బెడిసి కొడుతుందా?

బెడిసి కొడుతుందా?
-వైసీపీ ఎమ్మెల్యేల చేరికతో తెలుగుదేశం పార్టీలో విభేదాలు
-ఎక్కడ చూసినా అదే సీన్‌
-పాత, కొత్తలను సమన్వయం చేయలేక బాబు తంటాలు
-టీడీపీ అసంతృప్తులు వైసీపీ వైపు చూపు
-ఎన్నికల ఆర్నెలల ముందు వైసీపీలో చేరే అవకాశాలు
-పార్టీ పటిష్ఠత కోసమే చేరికలంటున్న బాబు
-కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నం

http://www.suryaa.com/news/regional/article.asp?contentId=245867

చిక్కుల్లో చంద్రులు
హైదరాబాద్, మే 8:తామొకటి తలిస్తే కేంద్రం మరొకటి తలవడంతో ఇద్దరు చంద్రులు రాజకీయంగా చిక్కుల్లో పడనున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 119 స్థానాలున్న తెలంగాణలో 150, 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్‌లో 228 అసెంబ్లీ స్థానాలు అవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపి సీఎం చంద్రబాబునాయుడు భావించారు. ఆ మేరకు రెండు అసెంబ్లీల్లోనూ తీర్మానాలు చేసి, కేంద్రానికి పంపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ మేరకు తమ మధ్య ఉన్న విభేదాలు పక్కకుపెట్టి, ఆ అంశంలో మాత్రం ఒక్కటయి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా భారీ లాబీయింగ్ చేశారు. వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రహోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్ వద్దకు వెళ్లి, నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వెంకయ్య నియోజకవర్గాల సంఖ్య పెరుగుతాయని, దాని పై బిల్లు పెడతామని, అయితే బిల్లు ఎప్పుడు పెడతామో చెప్పలేమని వెంకయ్య స్పష్టం చేశారు. వెంకయ్య హామీ ఇచ్చిన కొద్దిరోజులకే కేంద్రమంత్రి హరిభాయ్‌చౌదరి కూడా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంచే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా 2019లో కూడా ఇవే నియోజకవర్గాలు కొనసాగుతాయని సమాచారహక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జవాబుగా స్పష్టం చేసింది. దీనితో ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల వరకూ కొత్త నియోజకవర్గాలు ఉండవని తేలిపోయిం ది. ఇది ఇద్దరు సిఎంలకు చిక్కు లు తెచ్చేలా కనిపిస్తోంది. కొత్త నియోజకవర్గాలు పెరుగుతాయన్న భరోసాతో తెలంగాణ, ఏపిలో రెండు అధికార పార్టీలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నాయి. కొత్త నియోజకవర్గాలు వస్తాయి కాబట్టి, మీ ఉనికికి వచ్చిన సమస్యలేదని అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఇటు సొంత పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలకు నచ్చచెప్పాయి.

ఇప్పుడు ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణతో కొత్తగా చేరిన విపక్ష ఎమ్మెల్యేలకు, సొంత పార్టీ నేతలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమి సమాధానం చెబుతారో, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. ఏపిలో టిడిపి నాయకత్వం ఇప్పటివరకూ 17 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోగా, తెలంగాణలో 13మంది టిడిపి, ముగ్గురు వైసీపీ, ఇద్దరు బీఎస్పీ, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంది. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గాల్లో తిరిగి టికెట్లు ఇస్తామని రెండు పార్టీల నాయకత్వాలు హామీ ఇచ్చాయి. అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిన సొంత పార్టీ అభ్యర్ధులకు, కొత్తగా పెరిగే సీట్ల నుంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు పునర్విభజన లేకపోవడం, పక్క నియోజకవర్గాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే సిట్టింగులుగా ఉండటంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారి రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో పార్టీలో కొనసాగుతున్న వారికి, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకూ నియోజకవర్గస్థాయిలో యుద్ధం తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఏపి విషయానికొస్తే… అద్దంకిలో టిడిపి నుంచి కరణం వెంకటేష్ పోటీ చేయగా, ఆయనపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు టిడిపిలో చేరారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టిడిపి అభ్యర్ధిగా పోటీచేయగా, ఆయనపై పోటీచేసి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రస్తుతం టిడిపిలో చేరారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి టిడిపి నుంచి పోటీ చేయగా, ఆయనపై వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచిన భూమా నాగిరెడ్డి కొద్ది నెలల క్రితమే సైకిలెక్కారు. కర్నూలు నుంచి టిడిపి అభ్యర్ధిగా టిజి వెంకటేష్ పోటీ చేయగా, ఆయనపై వైసీపీ అభ్యర్ధి ఎస్వీ మోహన్‌రెడ్డి గెలిచారు. తాజాగా ఎస్వీ మోహన్‌రెడ్డి టిడిపి తీర్ధం తీసుకున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి స్థానాలు లేకపోవడం, పక్క నియోజకవర్గాల్లో ఇప్పటికే టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలుండటంతో వారి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, టికెట్లో, మరొకటో ఆశించి తమ పార్టీలోకి రావడం లేదని టిడిపి నేతలు చెబుతున్నారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యకర్తలు చూసి వస్తున్నారు. జగన్ ధాటికి ఉండలేక మా పార్టీలో చేరుతున్నారు.ప్రజల కోరిక, ఒత్తిళ్ల మేరకు వాళ్లు నిర్ణయం తీసుకుంటున్నారు. మా పార్టీలో ఓడిన ఎమ్మెల్యేలకు సముచిత స్థానం కల్పిస్తాం. వారికేమీ అభద్రతాభావం లేదు. అవన్నీ మీడియా సృష్టి మాత్రమే. టికెట్ల ఎంపికకు కొన్ని ప్రామాణికాలుంటాయి. వాటిని ఎన్నికలప్పుడు పాటిస్తాం. వాటి గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేద’ని టిడిపి జాతీయ కార్యాలయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ జనార్దన్‌రావు వ్యాఖ్యానించారు.

