‘హోదా’ అడగనే లేదు! బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్

సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరి బట్టబయలైంది. సీఎం ఇంతవరకూ కేంద్రాన్ని ప్రత్యేక హోదా కోరనేలేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ పరోక్షంగా వెల్లడించారు. శుక్రవారం విజయవాడలో సిద్ధార్థనాథ్ నేతృత్వంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం నగరంలోని ఒక హోటల్‌లో సిద్ధార్థనాథ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా విషయంపై మాట్లాడుతూ.. విభజన చట్టంలో ఏం ఉందో దాన్ని అమలు చేయమని చంద్రబాబు కోరారని, అదే తాము చేస్తున్నామని తెలిపారు.

అంటే చంద్రబాబు ప్రత్యేక హోదా కోరలేదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆ మాట నా నోటితో ఎందుకు చెప్పిస్తారు’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక కేటగిరి స్టేటస్ ఇవ్వలేము కానీ ప్రత్యేక రాష్ట్రంగా చూస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అన్ని విషయాల్లో ప్రత్యేకంగా చూస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, 12వ రాష్ర్టంగా ఏపీని చూపలేక ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు.

14వ ఆర్థిక సంఘం ద్వారా అదనపు నిధులు..
ఏపీకి తప్పనిసరిగా రెవెన్యూ లోటు భర్తీచేయాలని పునర్విభజన చట్టంలో ఎక్కడా లేదని, అయినా ప్రధాని మోదీకి ఏపీ ప్రత్యేక రాష్ట్రం కాబట్టి ప్రతియేటా రెవెన్యూ లోటు కింద నిధులు ఇస్తున్నారని అన్నారు. కేంద్రం ఏపీకి నాలుగేళ్లలో రూ. 22,112 కోట్లు రెవెన్యూ లోటు కింద ఇస్తుందని, దీనిలో ఇప్పటికే రూ. 7,020 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. 13వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి రూ. 1,70,686 కోట్లు రాగా, 14వ ఆర్థిక సంఘంలో రూ. 2,06,911 కోట్లు వస్తున్నాయని, అంటే రూ. 30 వేల కోట్లు ఎక్కువగా వస్తుందని వివరించారు. ఇవికాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ. 1.43 లక్షల కోట్లు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని దానికి నూరుశాతం నిధులు కేంద్రమే ఇస్తుందని వివరించారు.

హెరిటేజ్ డైరెక్టర్ గా మొటపర్తి రాజీనామా
బినామీ కంపెనీలు, బోగస్ కంపెనీలను పెట్టి పన్నులు ఎగవేతకు పాల్పడ్డారంటూ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది పేర్లను వెల్లడించిన పనామా లీక్ జాబితాలో ఉన్న మొటపర్తి శివరామ ప్రసాద్ ను హెరిటేజ్ కంపెనీ నుంచి తప్పించారు. శివరామ ప్రసాద్ తన ఇండి పెండెంట్ పదవికి రాజీనామా చేసినట్లు హెరిటేజ్ పుడ్స్ వెబ్ సైట్ లో శుక్రవారం రాత్రి ఒక ప్రకటన ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.గురువారం నాడు ప్రసాద్ తన రాజీనామా సమర్పించారని, ఈ నెల ఇరవైమూడున జరిగే కంపెనీ డైరెక్టర్ల సమావేశంలో దీనిని ఆమోదించవచ్చని తెలిపారు.హెరిటేజ్ కంపెనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందినదన్న సంగతి తెలిసిందే.మొటపర్తి పేరు పనామా పత్రాలలో వెల్లడి అవడంతో ఆయనకు,చంద్రబాబుకు లింక్ పెడుతూ పెద్ద ఎత్తున ఒక వర్గం మీడియాలో కధనాలు వచ్చాయి.

