ఎమ్మెల్యేల కొనుగోళ్లకు మీడియా వత్తాసా!

ఎపి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అదినేత చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలను ఎదుర్కుని నిలబబడడానికి విపక్ష నేత ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తన ఎమ్మెల్యేలను వేర్వేరు చోట్లకు విహార యాత్రలకు పంపించవలసి వచ్చిందని ఒక పత్రికలో కధనం వచ్చింది.

ఇది నిజంగా చిత్రమైన అంశమే. ఒకప్పుడు ఎన్.టి.రామారావును కాంగ్రెస్ పార్టీ అదికారం నుంచి దించినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నాయకత్వం కర్నాటకలో శిబిరాన్ని నిర్వహించింది. ఆ రోజులలో కాంగ్రెస పార్టీ,టిడిపి నుంచి చీలిన నాదెండ్ల భాస్కరరావులు ఎమ్మెల్యేలను కొంటున్నారని టిడిపి ఆరోపించిదే.సరిగ్గా ఇప్పుడు అవే విమర్శలను తెలుగుదేశం పార్టీ ఎదుర్కుంటోంది. ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొంటున్నారని,చివరికి ఒక రాజ్యసభ సీటుకోసం ఎంత నీచానికైనా టిడిపి పాల్పడుతోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన డబ్బున్న ఒక కాంట్రాక్టర్ ను డబ్బుతో రంగంలో దించడానికి టిడిపి ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.ఈ వార్తలు వస్తుండడంతో జగన్ ముందు జాగ్రత్తగా సుమారు నలభై మంది ఎమ్మెల్యేలను టిడిపి ప్రలోభాలు, ఇతరత్రా ఇబ్బందులకు గురి చేయకుండా వేరే చోట్లకు పంపించారని ఆ కధనం చెబుతోంది.జగన్ ఇలా శిబిర రాజకీయాలకు పాల్పడతారా అని ఆ కధనంలో విమర్శించారు.ఎమ్మెల్యేలు సెల్ పోన్ లను కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆ కధనంలో తెలిపారు.

ఏది ఏమైనా నైతిక విలువల కోసం పుట్టామని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఇలాంటి దౌర్బాగ్యపు రాజకీయాలకు దిగుతుంటే ,మీడియాలోని ఒక వర్గం ఫిరాయింపు రాజకీయాలను విమర్శించవలసింది పోయి,వైసిపి ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండాపోయారని బాదపడుతూ రాయడం దిగజారుతున్న ప్రమాణాలకు అద్దం పడుతున్నట్లే బావించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

తెలంగాణలో టిడిపితో సహా ఆయా పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ ఆకర్షించినప్పుడు తీవ్రంగా విమర్శించిన ఒక వర్గం మీడియా ఇప్పుడు ఎపిలో జరుగుతున్నవాటిని సమర్ధిస్తూ రాస్తోందని వారు అంటున్నారు. నిజమే తెలంగాణలో అయినా,ఎపిలో అయినా ఇలాంటి పిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం అంటే నైతికంగా దిగజారడమే అవుతుంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20160530_24.php?p=1464584715046

14 Comments

Filed under Uncategorized

14 responses to “ఎమ్మెల్యేల కొనుగోళ్లకు మీడియా వత్తాసా!

 1. Banks ni dochukoni …..
  India prajala dabbu tho London lo jalsalu chesthunna ….
  Ee Neethimalina manushulaki ….
  Kulanni ….Kalanni addam pettukuni
  AP ni dochukuntu jalsalu chesthunna Neethimalina jathki theda anti ?

  http://www.sakshi.com/news/sports/vijay-mallya-enjoys-watching-ipl-final-in-london-347132?pfrom=home-top-story

  Death is inevtable and they will all be caught in the GOD’s court.

 2. Adnan

  what happens, If YSRCP does not withdraw second candidate and election happens.

  Can YSRCP issue a whip to all MLAs, including those 17 MLAs?

