మారని మహానా(యు)డు!

నమ్మినవారికి న్యాయం చేయలేరన్న అపప్రధను బాబు ఇప్పటికీ తొలగించుకోలేకపోయారు. యువ నాయకత్వ ప్రమేయంతో పార్టీకి అద్దిన కార్పొరేట్ సంస్కృతి సంప్రదాయ కార్యకర్తను పార్టీకి మానసికంగా దూరం చేస్తోందన్న ఆవేదన లేకపోలేదు.

తాను మారానని గతంలో ఒకటికి పదిసార్లు చెప్పినప్పటికీ, బాబు ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదంటున్నారు. సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించే విషయంలోనే బాబు గత ధోరణి మారింది తప్ప, మిగిలినదంతా పాతదేనని నేతలు విశే్లషిస్తున్నారు. గతంలో సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించేందుకు భయపడిన బాబు, ఈసారి మాత్రం ఆ విషయంలో ఎవరికీ భయపడటం లేదని, ఈ విషయంలో పుత్రప్రోత్సాహమే ఎక్కువగా ఉందంటున్నారు. అయితే, అది మోతాదు మించుతున్న ప్రమాదం కనిపిస్తుంది. దానివల్ల మిగిలిన వర్గాలు దూరమవడంతోపాటు, ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పదేళ్లు పార్టీ కోసం పనిచేసిన తనకు ఇప్పటివరకూ బాబు, లోకేష్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని సినీ నటి కవిత ఎన్నోసార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలకే సమయం ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విషయంలో బాబు మళ్లీ పాత ధోరణిలోనే కనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీఎంఓలో కూడా ప్రజాసంబంధాలున్న వారు ఒక్కరూ లేరంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన వారికి మళ్లీ అందలం ఎక్కిస్తున్నారు. వారిని మార్చాలని ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు బాగానే పనిచేస్తున్నారు కదా అని స్వయంగా బాబు ప్రశ్నించడంతో నేతలు బిత్తరపోతున్నారు.

అటు చాలామంది అధికారులు కూడా బాబు పనితీరుతో విసుగెత్తిపోతున్నారు. సమీక్షలు, సమావేశాల విషయంలో బాబు వైఖరిలో మార్పు రాలేదు. గంటలపాటు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సమావేశాల వల్ల పని జరగడం లేదని, అందుకే తాము కూడా అంకెలగారడీ చేయాల్సి వస్తోందంటున్నారు. ఈసారి ఉద్యోగులను ఎక్కువ కష్టపెట్టనని చెప్పినప్పటికీ, అది ఆచరణలో కనిపించడం లేదంటున్నారు.

నిజానికి, తెలంగాణతో పోలిస్తే ఏపిలో అవినీతి ఎక్కువగా ఉందన్న నిజం సర్వేలు కూడా తేల్చాయి. తెలంగాణలో అది కొంతమందికే పరిమితమైతే, ఏపిలో విస్తృతమయింది. ఎమ్మెల్యేల విచ్చలవిడితనంతో పార్టీ పరువు రోడ్డెక్కింది. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పుడు కూడా ఇంత బరితెగింపు ధోరణి లేదని, చివరకు సొంత పార్టీ నేతల ఆస్తులే కొల్లగొడుతున్న దారుణం నెలకొందని సీనియర్లు వాపోతున్నారు. అగ్రనేతల సంతానాలు జనాలను దోచుకుంటున్నారన్న భావన సొంత పార్టీ శ్రేణుల్లోనే నెలకొంది. వాటిని అనుభవిస్తోన్న జనాలకు ‘కాంగ్రెస్ వాళ్లే నయమన్న’ భావన మొదలయింది. ఇది పార్టీ భవిష్యత్తుకే ప్రమాదకరం, దీనిని గాడిలో పెడితేనే పార్టీకి ఆరోగ్యం.

పార్టీ జెండా మోయని వారిని, ప్రతిపక్షంలో ఉండగా తమపై కేసులు పెట్టిన వారిని అందలమెక్కిస్తే, ఇక పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేసే వాతావరణం ఎందుకుంటుందని శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మరి అధికారం వచ్చి ఎవరికి లాభమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం వచ్చింది తమకు కాదని, దళారులు, ఫిరాయింపుదారులు, వ్యాపారస్తులకేనన్న భావన బలంగా నాటుకుపోయింది.

వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో పార్టీ బలపడిందని భావిస్తున్నప్పటికీ, అది వాపేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలో మినీ మహానాడు నిర్వహించుకున్నారంటే పార్టీలో క్రమశిక్షణ ఏస్థాయిలో దిగజారిందో, బాబంటే ఏ స్థాయిలో భయం పోయిందో చెప్పకనే చెబుతుందని విశే్లషిస్తున్నారు. అధినేత అంటే గతంలో అంతో ఇంతో నేతలకు భయం ఉండేది. వైసీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన తర్వాత ఆ భయం కూడా పోయింది.

ఈ రెండేళ్లలో అమరావతిలో మోదీ ఇచ్చిన నీళ్లు, మట్టి తప్ప ఒక్క ఇటుక కూడా రాలేదు. ఇంకా పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఇది బాబు ప్రతిష్ఠకు సవాలుగా మారింది. ఐటి ప్రమోషన్‌కు మారుపేరయిన బాబు, ఇప్పటివరకూ ఏపికి ఒక్క ఐటి కూడా తీసుకురాలేకపోయారన్న భావన యువకుల్లో ఉంది. కొత్త రాజధానిని వృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే బాబును గెలిపించారు. ఆ నమ్మకంలో సగం శాతం కూడా ఈ రెండేళ్లలో సాధించలేకపోయారు.

బాబును మోదీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది

http://www.andhrabhoomi.net/content/main-feature-99

11 Comments

Filed under Uncategorized

11 responses to “మారని మహానా(యు)డు!

  1. Neethimalina jathiki chepputho kottinchukuna arhatha kuda ledhu …
    Veeriki Devudi court lo na siksha. Akkada thappinchukolaru ee Gajji / Gaja dongalu.

    http://www.sakshi.com/news/district/woman-takes-on-chandrababu-naidu-while-on-tdp-mahanadu-meeting-in-tirupati-346454?pfrom=home-top-story

  2. Veera

    కాపులకు YS ఏమి చేసాడు? బాబు
    రంగా ను అయితే చంపలేదు కదా???
    కోస్తాలో అన్ని పదవులు కాపులకే ఇస్తున్నాడు YS
    -2007 లో అప్పటి కాంగ్రెస్ MP రాయపాటి చౌదరి
    (మొన్న 2014 లో జగన్ కూడా 6 MP 32 MLA సీట్లు ఇచ్చాడు కాపులకు కానీ బాబు 2 MP 20 MLA సీట్లు ఇచ్చాడు)

    కాంగ్రెస్ వాళ్ళు రతనాల సీమ ను రాల్లసీమ గా మార్చారు-బాబు
    గత 35 సం లలో TDP 20 సం అధికారం లో ఉన్న విషయం మర్చిపోతే ఎలా?
    పైగా రాయలసీమ కు నీళ్ళు వెళ్ళకూడదనే కదా శ్రీశైలం లో నీటి మట్టం 856 అడుగుల నుంచి 832 అడుగులకు తగ్గించింది నీవే కదా బాబూ?
    కేంద్రం రాయలసీమ కు ఇచ్చిన AIIMS లాంటి సంస్థలు కూడా తీసుకెళ్ళి గుంటూర్ లో పెట్టింది నీవు కాదా బాబూ?

    పాపం ముని శాపం నిజం చెబితే తల వెయ్యి వక్కలని !!!

  3. Veera

    పుట్టింటోళ్ళు తరిమేసారు, కట్టుకున్నోడు వదిలేసాడు !!!
    ఈ సారి కర్ణాటక నుంచి తీవ్ర వ్యతిరేకత రావడము తో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెంకయ్య నాయుడు !!!

  4. Veera

    కత్తులు నూరుతున్న BJP, బాబు కు చెక్ పెట్టిన BJP !!!
    AP నుంచి కాకుండా కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ కు రాజ్యసభ MP సీటు
    కుల మీడియా లో కుల మేధావుల చేత రోజూ BJP ని తిట్టిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నాడు అని BJP బాధ.In Front Crocodile Festival బాబూ !!!!

