దూర‌మ‌వుతున్న విష‌యం జ‌గ‌న్ కి ముందే తెలిసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వారిని స‌ముదాయించే ప్ర‌య‌త్నాలు ఇక మానుకున్నారు. జ్యోతుల నెహ్రూ, సుజ‌య కృష్ణ రంగారావు ద‌గ్గ‌ర‌కి బృందాల‌ను పంపించిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత అలాంటి ప్ర‌య‌త్నాలు కూడా విర‌మించుక‌న్నారు. తాజాగా గొట్టిపాటి ని గానీ, బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డిని గానీ కనీసం ఆపే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేదంటే జ‌గ‌న్ ఆలోచ‌న అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారి తీసిన అంశం మాత్రం ఎంప‌ర‌ర్ ఆఫ్ క‌ర‌ప్ష‌న్ పుస్త‌క‌మే. తెలుగుదేశం అనుకూల మీడియాలో ఆ పుస్త‌కం గురించి పెద్ద‌గా చ‌ర్చ రాన‌ప్ప‌టికీ జాతీయ , ఇంగ్లీష్ ప‌త్రిక‌లు, చానెళ్లు మాత్రం ప్రత్యేకంగా ఆస‌క్తి రేపాయి. దానికి త‌గ్గ‌ట్టుగా క‌థ‌నాలు ఇచ్చాయి. ఢిల్లీ స్థాయిలో పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపాయి. చంద్ర‌బాబు రెండేళ్ల కాలంలోనే 1.30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డిన‌ట్టు ఆ పుస్త‌కంలో ఉన్న అంశాన్ని హైలెట్ చేశాయి. దానికిత‌గ్గ‌ట్టుగా జీవోలు, ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు అన్నీ ఉండ‌డంతో చంద్ర‌బాబు పాల‌నా తీరుపై అనుమానాలు పెంచాయి. ఎమ్మెల్యేల‌కు 20 నుంచి 30 కోట్లు ఇస్తున్నార‌న్న ప్ర‌చారం గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కూ సాగుతున్న త‌రుణంలో ఈ పుస్త‌కం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంద‌నే చెప్పాలి. కేంధ్ర‌మంత్రులు కూడా ఆస‌క్తిగా పుస్త‌కంలో అంశాలు ప‌రిశీలించిన తీరు చూస్తే జ‌గ‌న్ ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టే భావించాలి.

అదే స‌మ‌యంలో దాని ప్ర‌భావం టీడీపీ నేత‌ల మీద ప‌డుతున్న తీరు కూడా ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తుంది. ఏకంగా పార్ల‌మెంట్ లాబీల్లోనే టీడీపీకి చెందిన ఓ ఎంపీతో జేడీఎస్ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు దానికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ఓటుకు నోటులో 5 కోట్ల రూపాయ‌లు ఎర‌వేస్తూ అడ్డంగా బుక్క‌యిన విష‌యం ఈ అక్ర‌మాల‌కు ఆధారంగా ఉండ‌డంతో అంతా న‌మ్ముతున్న‌ట్టు భావిస్తున్నారు. దాంతో చంద్ర‌బాబు అండ్ కో కొంత స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టుగానే చెప్పాలి.

ఇక య‌న‌మ‌ల మ‌రో అడుగుముందుకేసి ఏపీ ప‌రువు తీస్తున్నార‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా చంద్ర‌బాబు ప‌రువు య‌మునా న‌దిలో క‌లిసిపోతున్న విష‌యాన్ని ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్ట‌వుతోంద‌ని ఓ విలేక‌రి వ్యాఖ్యానించారు.

జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేపథ్యంలో జ‌గ‌న్ ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌డానికే అన్న‌ట్టుగా టీడీపీ మైసూరా రెడ్డిని ముందుకు తీసుకొచ్చిన‌ట్టు భావిస్తున్నారు. అత‌డి ఘాటు లేఖ ద్వారా జ‌గ‌న్ వాద‌న‌ను కార్న‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. అప‌రిచితుడు అంటూ మైసూరా చిత్రీక‌రించిన తీరు సంచ‌ల‌నంగా మారుతోంది. అందుకే దాన్ని హైలెట్ చేయ‌డం ద్వారా జ‌గ‌న్ వాద‌న‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నంలో టీడీపీ మీడియా క‌నిపిస్తోంది. కానీ దానికి జ‌గ‌న్ స్పందించిన తీరు మాత్రం ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌పోయినా ప్ర‌చారానికి మాత్రం నోచుకోలేదు. ఆరు నెల‌లుగా తాను మైసూరాని చూడ‌లేదంటూ జ‌గ‌న్ చెప్పిన మాట‌కు తెలుగు మీడియా లో చోటు ద‌క్క‌లేదు. ఏమైన‌ప్ప‌టికీ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న, టీడీపీ స్పంద‌న‌, అదే స‌మ‌యంలో మైసూరా లేఖ ఇలా గ‌డిచిన మూడు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో కొంత వేడిని పుట్టించాయి. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు కొంత ఫ‌లించిన‌ట్టు క‌నిపించాయి.

అస‌లే అంతంత‌మాత్రంగా ఉన్న చంద్ర‌బాబు ప‌రిస్థితిని మ‌రింత దిగ‌జార్చిన‌ట్టుగానే భావించాలి. వాస్త‌వానికి ఈ పుస్త‌కంలోని అంశాలు, ఢిల్లీలో జ‌గ‌న్ ప్ర‌స్తావించిన అంశాల ప్ర‌భావం భ‌విష్య‌త్తులో క‌నిపిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో చంద్ర‌బాబు పుస్త‌కాలు పంచినప్పుడు ఉన్న అనుభ‌వాల‌ను పరిశీలిస్తే ఇదే స్ప‌ష్ట‌మ‌వుతుంది.

http://telugu.updateap.com/?q=latest/1495

13 Comments

Filed under Uncategorized

13 responses to “జ‌గ‌న్ స‌క్సెస్ అయిన‌ట్టే..!

  • The fact that these unethical crooks are buying YSRCP MLA’s is itself a refletion of how much they are scared of our values …
   15 MLA’s will be equal to 15 votes for us. Infact they might not even vote for KDP in the next polls. Okaru potha padhi mandhi ready ga vunnaru poti cheayataniki.
   We will come to power ethically by winning the Hearts of the people.
   Not by filling the pockets of people’s representatives.
   @ yellow caste fanatics
   Bhoomi meedha brathika nalugu rojulanna …nijayatheega brathakatam nerchukondi. No matter how much you loot you take nothing with you.
   Death is inevitable and your bodies start rotting within 10 minutes of death , after you waste all your life talking about caste and looting fellow human beings. Do not think that your sins will dissapear by praying to GOD. You know this very well.
   No matter what you do …
   Your fears and our dreams will come true.

 1. Veera

  వెంక‌య్య‌కు మోడీ బ్రేకులు ..?
  మోడీకి వెంక‌య్య మీద అందిన రిపోర్ట్ ఆధారంగానే వాళ్లిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెరిగిన‌ట్టు చెబుతున్నారు. ఇటీవ‌ల ప‌లు ఆర్థికాంశాల్లో వేలు పెట్టిన వెంక‌య్య కొడుకు పేరుతో అనేక కంపెనీల్లో వాటాలు సంపాదించిన‌ట్టు ఓ రిపోర్ట్ ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

  దాని ప్ర‌కారం 40 కంపెనీల్లో వెంక‌య్య కొడుకు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఆయా కంపెనీల్లో హ‌ర్ష‌వ‌ర్థ‌న్ వాటా విలువ వెయ్యి కోట్ల‌కు స‌మీపంలో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

  దానికితోడుగా వెంక‌య్య కూతురు దీప పేరుతో కూడా భారీగానే సంపాదించిన‌ట్టు ఢిల్లీ స‌ర్కిల్ కోడై కూస్తోంది. స్వ‌శ్ఛంద సేవ పేరుతో భారీగా నిధులు సేక‌రించేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అటు కొడుకు, ఇటు కూతురు కూడా భారీగా సంపాదించేయ‌డం వెనుక పెద్దాయ‌న హ‌స్తం ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు.