 3. Veera

  చంద్ర‌బాబు ఓడిపోయారా..?
  ఏపీ రాజ్య‌స‌భ ఎన్నిక‌లు అన‌వ‌స‌రపు గంద‌ర‌గోళం నుంచి చివ‌ర‌కు గ‌ట్టెక్కాయి. ఎంతో టెన్ష‌న్ పుట్టించి చివ‌ర‌కు ప్ర‌శాంతంగా సాగిపోయాయి. నాలుగో సీటు కోసం నాలుగు నెల‌లుగా న‌డుస్తున్న నాట‌కం ముగిసిపోయింది. ఎంతో శ్ర‌మించినా చివ‌ర‌కు అధికార పార్టీ చేతులెత్తేయ‌క త‌ప్ప‌లేదు. చివ‌రి నిమిషం వ‌ర‌కూ డ్రామా న‌డిపిన‌ప్ప‌టికీ విప‌క్షానికి సీటు వ‌దిలేయ‌క మ‌రో మార్గం క‌నిపించ‌లేదు. దాంతో నాలుగు సీట్లు మూడు పార్టీలు పంచుకున్నాయి. ఎన్నిక‌లు లేకుండానే ఏక‌గ్రీవం చేశాయి. కానీ ఈ ప్ర‌క్రియ‌లో చంద్ర‌బాబు మాత్రం దాదాపు ఓడిపోయిన‌ట్టేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఆయ‌న‌కు వ్ర‌తం చెడ్డా ఫ‌లితం మాత్రం ద‌క్క‌క‌పోవ‌డం రాజ‌కీయంగా ఎదురుదెబ్బేన‌న్న వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తున్నాయి. చివ‌ర‌కు సొంత బ‌లం లేకుండా ఫిరాయింపుదారుల‌తో క‌లిసి పోటీ చేద్దామ‌ని భావించి బోల్తాప‌డ‌డం చంద్ర‌బాబు రాజ‌కీయ త‌ప్పిదంగానే కొంద‌రు వర్ణిస్తున్నారు. గ‌ద్దెనెక్కిన రెండేళ్ల త‌ర్వాత ఇది తొలి ఓట‌మిన‌డానికి కూడా సాహసిస్తున్నారు. ప‌రోక్షంగా ప్ర‌భుత్వం లెక్క త‌ప్పి చివ‌ర‌కు ప‌రాభ‌వం పాలుకావాల్సి వ‌చ్చింద‌న్న అభిప్రాయం వినిపిస్తోంది.
  ప్ర‌స్తుత రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీల బ‌లాబ‌లాల ప్ర‌కారం 3 అధికార‌ప‌క్షానికి, 1 విప‌క్షానికి ద‌క్కుతాయ‌న్న‌ది అంద‌రికీ తెలిసిన స‌త్యం. కానీ టీడీపీ మాత్రం దానికి స‌సేమీరా అన్న‌ది. విప‌క్ష వైఎస్సార్సీపీకి ఒక్క‌టి కూడా ద‌క్క‌డానికి వీలులేద‌న్న‌ది. అందులోనూ జ‌గ‌న్ అభ్య‌ర్థి విజ‌యసాయి రెడ్డిని స‌సేమీరా అంగీకరించేది లేద‌న్న‌ది. అందుకు త‌గ్గ‌ట్టుగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల‌కు తెర‌లేపింది. మార్చి నెల నుంచి ముంద‌స్తు గోడ దూకుడు కార్య‌క్ర‌మాలు ప్రారంభించింది. అంచెలంచెలుగా 17మందిని చేర్చుకుంది. ఇంకా చాలామంది ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పుకుంది. వైఎస్సార్సీపీని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిలువ‌రిస్తామ‌ని ..ఒక్క ఎంపీ సీటు కూడా ద‌క్క‌నివ్వ‌మ‌ని తెగేసి చెప్పింది. కానీ ఇప్పుడు సీన్ మాత్రం రివ‌ర్స్ అయ్యింది. టీడీపీ ఆశ‌లు నీరుగారిపోయాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా విజ‌య‌సాయిరెడ్డి ఎంపిక అధికారికంగా ప్ర‌క‌టించ‌డం మాత్ర‌మే మిగిలింది.
  చంద్ర‌బాబు చేసిన స‌వాల్ పార‌లేదు. చాలెంజ్ చేసినా నెర‌వేర్చుకోలేక‌పోయారు. క‌ష్ట‌ప‌డినా ఫ‌లితం ద‌క్క‌లేదు. కోట్లు కుమ్మ‌రించినా అనుకున్న టార్గెట్ కి చేరుకోలేక చతికిల‌ప‌డ్డారు. దాంతో విప‌క్షానిదే పై చేయి అయ్యింది. అయితే ఇదంతా అన‌వ‌స‌ర‌పు వ్య‌వ‌హారం అని ఇప్పుడు అధికార‌పార్టీ నేత‌లు భావిస్తున్నారు. కోట్లు పోసి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం ద‌క్క‌క‌పోవ‌డం చూస్తే గోటితో పోయే దానిని గొడ్డ‌లి వ‌ర‌కూ తెచ్చుకున్న‌ట్ట‌య్యింద‌ని ఒక సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వానికి స‌రిప‌డా బ‌లం ఉన్న‌ప్ప‌టికీ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సాకుతో చేర్చుకున్న వారంద‌రి వ‌ల్ల ఇప్పుడు పార్టీలో అన‌వ‌స‌ర‌పు త‌ల‌నొప్పులు త‌ప్పా..ఏమీ మిగ‌లలేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. చాలాకాలంగా పార్టీని న‌మ్ముకున్న వారిలో కూడా చంద్ర‌బాబు ప‌లుచ‌న‌య్యార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. స‌ర‌యిన అంచ‌నాలు లేకుండా చేసిన ప్ర‌చార విన్యాసాల మూలంగా కోరిక నెర‌వేర‌కుండానే అభాసుపాలు కావాల్సి వ‌చ్చిందంటున్నారు. దాంతో చంద్ర‌బాబు అంచ‌నాలు, అస‌లు వాస్త‌వాలు వేరు వేరుగా ఉన్నాయ‌న్న విష‌యాన్ని గ్ర‌హించాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేని చిన‌బాబు ఆదేశాల‌తో అన‌వ‌స‌ర‌పు దూకుడు ప్ర‌ద‌ర్శించినా ఇప్పుడు చేతులు కాల్చుకోవ‌డం త‌ప్ప ఒరింగిందేమీ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆపార్టీలోని ప‌లువురు నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. చంద్ర‌బాబుకి ఇప్ప‌టికైనా క‌నివిప్పు క‌ల‌గాల‌ని కోరుకుంటున్నారు. ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే పెద్ద దెబ్బ త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ,చూద్దాం..చంద్ర‌బాబులో ఈ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎంత‌మేర‌కు మార్పును తీసుకొస్తాయో..

