రెండు రాష్ట్రాలు.. రెండేళ్లు!

Key Points:
పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిశ్చింతగా ఉంటే, కోరి లేఖ ఇచ్చి మరీ విభజనకు గురైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిరంతరం సమస్యలే. తెలంగాణలో విపక్షం మరగుజ్జుగా మారి, మీడియా విధేయతతో కేసీఆర్ వెలిగిపోతుంటే, ఏపిలో బలమైన ప్రతిపక్షంతోపాటు మీడియా చైతన్యంతో బాబు నలిగిపోతున్నారు.

నిజానికి బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనలో మార్పు వస్తుందని భావించారు. కానీ, ఆయన వ్యవహారశైలి ఏమాత్రం మారలేదని బాబు చేస్తున్న వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఈ రెండేళ్లలో పరిపాలన కంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కావలసినంత మెజారిటీ ఉంది. అయినా ఎందుకు వెంపర్లాడుతున్నారో తెలియదు. దీన్నిబట్టి, బాబు ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలు నిజమవుతున్నాయి.

రెండేళ్ల క్రితం అద్భుత అమరావతిని ఆవిష్కరించినందున, జనం ఇంకా ఆ భ్రమల్లోనే ఉన్నారు. ఈ రెండేళ్లలో అక్కడ కనీసం ఇటుక కూడా పేర్చలేదు. ఆ అవకాశం, సదుపాయం కూడా లేదు. ఆ విషయానే్న నిజాయితీగా ప్రజలకు చెప్పి, ఉన్న వెలగపూడినే వెలిగించి, వాస్తవాలు చెబితే ప్రజలు ఆయన నిజాయితీని మెచ్చుకుంటారు. అలాకాకుండా, ఇంకా అమరావతి చుట్టూ అందమైన కల్పనలు అల్లితే జనం నమ్మే పరిస్థితిలో లేరు.

ఈ రెండేళ్లలో ఆయన ఎవరిలోనూ విశ్వసనీయత పెంచుకోలేకపోయారు. తన కోసం పనిచేసిన వారిని కాకుండా, కృత్రిమ ప్రేమతో వచ్చిన వారిని, సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేసే పనిలో ఉన్నారు.

ఇటీవల ఒక డిజి స్థాయి అధికారిని లూప్‌లైన్‌లో పంపిస్తున్నారని తెలిసి, సదరు అధికారి తనపై అధికారిని కలిశారట. తనకు లూప్‌లైన్ పోస్టింగ్ ఇచ్చినట్టయితే, డీఎస్పీ పోస్టింగులలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎంతమందికి పోస్టింగులిచ్చారో బయటపెడతానని హెచ్చరించారట. దానితో ఆయనకు ప్రాధాన్యం ఉన్న పోస్టింగు దక్కింది. బాబు తొమ్మిదేళ్ల కాలంలో కూడా లేనంత కుల వాసన ఈ రెండేళ్లలో ముక్కుపుటాలదిరిస్తోందన్న భావన అందరిలోనూ ఉంది.

కేసీఆర్ డబుల్‌బెడ్‌రూము, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల హామీ నెరవేరినంత వరకూ ఆయన సర్కారుకు వచ్చిన ఢోకా లేదు. ప్రతిపక్షాల బలహీనత, సరైన నేత లేకపోవడం కూడా ఆయనకు వరమే. డబుల్‌బెడ్‌రూముల దరఖాస్తులు లక్షల్లో పేరుకుపోయాయి. మూడెకరాల భూమి అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. మరి భూములెక్కడ నుంచి తెస్తారో చూడాలి. విపక్షాలెంత అచేతనంగా ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం నిత్య చైతన్యంగానే ఉంటుంది. ఎన్టీఆర్ వంటి జనాకర్షక నేత ఎన్ని పథకాలు చేపట్టినా ఓటమి తప్పలేదు. బిజెపి కేవలం రెండు సీట్ల నుంచే అధికారంలోకి వచ్చింది. ఈ విషయం బాగా తెలిసిన కేసీఆర్, అందుకు అనుగుణంగా పనిచేస్తే, ఆయన కత్తికి ఎదురుండదు.

