ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. దాంతోనే చంద్రబాబుకి బెంగ పట్టుకుంది. ఇప్పటికే విపక్ష ఎమ్మెల్యేలు 19మందిని బాహాటంగా కొనుగోలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా ఆయన మనసు స్థిమిత పడినట్టుగా లేదు. దాంతో చివరకు మీడియా ప్రసారాలను కూడా సహించలేక చిర్రుబుర్రులాడుతున్నారు. ఏకంగా కేబుల్ ప్రసారాలు నిలుపివేసి ఆనంద పడుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమం నేపథ్యంలో పరిణామాలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎక్కడికి దారితీస్తాయోనన్న బెంగ కలిగిస్తున్నాయి. అంతే ఆయన అణచివేత అస్త్రాన్ని తీస్తున్నారు. ముద్రగడ అరెస్ట్ సందర్భంగా ఉద్యమ నాయకుడి బంధువులపై పోలీసులు లాఠీ ఝుళిపించిన తీరు దానికి సాక్ష్యంగా కనిపిస్తోంది.
మీడియా విషయంలో చంద్రబాబు వైఖరి కాస్త సానుకూలంగా ఉంటుందన్నది సాదారణంగా ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయిన తర్వాత ఎన్టీవీని బ్యాన్ చేసి మారిన బుద్ధి బయటపెట్టుకున్నారు. ఆతర్వాత నెంబర్ వన్ న్యూస్ దాదాపు కనిపించకుండా చేసేశారు. ఇప్పుడు తాజాగా సాక్షి సహా పలు చానెళ్ల ప్రసారాలు నిలిపివేయడం ప్రభుత్వం తీరును చాటుతోంది. ప్రసార సాధనాలను నియంత్రించాలని చూడడం నియంతృత్వానికి తొలి మెట్టు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం అందులో భాగమే అని అర్థమవుతోందని పలువురు మీడియా ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగిన సమయంలో కూడా ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి న్యూస్ చానెళ్లు నిలిపి వేసిన ఘటనలు లేవు. కానీ ఇప్పుడు ముద్రగడ ఉద్యమానికే చంద్రబాబు వణికిపోవాల్సిన అవసరం లేనప్పటికీ ఆయన అతిగా స్పందించినట్టు కనిపిస్తోంది. అయితే మీడియాను నిలిపివేసి ఏ ప్రభుత్వమైనా సాధించగలిగేదేమీ ఉండదన్న సత్యాన్ని విస్మరించి ప్రభుత్వం సాగడమే విచిత్రంగా ఉంది. రెండు రోజుల్లో సాక్షిని స్వాధీనం చేసుకుంటున్నామంటూ ప్రకటించిన పెద్దలే..అంతలోనే ఆ చానెల్ ను నిలిపివేయడం మరో విడ్డూరంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఒత్తిడితో కొన్ని చోట్ల చానెల్ ప్రసారాలు నిలిపివేసినప్పటికీ దిగువన ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అనేక చోట్ల కేబుల్ ప్రసారాల పునరుద్దరణ జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కేబుల్ ఆపరేటర్లను నిలదీయడంతో బాబు ప్లాన్ రివర్స్ అవుతోంది. సాక్షి సహా న్యూస్ చానెళ్లకు వేయాలనుకున్న బంధనాలు తెగిపోతున్నాయి. తద్వారా కూడా ప్రభుత్వం మరింత పలుచనవుతున్నట్టు స్పష్టమవుతోంది.
Murali Mohan (https://www.facebook.com/ilapavuluri.murali)
నా కోస్తాంద్ర పర్యటన – 1 (June 8)
గత వారం మొత్తం కోస్తా, ఉత్తరాన్ద్రాలలో గడిపాను. పర్యటన మొత్తం ఆహ్లాదకరం గా సాగిపోయింది. ప్రధానంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలలో తిరిగాను. విజయవాడ, ద్వారకా తిరుమల, ఏలూరు, అన్నవరం, విశాఖ, సింహాచలం, అనంతగిరి, స్రుంగవరపుకోట, కొత్తవలస, బొర్రా గుహలు, అరకు, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, కోటిపల్లి, కాకినాడ, అమలాపురం, ఉండి, రాజోలు, సఖినేటి పల్లి, అంతర్వేది, పాలకొల్లు, భీమవరం, ప్రాంతాలు చుట్టేసాను. దాదాపు 50 చోట్ల ఆగాను.