  http://telugu.updateap.com/?q=latest/2127

 4. Veera

  జోక్ అఫ్ ది డే !!!
  4 వ అభ్యర్ధి ని పెట్టి అనైతిక రాజకీయాలు చేయవద్దు మనం అని బాబు చెప్పారు -భూమా

  • Adnan

   Please give clarity. which babu said it, Chandra babu, Lokesh babu or Devansh babu?

   Anything can possible in that family..

 5. Veera

  నేను అమ్ముడు పోలేదు, అలా అయితే YCP లో చేరినప్పుడు జగన్ నన్ను ఎంతకు కొన్నాడు? జోకుల నెహ్రూ
  అయ్యా YCP లో చేరిన రోజున మీరు రెండు సార్లు ఓడిపోయిన మాజీ MLA మాత్రమే, పైగా ఆ రోజున జగన్ ప్రతిపక్షం లో ఉన్నాడు, మీ లాంటి ఓడిపోయిన MLA ను కొని ప్రతిపక్షం లో ఉన్న జగన్ అధికారం లోకి ఏమైనా వస్తాడా?

  పైగా మీరే ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు నేను అడగలేదు కాని బాబు నాకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పాడు , ఇది చాలదా?

 6. Veera

  జగన్ మగాడురా పప్పూ అన్న నిప్పు !!!
  http://www.muchata.com/main-news/sunandareddy-she-is-jagans-second-or-dummy-candidate-for-rajyasabha-elections/

 7. Veera

  బాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా విజయ సాయి రెడ్డి గారి విజయాన్ని అడ్డుకోలేకపోయాడు. విజయ సాయి రెడ్డి గారి రాజ్యసభ ఎంపిక ఇక లాంచానమే !!!

 8. Veera

  దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే !!! నక్కకు చుక్కలు చూపిన జగన్
  http://www.muchata.com/main-news/that-is-why-chandrababu-went-back/

 9. Veera

  మనోడు కదా అని ఎంత భజన చేసినా TV5 నాయుడు, NTV చౌదరి, TV9 రవి ప్రకాష్ చౌదరి, ABN రాదక్రిష్ణ చౌదరి, ఈనాడు రామోజీ లకు రాజ్యసభ ఇవ్వకుండా షాక్ ఇచ్చిన బాబు
  http://www.muchata.com/main-news/chandrababu-mark-shock-to-telugu-media-tycoons/

 10. Adnan

  He did not thank Modi for giving him RS MP seat, nor did he thank Rajastan CM.

  But he is Thanking Tenali batch NAIDU for giving chance to Prabhu

  Thats 1Kaya

 11. Veera

  వోటుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడి 5 వేల కోట్లు ఇచ్చి పార్టీని కూడా తాకట్టు పెట్టి బయట పడ్డ నిప్పు ను నేను, అవునా కాదా తమ్ముళ్ళూ మీరే చెప్పండి ???
  ఆ విధంగా ‘విలువ’ లతో కూడిన రాజకీయాలు చేస్తున్నాను అవునా కాదా ?

