ఆర్థిక మూలాలపై దెబ్బ-అందుకే పార్టీ మారుతున్న వైసిపి ఎమ్మెల్యేలు

ఆర్థిక మూలాలపై దెబ్బ-అందుకే పార్టీ మారుతున్న వైసిపి ఎమ్మెల్యేలు
-వ్యాపార లావాదేవీలకు ఎసరు, వ్యాపారాలు లేకుంటే ప్రలోభాలు
-ఎసిడిపి స్థానే ఎస్‌డిఎఫ్‌తో గాలం

ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
ప్రతిపక్షాన్ని దెబ్బ తీయడం ద్వారా ఏకపక్ష పాలన చేసుకోవచ్చనే ఆలోచనతో టిడిపి ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతోంది. వ్యాపారాలు లేని వారికి ప్రలోభాల ఎర వేస్తోంది.

ఒకరిద్దరు ప్రతి పక్ష నాయకుడి తీరు నచ్చక వెళ్లి పోతే మిగిలిన వారిలో ఎక్కువ మంది వ్యాపార, ఆర్థిక లావాదేవీ లను కాపాడుకునేందుకే వెళ్లారని ఇరుపార్టీల వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎసిడిపి) ఆపేసి, స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డిఎఫ్‌) పేరిట అధికార పార్టీ ఇన్‌ఛార్జులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. ఈ పరిస్థితి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మింగుడు పడని అంశంగా మారింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావడం వెనుక ఓ సీనియర్‌ మంత్రి కీలకపాత్ర పోషిస్తు న్నారు. ఆర్థికపరమైన వ్యవహారాలు చూసే ఈ మంత్రి ఏడాదికాలంగా ఇదేపనిలో ఉన్నట్లు సమాచా రం. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చెందిన ఆర్థిక వ్యవహా రాలను గుప్పిట పెట్టుకుని అనుమతులు, వ్యాపారం, ఇన్‌కంట్యాక్స్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌, మైనింగు, ఇరిగేషన్‌ కాంట్రాక్టులను టార్గెట్‌చేసి వ్యవహారం నడుపుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు రాజధాని చుట్టుపక్కల భూములున్నాయి. వీటినీ టార్గెట్‌ చేశారు. ఇటీవల టిడిపిలో చేరిన ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలకు పోయినట్లు తెలిసింది. ఆయన గ్రానైట్‌ వ్యాపారానికి సంబంధించి కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిపేయడంతోపాటు, ట్యాక్సుల పేరు తో క్వారీలకు నోటీసులు వెళ్లాయని తెలిసింది. కొన్ని క్వారీల అనుమతుల పునరుద్ధరణ కూడా నిలిపేస ినట్లు సమాచారం.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నా రు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీచేసిన వైసిపి అభ్యర్థి జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. శ్రీకాకుళం జిల్లాలో ఆయ నకు చెందిన బీచ్‌శాండ్‌పై దృష్టిసారించారు. విచా రణ పేరుతో రూ.1200 కోట్లు జరిమానా వేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. దీనిపై చర్చలు సాగుతున్న సమయంలో వెంటనే వైఎస్‌ఆర్‌ సిపికి రాజీనామా చేయాలని కీలక మంత్రిచేసిన సూచన మేరకు వెంటనే ఆయన ఆ పార్టీకి రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. విజయవాడ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే పాత ఇనుప వ్యాపారంపై ప్రభుత్వం దృష్టిసారించింది. దాదాపు దెబ్బతీసే స్థితికి తీసుకెళ్లే సమయంలో ఆయన నేరుగా జిల్లాకు చెందిన ఓ మంత్రిని కలిసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. అదను చూసి చేర్చుకుంటామని టిడిపి చేసిన సూచన మేరకు ఆగి ఇటీవల టిడిపిలో చేరారు. కర్నూలుకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే పార్టీ మారడం వెనుకా మైనింగు వ్యాపార లావాదేవీలే కీలకంగా ఉన్నట్లు తెలిసింది. వ్యాపారాలు దెబ్బతినిపోతే ఇబ్బంది పడతామేమోననే ఉద్దేశంతో ఉన్న సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త, టిడిపి ఎంపి సిఎం రమేష్‌ ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామనే ఒప్పందం మేరకు పార్టీకిలోకి ఆహ్వానించారని తెలిసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ గిరిజన ఎమ్మెల్యేకు డబ్బు ప్రలోభపెట్టినట్లు సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేకు చెందిన పెట్టుబడులపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో మిగిలిని ఇద్దరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో ఒకరితో చర్చలు సాగుతున్నాయి. ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన ఓ రాజాకు జిల్లాకు చెందిన వైసిపి నాయకులతో విభేదాలతోపాటు రాజధానికి దగ్గరగా కృష్ణా జిల్లాలో భూములున్నాయి. ఆ ప్రాంతంలోనే ఔటర్‌ రింగురోడ్డు వెళుతుంది. ఇదే జరిగితే సుమారు రూ.20 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకూ ఆయన నష్టపోతారు. దీంతో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారని తెలిసింది.