ఎక్కడికి వెళ్ళినా, అక్కడి రాజకీయ పరిస్థితి, ప్రజల స్థితిగతులు, ఆ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ పరిపాలన, రాజకీయ నాయకులను గూర్చి జనం ఏమి అనుకుంటున్నారు లాంటి విశేషాలు తెలుసుకోవడం నాకున్న అలవాటు.
ఈ అలవాటులో భాగం గా ఎక్కడ బడితే అక్కడ ఆగడం, కాఫీలు తాగడం, తాగుతూ అక్కడ కూర్చున్నవారు ఏమి అనుకుంటున్నారు, ఎవరి గూర్చి మాట్లాడుకుంటున్నారు, లాంటి వి వింటాను. ఆ తరువాత అవసరం అనుకుంటే వారితో కాజువల్ గా ముచ్చట పెట్టడం, విషయాలు సేకరించడం నా పధ్ధతి. కావాలని వివరాలు అడిగినట్లు అడగను. అప్పుడు మనకు సరైన జవాబులు రావు.
మనం అడిగేవారిని కూడా నేను ప్రత్యెక పధ్ధతి లో ఎంచుకుంటాను. బాగా ఉన్నవాళ్ళు, ఫెళ ఫెళ లాడే బట్టలు వేసుకునేవారు, ఉన్నత తరగతి కి చెందిన వారు, హైక్లాస్ మనుషులను అడిగితే ప్రయోజనం ఉండదు, వారికి అనేక మొగమాటాలు, అనుమానాలు ఉంటాయి. కింది తరగతి వారిని, కూలిపనులు చేసుకునే వారు, పేదవారిని అడిగితేనే మనకు వాస్తవాలు తెలుస్తాయి.
నేను ప్రధానంగా అడిగిన ప్రశ్నలు;
ప్రభుత్వం ఎలా పని చేస్తున్నది?
పరిపాలన ఎలా ఉన్నది?
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా?
అంతే…ఎ ఒక వ్యక్తీ గూర్చి నేను ప్రశ్నించలేదు.
ఈ ప్రశ్నలకు జవాబులు ఎలా వచ్చాయో రేపటినుంచి తెలుసుకుందాము.
అరకు పద్మాపురం గార్డెన్స్
నా కోస్తాంధ్ర పర్యటన – 2 ( june 9)
(ఇదేమీ సర్వే కాదు. నేను అడిగిన యాభై, వంద మంది అభిప్రాయాలు రాష్ట్రం మొత్తం అభిప్రాయలు కాదు. కనుక దీన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దు. భజన పత్రికలూ, భజన చానెల్స్ లో వచ్చే వార్తలని నమ్మే వారు ఈ వ్యాసాన్ని చదవక పోవడం ఉత్తమం )
@@@
అరకు ను ఆంద్ర ఊటీ అంటారని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను. కానీ ఇంతవరకు చూడటానికి కుదరలేదు. తొలిసారిగా గత వారం వెళ్లాను. నేను గతం లో ఊటీ, కోడై కెనాల్ చూసాను. నేను ఆ స్థాయి లో అరకు ను ఊహించుకున్నాను. తీరా అక్కడకు వెళ్తే తీరా అక్కడికి వెళ్లి చూస్తె అరకు కన్నా కోనసీమ ప్రాంతం లక్ష రెట్లు మెరుగు అనిపించింది. ఎండ మండి పోతున్నది. అసలు మేము వెళ్ళింది అరకేనా కాదా అని అనుమానం వచ్చి బస్టాండ్ దగ్గర ఆగాము. అక్కడ ఒక మెడికల్ షాప్ కనిపించింది. లోపల 30 ఏళ్ల వయసుగల వ్యక్తీ కూర్చున్నాడు. బయట లుంగీ కట్టుకున్న మరో 60 ఏళ్ల వ్యక్తీ అతడితో మాట్లాడుతున్నాడు.
” అరకు ఇదేనా? ఇక్కడ ప్రక్రుతి చాలా అందంగా ఉంటుందని, చల్లగా ఉంటుందని, కాఫీ తోటలు ఉంటాయని విన్నాను. కానీ ఇక్కడ ఎండ హైదరాబాద్ కంటే ఘోరంగా ఉంది.” అన్నాను.
