రాజకీయాలతో ఆంధ్రకు అన్యాయం

రాజకీయాలతో ఆంధ్రకు అన్యాయం- ఆంధ్రభూమి ఎడిట్ పేజీ-May 17,2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యవహారశైలి కారణంగా ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాడు ‘రెండు కళ్లు’, ‘సమన్యాయం’ అంటూ…23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకుంటూ లేఖల మీద లేఖలు పంపారే కానీ, విభజన ముసాయిదా రూపకల్పనకోసం నాటి యుపీఏ సర్కారు నిర్వహించిన ఏ సమావేశంలోను ఆయన పాల్గొనలేదు. ఐదులక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని ఓ పేపర్ స్టేట్‌మెంట్‌తో సరిపుచ్చారు.

ఇక భాజపా సంగతి సరేసరి. పరిశ్రమల స్థాపనకోసం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని రాజ్యసభలో నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న నేటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా విషయం కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో పట్టలేదని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు.

దేశవ్యాప్తంగా యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో, భాజపాతో జట్టుకట్టిన చంద్రబాబు ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విజయం సాధించగలిగారు. అయితే పదవీ స్వీకార ప్రమాణం చేసిన దగ్గరినుంచి నేటి వరకు ‘అడ్డగోలుగా విభజించారు’, ‘ఇష్టానుసారం చేశారు’ అంటూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. కాలచక్రంలో రెండేళ్లు గడిచిపోయాయి. మిగిలింది ఏమిటి?

బాబు, రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేగలిగారా? నిరుద్యోగభృతి ఇవ్వగలిగారా? రాష్ట్ర ప్రజలందరికీ శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వగలుగుతున్నారా? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారా?ఎన్నికల్లో కులాలవారీగా ఇష్టారీతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 వైద్యసేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రజారంజక పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని ప్రచారం చేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల నోట్లో మట్టి కొట్టారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌కు మొక్కుబడి నిధులు కేటాయించడమే కాకుండా అవికూడ సక్రమంగా అమలు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటా వైఫల్యాలే కనిపిస్తాయి.

విభజనచట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలు, నాడు కేంద్ర ప్రభు త్వం తరపున ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా కేటగిరి, ఆర్థికలోటు భర్తీ వీటినైనా సాధించగలిగారా? కృష్ణా, గోదావరి మిగులు జలాలు రాష్ట్రానికి దక్కనీయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నా దీటుగా స్పందించారా? ఏమీ లేదు.

రాజధాని పేరుతో గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య మూడు పంటలు పంటే వేలాది ఎకరాల భూములను నయానా, భయానా లాగేసుకొని రియల్ ఎస్టేటర్ అవతారం ఎత్తారు

పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పాలనాపరంగా మంత్రులపై, అధికార్లపై సీఎంకు పట్టు లేదు. ప్రభుత్వ యంత్రాం గం ఆసాంతం అవినీతిమయమైపోయింది. ప్రభుత్వ విధుల్లో అధికార పార్టీ పెద్దల జోక్యం మితిమీరిపోయింది. టీడీపీ కార్యకర్తలు దళారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు.

మరోపక్క ప్రధాన ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్యాకేజీలను ఇస్తూ మరీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పేస్తున్నారు.

రాష్ట్ర హక్కుల సాధనకు దృఢవైఖరి తీసుకోరెందుకని?
ఓటుకు నోటు కేసు సహా, ఇతరత్రా చెప్పుకోలేని బలహీనతల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారా?

ఇటీవలి కాలంలో టీడీపీ-బీజేపీల మధ్య మిత్రభేదం బయటపడుతోంది. బాబుపాలన పారదర్శకంకగా లేదని, కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడంలేదని భాజపా నాయకులు బహిరంగాంగానే విమర్శిస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదంటూ స్వయానా ముఖ్యమంత్రే మెల్లమెల్లగా స్వరం పెంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడం వల్ల రాజకీయంగా తమకొరిగేదేమీ లేదని, ఫలాలన్నీ టీడీపీనే నొక్కేస్తున్నదని, భాజపా అగ్రనాయకత్వం భావిస్తోందా?

తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీకి దిగలేమని భావిస్తున్నారా? అందుకే టీడీపీని పొమ్మనలేక పొగపెడుతున్నారా?