http://www.andhrabhoomi.net/content/ap-563

15 Comments

Filed under Uncategorized

15 responses to “బెడిసి కొడుతుందా?

 1. AP lo KDP chesthunna papam ….Telangana lo panduthundhi ?

  http://www.sakshi.com/news/hyderabad/l-ramana-joining-in-trs-party-discussion-to-cm-and-harish-rao-340726?pfrom=home-top-story

  AP prajalu appudu melu kuntaro ??
  It is our responsibility to wake them up before the 5% fanatics rot the society.

 2. Neethimalina Jathi ……….Siggumalina panulu
  Cinemallo , Rajakeeyallo na kadhu ……Bhayatakuda ava panulu ??

  http://www.sakshi.com/news/district/sex-scandal-chased-by-vijayawada-police-340647?pfrom=home-top-story

 3. Veera

  10 వ తరగతి ఫలితాల్లో మొదరి స్థానం లో వచ్చి, కడప వాళ్ళు రౌడీలు అన్న చిత్తూరు చెంబును చెప్పుతో కొట్టారు
  ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
  [ఉత్తీర్ణతలో వైఎస్ఆర్ జిల్లా (98.89) ప్రథమ స్థానంలో నిలవగా, చిత్తూరు జిల్లా (90.11) చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ]
  [AP EAMCET 2016 Toppers List:
  S Vamshi Krishna Reddy – 158 marks (1st Rank)
  C. Lakshmi Narayana – 157 marks (2nd Rank)
  K. Vignesh Reddy – 157 marks (3rd Rank)
  M. Prashant Reddy – 156 Marks (4th Rank)
  G. Gautam – 156 marks (5th Rank)
  Chetan Sai – 155 marks (6th Rank)
  A Sai Teja – 154 marks (7th Rank)
  Goerge – 154 marks (8th Rank)
  Sai Dinesh – 154 marks (9th Rank)
  Krishna sai – 154 marks (10th Rank) ]

 4. Veera

  గతంలో ప్రత్యేక హౌదా కారణంగా హిమచల్‌ ప్రదేశ్‌లో పరిశ్రమలు 34%, ఉత్తరాఖండ్‌లో 24.4% పుంజుకోవడం బాగా ఉపయోగపడింది-తెలకపల్లి రవి
  ప్రత్యెక హోదా సంజీవని కాదు అని సుజనా చౌదరి కి మంత్రి పదవి ఇప్పించుకున్న బాబు .

 5. What caste do we belong to after death ??
  Maa Neethimalina Jathi chesthunna Siggumalina panulu choostha naku asahyam vesthundhi – Jagapathi Babu

 6. Neethimalina Jathi …….Siggumalina panulu
  No matter how mch they loot ……death is inevitable ..they take neither their caste nor their mney with them.
  Their hatred towards fellow human beings turns into poisonous cancer before they die.

  http://www.sakshi.com/news/district/jogi-ramesh-attack-on-chandrababu-lokesh-340358?pfrom=home-top-story

 7. Veera

  నా ఆంధ్రా పర్యటన అనుభవాలు – 1- Murali Mohan , మే 4
  ఏదో పెద్ద విదేశాలు చుట్టి వచ్చిన వాడిలా ఆ టైటిల్ ఏంటి? నాలుగు గంటల ప్రయాణం తో చేరుకోగల ఆంద్ర వెళ్లి రావడం కూడా గొప్పేనా అనుకోవద్దు. ఇప్పుడు ఆంద్ర ప్రదేశ్ మాకు పొరుగు రాష్ట్రం. అందువల్ల ఆంధ్రా వెళ్లి రావడం కూడా విశేషమే.
  ఆంధ్రా లో నేను విజయవాడ, గుంటూర్, చిలకలూరిపేట, మేదరమెట్ల, అద్దంకి, మరో నాలుగైదు చిన్న చిన్న గ్రామాలు తిరిగాను. బస్ లో తోటి ప్రయాణీకులతో పాటు ఊళ్లలో కొంతమంది నాయకులను, సామాన్యులను, మేధావులను, పాత్రికేయులను, సంపాదకులను, కలిసాను. కొంతమంది నన్ను కలిసారు. మా మధ్య సాగిన ముచ్చట్ల క్రోడీకరణ ఈ వ్యాసం.

