మరో మాఫీ జిమ్మిక్కు

మరో మాఫీ జిమ్మిక్కు
-ఆర్థిక శాఖకు తెలీకుండా వ్యవసాయశాఖ జీవో
-రెండో కిస్తీకి రూ.2,360 కోట్లకు పరిపాలనా ఆమోదం
-బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధం
-రైతులను మభ్యపెట్టేందుకే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌

రైతుల రుణమాఫీపై గడచిన రెండేళ్లలో అనేక విన్యాసాలు ప్రదర్శించిన చంద్రబాబు సర్కారు తాజాగా మరొక జిమ్మిక్కుకు తెర తీసింది. రైతులకు చెల్లించాల్సిన రెండో కిస్తీకి నిధులు అందుబాటులో లేకపోయినా, ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బిఆర్‌వొ) ఇవ్వకపోయినా, వ్యవసాయశాఖ రూ.2360,41,71,000 కోట్లను మంజూరు చేస్తూ బుధవారం పరిపాలనా ఆమోదం ఇచ్చేసింది. ఆ మేరకు జివొఆర్‌టి నెం.446ను వెలువరించింది. అడ్మినిస్ట్రేషన్‌ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా, కేవలం కంటి తుడుపు కోసమే ఈ జీవో ఇచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. రెండో కిస్తీకి సంబంధించి రైతులకు రుణ మాఫీ ద్రువీకరణ పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఒంగోలులో లాంఛనంగా ప్రారంభించారు.

సిఎం చేసిన ఆర్భాటంతో రైతులు సర్టిఫికెట్లు పట్టుకొని బ్యాంకులకు పరుగులు తీయగా ఇంకా డబ్బులు రాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న తరుణంలో పెట్టుబడుల కోసం వెతుక్కుటుంటున్న అన్నదాతలు రెండో కిస్తీ అయినా చేతికి అందుతుందని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క సిఎం ఈ ఏడాది ఖరీఫ్‌ పనులకు శుభసూచకంగా ఎంతో అట్టహాసంగా జూన్‌ 20న ఏరువాకను ప్రారంభించారు. రుణమాఫీ రెండో కిస్తీ చెల్లింపులకు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. దీంతో రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది

ఈ నేపథ్యంలో రైతులను మభ్యపెట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మాఫీకి సుమారు రూ.2,360 కోట్లు ఇచ్చేసినట్లు వ్యవసాయశాఖ నుంచి హడావుడిగా బుధవారం జీవో ఇప్పించింది. వాస్తవానికి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బడ్జెట్‌ నిధులను విడుదల చేసే అధికారం ఏ ప్రభుత్వ శాఖకూ లేదు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను విడుదల చేస్తూ ఆర్థికశాఖ తొలుత బిఆర్‌వొ ఇస్తుంది. తదుపరి ఆయా ప్రభుత్వ శాఖలు పరిపాలనా ఆమోదం ఇస్తాయి. మాఫీ విషయంలో వ్యవహారం తిరగబడింది. నిధులు అందుబాటులో లేవంటూ మాఫీ నిధులకు ఆర్థిక శాఖ బ్రేక్‌ వేసింది. బిఆర్‌వొ ఫైలు సిద్ధమైనప్పటికీ జివో ఇవ్వలేదు. కాగా ముందే కోయిల కూసినట్లు వ్యవసాయశాఖ కనీసం ఆర్థిక శాఖ ప్రస్తావన లేకుండానే నిధుల విడుదలకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది.

మాఫీ చేసేశామని రైతులను మభ్యపెట్టేందుకే సాధారణ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవసాయశాఖ జీవో ఇచ్చినట్లు విమర్శలొస్తున్నాయి.