http://andhrabhoomi.net/content/main-feature-88

6 Comments

Filed under Uncategorized

6 responses to “రాజకీయాలతో ఆంధ్రకు అన్యాయం

 1. Veera

  అనుభవం అంతా ఉపయోగించి కృష్ణా పుష్కరాల డబ్బు ఎలా నోక్కేస్తున్నారో …!!!
  [ముఖ్యమంత్రి ఆగ్రహం
  యథావిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు పనులు సకాలంలో కాలేదేమిటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు ఆగ్రహం కాదు తీవ్ర ఆగ్రహం. గతంలో చాలా సార్లు చాలా పనుల గురించి ఆగ్రహం వ్యక్తం చేసినట్లే ఈ సారి పుష్కర పనులు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిటేడాది గోదావరి పుష్కరాలకు ముందుకూడా ముఖ్యమంత్రి ఈ విధంగానే పనులు కాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి పన్నిండేళ్ల క్రితం జరిగిన గోదావరి పుష్కరాల సందర్భంగా కూడా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇలానే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలు వచ్చే ప్రతిసారీ ఏడాది ముందుగానే అద్భుతమైన పథకాలు ప్రకటించడం, కోట్లు కోట్లు రూపాయల ప్రజాధనం పనులకు కేటాయించడం తీరా చూస్తే పుష్కరాలు సమీపానికి వచ్చేక హడావుడి పడడం, పనులు కాలేదని ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రభుత్వ పనితీరులో భాగమైపోయినట్లు కనిపిస్తోంది. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ హడావుడి పునుల వెనుక అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలు, వారి అనుయాయుల ప్రయోజనాలు దాగున్నాయన్న విషయం అర్ధమవుతుంది.

  ఆగస్టు 12 న పుష్కారాలు ప్రారంభంకానున్నాయి. పుష్కరాలకు ముందుగా ముగించాల్సిన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే వీరంతా ఆఖరి నిమిషపు ‘అత్యవసర’ పనుల కోసం వేచివున్నట్లు కనిపిస్తోంది. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని రూ.8 కోట్లతో అభివృద్ధి చేయాలనుకున్నా ఏ ఒక్క కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడం ఆశ్ఛర్యం వేస్తుంది. 13 ప్యాకేజీల ద్వారా చేయించాల్సిన రోడ్లు, కల్వర్ట్‌లు, పనులూ ‘ఆఖరి నిమిషం’ కోసమే వేచిచూస్తుండటం విశేషం. పుష్కరాలను అత్యంత ఘనంగా జరపాలంటున్న ప్రభుత్వ ఉత్సాహం ప్రకటనల్లో కనిపిస్తోందే తప్ప ఆ మేరకు అందించాల్సిన సహకారంలో ఉండటం లేదని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం నేతలు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

  ఆహా..అద్భుతం అనిపించేలా పుష్కరాలు నిర్వహిస్తామనే పాలకుల ప్రగల్భాలకు క్షేత్రస్థాయిలో పుష్కర పనులకు పొంతన లేదు. పుష్కర ఘాట్లు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. ప్రచార ఆర్భాటంలో ఉండే శ్రద్ధ పనులు పూర్తి చేయించడంలో ఏమాత్రమూ కనిపించడంతో ప్రజానీకం విస్తుపోతోంది. ఆలస్యానికి ప్రధాన బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం దాన్ని అధికారులపైకి నెట్టేస్తుండటం విడ్డూరం. నిధులను తొక్కిపెట్టి అరకొర పనులను సాగదీస్తూ సమయం సమీపించగానే ఆదరబాదరగా మమ అనిపించేసి ‘అత్యవసరం’ పేరుతో కాంట్రాక్టర్లకు కోట్లు కట్టపెట్టిన గోదావరి పుష్కరాలు కళ్లముందు కదలాడుతూనేవున్నాయి. అయినా కూడా పాలకులు మాత్రం అదే తీరుతో ముందుకు సాగిపోతుండటం ఆందోళనకరం. గోదావరి పుష్కర పాఠాలను ఏమాత్రమూ ఒంటబట్టించుకోని ప్రభుత్వ పెద్దలు అధికారులపై ఆగ్రహం నంటించడం దేనికోసం? తరుముకొస్తున్న గడువు, నత్తనడక పనులు చూస్తుంటే కృష్ణా పుష్కరాల్లోనూ ఆదరబాదర పనులు పునఃదర్శనమివ్వకతప్పదనే ఎవ్వరికైనా బోధపడుతుంది.