  ఇక్కడ నేను చెప్పేవి ఏవీ నా సొంత అభిప్రాయాలు కావు. నేను కలిసింది, మాట్లాడింది ఒక పాతిక ముప్పై మంది ఉండవచ్చు. వీరి అభిప్రాయమే ఆంద్ర ప్రజల అభిప్రాయం కాదు. హైదరాబాద్ లో హిట్ అయిన సినిమా అమలాపురం లో కూడా హిట్ అవుతుంది. తిరపతి లో కూడా హిట్ అవుతుంది. విజయవాడ లో ఫ్లాప్ అయిన సినిమా విశాఖ లో ఫ్లాప్ అవుతుంది. హైదరాబాద్ లో ఫ్లాప్ అవుతుంది. కనుక కొద్దిమంది వెలిబుచ్చిన అభిప్రాయాలు అనేకమంది ప్రజల అంతరంగాన్ని ప్రతిబింబిస్తాయి అని తెలుసుకోవాలి.

  విజయవాడ నుంచి ఒంగోలు వరకు సుమారు 150 కిలోమీటర్ల నేషనల్ హైవె రోడ్. వాజపేయి పాలనలో స్వర్ణ చతుర్భుజి పథకం కింద ఈ రోడ్ నిర్మించారు. ప్రస్తుతం రోడ్ల నిర్వహణ అద్భుతంగా ఉంది. 120 కిలోమీటర్ల స్పీడ్ లో కూడా వెళ్ళవచ్చు. దాదాపు మన ఔటర్ రింగ్ రోడ్ స్థాయి లో ఉంది. ఈ విషయం లో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు ను అభినందిస్తాను.

  ఆంద్ర ప్రదేశ్ లో నాకు మిత్రులు అందరూ తెలుగుదేశం వారే. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వారు ఎవ్వరూ నాకు తెలియదు. అలాగే ఇటీవలే పుట్టిన వైకాపా వారు కూడా నాకు ఎవ్వరితో పరిచయం లేదు. కనుక నేను తెలుగుదేశం, కాంగ్రెస్ వారి తోనే మాట్లాడాను. ఇవన్నీ వారు చెప్పిన విషయాలు మరియు బస్ లో నాతో ప్రయాణించిన కొందరు చెప్పిన విషయాల విశ్లేషణ ఇది.

  1. సమైక్య రాష్ట్రం చీలిపోయింది అనే భావన నుంచి ప్రజలు తొందరగానే బయటకు వచ్చారు. తెలంగాణా ను పొరుగు రాష్ట్రం గానే చూస్తున్నారు. కెసియార్ ను ఇదివరకు లా బూతులు తిట్టేవారు తగ్గిపోయారు.
  2. అమరావతి శంకుస్థాపన కు కెసియార్ హాజరు కావడం, కోరితే రాజధాని నిర్మాణానికి సాయం చేస్తానని చెప్పడం, పట్టిసీమ విషయం లో కెసియార్ చంద్రబాబు ను సమర్ధించడం, తెలంగాణా లోని ఆంధ్రుల పట్ల వివక్ష చూపకపోవడం, రాజకీయ వాతావరణం ప్రశాంతంగా ఉండటం మొదలైన అంశాలు కెసియార్ పట్ల వ్యతిరేకతను తగ్గించాయి. జయలలిత, సిద్దరామయ్య, నవీన్ పట్నాయక్ ఎలాగో, కెసియార్ కూడా అలాగే అనే మానసిక స్థితి కి వచ్చారు. ఆంధ్రాలో ఎక్కడా ఆందోళనలు, అలజడులు, ద్వేషభావాలు లేవు. ఇది హర్షించాల్సిన విషయం.
  3. పదేళ్ళపాటు రెండు రాష్ట్రాల ప్రజలు, నాయకులు ఉప్పు నిప్పులా ఉంటారు అనుకున్నారు చాలామంది. కానీ ప్రజలు కలిసిమెలిసి ఉండటం అందరికీ సంతోషంగా ఉంది.

