లీజుల కుంభకోణం

– తరలింపు కార్యాలయాల అద్దెల్లో చేతివాటం
– రూ.కోట్లు జేబుల్లోకి
– కృత్రిమ డిమాండ్‌ సృష్టి
– శిథిóలావస్థ బిల్డింగ్‌లకూ అంతే
– మార్గదర్శకాల్లోనే స్కామ్‌కు ఆస్కారం
– భారీగా ప్రజాధనం పక్కదారి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

హైదరాబాద్‌ నుంచి అమరావతికి ప్రభుత్వ కార్యాలయాల హడావుడి తరలింపు వలన రూ.వందల కోట్లు దుబారా అవుతుండగా, ఈ దుబారా ఖర్చులోనూ చేతివాటం మెండుగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయ అద్దెలు, లీజుల వ్యవహారంలో రూ.కోట్లల్లో అక్రమ పద్దతుల్లో కొంత మంది జేబులు నింపుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. కార్యాలయాల అద్దెలు, లీజులకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శ కాల్లోనే వాటంగా స్కాం చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. పైసా ఖర్చు లేకుండా కొన్ని లక్షల చదరపు అడుగుల సర్కారీ భవన సముదాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పక్కనపడేసి మరీ ప్రైవేటు బిల్డింగ్‌లను అద్దెకు తీసుకునేందుకు ఉబలాట పడుతున్నట్లు సమాచారం. ఆఫీసుల తరలింపులో పెద్ద కుంభకోణం దాగి ఉందని ప్రభుత్వ వర్గాలే వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి అమరావతి ప్రాంతానికి కార్యాలయాల తరలింపుపై ఏర్పాటైన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ సుమారు 50-55 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ కావాలని అంచనా వేసింది. సచివాలయం, 33 ప్రభుత్వ విభాగాలు, 70 డైరెక్టరేట్లు, కమిషనరేట్లు (హెచ్‌వోడి), ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేయాలి. కాగా గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో సెక్రటేరియట్‌ విభాగాలకు నాలుగు లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులోకొస్తుందని తేల్చారు. హెచ్‌వోడిలు, ఇతర ఆఫీసుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సర్కారీ భవనాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అందుబాటులో ఉందని కలెక్టర్లు ఇచ్చిన సమాచారానికనుగుణంగా నిర్ధారించారు. ఇంకా నికరంగా 40 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ కావాలని అంచనా వేశారు. తొలుత వెలగపూడిలోనే హెచ్‌వోడీల కోసం అదనపు అంతస్థులు నిర్మిస్తామన్న సర్కారు చివరి నిమిషంలో మాట మార్చి ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకొనైనా ఈ నెల 27 లోపు అమరావతికి వచ్చి తీరాలని ఆదేశించిన దరిమిల కుంభకోణానికి బీజాలు పడ్డాయి.

అంతా గైడ్‌లైన్స్‌లోనే
కార్యాలయాల అద్దెల విషయంలో సర్కారు ఇచ్చిన మార్గదర్శకాల్లోనే కుంభకోణం చేయడానికి ఆస్కారం కల్పించారని ఆరోపణలొస్తున్నాయి. ఒకే చోట కనీసం 20 వేల చదరపు అడుగులకు తక్కువ కాకుండా లీజుకు తీసుకోవాలి. లీజు సమయం మూడేళ్లు ఉండాలి. చదరపు అడుగుకు రూ.20 లోపు అయితే హెచ్‌వోడిలు నేరుగా తమ విచక్షణతో లీజును ఓకే చేసుకోవచ్చు. రూ.20-30 అయతే రోడ్లు, భవనాల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఓకే చేయాలి. రూ.30 పైన అసలు చెల్లించకూడదు. అయితే ఒకేసారి 40 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ అదీ తక్కువ సమయంలో చూసుకోవాలని కృత్రిమంగా డిమాండ్‌ సృష్టించారు. మామూలుగానే భవనాలు అద్దెకు దొరకని పరిస్థితి ఉండగా కొంత మంది ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు అద్దెలు పెంచే విధంగా చక్రం తిప్పుతున్నారు. పనికిరాని భవనాలనైనా, ఊరికి దూరంగా విసిరేసినట్లు ఉన్నా, అద్దె పెద్దగా లేకపోయినప్పటికీ చదరపు అడుగుకు ప్రభుత్వం పెట్టిన పరిమితిలో గరిష్ట ధర పొందేందుకు పావులు కదుపుతున్నారు. ఆ ప్రాంతంలో చదరపు అడుగు రూ.10-15 ఉన్నా రూ.29 వరకు తీసుకెళుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. మార్కెట్‌ రేటుతో సంబంధం లేకుండా ఎంత ఎక్కువ పిండుకోవాలో అంతా పిండుకుంటున్నారు. సగటున ఒక చదరపు అడుగుకు నెలకు అద్దె రూ.25 వరకు నిర్ణయిస్తున్నారని అధికారులే చెబుతున్నారు. శిధిలావస్థలో ఉన్న పాత భవనాలకు చిన్న రిపేర్లు, రంగులు వేసిన భవనాలకు సైతం కమర్షియల్‌ స్థాయి కంటే అధిక అద్దెలు చెల్లించేందుకు ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపణలొస్తున్నాయి.