3 Comments

Filed under Uncategorized

3 responses to “‘హోదా’ అడగనే లేదు! బీజేపీ ఏపీ ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌సింగ్

 1. Gandhi puttina Desam ni …
  Kulanni ….Kalanni addam pettukuni Godselu dochukuntunta
  Gandhi varasula paristhithi !!

  http://www.ndtv.com/india-news/mahatama-gandhis-grandson-lives-in-an-old-age-home-in-delhi-1406255?pfrom=home-lateststories

  I don’t have to tell who will go to heaven and who will rot in hell.

 2. Veera

  ఏపీకి ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో స‌రైన నాయ‌కుడెవ‌రు?:-
  చంద్ర‌బాబు: 39 శాతం
  వైఎస్ జ‌గ‌న్: 41 శాతం
  ప‌వ‌న్ క‌ల్యాణ్: 5 శాతం
  చిరంజీవి :4 శాతం
  సోము వీర్రాజు: 1 శాతం
  ర‌ఘువీరారెడ్డి :1 శాతం
  చెప్ప‌లేం :9 శాతం

  మొత్తంగా రెండేళ్ల క్రితం విశేష ఆద‌ర‌ణ సాధించి అనూహ్యంగా అధికారం ద‌క్కించుకున్న చంద్ర‌బాబు జ‌నంలో ప‌ల‌చ‌న‌వుతున్నారు. అదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు ప‌ట్టున్న వ‌ర్గాల్లో మ‌రింత బ‌ల‌ప‌డుతున్నారు. దాంతో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ ముందున్నారు.

  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వివిధ సామాజిక‌, వ‌ర్గాల వారీగా నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డయిన ఈ ఫ‌లితాల‌తో అసెంబ్లీలో అధికార ప‌క్షం బ‌ల‌ప‌డుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో మాత్రం ప్ర‌తిప‌క్ష నేత‌కే మ‌ద్ధ‌తు ల‌భిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న ఆస‌క్తికర అంశాలు రాబోయే భాగాల్లో చూడండి..!

  http://telugu.updateap.com/?q=latest/1819

 3. Veera

  పవన్ కళ్యాణ్ జనసేన -అసలు ఉద్దేశం వేరా
  ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేనను రాజకీయ ఉద్దేశాలతో ఆరంబించలేదా?ఆయనతో అప్పట్లో సన్నిహితంగా ఉన్న ప్రముఖ నిర్మాత ,సినీ రంగ ప్రముఖుడు పొట్లూరి వరప్రసాద్ (పివిపి) చెబుతున్నదాని ప్రకారం ఒక రాజకీయేతర సంస్థను నడపాలని అనుకున్నామని,కాని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దానిని రాజకీయ సంస్థ గా మార్చేశారు.

  ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెబుతూ పవన్ కళ్యాణ్, తాము అనుకున్నది ఒకటి,ఆయన చేసింది మరొకటి అని అంటున్నారు.దానితో తాను ,మరికొందరం సైలెంట్ గా పక్కకు తప్పుకున్నామని ప్రసాద్ వివరించారు. తాను గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ద్వారా టిక్కెట్ కోసం యత్నించలేదని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇండియాలోనే లేనని చెప్పారు.

  వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ లతో తనకు సాన్నిహిత్యం ఉందని, జగన్ తో ఒక మాట తేడా వచ్చాక సైలెంట్ అయిపోయానని అన్నారు.

  పవన్ కళ్యాణ్ తో తాను సినిమా తీసే ఆలోచన లేదని ఆయన చెప్పారు.ప్రభుత్వంతో సంబందం ఉన్న ఏ వ్యాపారం చేయబోనని అన్నారు.

  సాక్షి పెట్టుబడులకు మంచి లాభాలే వస్తున్నాయని ఆయన చెప్పారు.తాను వైఎస్ వల్ల లాభం పొందినట్లు చిన్న నోట్ చూపించినా,దేనికైనా సిద్దమేనని సిబిఐకి స్పష్టం చేశానని ప్రసాద్ అన్నారు.

  http://kommineni.info/articles/dailyarticles/content_20160514_27.php?p=1463210814648

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s