  తరువాయి భాగం రేపు…. మురళి మోహన్

  నా ఆంధ్ర పర్యటన అనుభవాలు – 2, మే 5

  విజయవాడ లో నేను ఎక్కిన బస్ లో నా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తీ గుంటూర్ వరకు టికెట్ తీసుకున్నాడు. అతను బస్ ఎక్కినప్పటినుంచి మొబైల్ లో ఎవరితోనో మాట్లాడుతూనే ఉన్నాడు. బస్ లో ఉన్నామన్న ధ్యాస అతనికి లేనట్లుంది. పెద్ద గొంతుక తో మాట్లాడుతున్నాడు. అతని మాటలని బట్టి, అతను ఉపయోగించే పదాలను బట్టి ఆతను రైతు అని అర్ధం అయింది. మంగళగిరి దాటిన తరువాత ఫోన్ పెట్టేసాడు. అతనికి 50 ఏళ్ల వయసు ఉండవచ్చు. అతనితో మాటలు కలిపాను. రాజధాని పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాను. “ఎం రాజదానో ఏమో? అంతా అయోమయంగా ఉంది” అంటూ మొదలు పెట్టాడు. మధ్యమధ్య లో కొంతమంది మంత్రుల పేర్లు ప్రస్తావించాడు. అతని తో సంభాషణ నా భాషలో అందరికీ సులభంగా అర్ధం అయ్యేట్లు చెప్తాను:

  1. తెలుగుదేశం పార్టీ గెలవడానికి పవన్ కళ్యాన్ కారణం కాదు. ఎందుకంటే, కృష్ణా, గుంటూర్, జిల్లాలు, ప్రకాశం జిల్లాలో చాలా భాగం ఒక సామాజిక వర్గం వారిది పైచేయి.
  2. చంద్రబాబు, జగన్ లలో ఒకరిని ఎంచుకోవాల్సిన అగత్యం వచ్చినప్పుడు చంద్రబాబు పది ఏళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉన్నాడన్న సానుభూతి ఉంది. జగన్ నిన్నమొన్న వచ్చాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనుభవం ఉన్నవాడు కావాలి.
  3, అలాగని జగన్ మీద వ్యతిరేకత ఏమీ లేదు.
  4. కాంగ్రెస్ హయాం లో రాజశేఖర్ రెడ్డి కరెంట్ బిల్లుల మాఫీ ప్రకటిస్తే అవి ఒకే దెబ్బకు రద్దు అయ్యాయి. ఒకసారి 500 మరోసారి 1000 …. ఇలా విడతలుగా లేదు. అలాగే చంద్రబాబు రుణమాఫీ అనగానే అదేవిధంగా బాంక్ రుణాలు మొత్తం ఒకే దెబ్బకు రద్దు అవుతాయి అని ఊహించారు.
  5. ఇంటికో ఉద్యోగం అనగానే యువకులకు ఆశ కలిగింది.
  6. రుణమాఫీ సాధ్యం కాదు అని జగన్ ఆ సమయం లోనే ప్రకటించడం దెబ్బ తీసింది. చంద్రబాబు కు సాధ్యం అయ్యేది జగన్ కు ఎందుకు సాధ్యం కాదు అని చర్చించుకున్నారు.
  7. తమ కులం వాడు ముఖ్యమంత్రి కావాలని వారు తహ తహ లాడి పోతున్నారు. ఉద్యోగాల విషయం లో కూడా జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు.
  8. జగన్ గెలిస్తే రాజధాని కడపలో పెడతాడు. తాము రాయలసీమకు పోవాలంటే కష్టం. పైగా రెడ్ల ఆధిపత్యం పెరుగుతుంది. చంద్రబాబు గెలిస్తే కచ్చితంగా కృష్ణా లేదా గుంటూర్ జిల్లాలలోనే రాజధాని వస్తుంది.
  9. చంద్రబాబు కు మోడీ తో పొత్తు ఉండటం మరో ప్లస్ పాయింట్ అయింది. ఇద్దరూ అనుభవం ఉన్నవారే కనుక రాష్ట్రం అభివృద్ధి అవుతుంది.
  10. పవన్ ను చూసి ఎవ్వరూ ఓట్లు వెయ్యలేదు.
  11, కెసియార్ ను చాలా తక్కువగా అంచనా వేసారు. చంద్రబాబు గనుక ముఖ్యమంత్రి అయితే, కెసియార్ చంద్రబాబు దగ్గర అణిగిమణిగి పడివుంటాడు.
  ఇలా ఉన్నది వారి ఆలోచనా ధోరణి.

  మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

  1. 2014 లో ఉన్నంత ప్రజాదరణ ఇప్పుడు చంద్రబాబు కు లేదు. రెండు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అసలు రాజధాని మీద స్పష్టత లేదు. మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతులు అన్నీ తీసుకుని, కాంట్రాక్టర్లను మాట్లాడుకుని, డబ్బు ఎంత అవుతుందో చూసుకుని, లోన్స్ తెచ్చుకుని తరువాత శంకుస్థాపన చేసి వెంటనే పని మొదలు పెడతాము. భూమిపూజ చేసి ఏడాది అవుతున్నది. ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. ఎ విధమైన అనుమతులు, డబ్బు, డిజైన్లు ఏమీ లేకుండా శంకుస్థాపన చెయ్యడం, మళ్ళీ పనులే మొదలు కాకపోవడం పట్ల తీవ్ర అసహనం తో ఉన్నారు. చంద్రబాబు కార్యనిర్వాహక సామర్ధ్యాన్ని ప్రశ్నార్ధకం చేసింది.
  2. పొలాలను బలవంతంగా లాక్కునారు తప్ప ఇష్ట పూర్తిగా ఇచ్చిన వారు చాలా తక్కువ. ఇప్పటికీ అమరావతి కట్టే చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
  3. ఇది ఇప్పుడల్లా అయ్యే పని కాదు.
  4. అమరావతి లో భూ కుంభకోణం జరుగుతున్నా మాట వాస్తవం. ఇద్దరు మంత్రుల పేర్లు కూడా చెప్పాడు. వారు అమరావతి లో భూములు కొన్నారు అని చెప్పాడు.
  ఇన్నివిశేషాలు చెప్పిన తరువాత కూడా అతను చంద్రబాబు నే సమర్ధిస్తూ మాట్లాడాడు. వచ్చే ఎన్నికలకు ఎలా మారుతుందో చెప్పలేము అన్నాడు.
  గుంటూర్ సమీపిస్తుండటం తో లేచాడు.
  (కొంతమంది మేధావులు, సామాన్యులు, సంపాదకులు, ఉద్యోగుల అభిప్రాయలు రేపు పంచుకుందాం… మురళి మోహన్ )

  నా ఆంధ్రా పర్యటన అనుభవాలు – 3, మే 6

  నా మిత్రుడు ఒకరు తెలుగుదేశం అభిమాని. ఆయన చంద్రబాబు సామాజిక వర్గం వారు. ఆయన పాత్రికేయ వృత్తి లో ఉన్నారు. కొంతమంది మంత్రులకు సన్నిహితులు. గత పది ఏళ్లుగా నాకు ఆయనతో సాన్నిహిత్యం ఉంది. తటస్థుడు. మేధావి అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయాల మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. స్వయంగా వ్యాస రచయిత. ఆయన తో అరగంట సమయం గడిపాను. ఆయన చెప్పిన మాటలను విశ్లేషిస్తే:
  1. అమరావతి లో భూ కుంభకోణం గూర్చి సాక్షి పత్రిక రాసిన వార్తలు నూటికి నూరు వాస్తవం. కొంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు అక్కడ భూములు కొన్న మాట కూడా యదార్ధం. (కొందరి పేర్లు చెప్పాడు)
  2. ఇసుక కుంభకోణం లో అధికార పార్టీ వారు వందల కోట్లు సంపాదించారు. అందరూ దోచుకున్న తరువాత ఇసుక ఉచితం అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మాట మొదలే చెప్పి ఉంటె బాగుండేది.
  3. అవినీతి గతం లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది.