రూ.4 కోట్ల నుండి రూ.12 కోట్ల ఖర్చు
ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా 2014 సాధారణ ఎన్నికల్లో కనీసం రూ.4 కోట్ల నుండి రూ.12 కోట్లకు తక్కువగాకుండా ఖర్చుచేసిన వారే. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం ఆపేసింది. దానిస్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధిని(ఎస్‌డిఎఫ్‌)ను పెట్టింది. ఇది ఇవ్వాలంటే ఎమ్మెల్యేలు నేరుగా సిఎంను కలిసి తమ వినతిని సమర్పించుకోవాల్సి ఉంటుంది. దానికి ఆయన అంగీకరిస్తే నిధులిస్తారు. లేకపోతే లేనట్లేనని గత అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి యనమల చెప్పారు. ఒక వైపు డబ్బు పోయి. మరోవైపు పనులూ లేక తీవ్ర ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలున్నారు. అదే సమయంలో స్థానికంగా అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పేరుతో నిధులు మంజూరు చేస్తున్నారు. పనులూ వారి పేరుతోనే అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు పొందడం కష్టతరమవుతుంది. ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఇదీ ఒక ప్రధాన కారణంగా ఉంది.

రాజధానిలో నోరు మూయించారు
రాజధాని ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసిపి తరుఫున పోటీచేసిన అభ్యర్థికి చెందిన సేవా సంస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. దానికొచ్చే నిధులు నిలిచిపోతాయనే భయంతో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వైసిపిలోకొస్తారని అంతా భావించి ప్రకటన చేసిన చివరి నిముషంలో, టిడిపికి చెందిన సీనియర్‌ ఎంపితో మాట్లాడించి ఆయన్ని టిడిపిలోకి తీసుకొచ్చారు. ఆయన ప్రతిపక్షంలోకి వెళ్లకుండా చాకచక్యంగా వ్యవహరించారు. స్థానిక యువనేతపై కేసులు బనాయించి భయపెట్టారు. దీంతో ప్రతిపక్షం తరుఫున రాజధాని ప్రాంతంలో మాట్లాడేవారు లేకుండా పోయారు. రైతుల సమస్యలపై రాజధాని ప్రాంతంలోనే కీలకంగా వ్యవహరిస్తున్న మరో వైసిపి నాయకుడికి చెందిన భూమి చుట్టూ ఇళ్లున్నప్పటికీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ జోన్‌లోకి మళ్లించి వేధింపులకు గురిచేస్తున్నారు.

http://www.prajasakti.com/Content/1789926

7 Comments

Filed under Uncategorized

7 responses to “ఆర్థిక మూలాలపై దెబ్బ-అందుకే పార్టీ మారుతున్న వైసిపి ఎమ్మెల్యేలు

 1. Veera

  హ హ హ కెవ్వు కేక !!!
  నా పేరు చంద్రబాబు నాయుడు
  మన తెలుగు మిత్రులు పేజీలో ఏం రాసిన ఆవు వ్యాసం లాగా బాబుగారు హస్యవస్తువు అయిపోయారు. అందుకే నేరుగా మన బాబుగారి మీదనే రాసిన జోక్.