  5. Veera

    దేవుడా!!!
    లోకేష్ తొమ్మిదో తరగతి చదివే రోజులలోనే నాకు రాజకీయ సలహాలు ఇచ్చాడు-బాబు
    అయితే మనోడు ఒక ఐన్ స్టీన్, ఐజాక్ న్యూటన్, సచిన్ అన్నమాట!!!
    అందుకే సత్యం రామలింగరాజు సహాయం లేకుండా, GRE,TOAFL లేకుండానే స్తాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సీటు ఇచ్చారన్నమాట !!!

  6. Veera

    వెంకటేశ్వర స్వామికి వైభవం పెరగడానికి తెలుగుదేశం పార్టీ నే కారణం
    ఎక్కువ పాపాలు చేస్తున్న వాళ్లు ఎక్కువ డబ్బులు దేవుని హుండీలో వేస్తున్నారు
    -బాబు
    ఇదే మాటలు ఎవరైనా అని ఉంటె బాబు అను కుల మీడియా గుడ్డలూదదీసేది కాదా?
    ABN,TV9,NTV,TV5,ETV…చర్చలు పెట్టి హిందువుల ద్రోహి అనేవాళ్ళు కారా?
    Request-No bad comments please !!!

  7. Veera

    అవినీతి చేయను కాబట్టే హాయిగా నిద్రపోతున్నా- బాబు
    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్
    పాలు పెరుగు అమ్మి వోటుకు 5 కోట్లు ఇచ్చే మీలాంటి ధర్మ ప్రభువులు ఇంకా ఉండబట్టే వర్షాలు బాగా పడుతున్నాయి రాజా-పోసాని

  8. Manavathvam marachi ..Neethimalina Jathi chesthunna Siggumalina panulu choosi asahyam putta rojullo ..
    Manavthvam brathiki vundhi ani cheputhunna oka Manishi.

    http://www.sakshi.com/news/national/ahmedabad-resident-performs-the-last-rites-of-unclaimed-bodies-346368?pfrom=home-top-story

    @ caste fanatics ….No matter how much time you waste to loot your own people by unethical means ,you will all have to die one day.
    Death is inevitable and you neither take your money nor your caste with you.

  9. Veera

    ఎరక్క పోయి వచ్చాము ఇరక్క పోయాము-జంప్ జిలానీలు
    [మ‌హానాడుకి దూరంగా ‘పొద్దు తిరుగుడు పువ్వులు’
    – హాజరు కాని 13 మంది
    – భూమా కుటుంబం ప్రాంగణం బయటే చక్కర్లు
    ప్రజాశక్తి – తిరుపతి ప్రతినిధి
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుండి ఇటీవల టిడిపిలో చేరిన 13 మంది ఎంఎల్‌ఏలు మహానాడుకు హాజ రుకాలేదు. ఆహ్వానం ఉన్నా రాలేమని చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. భూమా కుటుంబం వచ్చి నప్పటికీ ప్రాంగణంలో ఎక్కడా కనిపించలేదు. వేదికపైకి ఆహ్వానం లేకపోవడంతో వెనక్కి వెళ్లిపో యినట్లు సమాచారం. రెండో రోజు ఎక్కడా తండ్రీ కూతుళ్లు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియలు కనిపిం చలేదు. మినీమహానాడుల్లో వివాదాలను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు తొలిరోజు ప్రసంగంలోనే ‘వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి వచ్చేవారిని రానీ యండి.. వారి గురించి మీరెవరూ అధైర్యపడొద్దు.. మీకుండే గౌరవం మీకు ఉంటుంది’ అని సభా ముఖంగానే చెప్పారు. అయినా పరిస్థితిలో ఎటు వంటి మార్పు కనిపించలేదు. రెండవరోజు కూడా వలస ఎంఎల్‌ఏలపై మహానాడులో చర్చ కొన సాగుతోంది. సీనియర్‌ టిడిపి నేతలు ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయంపై మాట్లాడుకోవడం కనిపి స్తోంది.