  4. వైఎస్సార్ ఉన్నప్పుడు చిన్నా పెద్దా భేదం లేకుండా అన్ని పత్రికలకూ ప్రకటనలు ఇచ్చేవారు. రోశయ్య వచ్చిన తరువాత ఫరవాలేదు. కిరణ్ కాలం లో కొంచెం నయం. ఇప్పుడు చిన్న పత్రికలకు అస్సలు ప్రకటనలు లేవు. కేవలం రెండు మూడు పెద్ద పత్రికలకు, తెలుగుదేశం అనుకూల వార్తలు రాసేవారికే ప్రకటనలు ఇస్తున్నారు. సమాచార శాఖ కమీషనర్ పెత్తనం పెరిగి పోయింది. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేదు.
  4. వైకాపా నుంచి కనీసం 50 మంది ఎమ్మెల్యేలను లాగడమే లక్ష్యం గా నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది చివరకు వైకాపా లో మిగిలేది 20 మంది కూడా ఉంటారా అనేది అనుమానమే.
  5. ఎమ్మెల్యేలను 5 నుంచి 25 కోట్లు ఇచ్చి కొంటున్నారు. వ్యాపారాలు ఉన్న వారికి అనేక మినహాయింపు లు ఇస్తున్నారు. అనగా, ప్రభుత్వ శాఖలు ఏవీ వారి జోలికి వెళ్ళవు అన్న మాట.
  6. స్థానిక ఎమ్మెల్యే రవి కుమార్ కు కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. గత రెండు ఏళ్లలో ఒక్క కార్యకర్త ను కూడా పార్టీ లో చేర్చలేదు. ఇక్కడ ఓడిపోయినా, బలరాం, వెంకటేష్ లదే పెత్తనం. వారిని తట్టుకోవడం రవికి అసాధ్యం.
  7. రవి వెంట ఒక్క కార్యకర్త కూడా వెళ్ళలేదు.
  8. 2013 లో NTV చేసిన సర్వె ఫలితాలు ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా ప్రకటించింది. ఆనాడు వైకాపా వూడ్చి వేస్తుందని సర్వె చెప్పింది. అప్పటికి అది యదార్ధమే. ఆ తరువాత చంద్రబాబు.. పవన్, మోదిలతో కలిసి వ్యూహాలు మార్చారు.
  9. జగన్ గెలిస్తే హిందువులను బలవంతం గా మతం మార్పిస్తారు అని, అందరి చేతిలో బైబిల్ పెడతారు అని ప్రచారం సాగించారు. దానికి తోడూ విజయమ్మ బైబిల్ చేత్తో పట్టుకుని ప్రచారం చెయ్యడం హిందువుల మనసులను గాయ పరచింది. ఆ ప్రచారం ప్రభావితం చేసింది.
  10. జగన్ ముఖ్యమంత్రి అయినప్పిటికీ, మళ్ళీ జైలు కు వెళ్తాడని, కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే, రాష్ట్రం అభివృద్ధికి దూరం అవుతుంది అని ప్రచారం చేసారు.
  ఇలాంటి అనేక కారణాల వలన చివరి నెల రోజుల్లో ఫలితాలు అనూహ్యంగా మారి పోయాయి.
  11. ఒక్కటి మాత్రం వాస్తవం. జగన్ మీద ఉన్న లక్ష కోట్ల అవినీతి ని ప్రజలు ప్రస్తుతం ఏమాత్రం నమ్మడం లేదు. కళ్ళముందు జరుగుతున్న వేలకోట్ల అవినీతి ని చూస్తున్న జనం జగన్ అధికారం లో లేకుండా లక్ష కోట్లు కొట్టెయ్యడం అసాధ్యం అనే భావనకు వస్తున్నారు.
  12. ప్రకాశం జిల్లా లో ఎమ్మెల్యేలు వెళ్తున్నారు కానీ 2014 లో వైకాపా కు ఉన్న ఓట్ల బలం చెక్కు చెదరలేదు.
  13. అమరావతి లో జరిగేది భూ వ్యాపారం తప్ప అభివృద్ధి కానే కాదు. అభివృద్ధి అనేది ఇంతవరకూ పది శాతం కూడా లేదు. ఏవైనా జరుగుతున్నవి అంటే అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నవే.
  14. చంద్రబాబు ఇంకా ఏదో చేస్తాడని నమ్మే వారి సంఖ్యా కూడా ఎక్కువే ఉంది.
  15. చంద్రబాబు పాలన ఇదేవిధం గా మరో రెండు ఏళ్ళు సాగితే, ఇక జగన్ ప్రచారం చెయ్యకుండానే గెలుస్తాడు.
  ఇవీ మేధావి వర్గం అభిప్రాయాలు.
  ఇక సామాన్యుల మనోగతం ఎలా వుందో రేపు తెలుసుకుందాము.