  మైక్ టైసన్ బాక్సింగ్ నుండి విరమణ అయ్యాక ఒక సోడా షాప్ పెట్టుకున్నాడు. వేసవిలో జనాలకు నిమ్మసోడా తయారు చేసి ఇవ్వడం ప్రారంభించారు. నిమ్మరసం మెషిన్ తో కాకుండా చేతితో పిండి రసం తీయడం అయన ప్రత్యేకత. అయన షాప్ బయట బోర్డ్ పెట్టారు. అదేంటంటే టైంసన్ పిండిన నిమ్మచెక్కల నుండి ఎవరయినా సరే ఒక్క బొట్టు నిమ్మరసం చుక్క పిండినా సరే వాళ్లకు 1000 డాలర్లు బహుమానం.

  ఎంతోమంది ఎన్నో దేశాల నుండి వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరూ సాధించలేక పోయారు. కానీ ఒకసారి ప్రపంచం చుట్టిన ఘనుడు ఆ షాప్ కు వెళ్లారు. ఆ బోర్డు మీద రాసిన సవాలును స్వీకరించి , టైసన్ పిండిన నిమ్మ చెక్క తీసుకుని పిండడం ప్రారంభించి, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది చుక్కల నిమ్మరసం తీసారు.

  టైసన్ ఆశ్చర్యపోయి పెద్ద పెద్ద పహిల్వాన్ లకే సాధ్యంకాలేదు మీకెలా అయింది అసలు మీరు ఎవరు అని అడిగారు.

  దానికి ఆ ప్రపంచ జ్ఞాని ఇలా అన్నాడు.
  నా పేరు చంద్రబాబు నాయుడు, పేద రైతుల భూములు వేల ఎకరాలు పిండిన వాడిని ఈ తొక్కలో నిమ్మముక్క ఒక లెక్కా.

  పాపం పందెం ఓడి , ఆయన మాటలకు మూర్చ పోవడం టైసన్ వంతయింది.
  – Sekhar, Meemaata

 2. Veera

  జూన్ లో AP మంత్రి వర్గ విస్తరణ, 5 YCP MLA లకు మంత్రి పదవులు-TV5
  1.గొట్టిపాటి రవి కుమార్ చౌదరి
  2.సుజయ కృష్ణ రంగ రావు
  3. భూమా నాగిరెడ్డి
  4.జలీల్ ఖాన్
  5.జ్యోతుల నెహ్రూ

 3. Veera

  కెవ్వు కేక !!!
  కేంద్ర మంత్రులను కలిసే అర్హత జగన్‌కు లేదన్నప్పుడు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సమయంలో ఆహ్వాన పత్రం ఇచ్చేందుకు మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లను ప్రభుత్వం ఎందుకు పంపింది?
  -రాష్ట్ర BJP దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు

 4. Adnan

  చంటోడు దొంగోన్ని బానె గుర్తుపట్టాడు…. గోచి ఎత్తుకెల్తాడని ఏడ్చినట్త్లున్నాడు

 5. Veera

  రాజకీయాల నుంచి వైదొలుగుతా, బాబు పర్యటనకు దూరం-TDP MP రాయపాటి చౌదరి
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5303889

 6. Veera

  రాజధానిలో భూ మాఫియా-450 ఎకరాలు కబ్జా
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5303884

 7. Veera

  ఫిరాయింపులపై ప్రజల్లో అసంతృప్తి
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5303893

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s