http://www.muchata.com/main-news/jagan-may-win-18-out-of-those-21-seats/
ఢీ అంటే ఢీ!
హైదరాబాద్, జూన్ 16:వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించి జగన్‌కు ఝలక్ ఇచ్చిన తెలుగుదేశం నాయకత్వానికి ఇప్పుడు బదిలీల వ్యవహారం తలనొప్పిలా పరిణమించింది. 20 నియోజకవర్గాల నుంచి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు, అంతకుముందు నుంచే పార్టీలో పనిచేస్తున్న ఇన్చార్జిలకు బహిరంగయుద్ధం జరుగుతుండటంతో..బదిలీల విషయంలో ఎవరి మాటకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక టిడిపి నాయకత్వం తలపట్టుకుంది. ప్రకాశం, కడప, తూర్పు గోదావరి, కర్నూలుజిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. జన్మభూమి కమిటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లనూ మార్చాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా పాత నేతల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఏపిలో మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ వ్యవహారం టిడిపికి ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా మారింది. టిడిపిలో చేరిన జలీల్‌ఖాన్ (విజయవాడ వెస్ట్), గొట్టిపాటి రవి (అద్దంకి), పోతుల రామారావు (గిద్దలూరు),అశోక్‌రెడ్డి (కందుకూరు), అమర్నాధ్రెడ్డి (పలమనేరు), డేవిడ్‌రాజు (యరగొండపాలెం), జ్యోతుల నెహ్రు (జగ్గంపేట), వరుపుల సుబ్బారావు (పత్తిపాడు), సుజయకృష్ణరంగారావు (బొబ్బిలి), కలమట వెంకట రమణ (పాతపట్నం), సునీల్ (గూడూరు), భూమా నాగిరెడ్డి (నంద్యాల), అఖిలప్రియ (ఆళ్లగడ్డ), ఎస్వీమోహన్‌రెడ్డి (కర్నూలు), జయరాములు (బద్వేలు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం), మణిగాంధీ (కోడుమూరు), చాంద్‌పాషా(కదిరి), సర్వేశ్వరరావు (అరకు) నియోజకవర్గాల్లో టిడిపి పాత నేతలకు, వీరికి బదిలీల వ్యవహారంలో ఎంత మాత్రం పొసగడం లేదు.
ట్రాన్స్‌కో, పోలీసు, రెవిన్యూ విభాగాలకు సంబంధించిన బదిలీలపై తమదే పైచేయి కావాలని ఇద్దరూ కుస్తీ పడుతున్నారు.ఆ ప్రకారంగా ఇరు వర్గాలు ఎవరి జాబితాలు వారు తయారుచేసుకుని, దానిని నాయకత్వానికి అందిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ శాఖల్లో డిఎస్పీ, సీఐ, ఎస్ఐలు, రెవిన్యూలో ఎమ్మార్వో, ఆర్డీఓ బదిలీలపైనే పాత-కొత్త నేతలు పట్టుపడుతున్నారు. వీటిలో ఆదాయం ఎక్కువగా ఉండటం పక్కకుపెడితే, తమ మనుషులను నియమించుకుంటే, వారు ఎన్నికల్లో తమకు పనికివస్తారన్న ముందుచూపు కనిపిస్తోంది.
దానికంటే మించి ఒకసారి బదిలీలపై పైచేయి సాధిస్తే, ఇక ఆ నియోజకవర్గంలో తమదే పైచేయి అని, మిగిలిన వారికి నాయకత్వం వద్ద ఎలాంటి ప్రాధాన్యం లేదన్న సంకేతాలు పంపించడమే, వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ తమ డిమాండ్లు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు.