http://www.andhrabhoomi.net/content/pencorner

మనదీ అనే మనోభావనేదీ?
-జ్యోతి/ABN MD రాదక్రిష్ణ చౌదరి వ్యాసం నుంచి కొన్ని పాయింట్లు
ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో అధికార యంత్రాంగం కిందినుంచి పైస్థాయి వరకు ముఖ్యమంత్రి కనుసైగల మేరకు నడుచుకుంటూ ఉండగా ఏపీలో మాత్రం కులాలు, పార్టీలవారీగా విడిపోయింది. ఏపీలో మాత్రం ప్రజలు కులాలవారీగా చీలిపోయారు.ఏపీ అభివృద్ధికి అతిపెద్ద అవరోధం అక్కడ కనిపించే కులతత్వమే!

పాలనపై పట్టు బిగించకపోవడంతో రాష్ట్రంలో అవినీతి పెరిగిందన్న భావన ఏర్పడింది
అయితే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావలా పనిచేసి ముప్పావలా ప్రచారం పొందేవారు.

కారణాలు తెలియదుగానీ చంద్రబాబుకు ఐఏఎస్‌ అధికారులకు మధ్య అంతరం ఏర్పడింది. ముఖ్యమంత్రి ఏమి ఆశిస్తున్నారో అధికారులకు తెలియడం లేదు. అధికారులు ఏమి అనుకుంటున్నారో ముఖ్యమంత్రికి తెలియదు. ఈ కారణంగా ఉభయపక్షాల మధ్య అంతరం పెరుగుతోంది.

తెలంగాణతో పోల్చితే ఏపీలో ప్రతిపక్షం బలంగా ఉంది.

ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రెండేళ్లు గడిచినా ఫలానా ప్రాజెక్టు పూర్తయిందనిగానీ, ఫలానా పరిశ్రమ వచ్చిందనిగానీ చెప్పలేని పరిస్థితి! విశాఖపట్టణంలో ఐటీ పరిశ్రమల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

రాజధాని నిర్మాణంలో కూడా ముందడుగు పడవలసి ఉంది. తరచుగా అమరావతి నిర్మాణం గురించి చెప్పడం వల్ల అక్కడి ప్రజలలో అంచనాలు పెరుగుతుండగా, ఇతర ప్రాంతాల ప్రజలేమో ముఖ్యమంత్రి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని భావించే పరిస్థితికి వస్తున్నారు. ప్రాంతాలు, కులాల మధ్య సమతౌల్యం సాధించవలసిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్కడి ప్రజలలో నమ్మకం పెరగగా, ఏపీలో చంద్రబాబుపై అక్కడి ప్రజలలో నమ్మకం పెరగలేదు. అదే సమయంలో సడలలేదు కూడా.

9 Comments

Filed under Uncategorized

9 responses to “రెండు రాష్ట్రాలు.. రెండేళ్లు!

  1. Expose these unethical dacoits to the rest of the world using Social media.
    It is 95% Public Vs 5% caste fanatics in AP.
    Telangana people have already kicked out this weed and why can’t people from AP do the same ? This is because the yellow media is fooling them.

    http://www.sakshi.com/news/district/chandra-babu-and-nara-lokesh-doing-corru-tion-ruling-in-andhra-pradesh-349638?pfrom=home-top-story

  2. Thandri anakonda …..Koduku Kondavhiluva – Roja
    Neethimalina Jathi ….Siggumalina brathukulu

    http://www.sakshi.com/video/news/ysrcp-mla-roja-slams-chandrababu-naidu-lokesh-54272?pfrom=home-top-videos

  3. Veera

    TV9 రవి ప్రకాష్ చౌదరి,TV5 రావిపాటి విజయ్ చౌదరి(ఉదయం న్యూస్ స్కాన్) , రాత్రి 8 గంటలకు TV5లొ సాంబశివరావు చౌదరి, రాత్రి 11.30 కి ప్రసారం అయ్యే TV5 ప్రవాస భారత్ లో సుబ్బారావు చౌదరి(CSR ),ABN రాదక్రిష్ణ చౌదరి, MahaTV వెంకట్ రావు చౌదరి లాగా బాబు భజన చేయకుండా TV షో లో కొంచెం నిజాలు చెప్పగానే బాబు కు కోపం వచ్చి NTV నరేంద్ర చౌదరి కి చెప్పి కొమ్మినేని శ్రీనివాస్ రావు చౌదరి (KSR) ని తీసేయించారు,మరి ఆయన అసలే నిప్పు కదా !!!