అరకు ఇదేనండి. ఇక్కడేమి ఉండదు చూడటానికి. ఈ పక్కనే ఒక మ్యూజియం, కొంచెం దూరం లో ఒక పార్క్ ఉన్నాయి. మీరు వచ్చిన దారిలోనే ఒక వ్యూ పాయింట్ ఉన్నది. అక్కడ నుంచి చూస్తె మీకు లోయ కనిపిస్తుంది” అని చెప్పాడు ఆతను.
మాకు తీవ్ర నిరాశ కలిగింది. “కాఫీ తోటలు ఎక్కడున్నాయి?” అడిగాను. “ఇక్కడికి 70 కిలో మీటర్లు పాడేరు వెళ్తే ఉన్నాయి” చెప్పాడు ఆతను. మాకు నీరసం వచ్చింది.
“ఇక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి? చంద్రబాబు పాలన ఎలా ఉంది? ” అడిగాను. షాపులో ఉన్న వ్యక్తీ అందుకున్నాడు. “బాగుందండి. చంద్రబాబు బాగానే చేస్తున్నాడు. కేసియర్ మా సంపదను అనుభవిస్తున్నాడు. పుష్కలంగా మా డబ్బు ఉండటం తో దర్జాగా అనుభవిస్తున్నాడు.” చెప్పాడు. వెంటనే షాపు బయట ఉన్న పెద్దాయన మాట్లాడుతూ ” నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. గత రెండు ఏళ్లుగా ఉన్న ఎండ నా జీవితం లో చూడలేదు. హుడుద్ తుపాను తో అరకు మొత్తం నాశనం అయింది. పట్టించుకున్న నాధుడు లేదు. ఇక్కడ అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు. గుంటూర్, కృష్ణా లకే పరిమితం అయ్యాడు చంద్రబాబు. టూరిస్టులు కూడా బాగా తగ్గిపోయారు. ఒకసారి ఆ పార్క్ కు వెళ్లి చూడండి” అన్నాడు. అతని మాటలలో వ్యంగ్యం ధ్వనించింది.
అక్కడకు దగ్గరలో ఉన్న పద్మాపురం గార్డెన్స్ కు వెళ్ళాము. దాన్ని పార్క్ అనేకంటే స్మశానం అనడం నయం అనిపించింది.
తిరిగి వస్తుండగా శృంగవరపు కోట లో ఒక సంత కనిపిస్తే ఆగాము. అక్కడ పంచాయితీ ఆఫీసు దగ్గర 40-50 మంది రైతులు కనిపించి ఆఫీస్ లో ఉన్న ఉద్యోగి తో పోట్లాడుతున్నారు. దూరంగా నిలుచున్న రైతులు ఇద్దరినీ పలకరించాను. వారిని రుణమాఫీ గూర్చి అడిగాను. తనకు లక్ష కు పైగా బాంక్ అప్పు ఉన్నదని, నాలుగు వేలు మాత్రం మాఫీ అయిందని, మళ్ళీ వచ్చే నెలలో అవుతుందని చెప్తున్నారు అన్నాడు అతను. చంద్రబాబు వాగ్దానం చేసినట్లుగా మాఫీ జరగలేదని చెప్పాడు.
” అసలు ఎవరైనా ఎమ్మెల్యే ఇటు వస్తేగా మేము ఏదైనా చెప్పుకోవడానికి? చంద్రబాబు కు రాజధాని తప్ప మరో విషయమే పట్టడం లేదు. నీటి కోసం రోజు ఆడవాళ్ళు కొట్టుకున్నంత పని అవుతున్నది. చాలా ఇబ్బందిగా ఉన్నది.” అన్నాడు మరో రైతు.
మొత్తానికి ఇక్కడి పరిస్థితి ఎలా ఉంది? అని అడిగాను. “ఇక్కడి ఎమ్మెల్యే లలితా కుమారి. మొన్నటి దాకా ఇక్కడ ఎక్కువమంది మొగ్గు తెలుగుదేశం వైపే ఉంది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గుతున్నది.50:50” అన్నాడు అతను.