వీరి ఒత్తిళ్లతో నాయకత్వం సతమతమవుతోంది. పాత వారిని కాదని కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తే, లీడర్లు, క్యాడరు అసంతృప్తికి గురయి, సరైన సమయంలో వైసీపీ వైపు చూసే ప్రమాదం లేకపోలేదు. కొత్తవారిని కాదని పాతవారికి ప్రాధాన్యం ఇస్తే, కొత్తగా చేరిన వారిని కరివేపాకుల మాదిరిగా వాడుకుని వదిలేశారన్న సంకేతాలు వెళితే, ఇక పార్టీలో ఎవరూ కొత్తగా చేరే సాహసం చేయరు.
దీనితో ముందు జగన్‌ను దెబ్బతీయాలన్న ఉత్సాహంతో ఫిరాయింపులు ప్రోత్సహించిన నాయకత్వం, ఇప్పుడు ఆ 20 నియొజకవర్గాల్లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక తలపట్టుకుంది. అయితే, పార్టీలో చేరిన వారు ఉచితంగా ఏమీ రాలేదుకాబట్టి, వారిని పక్కకుపెట్టినా పెద్ద నష్టం లేదన్న వాదన కార్యకర్తల్లో వినిపిస్తోంది.
తాజాగా ప్రకాశం జిల్లాలో మొదలైన పంచాయితీ దేశం యువనేత లోకేష్‌కు శిరోభారంగా పరిణమించింది. అటు హామీలిచ్చి తీసుకువచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఇటు పార్టీకి పునాదిరాళ్లకు సర్దిచెప్పలేక, తాత్కాలిక హామీలిచ్చి పంపించాల్సిన సంకటస్థితి ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలయిన గొట్టిపాటి రవికుమార్, రామారావు, అశోక్‌రెడ్డి తాజాగా లోకేష్‌ను కలిశారు. అద్దంకిలో కరణం బలరాం ఆగడాలు పెచ్చుపెరుగుతున్నాయని, తాను సీఐని బదిలీ చేయిస్తే దాన్ని బలరాం రద్దు చేయించారని, తాను పార్టీలో చేరేముందు సీఐ బదిలీ షరతు కూడా ఉందని లోకేష్‌కు గుర్తు చేశారు.
కనీసం బదిలీలు కూడా చేయకపోతే తానిక పార్టీలో చేరి ఏమి ఉపయోగమని రవి వాపోయినట్లు సమాచారం. అశోక్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, రామారావు మాజీ ఎమ్మెల్యే దివిశివరాం మీద ఫిర్యాదు చేసి, సీఐ, ఆర్డీఓ, ఎమ్మార్వో, ఎస్ఐల జాబితాను లోకేష్‌కు అందించారు. అయితే లోకేష్ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు. నిజానికి వీరిని టిడిపికి అనుకూల మీడియాగా ఉన్న, ప్రకాశం జిల్లా జర్నలిస్టు సంఘం నేత ఒకరు విజయవాడకు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు జర్నలిస్టు చొరవతోనే ఆ అధిపతి రాయబారంతో వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినట్లు రెండు పార్టీల్లోనూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ గొడవ రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తోంది. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి-వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి; నంద్యాలలో భూమా-శిల్పా; ఆళ్లగడ్డలో అఖిలప్రియ- ఇరిగెల రాంపుల్లారెడ్డి; కర్నూలులో టిజి వెంకటేష్-ఎస్వీ మోహన్‌రెడ్డి- కదిరిలో చాంద్‌పాషా- ప్రసాద్ తమ మనుషులకు పోస్టింగులివ్వాలని కోరుతూ జాబితాలు సిద్ధం చేసుకుంటున్నారు.అయితే, నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను విభజించి, రెండు వర్గాలు సూచించిన వారికి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, ఈ గొడవలకు తెర దింపాలని యోచిస్తోంది.
Mudragadda ki amanna aithe …AP lo KDP ni kali chesthamu – Kapus
http://www.sakshi.com/news/district/kapu-leaders-warns-ap-government-on-mudragada-issue-353116?pfrom=home-top-story
Kulala madhya chicchu petti rastranni dochukuntunna Gajji / Gaja dongalaki time deggara padindhi.