    కొమ్మినేని స్థానంలో NTV లో రిషి చౌదరి వచ్చారు ఇంక పండుగ చేస్కొండి బాబూ !!!
    ఇక అంత మన భజనే కదా అలా కానీండి !!!

    [ఎన్.టి.వి నుంచి వైదొలిగా – కొమ్మినేని
    ఇంతకాలం ఎన్.టి.విలో ఛీఫ్ ఎడిటర్ గా, గౌరవ ఛీఫ్ ఎడిటర్ గా బాద్యతలు నిర్వహించిన నేను సంస్థ నుంచి వైదొలిగాను .ప్రతి రోజు కె ఎస్ ఆర్ లైవ్ షో ను నిర్వహించడం ద్వారా లక్షలాది మంది ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశం వచ్చింది.ఆ షో నుంచి విరమించడానికి కారణాలను ఇంతకుముందే వివరించడం జరిగింది.దురదృష్టవశాత్తు ప్రభువులలో ప్రజాస్వామ్య స్పూర్తి కొరవడింది.భిన్నాభిప్రాయాలకు అవకాశం లేని విదంగా పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొంతకాలం వేచి చూడాలని అనుకున్నప్పట్టికీ జరిగిన కొన్ని పరిణామాలలో ఆత్మగౌరవమే ముఖ్యమని భావించి బయటకు వచ్చేశాను.ఏడేళ్లపాటు ఎన్.టి.విలో పనిచేసే అవకాశం ఇచ్చినందుకు , యాజమాన్యం నన్ను గౌరవంగా చూసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.ఎన్.టి.వి సంస్థ, యాజమాన్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ వారికి శుబాకాంక్షలు తెలియచేస్తున్నాను.

    కొమ్మినేని శ్రీనివాసరావు

    http://kommineni.info/articles/dailyarticles/content_20160607_28.php?p=1465298763660 ]

  4. Desam lo aa Rajakeeya Nayakudu cheyani alupergani Praja poratam chesthu ……Thandriki minchina Thanyaudu ga Kotla mandhi neerajanam andhukuntunna …..Oke Okkadu….JAGAN
    AC room lo kurchoni Siggumalina rajakeeyalu chesthu …Thandriki minchina Donga ani peru sampandhinchuktunna …China Babu
    Brathikina nalugu rojulanna Nijayatheega brathakatam chethkadhu ee Gajji / Gaja dongalaki . Chee kondhari brathukulu.

  5. Veera

    బాబు హయాంలోనే మూడు నుంచి ఐదో స్థానానికి పడి పోయిన IT ఉత్పత్తులు
    2004 లో బాబు CM గా దిగిపోయేనాటికీ భారత్ IT రంగం లో బెంగళూరు 38% వాటా, తమిళనాడు 14%, ఢిల్లీ 14%, బాంబే- పూణే 16% అయితే ఆంధ్రప్రదేశ్ 8 % మాత్రమే.

    ప్రపంచానికే IT నేర్పించానని చెప్పుకునే చంద్రబాబు CM అయినప్పుడు మూడో స్థానంలో ఉన్న ఏపీ, సీఎంగా దిగిపోయే నాటికి ఐదో స్థానానికి పడిపోయిన విషయం వాస్తవం కాదా? ఐటీ రంగ వాటాలో 8 శాతం ఉన్న ఏపీ ప్రపంచానికే ఐటీ నేర్పించామని చెప్పుకుంటే 38 శాతం ఉన్న బెంగళూరు వాళ్లు ఏమని చెప్పుకోవాలి?