(వైజాగ్ లో కొందరి అభిప్రాయాలు రేపు)
నా కోస్తాంధ్ర పర్యటన – 3
(ఇదేమీ సర్వే కాదు. నేను అడిగిన యాభై, వంద మంది అభిప్రాయాలు రాష్ట్రం మొత్తం అభిప్రాయలు కాదు. కనుక దీన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవద్దు. భజన పత్రికలూ, భజన చానెల్స్ లో వచ్చే వార్తలని నమ్మే వారు ఈ వ్యాసాన్ని చదవక పోవడం ఉత్తమం. ఇది ఎ పార్టీకి అనుకూలం కాదు.వ్యతిరేకం కాదు. తటస్థం మాత్రమే. )
@@@
నా జీవితం లో విశాఖ వెళ్ళడం ఇదే తొలిసారి. ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా లలోని 23 జిల్లాలు తిరిగాను. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల లో చాల నగరాలు చూసాను. నేను చూసినంతవరకూ అన్ని నగరాలలోకేల్లా విశాఖ పట్నం అత్యంత సుందరమైన నగరం. విశాలమైన రోడ్లు, తక్కువ ట్రాఫిక్, చూడ తగిన అనేక ప్రదేశాలు, సముద్రం, బీచ్ లు, పది కిలో మీటర్ల లోపే సింహాచలం, పోర్ట్, చూస్తుంటే అప్పుడు విశాఖ లో ఉన్నామా, లేక విదేశాల్లో ఉన్నామా అన్నంత అనుభూతి కలిగింది. ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, తెన్నేటి పార్క్ బీచ్ దగ్గర ఎంతసేపు కూర్చున్నా తనివి తీరదు. సాయంత్రం 7.30 కె రోడ్లు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి దాదాపు. అయితే, ఇష్టం వచ్చినట్లు తినడానికి రోడ్ల మీద ఎలాంటి టిఫిన్స్ అమ్మేవారు లేరు. లాడ్జీలలో రూం రెంట్స్ మాత్రం చాల ఎక్కువ.
మేము పాత జైలు రోడ్డు లో గల ఒక హోటల్ లో బస చేసాము. రిసిప్షన్ దగ్గర నలుగురు సిబ్బంది ఉన్నారు. ఇద్దరు ఒరిస్సా వాళ్ళు, ఇద్దరు లోకల్. అందరూ ఈనాడు, జ్యోతి, ప్రభ పేపర్స్ చదువుతున్నారు. ఉదయం వేళ వారిని అడిగాను అక్కడి రాజకీయాలు, అభివృద్ధి గూర్చి. అడగటమే ఆలస్యం, ఇద్దరు కుర్రాళ్ళు రెచ్చి పోయారు.
“అభివృద్ధా? ఎక్కడండీ, లేచినప్పటి నుంచి రాజధాని, అమరావతి తప్ప మరో మాట ఉన్నదా? రాజధాని అంటే ఏముందండి? అసెంబ్లీ, కోర్టు, సచివాలయం, కొన్ని ఆఫీసులు, కొన్ని ఇల్లు…. ఇంతేగా…ఈ మాత్రం దానికి అసలు ఇంత హంగామా ఏమిటి? రెండు ఏళ్ళు అయింది… ఇంతవరకు ఒక్క గోడ కట్టారా? ఇంకో వందేళ్ళు దాటినా అసలు అయ్యేట్లు కనపడటం లేదు. 2014 లో విశాఖ జిల్లా మొత్తం తెలుగుదేశం వైపు ఓట్లు వేసారు. ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు చంద్రబాబు కు ఎందుకు ఓట్లు వేసామా అని బాధపడుతున్నారు. తెలుగుదేశం కు అప్పుడు ఉన్న బలం లో ఇప్పుడు సగం కూడా లేదు. మరో రెండు ఏళ్ళు కూడా ఇలాగే జరిగితే 2019 లో ఒక్క సీటు కూడా తెలుగుదేశం కు రాదు” అన్నాడు.
రెండో కుర్రాడు మాట్లాడుతూ, ఎక్కడ బట్టినా లంచగొండి తనం విపరీతం అయింది. చిన్న లైసెన్స్ కు వెళ్ళినా, వేలల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఇక ఆటో వారి మీద పోలీసుల దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయి. విపరీతం గా చలాన్లు వేస్తున్నారు. ఒక్క మనిషి ఎక్కువ కూర్చుంటే వంద రూపాయలు ఫైన్ వేస్తున్నారు.” అన్నాడు.