ఇదిలా ఉండగా రుణమాఫీ రెండో కిస్తీ కోసం 2015-16 బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2016-17 బడ్జెట్‌లో రూ.3,512 కోట్లు ప్రతిపాదించగా ఆ నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 25న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం రోజున సిఎం తొలి సంతకం చేశారు. అనంతరం మే 6న ఆర్థిక శాఖ రూ.వెయ్యి కోట్లకు బిఆర్‌వొ ఇస్తూ జివొఆర్‌టి నెం.1347 జారీ చేసింది. బిఆర్‌వొ ఇచ్చిన తర్వాత కూడా కొరత పేరుతో నిధులు విడుదల చేయలేదు. ఎప్పటికో రైతు సాధికార సంస్థకు నిధులు బదలాయించారు. ఇంకా పంపిణీ చేయలేదు. ఇదిలా ఉండగానే బుధవారం ఆర్థిక శాఖకు తెలీకుండానే వ్యవసాయశాఖ ఏకంగా రూ.2,3460 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

http://www.prajasakti.com/WEBCONTENT/1811165

1 Comment

Filed under Uncategorized

One response to “మరో మాఫీ జిమ్మిక్కు

 1. Veera

  మానసిక విశ్లేషకులా లేక మానసిక రోగా ఈ నరసింహారావు చౌదరి ???
  సత్యం రామలింగరాజు సిగ్గుతో ప్రజల్లోకి రావడం లేదు కానీ ED ఆస్తులు జప్తు చేసినా జగన్ సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతున్నాడు
  -జూన్ 30 TV 5 చర్చ లో మానసిక విశ్లేషకులు అనే C నరసింహారావు చౌదరి

  సత్యం రామలింగరాజు నేను నేరం చేసాను అని ఒప్పుకొని పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యారు, కోర్టు కూడా ఆయన దోషి అని 7 వేల కోట్లు కట్టాలి అని తీర్పు ఇచ్చింది కానీ జగన్ విషయం లో కోర్టు తీర్పు ఇవ్వలేదు, పైగా CBI వేసిన కేసుల మొత్తం విలువ 1233 కోట్లు మాత్రమే. నిజానిజాలు కోర్టు లు తెలుస్తాయి, వేచి చూద్దాం !!!

  పోతే NTR CM గా ఉన్నప్పుడు 1987 లో అనుకొంటా కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ NTR అవినీతికి పాల్పడ్డాడు అని హై కోర్టు లో కేసు వేస్తే 6 కేసుల్లో ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని కోర్టు తీర్పు చెప్పింది, అప్పుడు NTR CM పదవికి రాజీనామా చేయలేదు.అప్పుడు బాబు న్యాయమూర్తులు అంతా కాంగ్రెస్ ఏజెంట్లు అని రాష్ట్ర బంద్ కి పిలుపు ఇచ్చి బస్సులు తగలపెట్టించాడు.

  విజయమ్మ బాబు మీద రాష్ట్ర హై కోర్టు లో కేసు వేస్తే బాబు ఆవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని మన రాష్ట్ర హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే అప్పటి కాంగ్రెస్ హోం మంత్రి చిదంబరం ను చీకట్లో కలిసి జగన్ నాకే కాదు మీకు కూడా మొగుడు కాబట్టి ఇద్దరం కలిసి తొక్కుదాం అని మైనారిటీ లో ఉన్న కిరణ్ రెడ్డి సర్కారు పడి పోకుండా విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ను కాపాడి కేసులు కొట్టేయించుకున్నాడు
  (India Today అయితే బాబు కాంగ్రెస్ రహస్య మిత్రులు, జగన్ ను ఎదుర్కోలేక చేతులు కలిపారు అని బాబు కిరణ్ ల ఫోటో తో కవర్ పేజీ స్టోరీ వ్రాసింది )

  ఇకపోతే మొన్న అందరం చూస్తుండగా ఓట్ వేస్తే 5 కోట్లు లంచం ఇస్తూ మనవాళ్ళు Briefed మీ అని ఆడియో వీడియో లో దొరికి అది బాబు గొంతే అని ఫోరెన్సిక్ ల్యాబ్ చెప్పినా కూడా సిగ్గు లేకుండా బాబు ఎలా తిరుగుతున్నాడో అడగవా చౌదరీ?

  ఓహో ఆయన మన కులపోదు కదా అయితే ఒకే !!!
  మనకులపొడిని పొగిడితే వచ్చే కిక్కే వేరప్పా !!!

  Request-No bad comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s