Use Social media to tackle the yellow media.
One You tube video for each unethical caste fanatic to expose their looting ?
One you tube video about each channel and their dirty tricks ??
It hardly takes a few hours of your life …but can benefit 95% telugu people in AP.
http://www.sakshi.com/video/news/cm-causes-of-the-breach-of-law-and-order-54977?pfrom=home-top-videos
PK should be chalenged about his silence on Twitter.
వేరే పార్టీ MLA లను తీసుకోవడం వ్యభిచారం-రవ్వంత రెడ్డి
ఎంత దైర్యం, నిప్పును అంత మాట అంటావా ?
Kulala madhya chicchu petti …
Siggumalina panulu chesthunna Neethimalina Jathi
http://www.sakshi.com/news/hyderabad/kapus-will-not-excuse-you-if-anything-happens-to-mudragada-padmanabham-says-botsa-satyanarayana-352723?pfrom=home-top-story
Paramannam babu arrest eppudo ?
నేను పోటీ చేసి గెలిస్తే జగన్ పార్టీ మూసేస్తాడా? భూమా నాగిరెడ్డి, అమరనాద్ రెడ్డి
సరే మీరు ఓడిపోతే బాబు TDP పార్టీ ని మూసేస్తాడా?
2011-14 మద్య జరిగిన 52 ఉప ఎన్నికల్లో సగం స్థానాల్లో ప్రతిపక్ష TDP కి డిపాజిట్ కూడా రాలేదు, ఒక్క సీట్ కూడా గెలవలేదు.
ఇంతెందుకు 2014 నుంచి తెలంగాణా లో GHMC , మెదక్, వరంగల్ పార్లమెంటు ఎన్నికలు, 3 అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ లో ఉన్న దాదాపు 42 అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపక్ష TDP కి ఎక్కడన్నా డిపాసిట్ వచ్చిందా?
గ్రేటర్ హైదరబాద్ లో ఉన్న 150 డివిజన్ లలో BJP తో కలిసి పోటీ చేసి అతి కష్టం మీద గెలిచిని ఒకే ఒక్క డివిజన్ అది కూడా బాబు కులస్తులు ఎక్కువగా ఉండే KPHB.
మరి పార్టీ మారిన మీరు కూడా మాట్లాడుతారా?
ముందు మీ బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో దాదాపు 20 సం ల నుంచి TDP వరుసగా ఎందుకు ఓడిపోతోందో తెలుసుకోండి అలాగే బాబు సొంత జిల్లా చిత్తూర్ లో 1999 లో తప్పించి ఇంతవరకు TDP మెజారిటీ సీట్లు గెలుచుకోలేదు.
ముద్రగడ కోడలిని పోలీసులు దూషించారా?
పోలీసులు కాపు ఉద్యమ నేత ,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబంపై పోలీసులు దురుసుగా వ్యవహరించడమే కాకుండా, ఆ కుటుంబ మహిళల పట్ల పరుష భాషను ప్రయోగించారా?
కాపు ముఖ్యనేతలు ఒక ప్రకటన చేస్తూ ముద్రగడ కుమారుడిని పైశాచికంగా పోలీసులు తరిమికొట్టారని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలు లేని పైశాచిక భాషను ప్రయోగించారని తెలిపారు. ముద్రగడ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పు పడుతున్నామని, ఇది వారి కుటుంబానికి జరిగిన అవమానం కాదని,కాపు జాతికి జరిగిన అవమానమని కాపు నేతలు ప్రకటనలో తెలిపారు.
కాపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషం చిమ్ముతున్నారని కూడా వారు పేర్కొన్నారు.
ఈ ప్రకటనపై దాసరి నారాయణరావు, చిరంజీవి, పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు,సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్,కన్నబాబు, ఎమ్.వి.కృష్ణారావు ,రంగయ్య నాయుడు తదితరులు సంతకాలు చేశారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160617_13.php?p=1466140069437