సహజమే కదా… అందులో తప్పు ఏమింది? ఓవర్ లోడింగ్ నేరం” చెప్పాను నేను.
“నిజమే… కానీ పేదవారి పట్ల కొంత చూసీ చూడనట్లు వెళ్ళాలి. నాయకులు కొండలు సైతం పగలగొట్టి ప్లాట్లు చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. వారిని ఏమీ చెయ్యరు. టాక్సులు విపరీతం గా ఉన్నాయి. పాలన భయంకరంగా ఉన్నది. నివురుగప్పిన నిప్పులా ఉన్నది. ప్రభుత్వ విధానాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. మీ హైదరాబాద్ చాలా నయం. కెసిఆర్ పాలన బ్రహ్మాండంగా ఉంది. (ఆ రోజు తెలంగాణా అవతరణ దినం. ఈనాడు పేపర్ లో తెలంగాణా దినోత్సవం ఫుల్ పేజి యాడ్స్ వచ్చాయి). ఎ గొడవలు లేవు మీకు. ” అన్నాడు. అతను.
అదే రోజు అనుకుంటాను. ఈనాడు లో చంద్రబాబు ది సుదీర్ఘమైన ఇంటర్వ్యూ వచ్చింది. వాళ్ళు అప్పటికే దాన్ని చదివారు. అదంతా పచ్చి అబద్ధం అని, చంద్రబాబు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా వాస్తవం లేదు అని ముఖం మీద గుద్దినట్లు చెప్పారు కొందరు.
వారు చెప్పిన ఇతర విషయాల ప్రకారం రాజధాని నిర్మాణం పట్ల అక్కడి ప్రజలకు ఏమాత్రం ఆసక్తి లేదు. అసలు రాజధాని మన వ్యవహారం కాదు అన్నట్లు ఉన్నాయి వారి మాటలు. విశాఖను రాజధాని చేస్తారు అని ఆశించారు వారు. అమరావతి పెద్ద రాజధాని అయినా, అది కేవలం కొంతమంది స్వార్ధం కోసమే అక్కడ కడుతున్నారు అనేది వారి అభిప్రాయం.
ఇక బీజేపి హరిబాబు దేనికీ పనికిరాడు. అతను చంద్రబాబు కు నమ్మిన బంటు అని చెప్పాడు ఒక ఆటో అతను. బీజేపి పట్ల అక్కడి ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉన్నది. బహుసా వచ్చే ఎన్నికలలో ఇది ప్రతిఫలించ వచ్చు.
మొత్తం మీద క్లుప్తం గా చెప్పాలంటే… రాజకీయ అవినీతి, అధికారులలో అవినీతి, గతం లో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఉన్నది. రాజకీయ నాయకులు ఇష్టా రాజ్యం గా దోచుకుంటున్నారు. అధికారులు కూడా వారిని అడ్డుకోలేక పోతున్నారు. చంద్రబాబు కు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఏవిధమైన చర్యలూ వారి మీద తీసుకోలేక పోతున్నారు. 2004-2014 లో కూడా అవినీతి జరిగింది కానీ ఇప్పటి అంత దారుణంగా లేదు.
ఫైనల్ గా చెప్పాలంటే ప్రభుత్వం పట్ల విశాఖ జిల్లా వాసులు పూర్తీ అసంతృప్తి తో ఉన్నారు అనేది వాస్తవం. అయితే, వారు జగన్ వైపు అనుకూలంగా మారారా? కాంగ్రెస్ పట్ల మళ్ళీ జాలి చూపుతున్నారా అనేది చెప్పడం కష్టం. మరో ఏడాది ఆగితే కానే క్లియర్ పిక్చర్ తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని ఓల్డ్ మోడల్ కేమారాలలో ఉండే నెగటివ్ ఫిలిం తో పోల్చవచ్చు.
