మేము వెనక్కి వస్తాం అని పార్టీ మారిన 6 MLA లు అంటున్నా ససేమిరా అంటున్న జగన్

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5625211

ఎంట్రీ ఇచ్చేసిన కేఎస్ఆర్: తొలిరోజే బాబుకి ఝ‌ల‌క్..!
కొమ్మినేని శ్రీనివాస‌రావు ఎంట్రీ ఇచ్చారు. సాక్షితో పునఃప్ర‌వేశం చేశారు. ఎన్టీవీలో ఆటంకాల మూలంగా మూడు నెల‌లుగా తెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న మ‌ళ్లీ బుల్లి తెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చారు. కేఎస్ఆర్ లైవ్ షో మ‌ళ్ళీ ప్రారంభించారు. తొలిరోజే కాపు ఉద్య‌మంపై జ‌రిగిన చ‌ర్చ‌ల్లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించ‌డం ద్వారా కొమ్మినేని టీడీపీని ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా ఏపీ కాపు కార్పోరేష‌న్ చైర్మ‌న్ ని చాలా ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ మీద సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం, రాజ‌కీయ ర‌హితంగా స్పందించాల్సిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌ట‌డుగుల‌తో తీవ్రం చేయ‌డం త‌గ‌ద‌ని కొమ్మినేని పేర్కొన్నారు. అంతేగాకుండా టీడీపీలో ఆత్మ‌విమ‌ర్శ కంటే ఎదురుదాడి వైఖ‌రి తీసుకోవ‌డం త‌గ‌దంటూ ఆయ‌న పేర్కొన్నారు.

స‌హ‌జంగా సొంత ఇమేజ్ సాధించుకున్న తెలుగు మీడియాలో జ‌ర్న‌లిస్టుల‌లో ఒక‌రైన కేఎస్ఆర్ మూలంగా సాక్షి చానెల్ ట్యూన్ చేసిన వారి సంఖ్య పెరిగిన‌ట్టు క‌నిపిస్తోది. ముఖ్యంగా యూ ట్యూబ్ లో లైవ్ చూసిన వారి సంఖ్య అసాధార‌ణంగా పెరిగింది. సాక్షి ప్ర‌సారాల‌ను లైవ్ లో చూసిన వారు భారీగా పెరిగారు. దాంతో సాక్షి యాజ‌మాన్యం కృషి కూడా ఫ‌లించిన‌ట్టే భావించాలి.

http://telugu.updateap.com/?q=latest/2453

6 Comments

Filed under Uncategorized

6 responses to “మేము వెనక్కి వస్తాం అని పార్టీ మారిన 6 MLA లు అంటున్నా ససేమిరా అంటున్న జగన్

  1. Veera

    లక్మీపార్వతి కంటతడి
    ఆ ఇంటిలో (ఎన్.టి.ఆర్) తనకు ఆ వ్యక్తి అంటే ఇష్టమని(బాలకృష్ణ) అతను తప్పు చేస్తే తాను వైఎస్ ను కలిసి ఎన్.టి.ఆర్.గౌరవం కోసం అతనిని వదలిపెట్టాలని అభ్యర్ధించానని ఆమె వెల్లడించారు. వైఎస్ ఆయనను కాపాడారని లక్మీపార్వతి తెలిపారు

    (కాని ఆ విశ్వాసం కూడా లేకుండా తండ్రి లేని పిల్లాన్ని ఒక వర్గం మొత్తం కక్ష గట్టి కాకులు పొడిచినట్టు పొడిచి జైలుకు పంపారు)

    http://kommineni.info/articles/dailyarticles/content_20160614_30.php?p=1465907113085

  2. Veera

    AP లో మిగులు విద్యుత్ కు కారణమేమిటి?
    1.ఉమ్మడి రాష్ట్రము లో దాదాపు 30% కరెంటు అవసరమయ్యే హైదరబాద్ తెలంగాణకు పోవడం వలన మరియు ఎక్కువ థర్మల్ ప్లాంట్లు నెల్లూర్ శ్రీకాకుళం లో ఉండడం వలన AP లో మిగులు విద్యుత్ ఉంది కానీ బాబు గొప్ప కాదు, ఈ విషయాన్నీ అప్పటి CM కిరణ్ రెడ్డి విభజన రోజుల్లోనే అసెంబ్లీ లో చెప్పారు కూడా.

    2.YS మొదలెట్టిన కృష్ణ పట్నం లాంటి థర్మల్ ప్రాజెక్ట్ ల వలన అధిక విద్యుత్ వస్తోంది

    3.2009 నుంచి 20014 వరకు దేశంలో లక్ష మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిచేసే థర్మల్ ప్లాంట్లను నిర్మించారు అయితే బొగ్గు ధరలు విపరీతంగా పెరగదముతొ ధర్మల్ ప్లాన్ లలో విద్యుత్ ఉత్పత్తి ఆపేసారు కాని 2014 తర్వాత బొగ్గు ధరలు 120 డాలర్ల నుంచి 30డాలర్లకు పడిపోవడంతో మోడీ సర్కార్ థర్మల్ ప్లాంట్ల నుంచి పూర్తిస్తాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాల కు ఇస్తోంది.

    కేంద్రం దేశములో 3 రాష్ట్రాలను 24/7 పవర్ పధకం క్రింద ఎంపిక చేసిన 3 రాష్ట్రాల్లో AP ఒఅక్తొ కావడం వలన కేంద్రం నుంచి ఆఫ్ కి అదనపు విద్యుత్ వస్తోంది

    4.ఇంతకు ముందు బాబు 9 సం CM గా ఉనప్పుడు విపరీతంగా కరెంటు కోతలు ఉన్న విషయం మరిచిపోకూడదు

    కాని కుల మీడియా తో బాబు వల్లనే AP లో కరెంటు కొరత లేదు అని డప్పు వేసుకొంటున్నాడు బాబు

    Note: Please share this info to all and expose Babu completely.