 12. Veera

  Weekend comments !!!
  1.బాబు తనపై ఉన్న16 కేసుల్లో స్తే ఎత్తేయించుకొని న్యాయ విచారణకు సిద్దపడతాడా? KVP
  ఊరుకోండి సర్, అయన వోటుకు 5 కోట్లు ఇచ్చే నిప్పు !!!
  అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని కెసిఆర్ ఊరికే అన్నాడా !!!
  ఆయనది రెండు కాళ్ళ సిద్దాంతం మరి, అందుకే కేసులు గట్రా ఉండవు !!!

  2.కాపులకు YS ఏమి చేసాడు? బాబు
  రంగా ను అయితే చంపలేదు కదా???
  కోస్తాలో అన్ని పదవులు కాపులకే ఇస్తున్నాడు YS
  -2007 లో అప్పటి కాంగ్రెస్ MP రాయపాటి చౌదరి
  (మొన్న 2014 లో జగన్ కాపులకు 6 MP 32 MLA సీట్లు ఇచ్చాడు కానీ బాబు 2 MP 20 MLA సీట్లు ఇచ్చాడు)

  3.కాంగ్రెస్ వాళ్ళు రతనాల సీమ ను రాల్లసీమ గా మార్చారు-బాబు
  గత 35 సం లలో TDP 20 సం అధికారం లో ఉన్న విషయం మర్చిపోతే ఎలా?
  పైగా రాయలసీమ కు నీళ్ళు వెళ్ళకూడదనే కదా శ్రీశైలం లో నీటి మట్టం 856 అడుగుల నుంచి 832 అడుగులకు తగ్గించింది నీవే కదా బాబూ?
  కేంద్రం రాయలసీమ కు ఇచ్చిన AIIMS లాంటి సంస్థలు కూడా తీసుకెళ్ళి గుంటూర్ లో పెట్టింది నీవు కాదా బాబూ?
  పాపం ముని శాపం నిజం చెబితే తల వెయ్యి వక్కలని !!!

  4.పుట్టింటోళ్ళు తరిమేసారు, కట్టుకున్నోడు వదిలేసాడు !!!
  కర్ణాటక నుంచి తీవ్ర వ్యతిరేకత రావడము తో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెంకయ్య నాయుడు

  5.దేవుడా!!!
  లోకేష్ తొమ్మిదో తరగతి చదివే రోజులలోనే నాకు రాజకీయ సలహాలు ఇచ్చాడు
  -బాబు
  అయితే మనోడు ఒక ఐన్ స్టీన్, ఐజాక్ న్యూటన్, సచిన్ అన్నమాట!!!
  అందుకే సత్యం రామలింగరాజు సహాయం లేకుండా, GRE,TOAFL లేకుండానే స్తాన్ ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు సీటు ఇచ్చారన్నమాట !!!

  6.మనుమడు హైదరాబాద్ లో ఉన్నా, CM మాత్రం అమరావతిలోనే ఉండి త్యాగం చేస్తున్నారు-లోకేష్
  నా భార్య బిడ్డలు వ్యాపారం కోసం హైదరబాద్ లో ఉన్నారు-బాబు
  వోటుకు 5 కోట్ల కేసు కోసం కదా రాజా అమరావతి కి పారిపోయింది-పోసాని

  7.అవినీతి చేయను కాబట్టే హాయిగా నిద్రపోతున్నా- బాబు
  అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బాబు పాలసీ-కెసిఆర్
  పాలు పెరుగు అమ్మి వోటుకు 5 కోట్లు ఇచ్చే మీలాంటి ధర్మ ప్రభువులు ఇంకా ఉండబట్టే వర్షాలు బాగా పడుతున్నాయి రాజా-పోసాని

  8.వెంకటేశ్వర స్వామికి వైభవం పెరగడానికి తెలుగుదేశం పార్టీ నే కారణం, ఎక్కువ పాపాలు చేస్తున్న వాళ్లు ఎక్కువ డబ్బులు దేవుని హుండీలో వేస్తున్నారు-బాబు
  ఇదే మాటలు ఎవరైనా అని ఉంటె బాబు అను కుల మీడియా గుడ్డలూదదీసేది కాదా?

  ABN,TV9,NTV,TV5,ETV…చర్చలు పెట్టి హిందువుల ద్రోహి అనేవాళ్ళు కారా?
  కులపోడు ఏమి చెప్పినా కమ్మగా ఉంటుందప్పా !!!

  Request-No bad comments please !!!

 13. Veera

  బాబు తనపై ఉన్న16 కేసుల్లో స్తే ఎత్తేయించుకొని న్యాయ విచారణకు సిద్దపడతాడా? KVP
  ఊరుకోండి సర్, అయన వోటుకు 5 కోట్లు ఇచ్చే నిప్పు !!!
  అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని కెసిఆర్ ఊరికే అన్నాడా?
  ఆయనది రెండు కాళ్ళ సిద్దాంతం మరి, అందుకే కేసులు గట్రా ఉండవు !!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s