    కాంగ్రెస్‌ పార్టీ నుంచి టిడిపి తీర్థం పుచ్చుకున్న ఆనం రాంనారాయణరెడ్డి తొలి రోజు చంద్రబాబుకు కరచాలనం చేసి వెళ్లిపోతుం డగా ఎంఎల్‌సి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బతిమ లాడి వేదికపైకి తీసుకువచ్చారు. కాంగ్రెస్‌, వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ల నుంచి వచ్చిన వారికి మహానాడులో ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు పయ్యావుల కేశవు లును సీరియస్‌గా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

    ఎవరెవ్వరు ఎందుకు రాలేదంటే ….
    వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏలు టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో తమ ఉనికికి ఎక్కడ ప్రమాదం కలుగుతుందోనన్న భయం పట్టుకుంది. మహానాడులో వారి ఉనికిని కూడా భరించలేకపోతు న్నారు. దీంతో భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ మహానాడుకు వచ్చినప్పటికీ చంద్రబాబు కనిపించి వెళ్లిపోయారు. అదే జిల్లాలో ఎస్‌వి మోహన్‌రెడ్డి ప్రవేశాన్ని మాజీ మంత్రి టిజి వెంకటేష్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిజి వెంకటేష్‌ వివక్ష పాటిస్తున్నారని, తాను మహానాడుకు రాలేనని ఎస్‌వి మోహన్‌రెడ్డి అధినేతకు తెలియజేసినట్లు తెలుస్తోంది. కోడుమూరు ఎంఎల్‌ఏ మణిగాంధీ ఏడు కోట్లకు అమ్ముడుపోయిన అతను పార్టీని ఏమి ఉద్ధరిస్తారంటూ ఎత్తిపొడుపు మాటల వల్ల మహానాడుకు రాలేదని సమాచారం. అనంతపురం జిల్లా కదిరి ఎంఎల్‌ఏ చాంద్‌బాషా మినీమహానాడుకు హాజరు కాగా ‘అవినీతికి నిలయమైన ఎంఎల్‌ఏని బట్టలు ఊడదీసి కొడతా’ అని ఇన్‌ఛార్జి కందికుంట ప్రసాద్‌ అనడంతో ఆయనా గైర్హాజరయ్యారు. అలాగే కడప జిల్లా ఆదినారాయణరెడ్డి టిడిపి ప్రవేశాన్ని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే జిల్లా బద్వేల్‌లో వీరారెడ్డి కుమార్తె విజయజ్యోతి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి రవిశంకర్‌ను మాజీ మంత్రి కరణం బలరాం అనుచరులు మినీమహానాడులో కొట్టారు. మార్కాపురం డేవిడ్‌రాజు టిడిపిలో చేరినప్పటికీ పట్టించుకోకపోవడంతో తటస్థంగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జలీల్‌ఖాన్‌కు టిడిపి తీర్థం పుచ్చుకుంటే మైనార్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే అతని ప్రవేశాన్ని అక్కడి టిడిపి నాయకులు తిరగబడుతున్నారు. జగ్గంపేట ఎంఎల్‌ఏ జ్యోతుల నెహ్రూ విషయంలోనూ గ్రూప్‌ తగాదా మొదలయ్యింది. అరకు ఎంఎల్‌ఏ సర్వేశ్వరరావును ‘మాకే గతి లేదు, నువ్వెందుకు వచ్చావ్‌’ అంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దూషణ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే టిడిపి తీర్థం పుచ్చుకున్న 13 మంది ఎంఎల్‌ఏలు మహానాడుకు రాలేదని సమాచారం.

    http://telugu.updateap.com/?q=latest/2078 ]

  10. Veera

    కోతల రా(నా)యుడి కోతలు !!!
    రైతులకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేశాం,నెల రోజుల్లో కరెంటు కోత లేకుండా చేశా-కోతల రా(నా)యుడు
    (నాకు 40 వేలు ఋణం ఉంటె ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు
    -బాబు బావ నాగరాజు నాయిడు)
    విభజన జరిగితే AP లో మిగులు విద్యుత్తు ఉంటుంది, తెలంగాణా లో కరెంటు కొరత ఉంటుంది- 2013లో అసెంబ్లీ లో అప్పటి CM కిరణ్ రెడ్డి చెప్పిన మాటలు
    (విభజన వలన AP కి జరిగిన మేలు మిగులు విద్యుత్తు మాత్రమే )

    1995-2004 వరకు అంటే బాబు CM గా ఉన్న 9 సం కాలం లో తీవ్రమైన కరెంటు సమస్య ఉండేది అన్న విషయం మరిచిపోయారా బాబూ?

  11. Veera

    ఉన్నత విద్యావంతుడు , మృదు స్వభావి, స్నేహ శీలి, YS కుటుంబానికి ఆప్తుడు అయిన విజయ సాయి రెడ్డి గారు నిన్న రాజ్యసభ MP గా నామినేషన్ వేయడం జరిగింది

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s