  ఈ ప‌రిస్థితులకు తోడుగా అటు తెలంగాణా, ఇటు ఆంద్రాలో ఆయ‌న వ్యాపార‌, కుటుంబ ప్ర‌యోజ‌నాల కోసం ఇద్ద‌రు సీఎంల‌తోనూ వెల‌గ‌బెడుతున్న స‌ఖ్య‌త సందేహాస్ప‌దంగా క‌నిపిస్తోందంటున్నారు. తెలంగాణాలో పోలీసుల‌కు కొనుగోలు చేసిన వాహ‌నాలు, ఇటీవ‌ల బ‌స్సులు కూడా వెంక‌య్య కొడుకు కంపెనీ నుంచే కొనుగోలు చేయ‌డం దానికి ఆధారంగా చూపిస్తున్నారు. ఏపీలో దీపిక పేరుతో సాగుతున్న ఎన్జీవీ విస్త‌ర‌ణ కోసం చంద్ర‌బాబుతో ప‌లు అంశాల‌లో ఆయ‌న సాగిస్తున్న వ్య‌వ‌హారాలు సాక్ష్యంగా ఉన్నాయంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో వెంక‌య్య ఆర్థిక లావాదేవీలు భ‌విష్య‌త్తు రాజ‌కీయ జీవితానికి కొంత ఆటంకంగా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదంటున్నారు. అందుకే ఆయ‌న‌కు మ‌ళ్లీ అమాత్య ప‌ద‌వి ద‌క్కుతుందా లేక పూర్తిగా తెర‌వెనుక రాజ‌కీయాలకే ప‌రిమితం కావాల్సి వ‌స్తుందా అన్న‌ది చూడాలి.

  http://telugu.updateap.com/?q=latest/1509

 2. Veera

  జగన్ వెంట విజయమ్మ మాత్రమే ఉంటుంది-TDP MP JC దివాకర్ రెడ్డి
  ముందు నీవెంట నీ కొడుకు పవన్ రెడ్డి ఉన్నాడా?జగన్ తో టచ్ లో ఉన్నాడు కదా

  టీచర్:ఆయారాం గయారాం అంటే ఏమిటి పిల్లలూ
  రాము:టిఫిన్ కు వెళ్లి ఒక పార్టీ లో చేరి డిన్నర్ కు వెళ్లి వేరే పార్టీ లో చేరడం

  ఏడు ఏళ్లుగా మా ఆస్తులు ప్రకటిస్తున్నాం -మాలోకం
  ఏంది చెంబు చాటా !!! జయ ప్రకాష్ రెడ్డి

  ప్రతిపక్షం సహకరించడం లేదు-నిప్పు
  అంటే సహరిస్తే 2 లక్షల కోట్లు కాకుండా 5 లక్షల కోట్లు నోక్కేసేవారా?

 3. Veera

  మైసూరాకు ఎదురు తన్నిన టిఫిన్ కండువా కథ
  http://www.muchata.com/main-news/a-boomerang-story-of-mysoora-letter/

 4. Veera

  వెంకయ్య నాయుడి కొడుకు 39 కంపెనీల్లో డైరెక్టర్,900 కోట్ల ఆస్తులున్నాయా?
  http://www.muchata.com/main-news/internal-discussions-on-venakayyas-son/

  • Rastram lo Dongalu paddaru.
   5% unethical people are looting the state helping each other out ,no matter what they do or where they live.
   The 95% public in AP should be ashamed of themselves for not brining these caste fanatics to justice.
   Ravi asthaminchani Samarajyalu ..Sankanakipoyayi
   Ee Chillari Dongalu antha ?

 5. NTR ni vennupotu podichi champina vyakthi votes vesi chappatlu koduthu
  Thandrini champina vyakthi kodukki pillani ichhi chapatlu koduthunna ..
  Neethi malina jathi gurinchi ….Jathiki theliya cheyandi.
  Save Democracy ……..Save AP.
  Social media is a fantastic weapon to tackle these caste fanatics ruining AP.
  If 5% are destroying AP…. …..Can’t 95% people save it ?
  Learn from Telangana people who plucked out this weed completely.

 6. Veera

  రాజకీయాల్లో విలువలు ముఖ్యం అని YCP MLA గొట్టిపాటి రవి కి TDP కండువా కప్పి రాజకీయాల్లో విలువల ఆవశ్యకత పై ప్రసంగించిన నిప్పు బాబా .
  (ఛీ దీనెమ్మ జీవితం, విరక్తి పుడుతోంది -బ్రహ్మి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s