  3. Veera

    థాంక్స్ బాబు-సాక్షి లో KSR లైవ్ షో సూపర్ హిట్

  4. Veera

    రగులుతున్న కాపులు, బాబు పై కాపు మంత్రుల అసంతృప్తి
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=5631206

    • Veera

      ముద్రగడను ‘కాపు’ కాద్దాం
      హైదరాబాద్, జూన్ 13: కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కాపు అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై తొలిసారిగా సోమవారం సాయంత్రం పార్క్‌హయత్ హోటల్‌లో నిర్వహించిన కాపునేతల సమావేశంలో ముద్రగడ వ్యవహారంపై లోతుగా చర్చించారు. ప్రభుత్వానికి రెండురోజుల గడువు ఇచ్చి, అప్పటికీ స్పందించకపోతే కార్యాచరణ ప్రకటించాలని సమావేశం నిర్ణయించడంతో పాటు 17న విజయవాడలో మళ్లీ భేటీ కావాలని సంకల్పించింది.

      ముద్రగడ అరెస్టు అనంతర పరిణామాలపై చర్చించిన కాపు పెద్దలు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పరుష పదజాలంతో విరుచుకుపడినట్లు సమాచారం. ముఖ్యంగా దాసరి, సి.రామచంద్రయ్య, బొత్స, చిరంజీవి, అంబటి రాంబాబు, కన్నబాబు కాపులను సంఘ విద్రోహశక్తులుగా ముద్రవేసేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలను కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. తాము అనైక్యంగా లేమన్న సంకేతాలు పంపించాల్సి ఉందని, దానితోపాటు బీసీ హోదా, తదితర అంశాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని కన్నబాబు చెప్పారు.

      మన పిల్లాడిని (ముద్రగడ కుమారుడిని) ఆ విధంగా అమానుషంగా కొడుతుంటే రక్తం మరిగిపోతోందని, బాబును ఇలాగే వదిలేస్తే కాపులను పూర్తి స్థాయిలో అణచివేస్తారని మరికొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

      బాబు సంగతి నాకు తెలుసు. ఎంతకయినా తెగిస్తాడు. అంతా కలసి అతని సంగతి తేలుద్దాం’ అని రామచంద్రయ్య తీవ్ర స్వరంతో అన్నట్లు తెలిసింది. చిరంజీవి కూడా తీవ్రంగానే మాట్లాడారు. ఇప్పుడు ఒక కులంపై దాడి చేస్తున్నారు. రేపు మరో కులం మీద దాడి చేస్తారు. దీన్ని ఇప్పటినుంచే ఎదుర్కోవాలని చెప్పారు.

      బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కాపు ఉద్యమంపై బాబు రకరకాలుగా మాట్లాడుతున్నట్లు తెలిసిందని, ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉంది కాబట్టి, ఈలోగా వారిని దారికి తెచ్చుకోవచ్చన్నట్లు మాట్లాడుతున్నారని, కాపులంతా సమైక్యంగా ఉంటే బాబు ఎత్తుగడను తిప్పికొట్టవచ్చన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని పార్టీల్లోని కాపులంతా ఏకం కాకపోతే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు.

      ముద్రగడ వైఖరిపైనా కొంతమంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన దీక్ష గురించి ఎవరితోనూ సంప్రదించలేదని, గతంలో కూడా సభ నిర్వహించి ఎవరితో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న అసంతృప్తి వ్యక్తమయింది. దానితో కల్పించుకున్న దాసరి తదితరులు ఉద్యమంలో కొన్ని నిర్ణయాలు అక్కడికక్కడ తీసుకోవలసి ఉంటుందని, దాని గురించి ఇప్పుడు ప్రస్తావించడం అనవసరమని సర్దిచెప్పారు. ముద్రగడకు ఎవరూ లేరన్న భావనతో ప్రభుత్వం ఉందని, దానిని తిప్పికొట్టి ఆయన వెనుక కాపుజాతి అంతా ఉందన్న సంకేతాలివాల్సి ఉంది అన్నారు. కాగా ఎదురుదాడి చేస్తున్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కాపు నేతలు భావించారు.

      అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలంతా ఒకే వేదిక మీదకు రావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా రాజకీయంగా బద్ధవిరోధులైన పల్లంరాజు, వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడాన్ని బట్టి.. ముద్రగడ విషయంలో కాపునేతలంతా ఏ స్థాయిలో పట్టుదలతో ఉన్నారో స్పష్టమవుతోంది.

      http://www.andhrabhoomi.net/content/state-2697

  5. Veera

    త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి విజ్ఞప్తి !!!
    అయ్యా మీ సినిమాల్లో మీ కులపొన్ని విలన్ గా/జోకర్ గా పెట్టుకోండి, వేరే కులం వారిని కాదు.ఇప్పటి వరకు కమ్మ వాళ్ళ సినిమాల్లో మాత్రమే రెడ్లను విలన్ లుగా బ్రాహ్మణులను జోకర్ లుగా చూపేవారు.అటువంటిది ఒక బ్రాహ్మిన్ అయి ఉండి మీరు కూడా ఇలా చేయడమేమిటి?మీరన్నా బ్రహ్మనులన్నా ఉండే అభిమానం కొద్దీ చెబుతున్నాం ఇంకో సారి సినిమాలలో రెడ్లను విలన్ లుగా చూపకండి.హీరో నితిన్ రెడ్డి కి కొంచెం అన్నా సిగ్గుండాలి !!!
    Request-No bad comments please !!!!
    http://teluguglobal.com/netizens-comments-on-trivikram-srinivas/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s