http://www.prajasakti.com/WEBCONTENT/1807611

4 Comments

Filed under Uncategorized

4 responses to “లీజుల కుంభకోణం

 1. Veera

  కుంగిన నేల -అమరావతిలో కలకలం
  సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో 3 అడుగుల మేర నేల కుంగడం తో రెండు బ్లాకుల్లో ఫ్లోరింగ్ దెబ్బతింది.

  లూజ్ సాయిల్ వల్లే నేల కుంగివుండొచ్చని అనుమానిస్తున్నారు. నిర్మాణ ప్రాంతంలో నేల కుంగిపోవడంతో పనులు ఏవిధంగా సాగించాలనే దానిపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మంత్రులకు, ప్రిన్సిపాల్ కార్యదర్శలకు కేటాయించనున్న బ్లాకులో నిర్మాణ లోపాలు బయట పడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

  ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి జూన్ 27కల్లా వెలగపూడికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు ఆదేశించడంతో తాత్కాలిక సచివాలయం పనులు హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తమకు కొంత సమయం కావాలని ఉద్యోగులు కోరినా చంద్రబాబు ససేమిరా అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులు వచ్చి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూన్ నెలాఖరుకు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి చేయాలని భావించారు.

  http://www.sakshi.com/news/district/land-sinks-at-temporary-secretariat-354754?pfrom=home-top-story

 2. Veera

  అస‌లు ప్ర‌త్యేక హోదా ప్ర‌తిపాద‌న‌లే మా ద‌గ్గ‌ర‌కు రాలేదు-నీతి ఆయోగ్
  నీతి అయోగ్ పేరిట నాయుడు బ్ర‌ద‌ర్స్ నీటి మాట‌లు..!
  నాయుడు అంటే నాయకుడు-వెంకయ్య నాయిడు
  ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలి-వెంకయ్య నాయుడు
  కాదు కాదు 15 ఏళ్ళు కావాలి-చంద్రబాబు నాయుడు

  సినిమాల్లో మాత్రం రెడ్లను విలన్ లుగా చూపిస్తారు మరి నిజ జీవితం లో???
  http://telugu.updateap.com/?q=latest/2647

  Request-No bad comments please !!!

 3. Veera

  5 వేల కోట్ల సదావర్తి సత్రం దేవుడి భూములనూ వదలట్లేదు బాబు
  ఈ భూముల వేలం వ్యవహారంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధాన లబ్ధిదారుడు కాగా, భూముల విక్రయంలో టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ హస్తముంది
  -శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య
  http://www.sakshi.com/news/hyderabad/congress-mlc-c-ramachandraiah-demands-for-cancellation-of-sadavarthi-satram-land-auction-353638?pfrom=home-top-story

  • They loot their own people ……finally die from cancer taking nothing with them and to Rot in Hell.
   Neethimalina Jathi ………Siggumalina brathukulu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s