ఎన్నిక‌లొస్తే ‘గోదారి’ ఎవ‌రి దరి? UPDATEAP స‌ర్వే

ప్ర‌స్తుత స‌ర్వేలో గోదావ‌రి జిల్లాలో సీట్లు ఇలా ల‌భించే అవ‌కాశం ఉంది
ప‌శ్చిమ గోదావ‌రి (15) టీడీపీ 8 (-7) వైఎస్సార్సీపీ 7 (+7)
తూర్పు గోదావ‌రి (19) టీడీపీ 9 (-5) వైఎస్సార్సీపీ 10 (+5)
మొత్తం 34 టీడీపీ 17 వైఎస్సార్సీపీ 17

ఈ ఫ‌లితాలు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి కూట‌మిగా మొన్న‌టి ఎన్నిక‌ల్లో పోటీచేసిన పొత్తు ఆధారంగా సేక‌రించిన‌వి. ప్ర‌స్తుత ప‌రిణామాలు మారుతున్న త‌రుణంలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య స‌ఖ్య‌త చెదురుతోంది. దానికితోడ జ‌న‌సేన కూడా టీడీపికి దూర‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే టీడీపీకి మ‌రింత న‌ష్టం త‌ప్ప‌దు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించే జిల్లాల్లో ఆయ‌న దూర‌మ‌యితే టీడీపీ న‌ష్ట‌పోతుంది. అప్పుడు త్రిముఖ పోటీలో ఫ‌లితాలు భిన్నంగా ఉంటాయి. అయితే ప్ర‌స్తుత లెక్క‌లు మాత్రం వైఎస్సార్సీపీకి సానుకూలంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చావుదెబ్బ తిన్న ప్రాంతంలో కోలుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌రిస్థితులు ఉప‌యోగించుకుంటే మ‌రిన్ని ఫ‌లితాలొస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు

http://telugu.updateap.com/?q=latest/1876

అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రం ఎడారే
– దామాషా పద్ధతిలో నీటి వాటా రావాలి
– కేంద్రం స్పందించకపోతే విద్వేషాలే
– జలదీక్షలో వైఎస్‌.జగన్‌
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి
కృష్ణా, గోదావరి నదులపై ఎగువన తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందని వైసిపి అధ్యక్షులు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరాక కిందికి నీటిని వదులుతున్నారన్నారు. మనకొచ్చే నీటిలో 120 టీఎంసీలు కేసీఆర్‌ తీసుకుపోతే ఆంధ్రా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక జలదోపిడీ చేసేవని, రాష్ట్రం విడిపోయిన తర్వాత జల దోపిడీకి తెలంగాణ తోడైందని తెలిపారు. శ్రీశైలంలోకి కృష్ణా నీరు రాకముందే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టి కేసీఆర్‌ ప్రభుత్వం నీటిని అడ్డుకుంటోందని తెలిపారు. శ్రీశైలంలోకి నీరు రాకపోతే రాయలసీమకు సాగునీరు కాదు కదా తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకదని చెప్పారు. నాగర్జునసాగర్‌, కృష్ణా డెల్టా పూర్తిస్థాయిలో దెబ్బ తింటుందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే రాయలసీమకు నీటిని మళ్లించుకునే అవకాశం ఉందని తెలిపారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగోడు ప్రాజెక్టులు, తెలంగాణకు కల్వకుర్తి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకాలకు మాత్రమే అనుమతులున్నాయని చెప్పారు.

సిడబ్ల్యుసి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, ఎఫెక్స్‌ కమిటీలతో సంబంధం లేకుండా పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కెసిఆర్‌ నియంతలా ప్రాజెక్టులను చేపడుతుంటే సిఎం చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు.

http://www.prajasakti.com/Content/1796219

6 Comments

Filed under Uncategorized

6 responses to “ఎన్నిక‌లొస్తే ‘గోదారి’ ఎవ‌రి దరి? UPDATEAP స‌ర్వే

 1. Kondharu Neethimalina jathi gallu AC rooms lo kurchoni siggumalina panuluchesthunta …
  Mandutenda lo Aluperganai Praja poratam chesthunna Oka Okkadu …

 2. Veera

  పోలవరం పై బాబు,రాయపాటి చౌదరి ల దోపిడీ మీద కన్నేసిన మోడీ ?
  http://www.muchata.com/main-news/modi-mark-shock-to-chandrababu-again-on-polavaram/

 3. Veera

  Just for fun
  మోడీని కలిసి ప్రత్యెక హోదా అడిగిన బాబు, అన్నీ విన్న మోడీ ఇలా అన్నారు
  “మనవాళ్ళు they briefed me. I am with you, don’t bother. For everything I am with you. What all they spoke we will honour. Freely you can decide. No problem, that is our commitment, u can decide”.
  ఇది విన్నాక మనవాడి పరిస్థితి మీరే ఊహించుకోండి

  -Pradeep Reddy Kathi

 4. Veera

  హ హ హ కెవ్వు కేక !!!
  కెసిఆర్ బాబుబలి-1 చూపించేసరికి విజయవాడ పారిపోయాడు అదే బాబుబలి-2 చూపిస్తే !!!
  -రోజా

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s