(రేపు గోదావరి జిల్లా వాసుల అభిప్రాయాలు)
నా కోస్తాంధ్ర పర్యటన – 4
@@@@
విశాఖ అందించిన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ తూర్పు గోదావరి లోకి ప్రవెశించాము. కాకినాడ, సామర్లకోట, దాక్షారామం, లో మధ్యలో మరి కొన్ని చిన్న గ్రామాలలో ఆగాము. కొందరు ఆలయం లోని భక్తులు, అక్కడ టీ కాఫీలు అమ్మేవారు, స్వీట్ షాపు లోని కొందరు వ్యాపారులతో మాట్లాడాను. అక్కడినుంచి అమలాపురం వెళ్లాలని మా ప్లాన్. “అక్కడినుంచి అమలాపురం వెళ్ళాలంటే యానాం మీదుగా రోడ్డు మార్గం లో వెళ్ళాలి, లేదంటే కోటిపల్లి నుంచి లాంచ్ లో గోదావరి దాటి వెళ్ళాలి” అని చెప్పారు అక్కడివారు.
లాంచ్ లో వెళ్తే యాభై కిలోమీటర్ల దూరం తగ్గుతుంది, గంట సమయం కలిసి వస్తుంది. అప్పటికే సాయంత్రం అయిదు గంటలు అయింది. లాంచ్ లో మేము వెళ్తాము సరే, మరి కారు ఎలా వెళ్తుంది? అడిగితె, కారును కూడా లాంచ్ లో తీసుకు వెళ్తారు అన్నారు వారు. ఇదేదో కొత్తగా ఉన్నది అనుకుని కోటిపల్లి వెళ్ళాము. అక్కడ రెండు లాంచీలు రెడీగా ఉన్నాయి. ఆశ్చర్యం!!! లంచ్ లో కార్లు, మోటార్ సైకిల్స్ కూడా ఎక్కిన్చుతున్నారు.!!!
గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. చార్జీ మనిషికి పదిహేను రూపాయలే…కారుకు డబ్బు తీసుకోలేదు. మొత్తం యాభై మంది మనుషులు, పాతిక వరకు టూ వీలర్స్, మూడు కార్లు ఎక్కించారు. రేవు దాటడానికి పది నిముషాలు పట్టింది. కొంతమంది ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు తో మాటలు కలిపాను.
సాయంత్రం ఏడు గంటలకు అమలాపురం చేరాము. మంచి లాడ్జ్ లో దిగాము. మరునాడు ఉదయం లాడ్జ్ దగ్గరే కాఫీ స్టాల్ కనిపించింది. అక్కడ దాదాపు పదిమంది కాఫీలు తాగుతూ కనిపించారు. ఆ స్టాల్ నిర్వాహకుడు తన పేరు …..రాజు అని చెప్పాడు. 40 ఏళ్ళు ఉంటాయి. అతడిని రాజకీయాల గూర్చి, అభివృద్ధి ని గూర్చి అడిగాను. అక్కడ కాఫీ తాగుతున్న మరికొందరు కూడా మాట్లాడారు. పైన చెప్పిన అందరి మాటలను విశ్లేషిస్తే :
1. ప. గో. జిల్లాలో రాజుల ప్రాబల్యం, తూ.గో.జిల్లా లో కాపుల ప్రాబల్యం ఎక్కువ.
2. రాజులు వైకాపా పట్ల 2014 కు పూర్వం విముఖం గా ఉన్నారు. బీజేపి పట్ల మొగ్గు ఉన్నది వారికి. ప్రస్తుతం వారు ఆలోచనలో పడ్డారు.
3. కాపులు 2014 కు పూర్వం వైకాపా వైపే మొగ్గు ఉన్నా, పవన్ కళ్యాన్ ప్రభావం తో తెలుగుదేశం కు మెజారిటీ వారు ఓట్లు వేసారు. కాపులను బీసీ లలో చేరుస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానం ప్రభావితులను చేసింది. కానీ కాపులకు ఏమాత్రం మేలు జరగడం లేదు అని వారు ఆగ్రహం తో ఉన్నారు. (అప్పటికి ముద్రగడ రగడ ఏమాత్రం లేదు అని గుర్తుంచుకోండి)
4. తెలుగుదేశం మోసం చేసిందని భావిస్తున్నారు.
5. ఒకప్పుడు 70 శాతం తెలుగుదేశం, 30 శాతం వైకాపా గా ఉన్న కాపులు ప్రస్తుతం 50:50 స్థితి లో ఉన్నారు. మరో ఏడాది చూసి వారు వైకాపా వైపు మళ్ళాలని చూస్తున్నారు.