  నా ఆంధ్ర పర్యటన అనుభవాలు – 4, మే 7

  చంద్రబాబు పాలన గూర్చి మధ్యతరగతి జీవులు ఏమనుకుంటున్నారు? సుమారు పదిమంది తో మాట్లాడిన మాటలను విశ్లేషిస్తే …. వారి భాషలో చెప్పడం సాధ్యం కాదు కాబట్టి చదవటానికి వీలుగా నా భాషలో వివరిస్తాను.
  1. పది ఏళ్ళపాటు ఉమ్మడి రాజధాని వాడుకునే హక్కు మనకు ఉన్నప్పుడు హైదెరాబాద్ నుంచి పాలన చేస్తూ, అమరావతి లో ఒక్కొక్క భవనాన్ని, ఉద్యోగుల ఇల్లు నిర్మించుకుంటూ, పరిశ్రమలను ఆకర్షిస్తూ, యువతకు ఉపాధి ని కల్పించి ప్రోత్సహిస్తూ పదేళ్ళ లోపల శాశ్వత రాజధాని ని నిర్మించుకోవచ్చు. అలా కాకుండా…తాత్కాలిక సచివాలయం ఏమిటి? దీనికి 850 కోట్లు ఖర్చు పెట్టడం లో ఔచిత్యమ్ ఉన్నదా?
  2. మనదేశం లో అనేక నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మన ఇంజినీర్లు విదేశాలలో పెద్ద పెద్ద భవనాలు, విమానాశ్రయాలు నిర్మిస్తున్నారు. ఈ విదేశీ సంస్థల గోల ఏమిటి? అంటా గందరగోలంగా ఉంది. ఒక నమూనా తయారు చెయ్యడానికి ఇన్ని సంస్థలా? ఇన్ని నెలల?
  3. రెండు సంవత్సరాలు పని చేసే పట్టిసీమ కు 1800 కోట్లా? ఆ కొద్ది నీరు అసలు రాయలసీమ వరకూ ఎలా వెళ్తుంది?
  4. ఇప్పుడున్న చంద్రబాబు ఒకప్పటి చంద్రబాబు కారు. ఆ రోజుల్లో చంద్రబాబు అంటే ఉద్యోగస్తులు వణికి పోయేవారు. ఎప్పుడు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయో, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని భయపడుతూ పని చేసేవారు. అలాగే బాహాటంగా లంచాలు తీసుకోవాలంటే భయపడే వారు. ఆ కాలంలో ఉన్నత స్థాయి అధికారులలో లంచగొండి తనం లేదు.
  ప్రస్తుతం అలా లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఉద్యోగులు లంచాలు తినడం లో అన్ని హద్దులు దాటేసారు. లంచం లేనిది అసలు చిన్న పని కూడా జరగటం లేదు. రెవెన్యూ శాఖలో ఉద్యోగులు బరితెగించారు. ఇప్పుడు పెద్ద స్థాయి అధికారులు కూడా అడిగి లంచాలు తీసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రులు నెలకు వంద నుంచి అయిదు వందల కోట్లు వెనకేస్తున్నారు. వీటి అన్నింటిలో ముఖ్యమంత్రికి వాటా వెళ్ళాల్సిందే.
  5. ఒక ప్రభుత్వోద్యోగి మాట్లాడుతూ, నేను నా సర్వీసుకు సంబంధించిన ఒక కాగితం కోసం కలెక్టర్ ఆఫీసుకు వెళ్తే, 5000 ఇస్తే కానీ ఆ కాగితం బయటకి రాలేదు. నా పరిస్థితే ఇలా ఉంటె ఇక సామాన్యుల సంగతి చెప్పాలా?
  6. లంచగొండులను చంద్రబాబు రక్షిస్తున్నాడు. వారిమీద ఎలాంటి చర్యలు ఉండవు. గత రెండు ఏళ్లలో ఒక్క లంచగొండిని శిక్షించడం జరగలేదు. పట్టుబడినా, కనీసం సస్పెండ్ చెయ్యడం లేదు.
  7. 2014 వరకు ప్రభుత్వ ఆఫీసులలో ప్రతి ఒక్కరికీ ప్రవేశం ఉండేది. లంచం ఇచ్చి అయినా పనులు చేయించుకునే వారు. ప్రస్తుతం అలా లేదు. ఆఫీసులోకి వేల్లెతపుడే ఇతను వైకాపా వాడు అనుకుంటే అతనిని అసలు లోపలికే పోనివ్వడం లేదు. వైకాపా కార్యకర్తలకు, సానుభూతిపరులకు ఎలాంటి సాయం చెయ్యకూడదని అలిఖిత ఆదేశాలు ఉన్నాయట. రేషన్ కార్డ్స్, పట్టా పుస్తకాలు, బాంక్ లోన్స్, మునిసిపల్ అనుమతులు లాంటివి వైకాపా వారికి గగన కుసుమం లా ఉన్నాయి. దాంతో పనులు కావడం కోసం కొంతమంది వైకాపా నుంచి తెలుగుదేశం లోకి వెళ్తున్నారు. నిజానికి వాళ్ళు ఓట్లు వేసేది వైకాపా కె. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు అని 70 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి చెప్పుకొచ్చాడు.
  8. ఒక మధ్యతరగతి ఉద్యోగి మాట్లాడుతూ 2014 వరకు 150 గజాలలో ఉన్న మా ఇంటికి 1200 రూపాయలు పన్ను విధించే వారు. చంద్రబాబు వచ్చిన తరువాత దాన్ని ఒకేసారి 6000 రూపాయలు చేసారు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి పెరగలేదు. ఇది దోపిడీ లా ఉన్నది అని వాపోయాడు.
  ఎ వర్గం వారిని కదిలించినా, చంద్రబాబు పాలన మీద తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వం పట్ల ఆగ్రహం నివురు కప్పిన నిప్పులా ఉన్నది. చంద్రబాబు నిజాయితీపరుడు అని చెప్పిన వాడు ఒక్కడు కనిపించలేదు. విచిత్రం ఏమిటంటే … కమ్మ వారు అందరూ చంద్రబాబు ను గుడ్డిగా సమర్ధిస్తారు అని నేను ఇన్నాళ్ళు అపోహ పడ్డాను. కానీ ఆ వర్గం వారు కూడా చంద్రబాబు పట్ల తీవ్ర ఆగ్రహం లో ఉన్నారని నాకు తొలిసారిగా అవగాహన కు వచ్చింది. ఎందుకంటే, అక్కడి నా స్నేహితులు అందరూ ఆ కులం వారే. వారి ఆంతర్యమే పై విశ్లేషణ.
  (ఇక వైకాప పరిస్థితి ఏమిటో రేపటి భాగం లో వివరిస్తాను)