  కృష్ణా పుష్కరాల పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు భవనాలు, సాగునీటి శాఖల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. పుష్కరాల గడువు సమీపిస్తోంది. రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు ఆలస్యం ఎందుకయ్యాయి? వర్షాలు కురుస్తున్న సమయంలో బీటీ రోడ్లు వేస్తే ఎలా నిలుస్తాయి? ఘాట్ల నిర్మాణం ఇంకా టెండర్ల దశలోనే ఉందా? అని ముఖ్యమంత్రి అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు పత్రికల్లో వచ్చింది నిజమే అయితే ఆయన కన్నా హిపోక్రాట్‌ మరొకరుండదు. ఇప్పటివరకూ రూ.1251 కోట్లతో 1495 పనులు చేపట్టినట్లు విన్నవించిన అధికారులు పనులు ముందుకు కదలాలంటే నిధులు ఇవ్వాలని, నిధులివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎలా అని ప్రశ్నించారని తెలుస్తోంది. పుష్కరాలు సమీపించే వరకు నిధులు విడుదల చేయంది ఎవరు? నిధులు లేకుండా అధికారులు పనులు చేయగలరని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా అనుకుంటారు? పనులు కాకపోవడం తమ ఘనకార్యమేనని తెలిసి కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం దేనికోసం? అంటే మళ్లీ గోదావరి పుష్కరాల సీన్‌ కృష్ణాపుష్కరాల్లో కూడా పునరావృతమవుతుందన్నమాట. పుష్కరాలకు తరలివచ్చే ప్రజలకు సేవచేయడం మీద కన్నా ప్రజా ధనాన్ని పుష్కరాల పేరుతో బొక్కడానికి వేస్తున్న ఎత్తులు ఇవన్నీనని తెలిసిపోవడం లేదూ?! పన్నెండేళ్లకొకసారి వచ్చే పుష్కరాలకు తరలి వచ్చే ప్రజలకు సదుపాయాలు చేయడం ప్రభుత్వ విధి. ఈ పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, అందినకాడికి దోచేయడానికి ప్రయత్నించడం క్షంతవ్యం కాదు. ప్రజల అప్రమత్తులై అవినీతికి చెక్‌ పెట్టాలి.

  http://www.prajasakti.com/EditorialPage/1797573

 2. Veera

  మేం పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చాం. మీకు సిగ్గు లేక రెండేళ్ల కే ప్రలోభాలకు లొంగారు, ఒత్తిళ్లకు తలొగ్గి ఫార్టీ ఫిరాయించారు
  -TDP లో చేరిన YCP MLA చాంద్ భాషా నుద్దేశించి TDP MLC పయ్యావుల కేశవ్ చౌదరి

  అంటే బాబు కోట్లకు కొంటున్నాడు వినకపోతే బెదిరిస్తునాడు అని చెప్పకనే చెప్పాడు చౌదరి
  http://telugu.greatandhra.com/politics/gossip/tdp-leaders-hue-and-cry-over-ycp-defectors–71457.html

 3. Adnan

  పిట్టల దొర మల్లి మొదలెట్టాడు…

  సందర్భం ఎదైనా ఆవు కధ మాత్రం వదలడు

  చార్మినార్ నెనె కట్టా, Golconda నెనె కట్టా, Airport నెనె కట్టా, Hitec city (Ragiv Gandhi Knowledge Park) నెనె కట్టా,

 4. Veera

  2 సం బాబు పాలన పై updateap సర్వే
  TDP కి 25 సీట్లు తగ్గి ఓడిపోతుంది అని సర్వే సారంశం
  TDP+BJP+పవన్: 83(-25), YCP: 92(+25)

  updateap స‌ర్వేలో జిల్లాల వారీగా వ‌చ్చిన అంచ‌నాలు
  శ్రీకాకుళం (10): టీడీపీ 6(-1) వైఎస్సార్సీపీ 4(+1)
  విజ‌య‌న‌గ‌రం(9): టీడీపీ 5(-1) వైఎస్సార్సీపీ 4(+1)
  విశాఖ (16): టీడీపీ 9(-3) వైఎస్సార్సీపీ 7(+4)
  ప‌శ్చిమ గోదావ‌రి (15) టీడీపీ 8 (-7) వైఎస్సార్సీపీ 7 (+7)
  తూర్పు గోదావ‌రి (19) టీడీపీ 9 (-5) వైఎస్సార్సీపీ 10 (+5)
  కృష్ణా (16 ): టీడీపీ 10(-1) వైఎస్సార్సీపీ 6 (+1)
  గుంటూరు (17): టీడీపీ 10 (-2) వైఎస్సార్సీపీ 7 (+2)
  ప్ర‌కాశం (12 ): టీడీపీ 5 (-1) వైఎస్సార్సీపీ 7 (+1)
  నెల్లూరు (10): టీడీపీ 3 వైఎస్సార్సీపీ 7
  అనంత‌పురం (14): టీడీపీ 8 (-4) వైఎస్సార్సీపీ 6 (+4)
  చిత్తూరు (14): టీడీపీ 6 (+1) వైఎస్సార్సీపీ 8 (-1)
  క‌డ‌ప (10) : టీడీపీ 1 వైఎస్సార్సీపీ 9
  క‌ర్నూలు (14): టీడీపీ 3 వైఎస్సార్సీపీ 11
  మొత్తం 175 టీడీపీ 83(-25) వైఎస్సార్సీపీ 92(+25)

  http://telugu.updateap.com/?q=latest/1919

 5. Veera

  ఔను, అమరావతి లో ఉద్యోగులు ఇబంది పడాల్సిందే
  కనీస సదుపాయాలు లేవు కానీ డబల్ బెడ్ రూం అద్దె 20 వేలు
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5452263

 6. Veera

  లబోదిబో మంటున్న పార్టీ మారిన MLA లు,వెన్నుపోటు రాజానా మజాకా !!!
  ఎరక్కపోయి ..ఇరుక్కున్నామా !!!
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5452255#

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s