6. జ్యోతుల నెహ్రు కాపు కులజుడే కానీ కాపు నాయకుడు కాదు. వారందరికీ ముద్రగడ మీదే నమ్మకం ఉన్నది. కులపోరు ఎక్కువైన ఈ తరుణం లో … వచ్చే ఎన్నికలలో ముద్రగడ ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. ఆయన ఎ పార్టీ వైపు చూస్తె, ఆ పార్టీ కి ఎక్కువ సీట్లు ఖాయం. అయితే ఇప్పుడే ఏమీ చెప్పలేము.
7. నిమ్మకాయల రాజప్ప నిజాయితీ పరుడు. సౌమ్యుడు. అమలాపురం లోనే ఉంటారట ఆయన. కానీ కాపు నాయకుడు స్థానం ఆయనకు రాలేదు.
8. 2019 నాటికి నెహ్రు మళ్ళీ వైకాపా లోనే చేరుతాడు. జగన్ చేర్చుకుంటాడు.
9. జగన్ కు మంచి ఫాలోయింగ్ ఉన్నది.
10. రెండు గోదావరి జిల్లాల వారికి అసలు రాజధాని మీద ఏవిధమైన ఆసక్తి లేదు.
11. అమరావతి అనేది కేవలం ఒక “కమ్మ” మహా సామ్రాజ్యం. అక్కడ ధనికులకు తప్ప సామాన్యులకు చోటు దొరకదు.
12. తెలుగుదేశం కు చెందిన పెద్ద పెద్ద నాయకులు అమరావతి లో బాగా ఆస్తులు కొన్నారు.
13. మరో పది ఏళ్ళు గడిచినా రాజధాని నిర్మాణం పూర్తీ అవుతుందన్న నమ్మకం లేదు.
14. అబివృద్ధి, సంక్షేమ పధకాలు లాంటివి అసలు లేవు.
15. కొన్ని వర్గాల వారికి పించన్లు సక్రమంగా అందుతున్నాయి.
16. ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం తో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.
17. అవినీతి, లంచగొండి తనం తారా స్థాయి లో ఉన్నాయి.
18. అధికార పార్టీ నాయకులు ఇసుక అమ్ముకుని బాగా డబ్బు సంపాదించారు. (మేము గోదావరి వారధి మీదుగా వెళ్తున్నప్పుడు చుక్క నీరు కూడా లేని నదిలో వందల సంఖ్యలో ఇసుక ను నిపుతున్న లారీలు కనిపించినాయి)
19. నాయకులు కావలసినంత దోచుక్కున్న తరువాత ప్రభుత్వం ఇసుకను ఉచితం అన్నది కానీ, రవాణా చార్జీలు, మరి కొన్ని చార్జీలు కలిపి అమ్ముకుంటున్నారు.
20. అమలాపురం లో రాజకీయ వాతావరణం ప్రశాంతం గానే ఉన్నది.
(ముగింపు రేపు)
Pulivendula Puli Bidda ki ….
Nakka jathiki theda ledha mare ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2226:2016-06-10-12-59-27&Itemid=665
Kulamathalaku athitham ga …..
Charmam rangulaki athitham ga …..
Desalaku athitham ga ……
Prajala kosam poradina yodhudu ……Mohammad Ali……RIP
It is not about whether you hold Bhagvad Gita in your hand or a Bible in your hand or the Quran in your hand …Life is about ethical and human values.
Annallu brathikamu anedhi mukhyam kadhu …Brathikinnanallu Ala brathikamu anedhi mukhyam – YS JAGAN
http://www.dailymail.co.uk/news/article-3634670/Thousands-bid-final-farewell-Muhammad-Ali-miles-long-funeral-procession-service.html
Ithara kulala madhya chicchu petti …
Kamma ga rastranni dochukuntunna Neethimalina Jathi ?
http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-kapu-leaders-to-special-meet-in-today-evening-350412?pfrom=home-andhra-news
Use the social media and save AP from this unethical Weed.
Neethimalina jathiki …….Nijalu chepitha bhayam ?
http://www.sakshi.com/news/cartoon/sakshi-cartoon-10-06-2016-350341?pfrom=home-cartoon