    -బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి , పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్

  6. Veera

    అది నోరా !!!
    సత్య నాదెళ్ళ-మైక్రోసాఫ్ట్ CEO నన్ను చూసి స్పూర్తి పొంది IT లో చేరారు లేకపోతె IAS కు వెళ్ళేవారు అని నా దగ్గర పనిచేసిన వాళ్ళ నాన్న , IAS అధికారి అయిన యుగంధర్ నాకు ఫోన్ చేసి చెప్పారు -బాబు
    (మరి కన్న కొడుకు లోకేష్ మాత్రం ఎందుకు స్పూర్తి పొందలేదు రాజా? పోసాని)

    సత్య నాదెళ్ల అమెరికా లో 1992లోనే మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయ్యారు
    సత్య నాదెళ్ళ తండ్రి యుగందర్, IAS 1986-88 లో APలో పని చేసారు
    బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి CM అయ్యింది 1995 లో

    ముని శాపం నిజం చెబితే తల వెయ్యి వక్కలు అని , పాపం అయన మాత్రం ఏమి చేస్తాడు?

    Request-No bad comments please !!!

    http://kommineni.info/articles/dailyarticles/content_20160606_23.php?p=1465214310532

  7. Veera

    నా కులం పేద కులం-బాబు
    అవునండయ్యా , అందుకే 6 పద్మ అవార్డుల్లో 5 బాబు కులస్తులకే వచ్చాయి, 14 MLC పదువుల్లో 7 మంది బాబు కులస్తులే, అలాగే కీలక ప్రభుత నియామకాల్లో 80% బాబు కులస్తులే.
    మరి పేదవారు కదా ప్రభుత్వం నుంచి ఆ మాత్రం సహాయం అవసరమే బాబు గారూ !!!

    [రెండు రాష్ట్రాలు.. రెండేళ్లు! ఆంధ్రభూమి వ్యాసం నుంచి, June 5
    ఈ రెండేళ్లలో బాబు ఎవరిలోనూ విశ్వసనీయత పెంచుకోలేకపోయారు. తన కోసం పనిచేసిన వారిని కాకుండా, కృత్రిమ ప్రేమతో వచ్చిన వారిని, సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేసే పనిలో ఉన్నారు.

    ఇటీవల ఒక డిజి స్థాయి అధికారిని లూప్‌లైన్‌లో పంపిస్తున్నారని తెలిసి, సదరు అధికారి తనపై అధికారిని కలిశారట. తనకు లూప్‌లైన్ పోస్టింగ్ ఇచ్చినట్టయితే, డీఎస్పీ పోస్టింగులలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎంతమందికి పోస్టింగులిచ్చారో బయటపెడతానని హెచ్చరించారట.
    దానితో ఆయనకు ప్రాధాన్యం ఉన్న పోస్టింగు దక్కింది.

    బాబు తొమ్మిదేళ్ల కాలంలో కూడా లేనంత కుల వాసన ఈ రెండేళ్లలో ముక్కుపుటాలదిరిస్తోందన్న భావన అందరిలోనూ ఉంది]

    మీరు నిరు పేదల కోసం నిరంతరం పోరాడుతారు సర్ , ఆ విధంగా ముందుకు పోతున్నారు !!!

  8. Veera

    నన్ను ఆశీర్వదించండి నాన్న
    విజయీ భవ .. ఇంటర్వ్యూ కు వెళుతున్నా వా బాబూ
    కాదు నాన్నా ఓ పెగ్గు వేసి పేకాడ దామని వెళుతున్నా
    -Murali Buddha

    • Veera

      ఎరా అబ్బాయి ఏం చేస్తున్నావ్ ?
      ఒక పెగ్గు మందు కొడుతున్నా , పేకాడుతున్నా
      వేరి గుడ్ .. ఏమైనా చెయ్ పరవాలేదు .. గుడికి మాత్రం వెళ్ళకు పాపాత్ముడు అనుకుంటారు .-Murali Buddha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s