  నా ఆంధ్రా పర్యటన అనుభవాలు – చివరి భాగం, మే 8

  అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్. ఇతను వైకాపా నుంచి గెలిచాడు. గత 35 ఏళ్లుగా ఈ నియోజక వర్గం లో కరణం బలరాం బలమైన నాయకుడు. 1977 లో ఈయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసినపుడు బలరాం తరపున మా గ్రామం లో నేను పోలింగ్ ఏజెంట్ గా పని చేసాను. అప్పటి నుంచి బలరాం ఎదుగుదలను నేను కళ్ళారా చూసాను. మంత్రి పదవి రాలేదు కానీ, ఆయనకున్న పలుకుబడి జిల్లా వ్యాప్తం. పట్టుదల, క్రమశిక్షణ గల వాడు. అద్దంకి గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసాడు. ఈయనకు, గొట్టిపాటి తండ్రి కి ఫాక్షన్ తరహా కక్షలు ఉన్నాయి. అవి రవికుమార్ తరం లో కూడా కొనసాగుతున్నాయి. ఆ నియోజక వర్గం లో తన కుమారుడు వెంకటేష్ ను నాయకుడు గా చెయ్యాలని బలరాం ప్రయత్నాలు చేస్తున్నాడు. వెంకటేష్ ను తొలిసారిగా గొట్టిపాటి మీద పోటీ కి నిలబెట్టినా, వైఎస్సార్ చరిష్మా కారణంగా రవికుమార్ గెలిచాడు.
  వైకాపా గూర్చి నాకు కొందరు అందించిన సమాచారం ఏమిటంటే..
  1. గొట్టిపాటి తెలుగుదేశం లో చేరడం తో అక్కడ వైకాపా కు ద్వితీయ శ్రేణి నాయకుడు లేడు. కార్యకర్తలకు ధైర్యం చెప్పి కాపాడుకునే బలమైన నాయకుడు లేడు.
  2. వైకాపా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లెదు. ఓటర్లు చెక్కు చెదరలేదు. నాయకులే లేరు.
  3. నేను అక్కడ ఉన్నరోజు జగన్ ఏదో ధర్నాకు పిలుపు ఇస్తే, అద్దంకి లో అసలు స్పందన లెదు.
  4. సుబ్బారెడ్డి ఉన్నా కూడా ఆయనకు ప్రజలను ఆకర్షించే శక్తి లోపించింది.
  5. వైకాపా లో జగన్ తప్ప ఆ స్థాయిలో పోరాడగల రెండో నాయకుడు లేడు.
  6. తెలంగాణా లోని లోటస్ పాండ్ నుంచి పార్టీ కార్యకలాపాలు నడిపించడం చాల మందికి నచ్చటం లెదు. పార్టీ ఆఫీసులు విజయవాడకు మార్చాలని చాల మంది అభిప్రాయ పడ్డారు.

  ఇక పాజిటివ్ పాయింట్స్:
  1. జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నా, ఆయన ఇమేజ్ మాత్రం అణుమాత్రం తగ్గలేదు.
  2. 2014 లో జగన్ కు ఓటు వేసినవారు రాబోయే ఎన్నికలలో కూడా జగన్ కె వేస్తారు.
  3. జగన్ లక్ష కోట్ల అవినీతి నిజం కాదేమో అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. కారణం ఏమిటంటే అధికారం లోకి వచ్చిన తరువాత ఒక్కసారి కూడా చంద్రబాబు లక్ష కోట్ల ఆరోపణ చెయ్యలేదు. తప్పుడు కేసులు పెట్టారు అని భావించేవారు పెరిగారు.
  4. రాబోయే ఎన్నికలలో కూడా వైకాపా అభ్యర్దే గెలిచే అవకాసం బలంగా ఉన్నది.
  5. గ్రామ గ్రామాన నాయకులు తిరిగి ప్రస్తుతం జరుగుతున్న అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు ప్రచారం చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ధర్నాలు, ర్యాలీలు కూడా …వందమంది జనం ఉన్నా సరే …నెలకో సారైనా, ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలని కోరుకుంటున్నారు.
  6. చంద్రబాబు పాలనలో ఒక్క సంక్షేమ కార్యక్రమం లెదు. రవ్వంత అభివృద్ధి లెదు. వీటిని ప్రజలలోకి తీసుకెళ్లడం లో వైకాపా నాయకత్వం విఫలం అవుతున్నది. ప్రజల నిరసనను సొమ్ము చేసుకోవడం లో వెనక పడుతున్నారు.

  ఇవీ స్థూలంగా వైకాపా మీద ప్రజాభిప్రాయం.
  సమాప్తం.

  Note:మురళి మోహన్ గారి ఆంధ్ర పర్యటన విశేషాలను ఇక్కడ కాపి పేస్ట్ చేయడం జరిగింది

 8. When some human beings turn animals in the name of caste and religion .
  This will not deter the determination of the poor …

  http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=80687&catid=12&Itemid=167&pfrom=home-sakshi-post

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s